Wednesday, April 18, 2012

పాడిస్తా చెత్తగా...


మొన్న సోమ వారం "పాడుతా తీయగా" కార్య క్రమం చూసాక పోస్ట్ రాయాలనిపించి రాస్తున్నాను..ఎప్పటిలాగే మీ అభిప్రాయాలు రాసినా సరే, రాయక పొయినా సరే... పూర్వం లాగ మనలో స్పందించే గుణం తగ్గిపోయింది..

కొత్తలో విపరీతంగా కామెంట్లు పెట్టే వారు..ఇప్పుడేమయింది ... న్యూస్ పేపర్ చదివి విసిరి పారేస్తున్నట్లు, పోస్ట్ లను కూడా చదివి పక్కన పడేస్తున్నారు..
చదవడానికే ఓపిక లేదు బాబు.. ఇక కామెంట్లు కూడానా..చెయ్యి ఖాళి లేదు వెళ్ళవయ్యా.. అన్నట్లుగా తయారయ్యాం..

సరే ఇక నా సోది లోకి వస్తే..ఎప్పటి లాగే ఒక సాంప్రదాయమైన కీర్తనను మధ్యలో పాశ్చాత్య ధోరణిలో పాడాలని కండిషన్. పాపం పిల్లలు బానే పాడారు..

(
ఇక్కడ మన బాలు కి శంకరాభరణం సినిమాలో శంకర శాస్త్రి ఇంటి ఎదురుగా వున్నవాళ్ళు శాస్త్రీయ సంగీతాన్ని ఎగతాళి చేస్తే వాళ్ళని శం. శాస్త్రి గారు బుద్ది చెప్పే సీను గుర్తుకు రాలేదు అనుకుంటా)...

అక్కడ సినిమాలో నీతికి వ్యతిరేకంగా ఇలా మంచి విలువలు వున్నపాటను ఖూనీ చెయ్యడం.. హాయిగా నవ్వు కోవడం.. ప్రస్తుతం సినిమాల్లో హిరోయిన్నే వాంప్ పాత్రను కూడా చేస్తూ హటాత్తుగా గుడ్డలిప్పి గోచి తో డాన్స్ చేస్తున్నట్లుగా వుంది..

ఇక రోహిత్ అనే పిల్లాడు సరిగ్గా ప్రెజెంట్ చెయ్యలేదని జడ్జిలుగా (పేరుకి మాత్రమే) వచ్చిన జంట చెప్పినా. అతన్ని ఎలిమినేట్ చెయ్యక పోవడం ఆశ్చర్యమే మరి.. శ్రుతి తప్పినా..పెద్దగా కష్టపడక పోయినా ఇంత వరకు రానివ్వడానికి అంతర్యమేమిటో .. బాలు కే తెలియాలి... పిల్లాడు కూడా నిలబడే విధానం దగ్గరనుంచి.. పాడే విధానం అంతా చాలా రెక్లెస్ గా వున్నట్టు కనిపిస్తున్నాడు.. ఎవడికోసం నన్ను పాస్ చేయ్యవులే అన్న చందాన వుంది.. గత నాలుగు ఎపిసోడ్ లుగా ఇదే పద్దతి..

ఇక చివరాకర్లో చెప్తాడే సర్వే జనా సృజినో భవతు.. సర్వ సృజనా సుఖినో భవంతు.. (దీని అర్ధ మేమిటి మహాను భావా ?) పోనీ ఇందులో వున్నది మనం పాటిస్తే మిగిలిన వాళ్లకు చెప్పచ్చు..

'
పాడుతా తియ్యగా' పేరుతో పాటలని ఇలా పిల్లల చేత ఖూని చేయిస్తూ, మమ్మల్ని ఖూనీ చేస్తూ ఆఖర్న.. నీతిశ్లోకం వర్లించి, వచ్చిన అతిధుల చేత నిన్ను నీవు పొడిగించు కుంటు ఇంకా ఎన్నాళ్ళిలా 'పాడిస్తా చెత్తగా' ప్రోగ్రాం...
విన్నపం: బాలు అభిమానులకు నా క్షమాపన్లు

