Tuesday, December 27, 2011

ఈ కధలో గజేంద్రుడు నువ్వే


మీలో చాలా మంది గజేంద్ర మోక్షం గాధ వినే వుంటారు.. పోతనా మాత్యులు చాలా అద్భుతంగా రాసారు.. ఒక భక్తుడు భగవంతుణ్ణి ఎలా ప్రార్ధించాలో తెలియచేసే గాధ.. అక్కడ ఏనుగు ఎవరో కాదు మనమే, ,మొసలి మనలో వున్న కామ, క్రోధ, మద, మాత్సర్యాలు.. ఇక కధ లోకి వస్తే ఎంతో బల గర్వితుడైన ఏనుగు రాజు తన రాణి ఏనుగులతో ఒక సరస్సు లో జలకాలుడూ, తన తొండము తో నీతిని పీల్చి ఇతర ఏనుగులపై చిమ్ముతూ, ఇలా ఒకరిపై ఒకరు నీటిని చిమ్ముతూ జలకాలుడుతూ వుంటే హటాత్తుగా ఆ సరస్సులో వున్న ఒక మొసలి తన నోటితో ఆ ఏనుగు యొక్క కాలుని పట్టుకుంటుంది..

కరి దిగుచు మకరి సరసికి
గరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్

గరికి మకరి మకరికి గరి
భర మనుచును నతల కుతల భటు దరుదు పడన్.


ఏనుగు తన బలమంతా వుపయోగించి యుద్దం చెసినా పట్టు విడవదు.. అడవంతా వినిపించేటట్టు ఘీంకారం చేస్తూ మొసలితో పోరాడినా, మొసలి తన పట్టు విడవదు.. అలా ఎన్నో రోజులు సాగుతుంది ఈ పోరాటం.. చివరికి ఏనుగులో బలం నశిస్తుంది.. ఎంతో బలంగా, పుష్టిగా వున్న ఏనుగు కాస్తా బలహీనంగా అయి మొత్తం శరీరం అంతా శుష్కించి పోతుంది.. అప్పుడు ఏమిచెయ్యాలో దిక్కు తోచక విష్ణు మూర్తిని ప్రార్ధిస్తుంది.

"దేవా , నా బలమంతయు పోయినది.. నా గర్వము అణిగినది, ధైర్యం కోల్పోయినాను, ఈశ్వరా నీవు తప్ప ఇక నాకు దిక్కెవ్వరు లేరు.. వచ్చి కాపాడుము.. ఈ మొసలి బారి నుంది నన్ను రక్షింపుము" అని ఎంతో దీనంగా, ఆర్తితో ప్రార్ధిస్తుంది..

ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై
యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
బెవ్వ; డనాదిమధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్

ఒకపరి జగముల వెలినిడి, యొకపరి లొపలికిఁ గొనుచు నుభయుముఁ దానై
సకలార్థ సాక్షియగు , య్యకలంకుని నాత్మమూలు నర్థిఁ దలంతున్


కలఁ డందురు దీనులయెడఁ, గలఁ డందురు పరమయోగి గణములపాలం
గలఁ డందు రన్ని దిశలను, గలఁడు గలం డనెడువాఁడు గలఁడో లేఁడో
కలుగఁడే నాపాలి కలిమి సందేహింపఁ గలిమిలేములు లేక గలుగువాఁడు
నా కడ్డపడ రాఁడె నలి నసాధువులచేఁ బడిన సాధుల కడ్డపడెడు వాఁడు
చూడఁడె నా పాటు చూపులఁ జూడక చూచువారలఁ గృపఁ జూచువాఁడు
లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱఁగువాఁడు


ఏనుగు మొరని విన్న విష్నుమూర్తి ఎక్కడో వైకుంఠ పురంలో తన భార్య లక్ష్మీ దేవితో పాచికలు ఆడుతున్న విష్ణు మూర్తి పరుగు పరుగున వచ్చి ఏనుగును కాపాడతాడు.. అప్పుడు పోతన గారు వర్ణించిన పద్యాలు ప్రతి ఒక్కరు వినితీరవలసిందే.. "

లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్చ వచ్చె; దనువున్ డస్సెన్; శ్రమబయ్యెడిన్;
నీవె తప్ప నిత:పరం బెఱుగ; మన్నింపందగున్ దీనునిన్;
రావె ఈశ్వర; కావవె వరద; సంరక్షింపు భద్రాత్మకా;

వినుదట జీవుల మాటలు, జనుదట చనరాని చోట్ల శరణార్థుల కో
యనుదట పిలిచిన సర్వము గనుదట సందేహమయ్యెఁ గరుణావార్ధీ

కమలాత్మ! యో వరద! యో ప్రతిపక్ష విపక్ష దూర! కు
య్యో! కవి యోగి వంద్య! సుగుణోత్తమ! యో శరణాగ తామర

నోకహ! యో మునీశ్వర మనోహర! యో విపుల ప్రభావ! రా

వే, కరుణింపవే, తలఁపవే, శరణార్థిని నన్నుఁ గావవే.


పద్యాలు భావయుక్తంగా, రాగ యుక్తంగా ఎవరైనా పాడితే పాడే వాళ్ళకి, వింటున్న వాళ్ళకి కన్నీళ్ళు రాక మానవు..
ఇంతకీ చివరగా మళ్ళి
నేను చెప్పేదేమిటంటే ఇక్కడ ఏనుగు మనమే, మొసలి మనలో వున్నా కోరికలు, కామము, ఆపేక్ష, కాంక్ష, ఆశ, వగైరా.. అవన్నీ వదిలి, ఆర్తితో, చిత్తసుద్దితో భగవానుని స్తుతించి మెప్పించ డమే మన విధి.. మరొక్క సారి పోతనా మాత్యులకు జోహార్లు అర్పిస్తూ విష్ణు నామ కీర్తనం చేద్దాం " ఓం నమో నారాయణాయ"

Monday, December 26, 2011

శాంతికి చిహ్నం మన దేశం

(ఈ పోస్ట్ కూడా నా బ్లాగ్ లో కామెంట్ చేస్తున్న అజ్ఞాత ను ఉద్దేసించి రాసినవే - ఇతరులు గమనింప ప్రార్ధన)
అయ్యా పేరు చెప్పడానికి కూడా భయపడే అజ్ఞాత గారు నమస్కారం..
సమాధానం చెప్పలేక ఇలా తిట్ల పురాణం ఇప్పడమే మీ సంస్కారం అయ్యేలా వుంది..
మీ తల్లి తండ్రులకు, ఆ సంస్కారాన్ని నేర్పిన మీ గురువులకు నమస్కారాలు..

ఎవరి తాట ఒలుస్తారు? ఇప్పుడు మనల్ని దోచుకుంటున్న వారి మాటేమిటి?
కొన్ని కోట్ల రూపాయలు నల్ల డబ్బు రూపం లో స్విస్ బాంకుల్లో మూలుగుంతుంటే ఏం పీకుతున్నాం మనమంతా..
ఇంత దారుణమైన వ్యవస్త అప్పుడు లేదే.. ఇంతకన్న తెల్ల వాళ్ళ పాలనే మంచింది అన్న స్థితి లో వున్నాం.. అవునా కాదా.. ఇంత అవినీతి రాజ్యం లో కూడా , ధర్మం, సత్యం ఇంకా బతికి వున్నాయి అంటే సనాతన హిందూ ధర్మమే.. పెద్దలు మనకి సంస్కారాన్ని, సంస్కృతిని కాపాడుకో బట్టే..
ప్రపంచ దేశాలకే శాంతిని, సౌభ్రాతత్వాన్ని నేర్పిన ఘనత మనది.. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఆమాత్రం కట్టుబాటు, పొరుగు రాజ్యాల మధ్య యుద్దాలు లేకుండా చేశాం అంటే మన నెహ్రూ గారు రూపొందించిన శాంతి సూత్రాలే.. అశోకుడి ధర్మ చక్రం మన జాతి చిహ్నం.. సత్యమేవ జయతే అన్న సూక్తి కి మూలం మన వేదాలే..
చత్రపతి శివాజీ లాంతి వీరులెందరో ధైర్యంగా ఆనాటి ముస్లిం రాజులని ఎదుర్కొన్నాడు అంతే ఆయన వెనకాల వున్నది సనాతన హిందూ మత గ్రంధాలే.. హిందూ మతం కేవలం దేవుని ప్రార్ధిస్తూ బోధనలను చేసేది కాదు.. మనిషి జీవనాన్ని ప్రభోధించే గొప్ప స్పూర్తినిచ్చే ధర్మ శాస్త్రం.. హిమాలయ పర్వతం అంత ఎత్తైనది, సముద్ర ఘర్భమంత లోతైనది..

