Thursday, December 2, 2010

ఎందఱో మదర్ దెరిస్సా లు.... అందరికీ


రోజు మా వైజాగ్ లో కే.జి.హెచ్ లో పని చేసి రిటైర్ అయిన ఒక సిస్టర్ గారి వీడ్కోలు సభకివెళ్ళాను. చాలా మంది డాక్టర్ లు, తోటి వుద్యోగినీ, ఉద్యోగస్తులు మాట్లాడారు.

ఆవిడ, ఆవిడభర్త గారు కూడా మాట్లాడారు .... ఆవిడ భర్త గారు "నేను ఆరోగ్యం గా వుండటానికి కారణం - మా ఆవిడ చేస్తున్న సేవలో నా వంతు సహకారం ఇవ్వడం వల్లనే" అన్నారు.. ఆవిడ " మాఆయన గారు ఎప్పుడూ నా మీద విసుక్కోకుండా నన్ను డ్యూటీ లకి, అనేక హాస్పటల్స్ కిదిగబెట్టీ వారు" అందుకే నేను అందరికీ సేవలు చెయ్యగలిగాను" అని చెప్పారు.

అయితేచివరలో ఆవిడ తమ్ముడు గార్ని వోట్ ఆఫ్ థాంక్స్ చెప్పమన్నారు. అతను " మా అక్క మమ్మల్ని చిన్నప్పటి నుండిమమ్మల్ని పెంచింది .. మమ్మల్నిచదివించింది... మాకు ఉద్యోగాలు వచ్చి వరుకు తనే మమ్మల్ని పోషించింది..." అనిచెప్తూ వుద్యేగంగా చెప్తూ కళ్ళ నీళ్ళు పెట్ట్కున్నారు.. ఆవిడ కూడా వుద్యేగానికి లోనై, కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు...

ప్రేక్షకులు ఎవరి గోలలో వాళ్ళు వున్నారు... కాని అప్రయత్నం గా నాకు కూడా కళ్ళ లోంచి ఒకటే కన్నీళ్ళు... దుఖం... బాధ తన్నుకోచ్చేయి గాని దిగమింగు కున్నాను... నా యవ్వన తనం లో నేను పడ్డ కష్టాలు (అందరూ వుండి కూడా)తల్చుకుని ....
ఇలాంటి అక్కలు ... ఎందఱో మదర్ దెరిస్సా లు అందరికీ ...... వందనాలు
......

Tuesday, November 9, 2010

అడ్రస్ ఆఫ్ గాడ్


ఈ మధ్య బ్లాగుల్లో "దేవుడున్నాడని కొందరు.. లేడని కొందరు".. ఇంకా నమ్మకాల గురించి,,జాతకాల గురించి.. తెగ పోట్లాడుకుంటున్నారు.. పనిలో పనిగా కులాల్ని కూడా ఇందులోకి జోడిస్తున్నారు..
అయితే ఈ నా అనుభవాల్ని క్లుప్తంగా రాస్తున్నాను.. దేవుడున్నాడో లేడో మీరే చెప్పండి...
ఒకానొక వుద్యొగానికి నేను ఇంటర్యూ కమ్ రిటన్ టెస్ట్ కి వెళ్ళాను చాలా దూర ప్రాంతానికి.. నాలాగే సుమారు వంద మంది వచ్చారు..వున్నవి రెండే పోస్టులు.. నేను బాగా ప్రిపేర్ అయ్యను గాని.. లోపల ఒకటే టెన్షన్.. కొంత నిరాశ.. మనకి రాదులే.. అయినా మన ప్రయత్నం మనం గట్టిగా చేద్దాం.. ఇలా డొలయాన పరిస్తితిలో వుండగా.. నా పక్కకి ఓ పెద్దాయన వచ్చాడు.. ఓ యాభై కన్నా ఎక్కువ వయస్సు వుండదు.. చక్కగా నవ్వుతూ పలకరించి.."ఏమీ భయపడకు.. బాగా కష్టపడు.. నీకు తప్పక ఈ వుద్యోగం వస్తుంది." అన్నాడు.."

