సదా నా మదిని నువ్వే నిండి వుండవా దేవా

సదా నా మదిని నువ్వే నిండి వుండవా దేవా
ఓం నమో నారాయణాయ..

Monday, November 28, 2011

నీ దారి ఎటు?...


భగవంతుని సృష్టి లో అన్నీ రెండు విభిన్న పార్శ్వాలు కనపడతాయి..
వెలుగు దాని వెనకాలే చీకటి..
అగ్నికి వ్యతిరేకం నీరు..
గాలిలో ప్రాణ వాయువు, ప్రాణహానిని కల్గించే విషవాయువులు....
తెల్లగా వుండే పాలు, నల్లని నీళ్ళు.... ఇలా ఒక్కక్కదానికి ఒక్కొక్క ధర్మం..
నిరంతరంగా వాటి విధులను అవి నెరవేరుస్తూ వుంటాయి.. వీటి మధ్యలోనే మన జీవితాలు కొట్టుకుపోతూ వుంటాయి..
వీటి వునికి తో మనకు జీవితంలో రెండు వేర్వేరు భావాలు ఎదురవుతూ వుంటాయి..
సుఖం దాని వెనకాలే దుఖం...
మెప్పు దాని వెనకాలే అవమానం
ఒకప్పుడు ధనికుడు నేడు పేదగా మారచ్చు.. పేద ధనికుడు కూడా అవవచ్చు..

ప్రేమ.... ధ్వేషంగా మారచ్చు.. ద్వేషం లో ప్రేమించిన వాడే ప్రాణ హరించిన వాడు అవుతున్నాడు..
నీతికి.. అవినీతి కి మధ్య పోరాటం ఎప్పుడు జరుగుతూనే వుంటుంది..

ఇలా రెండు విభిన్న ధోరణులు మనిషిని శాసిస్తున్నాయి..
రెంటి మధ్య ఎటు పక్క వెళ్ళాలో తెలియని అయోమయ స్థితిలో మానవుడు మనుగడ సాగిస్తున్నాడు..

అందుకే పూర్వ కాలంలో నీతి కధలు, ధర్మ సూక్ష్మాలు, దేవుని మహత్యాల తో కూడిన కధలు పాఠ్య పుస్తకాల్లో వుండేవి.. మోరల్ పిరియడ్ వుండేది..

ఇప్పటి విద్యా సంస్థల్లో అవి లేవో, అసలు వాటి విలువలు తెలుసున్న వారు యాజమాన్యం లో వున్నారో లేదో..
అన్ని వ్యాపార కేంద్రాలుగా మారిన విద్యా సంస్థలు..
నిరంతరం వార్తలని అందించే చానళ్ళలో అన్ని హత్య వార్తలు.. వాటిపై అనాలిసిస్సులు ...
కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకున్న ఒక మావోయిస్టు చనిపోగానే హిరో అవుతాడు..
పదిమందితో ఎంగేజ్ మెంట్ చేసుకుని వదిలేసిన హిరోయిన్ తల్లైతే అది ఒక పెద్ద వార్త....
మహాత్మా గాంధి, ఝాన్షి లక్ష్మి బాయి వీరు కాదటోయ్ మహానుభావులు, పోరాట వీరులు..
నువ్వు చదివిన చరిత్ర మర్చిపో ....
"జనం మర్చిపోయినా మేం మర్చి పోనివ్వం .. మీలో మత, కుల, ప్రాంత విద్వెషాలని రెచ్చ గోడుతునే వుంటాం ..
చలి మంటల్లో వెచ్చగా , హాయిగా సుఖిస్తాం తరతరాలుగా అనుకుంటూ" ప్రజల ధన, మాన ప్రాణాలతో చెలగాటాలు ఆడుకుంటున్న నాయకులు, సినిమా వాళ్ళు, మీడియా వాళ్ళు ఉన్నంత కాలం .....
ఇలా రెండు విభిన్న పార్స్వాల మధ్య జీవుడు నలిగి పోవాల్సిందే..

దేవుని సృష్టి లో వెలుగు, నీడలు .. అగ్ని, వాయువులు.. పాలు, నీళ్ళు... సర్వ మానవాళికి ఒక్క పైసా ఖర్చు లేకుండా సుఖమయ జీవితాన్ని ప్రసాదిస్తే .. మనిషి తోటి మనిషి జీవితాన్ని విభిన్న పార్స్వాలతో నాశనం చేస్తాడు..
శాశ్వతం అనుకున్నది ప్రతిది అశాశ్వతము గా మిగులుతుంది.. అయినా ఆరాటం.. పోరాటం ..
ఇలా ఎంత కాలం..

4 comments:

  1. కడిగి పారేసారండీ బాబూ!మీ ఆవేదన అంతా కనిపిస్తోంది!

    ReplyDelete
  2. Thank u very much rasajna gaaru

    ReplyDelete
  3. HI...namastE..__/\__

    meeru peddavaarO chinnavaarO naaku teliyadu andukE .. Hi..tO paaTu..namaste kuda unchaa..

    chaalaa baagaa raasaarandii

    meeru naa BLOG lo raasina comment chusi mee blog ki vachaanu kaani ikkada chusaaka innaallu manchi manchi vishayaalu mis ayyaanani anipinchindi

    ఏ పుర చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం...chaalaa baavundi thankse meeku naa blog lo comment pettinanduku..mee blog nu nenu sandarsinchinanduku...opikalekunte evarainaa emii cheyalemandii..naaku paatala pichchi..ii paatalannii naatopaatu meerandaru santoshaanni panchukontaarani chinna aasato ii naa paatala raatalu :) tappulunna kshaminchedi

    ReplyDelete
  4. శ్రీనాధ్ కన్న గారు, నా బ్లాగ్ సందర్శించి, కామెంట్ రాసినందుకు కృతజ్ఞతలు.. మీ పాటల ప్రపంచం చాలా బాగుంది.. ఉద్యోగ రీత్యా, నా యితర వ్యాపకాల వల్ల, ఏదో అప్పుడప్పుడు మాత్రమే ఇలా మన తెలుగు బ్లాగుల్లోకి రావడం, తిన్నది అరక్క ఏవేవో నా బ్లాగులో గీకడం, ఇతరుల బ్లాగులకి కామెంట్ రాయడం చేస్తుంటాను.. మరోసారి కలుద్దాం ఓ.కే బై..

    ReplyDelete