Saturday, September 10, 2011

సత్య లోక దర్శనంనా ముందరి పోస్ట్ "సత్య మే జయతే" రాసిన తర్వాత కల వచ్చింది.. నన్ను ఇద్దరు భటులు లాంటి వారు చెరో పక్క రెక్కలు పట్టుకుని ఎక్కడికో తీసుకెళ్తున్నారు.. నేను వాళ్ళను విడిపించు కోడానికి ప్రయత్నిస్తున్నాను.. కానీ సాధ్యపడట్లేదు.. అలా గిజ గిజ లాడుతునే వాళ్ళ వెనకాల చాలా సేపు వెళుతున్నా...
నా ఇష్ట దైవాన్ని పక్క ప్రార్దిస్తున్నా.. కాస్సేపటికి భటులు మారారు.. ఎవరో కొత్త భటులు (మంచి వారిలా వున్నారు).. తీసుకుని వెళ్తున్నారు.. అలా గాలి లోకి ప్రయాణం సాగిస్తున్నాం..అలా ఎగురుతూ ఎగురుతూ ఎక్కడికో వెళ్ళిపోతున్నా....ఇంతలో నేను ప్రార్ధన చేస్తున్న మూర్తి రూపం కనిపించింది.. వెనువెంటనే దేవ దేవుని రూపం..
సరిగ్గా అప్పుడే లోకాన్ని చూసాను.. కొత్త లోకం..అందులోకి ప్రవేసించాను.... దివ్య మైన అనుభూతికి లోనయ్యాను.. కాని అనుభూతి ఏమిటో... అంతకు ముందు కనబడ్డ దైవ మూర్తులు ఎవరో విపులంగా చెప్పాలని లేదు.. ఇలాంటి అనుభూతులని ఎవరికీ వారే తెలిసికుని పొందాలి గాని వేరే వాళ్లకి పైగా ఇలా పబ్లిక్ లో చెప్పకూడని ధ్యానం క్లాసుల్లో చెప్పే వాళ్ళు.. అయినా ఎందుకని రాసాను అంటే.. ఒక మంచి ఆర్టికల్ ( నా దృష్టి లో) రాసాననే తృప్తి తో నిద్రపోవడం వల్ల కావచ్చు , సత్యమేవ జయతే అన్న మంచి పదం వల్ల కావచ్చు .. దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల కావచ్చు నిజంగానే "సత్యలోక" దర్శనం అయ్యింది..
కానీ ఆరోజు నుంచి ప్రతి క్షణం నిత్యం సత్య లోకం లోనే వుండాలని.. అలా వుండడం వల్ల పొందే అనుభూతి ఎంతో వున్నత మైనదిగా భావించడం జరుగు తోంది... ఒక అబద్ధం ఆడడం చాలా తేలిక అవచ్చు..
కానీ కేవలం నిజం మాత్రమే చెప్పడానికి ఎంతో గట్స్ వుండాలి..తప్పు ని తప్పు గా చెప్పడానికి ధైర్యం వుండాలి..ఎదుటి వాడు చెప్పే ప్రతి మాటని గంగి రేద్దులా "యస్" అని ఒప్పు కోకూడదు..వాడు ఎంత పెద్ద వాడైనా... మనం అప్పటికి చెడ్డ అయినా సరే...
డియర్ ఫ్రెండ్స్ నా సిన్సియర్ రిక్వెస్ట్ "మీరు కూడా సత్య లోకంలో విహరించండి.. బతికేది కొన్నాళ్ళే.. కొద్ది జీవితం అబద్దాల మెట్ల పై కాక సత్య మనే వైతరిణి లో మునుగుదాం.. ఏమంటారు..

Monday, September 5, 2011

సత్య మేవ జయతే..."సత్య మేవ జయతే" అనగా సత్యం ఎప్పటికైనా జయిస్తుంది అని అర్ధం అనుకుంటా.. ఈ మాట ఎంతో మందికి స్ఫూర్తి... నిత్యం సత్యాన్నే పలకాలనే వాళ్లకు ఉపిరి..కాని ఈ రోజు ఓ అవినీతి సామ్రాట్టు నోట ఈ మాట వినవలసి వచ్చింది..మరొకాయన "నేను ఏ పాపం చెయ్యలేదు... అంతా ఆ దేమునికి తెలుసు" అంటాడు..మరొక బాబు గారు "ఇవిగో నా ఆస్తి అంతా పావలా మాత్రమె" అంటారు..
కాని చట్టం తన పని తానుచేసుకుని పోతూనే వుంటుంది.. దేవుడు సరి అయిన టైంలో సరిగ్గానే స్పందిస్తాడు..