"చూస్తున్నారుగా ఇంతమంది వచ్చారు.. ఇక్కడ మనకి ఎవరున్నారు." ఏం కాదు..నువ్వు తప్పక సెలెక్ట్ అవుతావు.. ఆనక ఓ మంచి పిల్లని అదీ కూడా వుద్యోగస్తురాలినే చేసుకో..బావుంటుంది" అన్నాడు.." చాల్లే వూర్కొండి.. ఇప్పుడు నా వయసెంతా..ముందు ఈ వుద్యోగం నాకు చాలా ముఖ్యం..మిగతావి తర్వాత అన్నాను.. ఏం కాదు నాయనా. చక్కగా ఇక్కడ పనిచేసే ఓ మంచి అమ్మాయిని చేసుకో.. నీ లైఫ్ చాలా బాగుంటుంది నే చెప్తున్నాగా" అన్నాడు..
ఇంతకీ మీరెవరు అనడిగా టాపిక్ డైవెర్ట్ చేద్దామని.." ఫలానా స్టాఫ్ నర్స్ మా అమ్మాయి అన్నాడు.. ఓ సంవత్సరం అయ్యింది ఇక్కడ జాయిన్ అయి అన్నాడు.సరే ఇంటర్యూ.. రిటన్ టెస్ట్ అన్నీ అయ్యాయి..నా శ్రమకి తగ్గ ఫలితం వచ్చింది..జాయిన్ అయింతర్వాత ఆ పెద్దాయన ఎవరో కనుక్కొందామని..వాళ్ళ అమ్మాయి పేరు చెప్పి ఎంక్వయిరీ చేస్తే.. అబ్బే అలాంటి పేరు గల స్టాఫ్ నర్స్ ఎవరూ లేరే అన్నారు.. సరేలే అని ఊరుకున్నాను.

కాని ఆయన రూపం, నవ్వుతూ నాతో మాట్లాడే తీరు మర్చిపోలేదు..అందర్నీ వొదిలేసి నా ఒక్కడితోనే ఎందుకు మాట్లాడేడో అర్దం కాలా.సరే అప్పటికి చిన్నవాణ్ణి కాబట్టి.. బుద్దిగా ఓ నాల్గేళ్ళు ఆ వూళ్ళో పనిచేసి.. మా వూళ్ళో ఇంకో జాబ్ లొ జాయిన్ అయ్యా..

ఇక్కడ కొచ్చేటప్పడికి...మా ఆఫీస్ లోనే పనిచేసే.. అమ్మాయి(అప్పుడు సరిగా ఆయన చెప్పిన వృత్తి) సంబంధం చెప్పేరు.. కాని వుద్యోగం చేసే స్త్రీలు మా ఇళ్ళల్లో అప్పటికి లేరందున కొద్దిరోజులు ఆలోచించినా..చివరికి ఆ సంబంధం రైట్ చేసుకోడం.. నాల్గేళ్ళ క్రిందటే ఆ పెద్దమనిషి చెప్పినట్లుగా అచ్చుగుద్దినట్లుగా జరగడంతో .. ఇంతకీ ఎవరా పెద్దమనిషి ..

ఆ రూపంలో వచ్చి.. ఖచ్చితంగా నీకే ఈ వుద్యోగం వస్తుందని నాకు ధైర్యం చెప్పడం.. నువ్వు ఫలానా వృత్తిలో అమ్మాయినే చేసుకుంటావు అని చెప్పడం.. ఆ తర్వాత ఎంక్వరీ చేస్తే ఆ పేరు గల మనిషే లేక పోవడం .. ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తోంది.. దెబ్బలాటలు.. వాదనలు వద్దు.. మన తల్లి తండ్రులు మనకి ఇచ్చిన సంస్కారం మర్చి పోవద్దు.. ప్లీజ్.. ఇలాంటిదే మరో అనుభవం వుంది నా దగ్గర .. ముందు మీరు. దీనికి స్పందించండి..