ముఖ్యంగా భగవద్గీతలో అహింస, ప్రేమ, కారుణ్యము, నేర్పి, దేనియందును అనురాగం లేక వైరాగ్య జీవనము అలవర్చుకుని జీవించినంత కాలము పరులకు వుపకారాన్నే చెయ్యాలని భోధించే గొప్ప నీతి శాత్రం..
మీ ద్వారా మరికొంత మందితో ఈ చక్కని విషయాలు చర్చించె అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు..

Sunday, December 25, 2011

శాంతిని ప్రేరే పించే భగవద్గీత..

(నా ముందరి పోస్ట్ లోని అజ్ణాతను సంబోధించి రాసినది.. దయచేసి పాఠకులు అర్థం చేసుకోగలరు )
అయ్యా .. అజ్ణాత గారూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు పెట్టి.. అనవసరంగా ఆయాస పడకండి.. ఇతరులను దూషించడమే మీ సంస్కారమే అయితే దానికి నా బ్లాగ్ వేదిక చేసుకోవద్దు..
ఇక విషయానికొస్తే.. ముందు మీరు అనుకున్న "అంటరానితనం" భగవత్గీతలో ఏ శ్లోకం లో వుందో శెలవిస్తే దాని గురించి చర్చించవచ్చు.. అంతే గాని ఇప్పుడు ఎప్పుడో జరిగిపోయిన చరిత్ర గురించి మరల చర్చించనక్కరలేదను కుంటాను.. కాని మీరు ఒక విషయం తెలుకోవలసిన అవసరం వుంది.. వేద భూమి అయిన అఖండ భరతావని అనేక వేల ఏళ్ళు రాజుల పరిపాలనలో సుభిక్షం గా వుంది..ప్రపంచ దేశాలన్నిటికన్న ముందుగా నవ నాగరికత, టెక్నాలజీ మన దేశం లోనే పుట్టింది.. రత్నాలను రాశులుగా పోసి విక్రయించిన దేశం మనది.. వస్త్రాలను అతి నేర్పుతో అల్లిన ఘనత మన దేశానిదే . ఖగోళ, గణిత శాస్త్రాలు పుట్టినది ఇక్కడే, వైద్య శాస్త్రం పుట్టింది ఇక్కడే..ప్రజలంతా సుఖ శాంతులతో విరాజిల్లినది ఇక్కడే..
అప్పుడు, ఇప్పుడు ప్రతి మానవునికి స్వేచ్చ, స్వతంత్రం దొరికినది ఇక్కడే.. ఈ ఘనత మరే దేశం లోను కనబడదు..
ఆనాడు, ఈనాడు కూడా భారతదేశామే శాంతికి చిహ్నం.. పోని ఇతర మతాల వారి ఏలుబడిలో సాగిన ఒక్క దేశాన్ని చూపెట్టండి..
అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, జపాన్ ఏ దేశం లొనైనా మన దేశం లో లభించిన స్వేచ్చ స్వాతంత్రం ఫలనా కాలం లో వుంది అని నిరూపించండి.. ఎక్కడో నేపాల్ పుట్టిన గౌతముడు బుద్దినిగా జ్ణానాన్ని పొందినది ఇక్కడే..ఆది శంకరాచార్యుని పాదం మోపిన ఈ వేదభూమిలో అణువణువున ఆధ్యాత్మికం వెల్లివిరిసిన పవిత్ర హిందూ మతం మనది..