హమ్మయ్య.. ఇంకా నీతి బతికుందని, పాపం చేసిన వాళ్ళకు ఎప్పటికైనా శిక్ష తప్పదని నమ్ముతున్న సామాన్యులకి అనేక కోట్ల ప్రజలకి ఆనందం కలగ జేసే చర్య ఈ నాటికి కలిగింది..
ఏమిటి నేనేదో టి.వి చానల్లో కనిపిస్తూ అవినీతి గురించి ఇప్పుడే జ్ఞాపకం వచ్చిన రాజకీయ నాయకుడి లా ప్రకటన ఇస్తున్నానని అనుకుంటున్నారా...గడ్డి మేయడానికి అవకాశం వుండి కూడా మేయడం చేతకాని గడ్డి వాము దగ్గర కుక్క లాంటి వాడినని అనే బిరుదులు ఎన్నో పొందిన వాణ్ని..
గత రెండేళ్ళుగా గమనిస్తున్నా.. ఎప్పటి కప్పుడు అనుకుంటూ వున్నా వీళ్ళ ఆగడాలకి అడ్డుకట్ట ఇక లేదా అని.. పాపం పెద్దాయన పోవడం తో వీళ్ళ కష్టాలు మొదలయ్యాయి.. ఆయన గనక బతికుంటే ఇవన్ని ఇలా జరుగుతాయా. అందుకే దేముడు ముందుగా ఆయన్ని తీసుకు పోయాడు...
బాబుగారు తినడం ఎలాగో నేర్పించారు.. మళ్లీ తానే అధికారం లోకి వస్తాను అనుకుని బాబుగారు కొన్ని తినకుండా మిగిల్చాడు.. విధి వక్రంగా తిరిగింది... పాద యాత్రతో అంచనాలు తారుమరాయి, పెద్దాయన గద్దె నెక్కాడు.. బాబు మిగిల్చిన భూములని అంతకు పదింతలు రేట్లను పెంచి భూదానాలు , జలయజ్ఞాలు చేసి, వారసున్ని చినరాజా గా ఎదిగేలా చేశారు..
ఇహ తరువాతి ముఖ్యమంత్రులకు భూమి(ప్రభుత్వ భూమి) లేకుండా చేశారు.. ఖజానా లో చిల్లిగవ్వ లేకుండా జాగ్రత్త పడ్డారు.. ఆయనకు ముందే తెలుసు అనుకుంటా ఇహ నా పని అయిపోయింది అని అందుకే వెళ్ళే ముందు ప్రజల్లో మంచి పేరు రావాలని ఎన్నో ప్రజా హిత పధకాలు చేపట్టారు.. అప్పటికి ఆనాటి ఆర్ధిక మంత్రి చెవిలో జోరీగ లాగ చెప్తూనే వున్నారు ఖజానా ఖాళి అవుతోందని అయినా లెఖ్ఖ చెయ్యలా.. అందుకే ప్రజల్లో అభిమానం...
గాలి నా కొడుకు లాంటి వాడు అని పెద్దాయన అప్పుడే చెప్పారు. అయినా సి.బి. వాళ్ళు లెక్క చెయ్యలేదు..షుష్మా స్వరాజ్య్ పెంచి పోషించిన రాబందు.. అయితే ఇక్కడతో అవినీతి పరులకు శిక్ష పడినట్టా... ఇంకా చెయ్య వలసింది ఎంతో వుంది.. బాబు లాంటి వాళ్ళని కూడా వదలకూడదు..మరి ఉద్యమం పేరు చెప్పి గత పదేళ్లుగా కోట్లు సంపాదించుకుని కుటుంబం మొత్తాన్ని, వ్యాపారం లోకి వదిలిన గద్దలని వదలకూడదు..
దేశం లో ఎంతో మంది అవినీతి పరులైన ఎం.పీ లు, ఎం.ఎల్. లు, మంత్రులు వాళ్ళ బావ మరుదులు, తమ్ముళ్ళు, అల్లుళ్ళు .. అందర్నీ ఒక్కక్కరుగా విచారించాలి.. వాళ్ళు చేసిన అవినీతి పనులకు జవాబు దారి కావాలి.
ఇప్పుడున్న సి.బి. ఆఫిసర్లకి రక్షణ వుండాలి..
ఆనాటి ..ఎస్ ఆఫిసర్లని కూడా సస్పెండ్ చెయ్యాలి..మళ్లీ అధికారి గాని, రాజకీయ నాయకులు గాని అవినీతి పన్లు చెయ్యకుండా శిక్షలు వుండాలి ...
ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నాను మేరా భారత్ మహాన్ అని..