Thursday, November 4, 2010

బాబా మహత్యం x శివ లింగం


ఈ ఫొటో లో కనిపిస్తున్న బుజ్జి శివలింగాన్ని చూసారు కదా ! ఈ కధంతా చదివి మహత్యాలు ఉన్నట్టా.. లేనట్టా ఏదో ఒక జవాబు ఇయ్యాలి లేదా...
మీ బుర్ర(బేతాళ కధలోలా)

ఇహ ఈ కధ.. ఈ లింగం ఈనాటివి కావు.. సుమారు పాతిక ఏళ్ళ క్రితం నాటివి. అందుకే కొంచెం పాడయింది(లింగం) ఇహ స్టోరీ లోకి వస్తే.. నేను అదేదో వూళ్ళో వుద్యోగం వెలగ బెడ్తున్నప్పుడు, ఒకానొక బాబా భక్త సంఘం వాళ్ళు మా ఊర్లో "ఉచిత కంటి ఆపరేషన్లు" (ముసలి పేద వాళ్ళకి కాటరాక్ట్ ఆపరేషన్ల కాంప్) నిర్వహించేరు..ఆ కాంప్ లోనే ఆ వారం రోజులూ వుదయం, సాయంత్రం బాబా గారి భజనలు కూడా ఏర్పాటు చేసారు.. నేను కూడా ఆ కాంప్ లో వుంటూ నాకు తోచిన సహాయం చేసే వాడ్ని.. కాని ఈ భజనలు.. వాళ్ళల్లో వాళ్ళకి గ్రూపులు అవీ నచ్చేవి కావు.. కుర్రవాణ్ణి (అప్పటికి) అగుటం చేతను.. కాస్త బాబాలమీద.. మూఢ భక్తిమీద విశ్వాసం లేక పోవడం చేతను.. నేను.. ఇంకో మిత్రుడు కలసి ఓ ప్లాన్ వేసాం.. (ఐడియా అతనిదే) అదేంటంటే...

ఆ రోజు రాత్రి రహస్యంగా ఈ శివ లింగాన్ని పూజా ద్రవ్యాల్లో కలిపెస్తాం.. మర్నాడు వుదయాన్నే సదరు భక్తుల లీడరు.. వాటిని సర్దడానికి వస్తాడు.. హఠాత్తుగా శివలింగాన్ని చూస్తాడు.. నిన్న లేని శివలింగం ప్రత్యక్షమయ్యేసరికి ఇదంతా బాబా మహిమే అనుకుంటాడు.. అందర్కీ చూపించి బాబా లీలల్ని తమ దైన రీతిలో చాటిచెప్తూ ఆనందించే వేళలో.. సరిగ్గా అప్పుడే మేం ఎన్టరై.. "నాయనలారా! ఇది మేం ఎరేంజ్ చేసిన శివలింగం.. ఇందులో బాబా మహత్యం అంటూ ఏమి లేదని" ఒక సమగ్ర ఉపన్యాసం ఇచ్చి వాళ్ళ కళ్ళు తెరిపిద్దాం అనుకున్నాం..కానీ....

మేం అనుకున్నట్టుగానే మా వాడు వెళ్ళి శివ లింగాన్ని అక్కడుంచాడు.. నేను ఇంటి దగ్గర ఆ రాత్రంతా మర్నాడు ఎలా ఉపన్యసించాలి.. అంత పెద్ద వాళ్ళ ముందు ఎలా మాట్లాడాలి అని ప్లాను వేస్కుంటూ రాత్రంతా ఆలోచిస్తూ ఏ మూడో ఝామునో పడుకున్నాను.. అందువల్ల నేను నిద్ర లేచీ సరికే సుమారు పదకొండు దాటింది.. అందులోనూ అప్పటికి మూడ్రోజులనుండి కాంప్ కోసం రాత్రి, పగలు కష్టపడుతున్నాం..
ఇదేమిట్రా ఇలా అయ్యింది.. పొద్దున్నా ఏం జరిగిందో ఏమిటొ అని కలవర పడ్డాను.. సరే మా వాడు ఉన్నాడు కదా.. వాడు వాళ్ళందర్కీ కళ్ళు తెరిపించే వుంటాడులే.. అని అతని రాక కోసం చూసేను.. వచ్చేడు...