అయితే హిందూ మతం లో వున్న పరమత సహనం వల్ల ముందు మనం ముస్లిం మతాన్ని, తరువాత క్రిష్టియన్ మతాని ఆదరింఛాం .... బలవంతంగా మత మార్పిడులు జరిగాయి.. ఇంతకన్న ఇతర మతాల గురించి రాయడం సంస్కారం కాక వదిలేస్తున్నాను... ఏ మతమూ చెడ్డది కాదు.. లోపం దాన్ని ఆచరించే వాళ్ళలో వుంది.. వ్యాపారం పేరుతో ఇక్కడ కాలుమోపిన సామ్రాజ్య వాదులు, మన విలువైన సంపద దోచుకోడమే కాక, ఐకమత్యం గా వున్న హిందూ ముస్లిం ల మధ్య చిచ్చురేపారు.. హిందూ మతం లో వున్న అనేక కులాల, జాతుల మధ్య చిచ్చు రేపారు..
భగవద్గీత కు, రామాయణ, భారతాలకు లేనిపోని మచ్చలను క్రియేట్ చేసి, హిందూ దేవుళ్ళ మీద వ్యతిరేక భావాల్ని ప్రచారం చేయడం లో సఫలీ క్రుతులయ్యారు... ఇవన్నీ చరిత్ర తెలిసిన అందరికీ తెలుసు.. మళ్ళి మళ్ళి దీని మీద చర్చించి దెబ్బలాడుకునే అవసరం లేదు..
ఇక ప్రస్తుతానికి వద్దాం.. స్వాతంత్రం వచ్చి సుమారు అరవై ఏళ్ళు అయ్యింది కదా.. అంటరాని తనం పోవడానికి ఎన్నో చట్టాలు చేసారు.. హరిజన గిరిజనులకు ఎన్నో రాయితీలు, చట్ట సభల్లో సీట్లను కేటాయించారు.. విద్యా వుద్యోగాల్లో ఎన్నో రిజర్వేషన్లు.. కాని ఏ ఒక్క కులస్తుడైనా హాపీ గా వున్నాడా..
మళ్ళీ ఎన్నో వుప కులాల మధ్య గొడవలు.. వీటికి పరిష్కారం ఆలోచించాలి.. ప్రజలంతా శాంతిగా బతకాలి.. దానికి భగవద్గీత, రామాయణ, భారతాలే ప్రమాణికాలు.. మతం మారినంత మాత్రాన ఈర్ష్యా, ద్వేషాలు,, ఆకలి దప్పులు, చావు పుట్టుకలు మారవు...
కొంత మంది మతస్తులు ఎవరైన కష్టాల్లోను, రోగాలతో భాధపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్ధనలు చేస్తూ మా మతం లోకి మారండి, మీకు ఏ కష్టం వుండదు అని పోరుతా వుంటారు వారి దగ్గర నూండి డబ్బులు వసూలు చేసి కోట్లు వసూలు చేస్తారు. ఇలాంటి దొంగ భక్తులను, సేవకులను, బాబాలను, స్వామిజీలను, మంత్ర గాళ్ళను నమ్మకూడదు..

కష్తాలోచినప్పుడు మాత్రమే కాదు సుఖాల్లో కూడా గోవింద నామాన్ని స్మరించ మని చెప్పేదే పవిత్ర హిందు మతం (భావము లోన భాగ్యము నందును గోవింద, గోవింద అని అనవో మనసా ) అసలు దైవానికి మనకి మధ్య వర్తులు (పూజారి వ్యవస్త) వుండ కూడదనేగా హిండు మతానికి వ్యతిరేకం గా ప్రచారం చేసారు.. ఇది ఇతర మతాలలో లేదని మీ అభిప్రాయమా? మరి మతం పేరుతో వసూలు చేస్తున్న కొన్ని కోట్ల రూపాయల మాటేమిటి.. (ఇప్పటికి ఇది చాలనుకుంటా)
చివరగా మీరు ఏ దైవాన్నైనా పూజించండి.. కాని ఏకాగ్రతతో పూజించండి.. అదెలాగో తెలుసుకోవాలంటే ఒక్కసారి భగవద్గీతను తిరగేయ్యండి..

