
"సత్య మేవ జయతే" అనగా సత్యం ఎప్పటికైనా జయిస్తుంది అని అర్ధం అనుకుంటా.. ఈ మాట ఎంతో మందికి స్ఫూర్తి... నిత్యం సత్యాన్నే పలకాలనే వాళ్లకు ఉపిరి..కాని ఈ రోజు ఓ అవినీతి సామ్రాట్టు నోట ఈ మాట వినవలసి వచ్చింది..మరొకాయన "నేను ఏ పాపం చెయ్యలేదు... అంతా ఆ దేమునికి తెలుసు" అంటాడు..మరొక బాబు గారు "ఇవిగో నా ఆస్తి అంతా పావలా మాత్రమె" అంటారు..
కాని చట్టం తన పని తానుచేసుకుని పోతూనే వుంటుంది.. దేవుడు సరి అయిన టైంలో సరిగ్గానే స్పందిస్తాడు..
హమ్మయ్య.. ఇంకా నీతి బతికుందని, పాపం చేసిన వాళ్ళకు ఎప్పటికైనా శిక్ష తప్పదని నమ్ముతున్న సామాన్యులకి అనేక కోట్ల ప్రజలకి ఆనందం కలగ జేసే చర్య ఈ నాటికి కలిగింది.. ఏమిటి నేనేదో టి.వి చానల్లో కనిపిస్తూ అవినీతి గురించి ఇప్పుడే జ్ఞాపకం వచ్చిన రాజకీయ నాయకుడి లా ప్రకటన ఇస్తున్నానని అనుకుంటున్నారా...గడ్డి మేయడానికి అవకాశం వుండి కూడా మేయడం చేతకాని గడ్డి వాము దగ్గర కుక్క లాంటి వాడినని అనే బిరుదులు ఎన్నో పొందిన వాణ్ని..
గత రెండేళ్ళుగా గమనిస్తున్నా.. ఎప్పటి కప్పుడు అనుకుంటూ వున్నా వీళ్ళ ఆగడాలకి అడ్డుకట్ట ఇక లేదా అని.. పాపం పెద్దాయన పోవడం తో వీళ్ళ కష్టాలు మొదలయ్యాయి.. ఆయన గనక బతికుంటే ఇవన్ని ఇలా జరుగుతాయా. అందుకే దేముడు ముందుగా ఆయన్ని తీసుకు పోయాడు...
బాబుగారు తినడం ఎలాగో నేర్పించారు.. మళ్లీ తానే అధికారం లోకి వస్తాను అనుకుని బాబుగారు కొన్ని తినకుండా మిగిల్చాడు.. విధి వక్రంగా తిరిగింది... పాద యాత్రతో అంచనాలు తారుమరాయి, పెద్దాయన గద్దె నెక్కాడు.. బాబు మిగిల్చిన భూములని అంతకు పదింతలు రేట్లను పెంచి భూదానాలు , జలయజ్ఞాలు చేసి, వారసున్ని చినరాజా గా ఎదిగేలా చేశారు..
ఇహ తరువాతి ముఖ్యమంత్రులకు భూమి(ప్రభుత్వ భూమి) లేకుండా చేశారు.. ఖజానా లో చిల్లిగవ్వ లేకుండా జాగ్రత్త పడ్డారు.. ఆయనకు ముందే తెలుసు అనుకుంటా ఇహ నా పని అయిపోయింది అని అందుకే వెళ్ళే ముందు ప్రజల్లో మంచి పేరు రావాలని ఎన్నో ప్రజా హిత పధకాలు చేపట్టారు.. అప్పటికి ఆనాటి ఆర్ధిక మంత్రి చెవిలో జోరీగ లాగ చెప్తూనే వున్నారు ఖజానా ఖాళి అవుతోందని అయినా లెఖ్ఖ చెయ్యలా.. అందుకే ప్రజల్లో అభిమానం...
గాలి నా కొడుకు లాంటి వాడు అని పెద్దాయన అప్పుడే చెప్పారు. అయినా ఈ సి.బి.ఐ వాళ్ళు లెక్క చెయ్యలేదు..షుష్మా స్వరాజ్య్ పెంచి పోషించిన రాబందు.. అయితే ఇక్కడతో అవినీతి పరులకు శిక్ష పడినట్టా... ఇంకా చెయ్య వలసింది ఎంతో వుంది.. బాబు లాంటి వాళ్ళని కూడా వదలకూడదు..మరి ఉద్యమం పేరు చెప్పి గత పదేళ్లుగా కోట్లు సంపాదించుకుని కుటుంబం మొత్తాన్ని, ఈ వ్యాపారం లోకి వదిలిన గద్దలని వదలకూడదు..
దేశం లో ఎంతో మంది అవినీతి పరులైన ఎం.పీ లు, ఎం.ఎల్.ఎ లు, మంత్రులు వాళ్ళ బావ మరుదులు, తమ్ముళ్ళు, అల్లుళ్ళు .. అందర్నీ ఒక్కక్కరుగా విచారించాలి.. వాళ్ళు చేసిన అవినీతి పనులకు జవాబు దారి కావాలి.
ఇప్పుడున్న సి.బి.ఐ ఆఫిసర్లకి రక్షణ వుండాలి..
ఆనాటి ఐ.ఎ.ఎస్ ఆఫిసర్లని కూడా సస్పెండ్ చెయ్యాలి..మళ్లీ ఏ అధికారి గాని, రాజకీయ నాయకులు గాని అవినీతి పన్లు చెయ్యకుండా శిక్షలు వుండాలి ...
ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నాను మేరా భారత్ మహాన్ అని..
0 comments:
Post a Comment