వస్తూనే.. "అరే! ఏంది గురూ పొద్దున్న రాలేదేం?" అని అడిగేడు.. జరిగింది చెప్పి."నా సంగతి సరే.. మన ప్లాను సక్సెస్ అయ్యిందా? వాళ్ళు శివ లింగం చూసారా? నువ్వు వాళ్ళ కళ్ళు తెరిపించావా?" అనడిగా. "ఏం చెప్పమంటావు భయ్యా? ఆ లీడరాయన ఇలా టేబుల్ మీద క్లాత్ తియ్యాగానే శివలింగం ..పక్కనే ఓ పళ్ళెం లో పడ్డది.. ఇహ చూస్కో.. ఇంతా అంతా హడావుడి కాదు.. వెంటనే "బాబా యే శివలింగాన్ని పంపించిండు.. అని ఒకరు.. కాదు బాబాయే శివలింగం రూపంలో వచ్చి మనల్ని ఆశ్వీదరిస్తున్నారు అని ఒకరు.. ఒకటే హడావుడి.. ఆ వెంటనే పేషంట్లు అందర్నీ కూచోబెట్టి..ఒకటే భజన్లు.." నేనడిగేను "మరి నువ్వే చేస్తున్నావ్.. వాళ్ళందర్కీ చెప్పలేక పోయావా ఇది మన పనే అని" లాభం లేదు గురూ అక్కడ నా మాట ఎవరూ వినిపించు కొనే స్థితిలో లేరు.. చాలా తన్మయత్వం లో వుండి.. అందరి లోను ఒక నూతన వుత్సాహం.. ఒక భక్తి భావం.. ఈ కాంప్ సక్సెస్ అయ్యిందని పెద్దాళ్ళంతా (అందరూ ఆఫీసర్లు, ఇంజనీర్లు) అంత ఉద్రిక్త వాతావరణం లో నాకసలు ఏం చెయ్యాలో తోచలే.. సర్లే మన వల్ల మంచి పనే జరిగింది.. ఏ గ్రూపులూ లేకుండా అందరూ అంతా కలసిమెలసి.. కాంపులో కలివిడిగా తిరుగుతూ పనిచేస్తున్నారు..అని సైలెంట్ గా ఉన్నా" అన్నాడు..

"ఛస్.. నీ ప్లేసు లో నేనుంటేనా..ఆళ్ళందర్కీ కళ్ళు తెరిపించేద్దును" అని అంటే
" ఆ నువ్వున్నా .. ఏం చెయ్యలేవు.. ఆ సిట్యువేషన్ అలా వుంది..పైగా వాళ్ళందరూ. మన కన్నా ఓ మెట్టు పైనున్న వాళ్ళు.. సర్లే.. ఇదీ ఒక విధంగా మంచే అనుకో.. ఆ దేవుడే మన చేత ఈ మంచి కార్యం చేయించి వుంటాడు..కాస్త ఆలోచించు" అని వెళ్ళిపోయాడు..
ఇప్పుడు చెప్పండి.. బాబా మహత్యం వున్నట్టా లేనట్టా? మా బుజ్జి శివుని లింగం నా చేత ఈ పని చేయించింది లోకానికి ఏం చాటడానికి? ఇంతకీ కధలో శివలింగం ఆ భక్తుడు పట్టుకుపోయాడు.. ఇది దాని కజిన్ అన్నమాట...

Wednesday, October 13, 2010

కులాల్లో చిచ్చుపెడదాం, పండగ చేసుకుందాంఆ మధ్య "తెలుగిల్లు" అనే బ్లాగ్ లో "మతానికి -చట్టానికి మధ్య వున్న సన్నిహిత సంబంధమే మనుస్మృతి" అనే కాలమ్ కి నేను ఈ క్రింది విధంగా స్పందించాను.. నాతో ఏకీభవిస్తారా?