Saturday, December 24, 2011

పోయే ముందు, పోయిన తర్వాత కాదు..గీతను చదవాల్సింది


నాముందరి పోస్ట్ "గీతను బాన్ చెయ్యాల్సిందే" కి కామెంట్లకి సమాధానంగా పోస్ట్ ని రాస్తున్నాను... అజ్ఞాత గా కామెంట్ రాసే వాళ్ళు, వారి పేరునే చెప్పుకోలేని స్థితిలో వున్నవాళ్ళు ఇలా వేరొకరి బ్లాగుల్లో ఎందుకు కామెంట్ చేస్తారో తెలీదు.. పోతే, మీరన్న అంటరాని తనం భగవద్గీతలో ఎక్కడ వుందో రాస్తే బావుణ్ణు.. అయినా మంచి శ్లోకాలు అనేకం వుండగా ఒక్క శ్లోకాన్నే ఎందుకు పట్టుకుని వేళ్ళాడతారు.. సరే అంటరాని తనం (కులాల మధ్య అంతరం) పోవడానికే మనం రాసుకున్న రాజ్యాంగం స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళయినా ఎందుకు విఫల మయ్యింది.. ఎవరెన్ని కబుర్లు చెప్పినా ఎన్నికల్లో కుల రాజకీయాలు ఎందుకు పనిచేస్తున్నాయి.. కేవలం పది సవత్సరాలు మాత్రమే రిజర్వేషన్ విధానం అమలు చేయ్యాలి అని అందులో రాసినా మరి స్వతంత్రం వచ్చి ఇన్నాళ్ళయినా ఇంకా ఎన్నో కులాలకి రిజర్వేషన్ శాతాన్ని పెంచుకుంటూ పోతున్నాం గాని, మాఫీ చెయ్యటం లేదే.. ఇహ పత్రం, పుష్పం, తుదకి జలమైనా ఇమ్మని చెప్పాడు అంటే మనం ఏది ఇచ్చినా సంతోషం తో స్వీకరిస్తాడు.చివరికి మన మనస్సుని సమర్పించాలి..దీనికి ఖర్చు లేదు.. అయినా గీతలో ఒక మంచి శ్లోకం వుంది మీరు చదివారో లేదో .. దాని అర్థం. కామము వలన కోరికలు అధికమగును..కోరికలయందు అనురాగం ఎక్కువై మనుజుడు బుద్దిని కోల్పోయి చివరికి అధోగతి పాలగును.. ఇది అన్ని వేళలా అన్ని ప్రాంతాల వాళ్లకి వర్తిస్తుంది..