Saturday, September 3, 2011

కోట్లని భోంచేసే (వి) నాయకుడు

మనం రోజు కోట్లని భోంచేసే నాయకుల్ని చూస్తున్నాం (టివి ఇరవై నాల్గు గంటలు పుణ్యమా అని)...
"ఒక్క రూపాయి చాలు బాబూ" అని మనల్ని అడుక్కునే వాళ్ళని చూసి ముఖం తిప్పు కుంటాం.. కాని సిగ్గు, ఎగ్గు లేకుండా ప్రజల ధనాన్ని దర్జాగా తిన్న వాళ్ళని దేవుడు, రాముడు అంటూ భజన చెయ్యడమే కాక తిరిగి వాళ్ళనే ఎన్నుకుంటాం.. అందుకు మనం కూడా సిగ్గు, ఎగ్గు లేకుండా ఓటు కి ఇంతా అని అడుక్కుం టాం....ఎంత మంది అన్నా హజారెలు రావాలి మనల్ని బాగు చెయ్యడానికి ? వీధికో వినాయకుని విగ్రహం వుందో లేదో తెలీదు గాని, వీధికి నాలుగు నాయకుల(?) విగ్రహాలు..ఒకే వూళ్ళో ఒక నాయకుడిది ఒక విగ్రహం వుంటే చాలదు.. ఇది అభిమానమా, దురభిమానమా....

అందుకే మా వినాయకుణ్ణి పూజించా ...
అదే మా ఇంట్లో వినాయకుణ్ణి ప్రార్ధించా "స్వామీ , ఎప్పటికైనా అవినీతి, బంధు ప్రీతి లేని రాజ్యాన్ని ఇవ్వు .. అప్పటికి నేను లేక పోయినా, మా ముని ముని మనవలైనా బాగుంటారు కదా" అని....
మా వినాయకుడు కూడా అన్ని భోంచేసి నవ్వుతూ చూస్తాడే గాని బదులివ్వడు.. అచ్చం నాటి నాయకుడి లాగే..
తెలంగాణా
పై తనది కూడా రెండు కళ్ళ సిద్ధాంతమే అట... ఖైరతాబాద్ ఎంత ముఖ్యమో వైజాగ్ లో గాజువాక కూడా అంతే ముఖ్యమట.. కాని అసలే కుళ్ళు కంపు కొడ్తున్న హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసి, మరింత కుళ్ళు చేస్తున్నారని వాపోయాడు..
స్వామీ
ఏంచేస్తాం, అప్పటికి గోదారిని హైదరాబాద్ కి మల్లిద్దాం అని కోట్లు భోంచే స్తున్నారు గాని మా నాయకులు చుక్క నీరు పారించ లేక పోతున్నారు.. అందుకే మా కేసి ఆర్ గారు ఏకంగా బంగాళా ఖాతాన్నే హైదరాబాద్ లో ప్రవహించేలా చేస్తారు అందుకు నీ సహకారం కావాలి..
ఆర్భాటం
లేని తెలంగాణా బ్రాహ్మల చేత నీకు సహస్ర అభిషేకాలు, నీ దంతం ఎరువిస్తే దాంతో మా నాలుకలు తెగ్గోసి, నీకు రక్త తర్పణాలు చేసి, ఎలాగోలా తెలంగాణా తెచ్చేసి, వాళ్ళ కొడుకుని ఆర్ధిక శాఖ మంత్రిగా, మేనల్లున్ని హోం శాఖ మంత్రిగా, కూతుర్ని ఇరిగేషన్ శాఖ మంత్రిగా మాత్రమె చేస్తారు అందువల్ల చిన్న చిన్న కోర్కెలు తీర్చి, తరించ వలసిందిగా మనవి..
అప్పుడు
హైదరాబాద్ నవాబ్ వలె కొన్ని కోట్లకి అధిపతి అయి నీకు బంగారంతో జిల్లేడు కాయలు, ఉండ్రాళ్ళు చేయిస్తారు..
మాటలకి ఏం కాని, మా ఇంట్లో కొలువైన , మా వినాయకుణ్ణి,
అలాగే మా వీధిలో కొలువైన వ్యాసుల చెప్తుండగా భారతాన్ని రాస్తున్న బుజ్జి, బొజ్జ గణపయ్యను చూసి తరిస్తారని, వినాయకుని ఆశీర్వచనాలు పొందుతారని ఆశిస్తూ ఇప్పటికి సెలవ్