సదా నా మదిని నువ్వే నిండి వుండవా దేవా

సదా నా మదిని నువ్వే నిండి వుండవా దేవా
ఓం నమో నారాయణాయ..

Friday, January 27, 2012

నా కొక్కడికే ఇలా వుందా.. మీక్కూడానా..చెప్పండి ప్లీజ్


1. నాకు న్యూస్ పేపర్లలో నచ్చని అంశం ఏమిటంటే ఏదైనా ఏక్సిడెంట్ జరిగినప్పుడు ఆ చనిపోయిన వారి శరీరాలను, రక్తం మడుగులో వున్న వాళ్ళ బాడీలను ప్రచురించడం.. మామూలుగా వార్త రాస్తే సరిపోతుంది.. మళ్ళ దానికి టైటిల్స్ కూడా చాలా భయంకరం గా పెడతారు.. మనం పొద్దున్నే పేపర్లు చదువుతాం. మరి ఇలాంటి వార్తలను కాస్త వయస్సు ఎక్కువయి, గుండె జబ్బులతో బాధపడే వారుగాని, కాస్త సెన్సెటివ్ గా వున్నవారు తట్టుకోలేరు..
2. పూర్వం సినిమా పత్రికలు, బూతు బొమ్మలకు ప్రత్యేకించి వేరే పత్రికలు వుండేవి. కానీ ఇప్పుడు డైలీ న్యూస్ పేపర్లలోనే బికినీలతో వున్న హీరోయిన్ ఫొటోలు పడుతున్నాయి.. మరి ఇంట్లో చిన్న పిల్లలు, ఎదిగీ ఎదగని పిల్లలు, వాటిని చూసి ఎలా రియక్ట్ అవుతారు..

ఇక టి.వీ లు, ఇంటర్ నెట్ ల సంగతి చెప్పక్కర్లేదు.. సెల్ ఫోన్ లలో బూతు బొమ్మలు, వీడియోలు కామన్ అయిపోయాయి.. అందుకే క్రైం రేట్ పెరిగింది.. మరల పోలీసులు ఏంచేస్తున్నరని మనమే విమర్శిస్తాం.. పోకిరి సినిమాలో "షీండే" లాగ "మీకు మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా అని గట్టిగా అడగాలనే అనిపిస్తుంది..
నేను అయితే మా అబ్బాయి (పెద్దవాడే అయినా) కార్టూన్ చానల్స్ నే చూడ్డానికి ఇష్ట పడతాము.. ఈ సీరియల్లు, నేరాలు ఘోరాలు, ఊడల మర్రులు, మన బీపి ని పెంచే రియాల్టి షోలు ఇవి చూడను.. కాని ఏదైనా కాస్త కామెడీ సినిమా వస్తే చూస్తాను..
ఇక నిరంతర వార్తా ప్రసారాల గోల, వాళ్ళ ఎనాలసిస్ లు మొదట్లో బాగానే వున్నా, ఎవరు ఏ పార్టీలో వున్నారో, ఎవరు ఎప్పుడు ఎవర్ని తిడుతున్నారో ఎందుకు తొడగొట్టి, మీసాలు తిప్పుతూ హల్ చల్ చేస్తున్నరో తెలీక తికమక గా వుంటోంది..
ఏదైనా న్యూస్ చానల్లో రాజకీయ నాయకుల మీద కామెడీ (మిమిక్రిలతో కూడిన) షోలు ముఖ్యంగా "బొత్స" వారి మాటలను మిమిక్రి చెయ్యడం, కిరణ్ గారిది, జగన్ మాటలు చక్కగా మిమిక్రీ చేస్తున్నారు.. ఇప్పటి నాయకులు కోట్లను దిగమింగుతున్నా, మనం హాయిగా నవ్వుకోడానికి పనికొచ్చే బఫూన్ల లాగ కనబడుతున్నారు.. ఓ.కే.. ఈ రోజుకి ఈ కబుర్లు చాలు.. కొద్ది నిముషాల్లో మరో అంశంతో మీముందుటాను.. బ్రేక్ తర్వాత.. (నా అభిప్రాయాలు తప్పు అని ఎలా తెలుస్తాయి.. మీరు కామెంట్ చెయ్యకుండా వదిలేస్తే)

3 comments:

  1. Who asked you to check all these things?????

    You can happily skip them!
    IDIOT!

    ReplyDelete
  2. E news chusi chusi Naku BP vachhindi at the age of 32 only...so sad.... still i watch news.

    ReplyDelete
    Replies
    1. మొదటి అజ్ఞాత గారు.. మంచి సూచన చేసారు.. ధన్య వాదాలు.. నేను స్కిప్ చేస్తాను సరే.. ధరలు మనకి అందుబాటులో లేకపోయినా, ఇలాంటి చెడు చేసే విషయాలు వుచితంగా (తక్కువ ధరకే) అందుబాటులో వున్నాయి కదా అందరికీ.. హొ టు స్కిప్ .

      రెండో అజ్ఞాత గారు.. మనం మొదటి అజ్ఞాత గార్ని ఫాలో అయితే సరిపోతుంది..

      Delete