కావూరి గారూ,మీది ఏ కులమో తెలీదు గాని, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం, (ఏ కాలంలోదో మీకూ తెలీదు.. మకూ తెలీదు)చెప్పబడ్డ మనుధర్మం గురించి అందర్కీ (ఆ మాత్రం సామాజిక శాస్తం చదివిన వాళ్ళకి) తెలిసిన విషయాల్నే రాసి చర్చకు పెట్టారు.. ఎందుకంటే ఇలాంటి విషయాల్ని సమర్ధించే వాళ్ళూ ఉంటారు.. వ్యతిరేకించే వాళ్ళూ వుంటారు.. పండగ చేసుకోవచ్చు.. ఇదో ఆనందం.(పేకు మీరే పెట్టుకోండి) అయితే.. మనకు స్వతంత్రం వచ్చి ఇన్నాళ్ళయ్యింది.. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క, ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల పాలనలో వున్నాము.. రాజరిక వ్యవస్థ పోయి ఎన్నేళ్ళయ్యిన్ది? ఇప్పుడు మన భారతదేశంలో ఆనాటి కాలం కన్నా ప్రజలు సుఖంగా వున్నారా? ఇప్పటి సమాజంలో అవినీతి, అరాచకం, కుళ్ళు, నేరాలు (ప్రజల్లోకే అవినేతి రక్తాన్ని ఎక్కించిన ఘనత మనది). ఇప్పుడు నోటు ఇవ్వందే ఓటు వెయ్యని పరిస్థితి. తెల్లారి పేపర్ చదివితే.. టి.విల్లో వార్తలు చూస్తే.. వాణ్ణి వీడు, వీణ్ణి వాడు తిట్టుకోడం తప్ప ఏమైనా వుందా? మంచి పన్లు చేసే వాళ్ళను సమర్థించే పరిస్తితి అసలు ఉందా? నేడు కులం ఏదైనా పేద వాడు అన్ని కులాల్లోనూ వున్నాడు. స్వాతంత్ర్యం వచ్చేక భూదాన ఉద్యమంలో స్వచ్చందంగా పాల్గొని, ఆస్థులు పోగొట్టుకున్న వాళ్ళు లేరా? ఇప్పుడు తక్కువ రేటుకే ప్రభుత్వ భూముల్ని లాక్కుంటున్న బడా బాబుల్ని ఏమనాలి? అరచి గోల పెట్టడం తప్ప ఏమైనా చెయ్యగలుస్తున్నామా? ఇక స్త్రీల విషయానికొస్తే.. అనాటి కాల, మాన పరిస్థితులని బట్టి అటువంటి పద్దతులు పెట్టి వుంటారు.. ఇప్పుడు అన్ని రంగాలలోనూ స్త్రీలు మగవాళ్ళతో సమానంగా (లేదా) ఎక్కువగా రాణిస్తున్నారు కాబట్టి, ఇక ఆ చర్చ అనవసరం.. కొన్ని కుటుంబాలలో అమ్మ/భార్య చెప్పిందే వేదంగా భావించి, చక్కగా మనుగడ సాగిస్తున్నారు.. ఇప్పటి స్త్రీ ఆలోచనా ధోరణి వేరు.. అయితే ఒక స్త్రీ, మరొక స్త్రీకి శత్రువుగా వుండడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి.. ఇవేళ ఏ టి.వి సీరియల్ చూసినా అదే ఇతి వృత్తం.. ఇంకా ఘోరం ఏంటంటే.. నేరాల్లో కూడా స్త్రీ పాత్ర వుండడం (తన సుఖానికి అడ్డొస్తోందని..తల్లే కూతుర్ని గదిలో బంధించి,చిత్రహింసలు పెట్టి.. ఓ తలుచుకుంటేనే భాధగా వుంది). ఇవన్ని మనకనవసం సార్..గత చరిత్రని తవ్వుదాం.. అయ్యో అప్పుడు ఎంత ఘోరం జరిగిపోయిందే అని టన్నుల కొద్దీ కన్నీరు కారుద్దాం.. కులాల్లో చిచురేపుదాం.. పండగ చేసుకుందాం.. సరేనా..

