Saturday, January 28, 2012

జాతీయ గీతం పాడిన వేళ.. మన చిరు గారి హేళ
తెలియని తనమా

అహంకారమా

పొగరా

నిరుత్సాహమా

ఏది ఆవహించి
మరిచితివయ్యా
చిరూ
జాతీయ జెండా ఎగురుతున్న వేళ
జాతీయగీతం వినిపించిన వేళ
అంతా శాల్యూట్ చేస్తున్న వేళ

అజ్ఞానిలా అలా నిలబడి

అడ్డంగా బుక్కైపోయావా

కాంగ్రెస్ వాళ్ళ దెబ్బకి
ఠారెత్తావా

Friday, January 27, 2012

నా కొక్కడికే ఇలా వుందా.. మీక్కూడానా..చెప్పండి ప్లీజ్


1. నాకు న్యూస్ పేపర్లలో నచ్చని అంశం ఏమిటంటే ఏదైనా ఏక్సిడెంట్ జరిగినప్పుడు ఆ చనిపోయిన వారి శరీరాలను, రక్తం మడుగులో వున్న వాళ్ళ బాడీలను ప్రచురించడం.. మామూలుగా వార్త రాస్తే సరిపోతుంది.. మళ్ళ దానికి టైటిల్స్ కూడా చాలా భయంకరం గా పెడతారు.. మనం పొద్దున్నే పేపర్లు చదువుతాం. మరి ఇలాంటి వార్తలను కాస్త వయస్సు ఎక్కువయి, గుండె జబ్బులతో బాధపడే వారుగాని, కాస్త సెన్సెటివ్ గా వున్నవారు తట్టుకోలేరు..
2. పూర్వం సినిమా పత్రికలు, బూతు బొమ్మలకు ప్రత్యేకించి వేరే పత్రికలు వుండేవి. కానీ ఇప్పుడు డైలీ న్యూస్ పేపర్లలోనే బికినీలతో వున్న హీరోయిన్ ఫొటోలు పడుతున్నాయి.. మరి ఇంట్లో చిన్న పిల్లలు, ఎదిగీ ఎదగని పిల్లలు, వాటిని చూసి ఎలా రియక్ట్ అవుతారు..

ఇక టి.వీ లు, ఇంటర్ నెట్ ల సంగతి చెప్పక్కర్లేదు.. సెల్ ఫోన్ లలో బూతు బొమ్మలు, వీడియోలు కామన్ అయిపోయాయి.. అందుకే క్రైం రేట్ పెరిగింది.. మరల పోలీసులు ఏంచేస్తున్నరని మనమే విమర్శిస్తాం.. పోకిరి సినిమాలో "షీండే" లాగ "మీకు మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా అని గట్టిగా అడగాలనే అనిపిస్తుంది..
నేను అయితే మా అబ్బాయి (పెద్దవాడే అయినా) కార్టూన్ చానల్స్ నే చూడ్డానికి ఇష్ట పడతాము.. ఈ సీరియల్లు, నేరాలు ఘోరాలు, ఊడల మర్రులు, మన బీపి ని పెంచే రియాల్టి షోలు ఇవి చూడను.. కాని ఏదైనా కాస్త కామెడీ సినిమా వస్తే చూస్తాను..
ఇక నిరంతర వార్తా ప్రసారాల గోల, వాళ్ళ ఎనాలసిస్ లు మొదట్లో బాగానే వున్నా, ఎవరు ఏ పార్టీలో వున్నారో, ఎవరు ఎప్పుడు ఎవర్ని తిడుతున్నారో ఎందుకు తొడగొట్టి, మీసాలు తిప్పుతూ హల్ చల్ చేస్తున్నరో తెలీక తికమక గా వుంటోంది..
ఏదైనా న్యూస్ చానల్లో రాజకీయ నాయకుల మీద కామెడీ (మిమిక్రిలతో కూడిన) షోలు ముఖ్యంగా "బొత్స" వారి మాటలను మిమిక్రి చెయ్యడం, కిరణ్ గారిది, జగన్ మాటలు చక్కగా మిమిక్రీ చేస్తున్నారు.. ఇప్పటి నాయకులు కోట్లను దిగమింగుతున్నా, మనం హాయిగా నవ్వుకోడానికి పనికొచ్చే బఫూన్ల లాగ కనబడుతున్నారు.. ఓ.కే.. ఈ రోజుకి ఈ కబుర్లు చాలు.. కొద్ది నిముషాల్లో మరో అంశంతో మీముందుటాను.. బ్రేక్ తర్వాత.. (నా అభిప్రాయాలు తప్పు అని ఎలా తెలుస్తాయి.. మీరు కామెంట్ చెయ్యకుండా వదిలేస్తే)

Thursday, January 12, 2012

అసలు సామాజిక న్యాయం అంటే ?

ఈ రోజుల్లో ఎక్కువగా వినిపించే మాట "సామాజిక న్యాయం" .. అంటే అసలు అర్థం ఏమిటో నాకు ఇప్పటికీ తెలీదు..బహుశా కుల, మత బేధాలు లేకుండా అందరికీ సమాన న్యాయం జరగాలి అని కాబోలు..
అయితే మన నాయకులకు బహుశా ఎన్నికలు అప్పుడే ఈ సామాజిక న్యాయం అన్న మాట గుర్తుకొస్తుందనుకుంటా..

అందరూ బడుగు, బలహీన, మైనార్టి వర్గాలనే ఉద్దరిస్తామని అంటారు. మరి మిగిలిన వర్గాల మాటేమిటి..వాళ్ళు ధనవంతులకింద లెక్క.. వాళ్ళకి ఆకలి, దారిద్ర్యం, నిరుద్యోగం లేదు ప్రభుత్వం లెక్కల్లో.. ఇళ్ళన్నీ ఈ బలహీన వర్గాలకే.. (వాళ్ళ పేరుతో కేటాయించినవి ఇతర కులాల వారు ఎలాగూ కొనుక్కుంటారు)..