ఇలాటివే
ఎన్నో మంచి శ్లోకాలు.. ముఖ్యం గా జ్ఞానాన్ని గూర్చి ఎన్నో శ్లోకాలు, సుఖ, దుఖాలను రెండిటిని ఒక్కలాగే చూడాలని, రాగము, ద్వేషము లేకుండా జీవులన్నిటి లోను బ్రహ్మ స్వరూపాన్ని చూడాలని చెపుతోంది గీత..మనం గీత యొక్క సారాంశాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటే కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా సుఖైక జీవన మార్గాన్ని తెలుసుకోగలం.. ఒక సామాన్యంగా బతికే మానవుడు అతి కొద్దిపాటి జ్ఞానం తో ఏవిదం గా భగవంతుని ఆరాధించ వచ్చో అది సులభంగా (భక్తీ, జ్ఞాన, రాజయోగ మార్గాల ద్వారా ) భగవంతునికి చేరువయ్యే మార్గం గీతా శాస్త్రం లో గలదు.. చక్కగా చదవండి.. అర్ధం చేసుకోండి ఇతరులకు విలైనచో చెప్పండి.. ఇక గీతా యశస్వి గారు మీరన్నది నిజమే ఇప్పుడు ఎంతమంది గీత పారాయణం చేస్తున్నారని.. ఎంత మంది ఇళ్ళల్లో భగవద్గీత వుంది అని .. కాని యోగా గురువుల వద్దకి ఎన్నో వేల మంది వెళ్తున్నారు .. ఇప్పుడు యోగ శాస్త్రమైనా చెప్పేది గీత యొక్క సారంశమే.. యోగ విద్యని, ధ్యానాన్ని ఆచరించే వాళ్ళు కొన్ని వేల మంది భారత దేశంలోనే కాక విదేశాల్లో కూడా వున్నారు.. బ్రిటిష్, అమెరికా వంటి దేశాల్లో మన భారతీయ కళలని, సంస్కృతిని ఎంతో చక్కగా నేర్చుకుంటున్నారు..ఒక్కసారి యు ట్యూబ్ లో చూడండి చాలు..వీటన్నిటికి మూలం భగవద్గితే
నిజమే ఇప్పుడు ఎవరైనా చనిపోతున్నప్పుడు మాత్రమే ఘంటసాల వారి భగవద్గీతను ప్రచారం చేస్తున్నారు.. దానికి సినిమా వాళ్ళు, మీడియా వాళ్ళే పూర్తీ భాధ్యులు.. ఎందుకంటే సినమాల్లో చాలాసార్లు చితి మంటలు కాలుతున్నప్పుడు "పుట్టిన వాడు మరణించక తప్పదు.. మరణించిన వాడు తిరిగి జివించక తప్పదు..అనివార్య మగు విషయమున శోకించుట తగదు" అని ఎన్నో సినిమ్మాల్లో, నాటకాల్లో చూపించడం వల్ల, ఇలా జరిగింది అని నా అభిప్రాయం..

ఇక
పోతే భగవద్గీతలో ముందర అంతా ఆత్మయొక్క లక్షణాలను తెలియ చేస్తూ శ్లోకాలు వుంటాయి..
"
ఆత్మ నాశనం లేనిది.. అగ్ని దహింప జాలదు, వాయువు ఆర్పివేయలేదు.."
ఇలా ఎన్నో శ్లోకాలు అందువల్ల ఇదేదో ఆత్మ కి సంభందించిన విషయం అని చాలా మంది పోరాపడతారు..
ఆత్మ ఎక్కడుంది .. మనలోనే,
బతికుండగానే, వయస్సులో ఉన్నప్పుడే విషయాలన్నీ గ్రహించి మన జీవన విధానాన్ని మంచి తోవలో మలుచు కోవాలి అంతే గాని ఎవరో పోయినప్పుడు వాళ్ళ ఆత్మ శాంతి కో లేదా ముసలి వాళ్ళం అయి రేపో మాపో చచ్చి పోతాం అనగా అప్పుడో భగవద్గీత చదివి ఏమి ప్రయోజనం వుండదు..

