ఇప్పుడున్న సమాజం లో నువ్వు బ్రతకడానికి పనికి రావోయ్..నీ కొలీగ్స్ చాలా మంది రాత్రి అయ్యేసరికి హాయిగా మత్తు పానియాలని సేవిస్తూ స్వర్గం లో విహరిస్తారు.. నీకు చేతవునా ..
అప్పుడప్పుడు పార్టి లంటూ లంచ్ అవర్ లో కూడా మజా చేసుకుంటారు .. నువ్వు వాళ్ళ మజాలో పాల్గొని ఎంజాయ్ చెయ్యగలవా..
-నో నెవర్..
నీ చుట్టు వున్నవాళ్ళు ఎంత సేపు ఇతరులని (మన మధ్యలో లేని వారిపైన) కామెంట్స్ చేస్తూ వుంటారు.. వాళ్ళ కున్న బలహినతలని, వాళ్ళపై అతి దారుణంగా ప్రేలాపనలు పేలుతూ నవ్వుకుంటూ వుంటారు.. నువ్వలా చేస్తూ మజా చెయ్యగలవా.
-కష్టం...
మనసులో ఇష్టం లేని వారిపైన లేని ప్రేమను వొలక బోస్తు పళ్ళికిలిస్తూ మాట్లాడి వాళ్ళతో వీళ్ళ అవసరాలు తిర్చేసు కుంటూ వుంటారు.. వారు అలా అటు తిరగ్గానే వెక్కిరింపుగా నవ్వుతు వుంటారు.
నువ్వలా చెయ్యగలవా..
-అమ్మో ఆత్మాభిమానం అడ్డొస్తుంది..
అబద్దాలను అవలోలకగా ఆడేయాలి, అది ఆఫిసరుతో నైనా గావచ్చు, భార్య తో నైనా కావచ్చు..
- నాకు చేతగాదు..
"అబ్బ ఈ చీరలో నువ్వెంత అందం గా ఉన్నావో తెలుసా?" ఈ ఒక్క మాట చాలు ఆడది పడిపోడానికి.
"వావ్! ఈ షర్ట్.. ఎంత బాగా నప్పింది మీకు..ఈ డ్రస్ లో ఎంత స్మార్ట్ గా వున్నారో .. సూపర్ సెలక్షన్ సార్ మీది" ఈ ఒక్క మాట చాలు మీ ఆఫీసర్ పడిపోడానికి.. వెంటనే మీకు కావలసినది సాంక్షన్ ..
నీకు చేతవునా..
- ఆ మాయ మాటలు చెప్పడం నాకు రాదు..
ఇంకా "ఏంటి ఈ చీర లో ఇంత చెండాలంగా వున్నావు?" అని అనగలను.. అప్పుడు మా ఆవిడ "ఇది మీరు కొన్నదే మహాశయా!" అని నిజం చెప్పి ఎత్తి పోడుపోకటి పారేస్తుంది..
మరి ఫ్రీగా , అప్పనంగా ఎవడి దగ్గరైనా టిఫిన్లు కాఫీలు లాంగించ గలవా ?
- చఛ..ఒకరికి పెట్టే వంశమే గాని ఒకరి దగ్గర చెయ్య చాపి బతికే ఖర్మ నాకు లేదు..
అయితే అనుమానం లేదు.. అర్జంటుగా నువ్వు చచ్చిపో .. ఈ సమాజంలో నువ్వు బతక లేవు...
ఇంకా చాలా విద్యలు వున్నాయి... అడ్డగోలుగా సంపాదించాలి..అలా వచ్చిన డబ్బును విచ్చల విడిగా ఖర్చు పెట్టాలి.. భోగాలు అనుభవించాలి..స్కాములు..స్కీములు..లంచాలు..హత్యలు.. మానభంగాలు.. దోపిడిలు.. ఇవన్ని ఎవరో దొంగలు చెయ్యడం లేదోయ్ .. మనలాటి మామూలు సాదా సీదాగా కనబడి , మన మధ్య తిరిగి మన కళ్ళముందే కనిపిస్తున్న పెద్ద మనుష్యులే చేస్తున్నారోయ్ .. నువ్వింకా ఎప్పుడు డెవలప్ అవుతావ్..
నేను కూడా మీ టైపే... మనలాంటి వాళ్ళు ఒక కమ్యునిటి స్టార్ట్ చెయ్యాలి...
ReplyDeletecool
ReplyDelete