అయితే అప్పుడు ఇప్పుడు అయినంత డెవలప్ లో లేదు..ప్రతి సెంటర్ లోను ఓ ఇరాని చాయ్ సెంటర్ మాత్రమే ఉండేది .. అలాంటి ఓ హోటల్ కి వెళ్ళాం. అప్పుడు సమయం మధ్యాహ్నం ఒంటి గంట అవుతోంది. నాకు మంచి ఆకలి గా వుంది..
మావాడు "సమోసా" అన్నాడు.. వెంటనే ఓ బుట్టడు నిండా సుమారు ఓ పాతిక సమోసాలు తెచ్చి మా ముందు పెట్టి వెళ్ళాడు హోటల్ అతను.. ఇన్ని సమోసాలు ఎందుకు ఆర్డర్ ఇచ్చాడో అర్థం కాలా... ఇది భోజనం చేసే సమయం కదా హాయిగా ఏదైనా భోజనం హోటల్ కి తీసికెళ్ళి భోజనం పెట్టించ కుండా ఇలా ఇన్ని సమోసాలు ఆర్డర్ ఇచ్చేడేమిటా అని వాటిని తినలేక తింటున్నా.. అతనేమో స్టైల్ గా ఓ రెండు సమోసాలు తిని ఆపేసి, చాయ్ తాగుతున్నాడు.. నేనేమో అవన్నీ తినాలనుకుని అలా తింటూనే వున్నా... అతను నా వైపు వింతగా చూస్తున్నాడు... ఇద్దరికీ మొహమాటం..కాని మా వాడే నన్ను, బుట్టను ఓ సారి పరికించి చూసి, ఇహ వెళ్దామా అన్నాడు..
ఏంటి ఆర్డర్ ఇచ్చిన సమోసాలు తినకుండానే .. డబ్బులు ఎక్కువైపోయాయా.. అనుకుంటూ "ఎందుకు ఇన్ని సమోసాలు ఆర్డర్ ఇచ్చావ్ ? " అని అడిగా .
అప్పుడు అర్ధం అయ్యింది అతనికి.."నేనేమి అన్ని సమోసాలు ఆర్డర్ ఇవ్వలేదు.. మనం సమోసా అనగానే ఆ బుట్ట మన ముందు పెట్టేస్తాడు, మనం ఒకటో రెండో తెనేసి మిగతావి వదిలేయాలి..మనం తిన్న వాటికి మాత్రమే బిల్లు పే చేస్తే చాలు.."అన్నాడు..
"మరి మిగతావి" అని అడిగా అమాయకంగా..
"వాటిని మరొకరు ఆర్డర్ చేస్తే వాళ్ళ టేబుల్ మీద పెడతాడు" ..
ఏంటి మనం తినగా మిగిల్చినవి ఇంకోడు తింటాడా..అయితే మనం తిన్నవి కూడా ఎవడో తినగా మిగిల్చినవేనా." అన్నాను..
అతను నవ్వుతు "అంతే.. అదే ఇక్కడి పద్దతి.. నువ్వు తెలిక బుట్టడు సమోసాలు తినాలని చూసావు..
ఆ విషయం నేను గ్రహించే సరికే ఆలస్యం.అయింది. నువ్వు సుమారు ఓ ఆరో, ఏడో తిని ఉంటావు.." మరి ఇలా ఒకరి ఎంగిలి వేరొకరికి తగిలి జబ్బులు రావా అని అడుగుదామన్నా నేను అడగలేక పోయా.అప్పటికే కడుపులో దేవుతోంది..సమోసాలు ఎక్కువై ఓ పక్క.. చాలా మంది తినగా వదిలిన సమోసాలు తిన్నానే అన్న భావన ఒక పక్క.. ఈ సంఘటన జరిగి చాలా కాలం అయినా హైదరాబాద్ గుర్తొచ్చి నప్పుడు.. లేదా మా మావయ్య కనబడ్డప్పుడు అతని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఇది గుర్తుకొస్తుంది.... ఇంకా ఈ పద్దతి హైదరాబాద్ లో వుందో లేదో నాకు తెలీదు.ఇప్పుడంటే ఇన్ని భోజన హోటల్లు వున్నాయి గాని.. అప్పుడు పెద్ద నాన్ వెజ్ హోటల్లు లేదా ఈ ఇరాని చాయ్ హోటల్లు తప్ప హైదరాబాద్ లో ఉండేవి కావు..ఒకటో అరా తప్ప.. అదికూడా నాంపల్లి, సికిందరాబాద్ దగ్గర తప్ప..
కాని తాగితే హైదరా బాద్ ఇరాని చాయ్ నే తాగాలి..
"ఇప్పుడంటే ఇన్ని భోజన హోటల్లు వున్నాయి గాని.. అప్పుడు పెద్ద నాన్ వెజ్ హోటల్లు లేదా ఈ ఇరాని చాయ్ హోటల్లు తప్ప హైదరాబాద్ లో ఉండేవి కావు..ఒకటో అరా తప్ప.. అదికూడా నాంపల్లి, సికిందరాబాద్ దగ్గర తప్ప"
ReplyDeleteI know more than 50 hotels from 23 years ago (~ 1988) excluding Irani hotels. There were veg hotels even in Mallepalli. Tajmahal, Kamath, Shanbagh, Gayatribhavan, Minerva etc. are famous till today. Abhiruchi type & Chinese restaurants were also there.
In fact very few middle budget or veg restaurants have come up in the last 23 years. The only change is the mushrooming of mess, tiffin center & curry points and tea bandies.
ఆంత పెద్ద హైదరాబాద్ కి ఇవి తక్కువే కదండీ.. అదీ రాజధాని నగరంలో.....పైగా మనకి అందుబాటు ధరలో..
ReplyDelete@voleti: I think the key here is "అందుబాటు ధర". 1980 నాటికి (9 years before your experience) మీరు చెప్పిన AG ఆఫీసు దగ్గరలో (పది నిమిషాల నడక లోపల) ఉన్న హోటళ్ళు తొమ్మిది: అయోధ్య, ద్వారక, రాజదూత్, ఇందు, కామత్, గోపి, కృష్ణ, స్వాగత్ & అశోకా(ఇంకా ఒకటి రెండు నేను మరిచి పోయానేమే). ఇవి కాక టెలిఫోన్ భవన్ కాంటీన్ లో కూడా అందరినీ రానిచ్చేవారు. ఇంకా చదువుకుంటున్న మాకు అశోక, రాజదూత్ & ఇందు మాత్రమె కొంచం ఎక్కువగా తోచేవి కానీ భోజనం రుచిగా ఉండడంవల్ల, unlimited:)అప్పుడప్పుడూ వెళ్ళే వాళ్లము.
ReplyDeleteఇప్పటికి కూడా అవే ఉన్నాయి, కొన్ని తగ్గి పోయాయి కూడా. ఆమీర్పేటలో కూడా ఇప్పుటికీ అన్ని లేవు.