సదా నా మదిని నువ్వే నిండి వుండవా దేవా

సదా నా మదిని నువ్వే నిండి వుండవా దేవా
ఓం నమో నారాయణాయ..

Wednesday, November 23, 2011

ఎవరు తెలంగాణా ప్రాంతానికి వ్యతిరేకి

నా బ్లాగుల విషయాలు చూసి నేనేదో తెలంగాణా ప్రాంతానికి కి వ్యతిరేకిని అనుకున్నట్లు ఉన్నారు కొంత మంది.. నాకు మొదట బిక్ష పెట్టిన ఊరన్నా, కంపెని అన్నా నాకు నా సొంత ఊరు కన్నా ఎక్కువ..
మీది ఏ
ఊరు అని ఎవరైనా అడిగితె ఊరి పేరే చెప్పే వాణ్ని..
అయితే
మధ్య కాలంలో కుహనా రాజకీయ నాయకుల వలన..ప్రాంతీయంగా చిచ్చు రేపుతున్న వాళ్ళ మాటలకి రియాక్ట్ అయి విధంగా స్పందించక తప్పటం లేదు.. నాకు తెలంగాణా అంటే అభిమానం వుంది కాబట్టే ఎక్కువగా ప్రాంతపు అలవాట్లు అవి రాసి, కనీసం కొంతమంది లోనైనా మార్పు వస్తుందని.. నా ఆశ.. నేను పనిచేసిన ఏరియా లో అడవి ప్రాంతం ఎక్కువ.. మేము సత్య సాయి బాబా వారి ఆధ్వర్యం లో ఉచిత కంటి ఆపరేషన్ కేంపులు నిర్వహించే వాళ్ళం..అలా ఇంజనీరు గారి జీపులో డాక్టరు గారు,మిగిలిన మిత్ర బృందం కలసి చుట్టుపక్కల సుమారు వంద కిలో మీటర్ల పరిధిలో వున్నా అడవి గ్రామాల్లోకి వెళ్లి, ఇంటి ఇంటి కి తిరిగి కాటరాక్ట్ ఏర్పడిన ముసలి వాళ్ళు ఎవరైనా వున్నారేమో పరీక్షించి , వాళ్ళని ఫలానా తారిఖు నాడు ఫలానా హాస్పిటల్ కి రమ్మని చెప్పే వాళ్ళం. అప్పటి వాళ్ళ పరిస్థిని చూస్తే ఎంతటి వారికైనా మనసు చలించక మానదు..వున్నది ఒకటే రోడ్డు..ఎలాంటి రవాణా సౌకర్యం వుండదు..
ఎప్పుడో రోజుకి ఒకటో రెండో వచ్చేడొక్కు బస్సులు తప్ప.. వయసు లో వున్నఆడా, మగా అడవిలో తునికాకు గాని, పుల్లలు గాని ఏరుకుని తేవడానికి వెళ్ళిపోతే, ఒంటి మిద కనీసం గుడ్డ ముక్క లేని
చిన్నపిల్లలు, కనీసం నడిచే ఓపిక లేని..ముసలి వాళ్ళు మాత్రమె పాకల్లో రోగాల తో కదల లేని స్థితి లో అలా పడుకుని వుంటారు.. జబ్బు వచ్చినా, ప్రమాదం ఏర్పడినా వాళ్లకి మరో దారి లేదు.. అడవిలో కన్ను ముయాల్సిన్దే .. అయితే ఇది అప్పటి స్థితి..
(
కాని ఇప్పుడు అంతా షేర్ ఆటోలు తిరుగుతున్నాయి.. సెల్ ఫోన్ లు వచ్చేసాయి).. అయితే మా జీపు వెనకాలే పిల్లలు పెద్దలు కొంత దూరం పరిగెత్తే వారు.. ఏమైనా మాత్రల్లు ఇమ్మని..గవర్నమెంట్ వారికి వాళ్ళ పరిస్థితి గురించి చెప్పమని బతిమాలే వారు.. వాళ్ళు మేము స్వచ్చంద సంస్థ నుండి కాక గవర్నమెంట్ ఎంప్లాయిస్ అనుకునే వారు.. అయితే
ఇక్కడ పాయింట్ ఏమిటంటే పేదరికం అనేది అన్ని ప్రాంతాల్లో సమానమే ... చివరికి చైనా, జపాన్, అమెరికా , రష్యా వెళ్ళినా డబ్బు లేని వారు, డబ్బు వున్న వారు అన్నవి రెండే కులాలు..అంత మాత్రం చేత ఎవరో మమ్మల్ని దోచుకున్నారు అన్న సిదాంతం తప్పు..నిజానికి నేను పనిచేసిన ఏరియాలో స్కూళ్ళల్లో మాస్టర్లు, ఆసుపత్రి లో డాక్టర్లు, ఇతర సిబ్బంది, ఇంజనీర్లు.. ఎక్కువ మంది ఆంధ్రా ప్రాంతం వాళ్ళే .. వాళ్ళు పేపర్లో ఏడ్ చూసి, ఎంప్లాయ్ మెంట్ ద్వారా, అక్కడి ఉద్యోగాలు న్యాయ బద్దం గా సంపాదిన్చుకున్నవే గాని.. వాళ్ళ ప్రతిభ ద్వారా సంపాదించి..
అక్కడ ఎన్నో విధాలా ఇబ్బందులు పడినా అవన్నీ ఓర్చుకుంటూ, ఒక్కోసారి కొంత మంది ముర్ఖత్వపు జనం తిరగ బడ్డా, అవమానాలు సహించి సేవలు అందించిన వారే.. చాలా మంది తమ భార్యల్ని, పిల్లల్ని ఆంధ్రా లో వున్నా తమ అత్తవారి ఇల్లల్లోనో, పుట్టింటి లోనో వుంచి వాళ్ళు అక్కడ ఉద్యోగాల్ని చేసిన వాళ్ళే .. అటువంటి ఆంధ్రా వాళ్ళని పట్టుకుని జాగో, బాగో అంటే ఎవరికైనా బాధగా ఉండదా..మేము తెలంగాణా ప్రాంతానికి వ్యతిరేకులం కాదు.. రాష్ట్రం అంతా కలసి కట్టుగా వుంటే నే బాగుంటుంది అని ఆశ పడే వాళ్ళం..

3 comments:

  1. మెము మీకు వ్యతిరెకం కాధు కెవలం మములను దొచుకొని మా బుములను కబ్జ చెసినవల కు మత్రమె . i mean రాజాకియనయకులకు

    ReplyDelete
  2. మీ భూములని కబ్జా చేసి కోట్లు గడించిన వాళ్ళలో మొదటి లిస్టు లో వున్నది తెలంగాణా ప్రాంత నాయకులే.. ఉదా: గుడిసెల ఎంకట స్వామి, ఇంకా చాలా మంది... పేర్ల ప్రస్తావన అనవసరం..

    ReplyDelete
  3. మీరు తెలంగాణా ప్రాంతానికి కానీ, ప్రజలకు కానీ వ్యతిరేకమని నేను అనుకోవడం లేదు. అయితే మీరు తెలంగాణా రాష్ట్రానికి వ్యతిరేకి అని తెలుస్తూనే ఉంది.

    మీకు నచ్చనివన్నీ మార్చాలనుకోవడం సరి కాదు. ఉదాహరణకు మీరు రాసిన "సమోసా పధ్ధతి" మాకు బాగానే ఉంది.

    ReplyDelete