Friday, December 23, 2011

తప్పని సరిగా గీతను బాన్ చెయ్యవలసిందే


డుగురు గుడ్డి వాళ్ళ కధ మీకు తెలిసే వుంటుంది. తెలియక పోతే మీకు అమ్మమ్మలు, బామ్మలు మీ ఇంట్లో వుంటే అడగండి.. వాళ్ళు లేక పోతే మీ ఖర్మ.. అలాగే భగవద్గీత కూడా మన మనస్సుని బట్టే, మనం అర్థం చేసుకున్నంత వరకే అర్థం అవుతుంది..
ఒక్కరికి ఒక్కక్క అర్థం స్పురించ వచ్చు..పారే నదిలోంచి ఒకరు దోసిట్లో నీళ్ళు తీసుకోవచ్చు, వేరొకరు చెంబు తో మరొకరు చేద తో, ఇంకొకరు పెద్ద డ్రమ్మునిండా నీళ్ళు నింపు కోవచ్చు..ఎవరి శక్తి వాళ్ళది.. చదవగానే గీతా సారాశం అంతా ఎవరికీ అర్థం కాదు.. ఒకసారి కాదు అనేక సార్లు
చదివినా రోజురోజుకి కొత్త అర్థాలతో గోచరిస్తూ వుంటుంది.
అలాగే కీ.శే.ఘంటసాల గానం చేసిన భగవద్గీత కూడా వింటున్న కొద్ది మరింత సుందరంగా, మనసారా విని లీనం అయ్యే వారికి మధురంగా, అనేక కొత్త అర్థాలతో, రోజు విన్నా సరే ఇవాళే వింటున్నంత కొత్తగా వుంటుంది.. ఆయన మన తెలుగు వారు అవటం, మనకి ఆయన భగవద్గీతను అందించడం తెలుగు వాళ్ళగా మనం గర్వించ తగ్గ విషయం.. నిరాశ, నిస్పృహ కలిగి ఏం చెయ్యాలో తేలిక అయోమయ స్థితిలో వున్నవాళ్లకి మనో ధైర్యాన్ని, జీవితాన్ని అస్తవ్యస్తంగా గడిపే వాళ్లకి, ఎలా నడచుకోవాలో తెలిపే కర్తవ్య బోదని, మనసు, శరీరం నియంత్రణలో ఎలా ఉంచుకోవాలో తెలిపే మనస్తత్వ శాస్త్రం, మనసుని ఏకాగ్రతతో నిలిపి, ఇష్ట దైవం పై ఆరాధన ఎలా పెంచుకోవాలో తెలిపే ధర్మ సాధన, చివరగా మోక్ష సాధన ఇవన్ని గీతా శాస్త్రం లో వున్నాయి..

వాటిని చాలా లోతుగా పరిశిలించాలి.. పరిశోదించాలి, కొన్ని రోజుల పాటు పారాయణం చెయ్యాలి అప్పటికి గాని పాక్షికం గా నైనా అర్థం అవదు..
నాలుగు
వేదాలు చదవడానికి అవకాశం లేని మన లాంటి సామాన్యులకు సూక్ష్మంగా భగవంతునికి, భక్తునికి, దైవానికి, మానవుకిని గల
సంబంధాన్ని తెలియచేస్తూ, ఉత్తమ మైన మనిషి జన్మ ని మరింత ఉన్నతంగా తీర్చి దిద్దు కోడానికి ఉపయోగ పడుతుంది.. అది అనేక మేనేజ్ మెంట్ కోర్సుల్లో కూడా వుండి, ఇవాళ అనేక కంపెనీలు ప్రగతి పధం లో పయనించడానికి సాధనం..అనేక నాయకులకి స్పూర్తి.. ఎవరో ఏదో అన్నారని, మన పూర్వికులు మనకి ఇచ్చిన సంస్కారాన్ని, సంస్కృతిని మనం వదిలేయగలమా..ప్రతి మతం లోను మంచి చెడ్డలు వుంటాయి, అది మతం తప్పు కాదు.. ఆచరించే వాళ్ళది.. మతం కూడా పరాయి మతస్తులని చంపమని, వారి మనోభావాల్ని కించ పరచమని చెప్పలేదు.. అయినా మతం పేరుతో జరుగుతున్నయుద్ధాలు అప్పుడు, ఇప్పుడు. ఎప్పుడూ జరుగుతూనే వుంటాయి, అది మన దురదృష్టం..

బాన్ చెయ్యండి సార్.. ఒక్క గీత నే కాదు, మంచి చెప్పే శాస్త్రాలన్నీ బాన్ చేద్దాం.. చెడు అలవాట్లని, చెడు పనులని, హింసని ప్రేరే పించే సినిమాలు, సాహిత్యం, చిన్న పిల్లల్ని కూడా విలన్లు గా చూపే సీరియల్ని ప్రోత్స హిద్దాం, చట్టాల కళ్ళు కప్పి నల్ల డబ్బుని కొల్ల గొట్టడం ఎలాగో తెలిసిన పాలకుల్నే ఆదర్శంగా తీసుకుందాం,

Saturday, December 17, 2011

నువ్వు బతక డానికి పనికి రావోయ్.. అర్జంటుగా చచ్చిపో

ఇప్పుడున్న సమాజం లో నువ్వు బ్రతకడానికి పనికి రావోయ్..
-ఏం?
నీ కొలీగ్స్ చాలా మంది రాత్రి అయ్యేసరికి హాయిగా మత్తు పానియాలని సేవిస్తూ స్వర్గం లో విహరిస్తారు.. నీకు చేతవునా ..
అప్పుడప్పుడు
పార్టి లంటూ లంచ్ అవర్ లో కూడా మజా చేసుకుంటారు .. నువ్వు వాళ్ళ మజాలో పాల్గొని ఎంజాయ్ చెయ్యగలవా..
-
నో నెవర్..