పాపం ఓ కేతిగాడు ఈ సామాజిక న్యాయం అన్న నినాదంతో వచ్చినా ఎందుకో బొక్కబోర్లా పడ్డాడు..ఆయన వెనకాల స్ఫూర్తినిచ్చిన మహానుభావుల బొమ్మలను పెట్టుకున్నాడు.. ఐనా ఫలితం శూన్యం.. ప్రజలు పిచ్చోళ్ళు కాదని నిరూపించ బడింది..

పెద్దాయన కొడుకు,బాబుగారు అంతా ఈ సామాజిక న్యాయం అనే సూత్రాన్నే పట్టుకుని వేళ్ళాడుతున్నారు.సంపాదించుకున్న కోట్లు చాలక ఇంకా తరతరలాకి సంపాదించుకుందామి ఎంత ఆశ.

ముక్కుపోలిగాడు అయితే తన రాజ్యానికి కాబోయే రాజు ఓ దళితుడే అని ప్రకటించేసాడు..దాంతో ప్రజలంతా చంకలు గుద్దేసుకుని తన పార్టీనే గెలిపిస్తారని ఆశ..

స్వతంత్రం వచేనాటికి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు.అప్పటి ప్రజలు కాస్త అమాయకులు..నాయకుల్లో స్వార్ధచింతన అస్సలు లేదనే చెప్పాలి..

కాని ఇప్పుడు ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎంతో తెలివైన వారు..ఎవర్నీ ఎవరూ మోసం చేసుకోట్లేదు. అంతా కలసి దేశాన్ని, ప్రభుత్వ ఖజానాన్ని దోచుకుంటున్నారు..

ఓట్ల పండగ అప్పుడు కుల పెద్దలు, వాడ నాయకులు,ఓటు కి నోటు తీసుకుంటుంటే.. అలా ఎన్నికైన వాళ్ళు దర్జాగా దోపిడీ చేస్తున్నారు.. వాళ్ళ పెట్టుబడికి లాభాన్ని ఆర్జిస్తున్నారు..

ఈ మధ్యలో నలిగిపోతున్నది ఎవరు.. మనసు ఒప్పక, అవినీతి మార్గంలో పయనించక. చేతకాని వాళ్ళుగా ముద్ర వేసుకున్న అమాయకులు..
తిరుపతి క్యూలైన్లలో ఎంతో మంది పేద అమాయక ప్రజలు అవస్థ పడుతూ వుంటే, ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫారసు కాగితం వుంటే చాలు దర్జాగా కొద్ది నిముషాల్లో దర్శనం,రూములు కేటాయింపులు అన్నీ జరిగిపోతాయి..

అనాడు దళితులు ఒక్కరికే అన్యాయం జరిగి, మన రాజ్యాంగం లో బడుగు, బలహీన వర్గాలకి ఎన్నో రాయితీలు ఇవ్వబడితే, ఈనాడు పేదవాడు అన్న ప్రతీ ఒక్కరికీ అన్యాయం జరుగుతోంది..

మరి ఇది ఏ దురాచారం లోకి వస్తుంది.. మంత్రి గారి కుక్క గారు కార్లో వెళ్తున్నా కుయ్ కుయ్ మంటు పోలీస్ వాహనం మనల్ని తప్పుకోమంటు హడావుడి చేసి, పక్కకి నెట్టేస్తుంది..

పెద్దవాళ్ళ బావమరదులు, వుంచుకున్న దాని తమ్ముళ్ళు, చివరికి వాళ్ళ పనిమనిషికి కూడా వి.ఐ. పి ట్రీట్ మెంట్ దొరుకుతున్న ఈ సమాజం లో సామాజిక న్యాయం అంటూ పట్టుకుని వేలాడే (ఎన్నికల అప్పుడు మత్రమే) నాయకులకు, కులం కార్డు మత్రమే అర్హత ప్రాతిపదికిన నాయకులు వున్నంత కాలమూ ఈ దేశాన్ని ఎవడూ బాగుచెయ్యలేడని నా భావం..

Tuesday, January 10, 2012

ఒకే రోజు ఒకే చోట జరిగిన దారుణమైన ఏక్సిడెంట్లు


ఈ ఫోటోలు చూడండి.. అన్ని ఏక్సిడెంట్లు ఒకే రోజు జరిగాయి.. మా వైజాగ్ బీచ్ రోడ్ లో .. అందుకే వాహనాన్ని నడిపే టప్పుడు కాస్త జాగ్రత్తగా వుండండి.
ఏంటి షాక్ అయ్యారా.. ఒకే రోజు ఒకే చోట ఇలా ఇన్ని రోడ్డు ప్రమాదాలా. నమ్మట్లేదా.. ఏం రోజూ న్యూస్ పేపర్లో ఇంత కన్నా ఎక్కువ రోడ్డు ప్రమాదాలే చూస్తున్నాం కదా..
ఖంగారు పడకండి.. పోలీస్ వాళ్ళు ఇలా మాక్ డ్రిల్ నిర్వహించి రోడ్డు ప్రమాదాలు ఎంత భయంకరంగా వుంటాయో, అలా అవడానికి కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రమాదం అయిన తర్వాత మనం ఎలా స్పందించాలో చాలా చక్కగా చూపించారు .. ఫొటోల్లో వున్న వారందరూ నటులు..

మరి ఈ క్రిందవి కూడా చూడండి..