Thursday, October 7, 2010

మనాలి - అందాలు -పులి కాదు.. ఒట్టు.. కుక్కే ..

మేము మనాలి వెళ్ళినప్పుడు బంధించిన దృశ్యాలు : కామెంట్స్ రాస్తే చాలా సంతోషిస్తాను...


కాల్కా నుండి సిమ్లా వెళ్ళే దార్లో బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన అద్భుత రైల్ బ్రిడ్జి


-- ------- ----

మనికరాన్ సహజ సిద్దమైన వేడినీళ్ళు అందులో ఉడుకుతున్న అన్నం, పప్పు,బంగాళాదుంపలు వగైరా

- - - -


వామ్మో ఇక్కడ నుంచి పడితే

పులి
కాదు... ఒట్టు ..కుక్కే ..

Tuesday, October 5, 2010

మౌనమే నీ భాష ఓ మూగ మనసా

మనం లేనప్పుడు మన గురించి, ఆఖరికి మన ఆఫీసులో గోడకి తగిలించుకున్న.. మన కిష్టమైన దేవుని ఫోటోని కూడా కామెంట్ చేసే.. కొలీగ్స్ మధ్యలో.. మన సీనియర్ మన కంటే తెలివైన వాడు కాకపోయినా, మన కంటే బలవంతుడు..దుశ్శీలుడు అయినా.. వాడు మాట్లాడే మాటలు.. మనకి విరుద్దంగా వున్నా.. మన మనస్సుకి బాధగా వున్నా.. ఆఫీసర్లు కూడా వస్తవాలు గ్రహించ కుండా.. భజంత్రీ గాళ్ళ మాటలు, తిరగబడే మనస్తత్వం వున్న వాళ్ళకి జడిసి వాళ్ళ మాటలకే విలువ నిస్తునప్పుడు.. గురూ.. ఎవ్వళ్ళు ఎలా పోతే మనకేవిటి.. కంపెనీ ఏవై పోతే మన కేవిటి.. దేశం ఏమైపోతే మన కేంటి.. మన జీతం రాళ్ళు మనకొస్తున్నాయా లేదా.. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా.. ఈ స్టైల్ లొ సలహా లిచ్చే శ్రేయోభిలాషులు(?).. ఏది చెప్పినా వెంటనే ఇంకొకళ్ళకి..ఆ విషయానికి..మనం చెప్పనివి.. మరో రెండు జోడించి..ప్రచారం చేసే నెట్ వర్కు గాళ్ళు వున్న ఈ నాటి మన వుద్యోగ పర్వం లో.. మౌనమే నీ భాష ఓ మూగ మనసా

Wednesday, July 7, 2010

దుష్ట మానవుడే మహనీయుడు

అయ్యా ఇప్పుడున్న పరిస్తితుల్లొ ఎవడు ఎంత దుస్ట పనులు చెస్తే అంత గొప్ప. పరవస్తు చిన్నయ్యసూరి (మీకు తెలీయక పొతే మీ నాన్నని అడిగండి). ఆయన రాసిన కధల్లొని పాత్రలన్ని మనచుట్టూ వున్నయి... సారి యున్నారు. మా కొలీగ్స్ చలా మంది గుంట నక్కలు, పెద్దపులులు, తోడెల్లు ... అబ్బో ఎన్నొ జంతువులు. మేకవన్నె పులులు.. నేను బొల్డు కథలు చెప్పగల్ను...అయితె మీరు నాకు ఎంకరెజ్ చేస్తే.. చాలా చెప్తాను..నా దగ్గర చాలా సరుకుంది.. ప్లేజ్ .. నన్ను ఫాలౌ అవ్వండేం .. ఓకేనా ..