నీ
చుట్టు వున్నవాళ్ళు ఎంత సేపు ఇతరులని (మన మధ్యలో లేని వారిపైన) కామెంట్స్ చేస్తూ వుంటారు.. వాళ్ళ కున్న బలహినతలని, వాళ్ళపై అతి దారుణంగా ప్రేలాపనలు పేలుతూ నవ్వుకుంటూ వుంటారు.. నువ్వలా చేస్తూ మజా చెయ్యగలవా.
-
కష్టం...
మనసులో
ఇష్టం లేని వారిపైన లేని ప్రేమను వొలక బోస్తు పళ్ళికిలిస్తూ మాట్లాడి వాళ్ళతో వీళ్ళ అవసరాలు తిర్చేసు కుంటూ వుంటారు.. వారు అలా అటు తిరగ్గానే వెక్కిరింపుగా నవ్వుతు వుంటారు.
నువ్వలా
చెయ్యగలవా..
-
అమ్మో ఆత్మాభిమానం అడ్డొస్తుంది..
అబద్దాలను
అవలోలకగా ఆడేయాలి, అది ఆఫిసరుతో నైనా గావచ్చు, భార్య తో నైనా కావచ్చు..
-
నాకు చేతగాదు..
"
అబ్బ చీరలో నువ్వెంత అందం గా ఉన్నావో తెలుసా?" ఒక్క మాట చాలు ఆడది పడిపోడానికి.
"
వావ్! షర్ట్.. ఎంత బాగా నప్పింది మీకు.. డ్రస్ లో ఎంత స్మార్ట్ గా వున్నారో .. సూపర్ సెలక్షన్ సార్ మీది" ఒక్క మాట చాలు మీ ఆఫీసర్ పడిపోడానికి.. వెంటనే మీకు కావలసినది సాంక్షన్ ..
నీకు
చేతవునా..
-
మాయ మాటలు చెప్పడం నాకు రాదు..
ఇంకా
"ఏంటి చీర లో ఇంత చెండాలంగా వున్నావు?" అని అనగలను.. అప్పుడు మా ఆవిడ "ఇది మీరు కొన్నదే మహాశయా!" అని నిజం చెప్పి ఎత్తి పోడుపోకటి పారేస్తుంది..
మరి
ఫ్రీగా , అప్పనంగా ఎవడి దగ్గరైనా టిఫిన్లు కాఫీలు లాంగించ గలవా ?
-
చఛ..ఒకరికి పెట్టే వంశమే గాని ఒకరి దగ్గర చెయ్య చాపి బతికే ఖర్మ నాకు లేదు..
అయితే అనుమానం లేదు.. అర్జంటుగా నువ్వు చచ్చిపో .. సమాజంలో నువ్వు బతక లేవు...

ఇంకా
చాలా విద్యలు వున్నాయి... అడ్డగోలుగా సంపాదించాలి..అలా వచ్చిన డబ్బును విచ్చల విడిగా ఖర్చు పెట్టాలి.. భోగాలు అనుభవించాలి..స్కాములు..స్కీములు..లంచాలు..హత్యలు.. మానభంగాలు.. దోపిడిలు.. ఇవన్ని ఎవరో దొంగలు చెయ్యడం లేదోయ్ .. మనలాటి మామూలు సాదా సీదాగా కనబడి , మన మధ్య తిరిగి మన కళ్ళముందే కనిపిస్తున్న పెద్ద మనుష్యులే చేస్తున్నారోయ్ .. నువ్వింకా ఎప్పుడు డెవలప్ అవుతావ్..