Tuesday, April 3, 2012

మరపు రాని, మర్చిపోలేని సంఘటన

కధ చాలా రోజుల నుండి రాద్దాం రాద్దాం అనుకుంటూనే ఇన్ని రోజులు గడిపేశాను.. తీరా చదివిన తర్వాత మీ రియాక్షన్స్ ఎలా వుంటాయా అని..సరే ఇక కధ లోకి వస్తే ..
అప్పుడు నా వయస్సు పదేళ్ళు వుంటాయేమో.. నేను మా నాయనమ్మ గారి ఇంటికి వెళ్లాను..(స్థలాలు రాయను) .. పట్టణానికి చివర పారిశ్రామిక ప్రాంతం .. నిర్మాణం లో వున్నఫ్యాక్టరీకి దగ్గరగా అంటే సుమారు కిలోమీటర్ దూరంలో వుంది వాళ్ళ ఇల్లు..
రోజు సాయంత్రం సుమారు .౩౦ గంటల సమయం..నేను వీధి గుమ్మంలో కుర్చుని వున్నాను. మా నాయనమ్మ గారు ఇంట్లో పనిలో వున్నారు.. ఎవరు లేరు ఆడుకోడానికి .. చాలా బోరుగా వుంది..
ఇంతలో ఇంచు మించు నా వయస్సు పిల్లవాడే వచ్చాడు.. "నాతొ వస్తావా ఆడుకుందాం" అన్నాడు..
అప్పటి వరకు పిల్లాన్ని చూడలేదు.. అందుకని కాస్త తటపటాయిస్తున్నాను..
"
ఏం పర్లేదు. మీ నాయనమ్మ గారు నాకు తెలుసు అన్నాడు.. నేను వెళ్ళనా అన్నట్లు మా నాయనమ్మ గారి వైపు చూస్తే "వెళ్ళు ఆడుకో" అని అన్నారు..
"
ఇక్కడే వీధిలోనే ఆడుకుందాం రా"అని అంతే సరే మనకో ఫ్రెండు దొరికాడు కదా అని ఆనందాగా వెళ్లాను... కొంచెం ముందుకి వెళ్తూ వుంటే "ఏమిటి ఇక్కడే కదా అని అన్నావు..అలా పరిగెడతావేమిటి?" అన్నాను.. "ఇక్కడే గ్రౌండ్ లో ఆడుకుందాం రా" అని తీసుకెళ్తూ వుంటే అతని వెనకాలే వెళ్తున్నాను..నవ్వుతున్న ఆతని ముఖం చూస్తూ వుంటే ఎంతో దగ్గర ఫ్రెండ్ లా అనిపించాడు..
"
ఎందుకింత పిరికి లా వున్నావు.. హుషారుగా వుండు..అన్నిటికీ భయపడుతూ వుండకూడదు.. ధైర్యంగా వుండాలి."అంటూ ఏవేవో కబుర్లు చెప్తూ నన్ను నవ్విస్తూ అప్పుడప్పుడు ఆట పట్టిస్తూ ముందు తను వెళ్తుంటే అతని వెనకాలే వెళ్తున్న నాకు ఎంత దూరం వెళ్తున్నానో తెలియటం లేదు..
కొత్త ప్లేస్ అయినా అతడు వున్నాడు కదా మళ్ళి ఇంటికి దింపు తాడులే అన్న ధైర్యం..ఇంతలో ఒక బావి వచ్చింది.. పైకి చూడడానికి మా ఇంట్లో నుయ్యి లాగే వుంది.. చుట్టూ గట్టు కూడా వుంది.. అబ్బాయి బావిలోకి సారి తొంగిచూసాడు... నేను నూతి దగ్గరగా వెళ్ళినా లోపలి తొంగి చూడలేదు..పక్కనించి వస్తున్నాను.."చూడు సారి తొంగి చూడు .. ఫరవాలేదులే " అంటూ నవ్వుతున్నాడు..
ఏముంది ఇందులో అని తొంగి చూసాను.. అంతే ఒక్కసారిగా గుండె జల్లు మంది..కాళ్ళు వణుకుతున్నాయి..ప్రాణాలు పైకి పోయిన అనుభూతి..
ఎందుకు అంటే ఇంతవరకు వయస్సులో అంత లోతైన బావి నేను చూడలేదు.. సుమారు.. యాభై లేదా డెభై అడుగుల లోతున వుంది.. మా ఇంటిలో వున్న నూతిలో పది అడుగుల లోతులోనే నీళ్ళు కనిపిస్తే.. ఎక్కడో పాతాళంలో వున్నాయి నీళ్ళు..
ఒక్క సారిగా నేను ఊహించని లోతులో ఒక మృత్యద్యారంలా కనిపించిన లోతైన బావిలోకి తొంగి చూసిన నాకు తెలియని భయం నాలో ఆవహించింది.. మూడు నిముషాలు గట్టునే నా చేతులతో గట్టిగా పట్టుకుని తమాయించు కున్నాక అంతవరకు నన్ను కవ్వించి నూతిలోకి తొంగి చూడమన్న పిల్లాడి కోసం చూసా.. అతను లేడు.. చుట్టుపక్కల ఎక్కడా లేడు.. పిలుద్దామన్నా , అరుద్దామన్నా నోట మాట రావటం లేదు..అంతా ఖాళి ప్రదేశం..మధ్యలో బావి.. బావి గట్టున నేను..చుట్టూ శూన్యం.. ఎక్కడా మనుషుల అలికిడి లేదు..ఎడారి లాంటి ప్రాంతం కనుచూపు మేరలో గుండ్రంగా భూమికి ఆకాశానికి మధ్యన గీత అక్కడక్కడ చెట్లు ,కొన్ని మోడువారినవి...
నా పని రోజుతో అయిపోయింది.. ఇంత వరకు నలుగురి అన్నదమ్ముల మధ్య, ఎంతో మంది చుట్టాల మధ్య పెరిగిన నేను చివరికి ఇలా వొంటరిగా, దిక్కులేని స్థితిలో ఇలా మిగిలిపోయానా. నా వాళ్ళంతా ఏరి..ఎక్కడ మా ఇల్లు ఎక్కడ ప్రాంతం..ఇప్పుడు నాకు ఏమైనా అయితే నాకు ఎవరు దిక్కు..
కాని ఎక్కడో గుండె ధైర్యం..పరిగెత్తాను..పరిగెత్తాను....వెనక్కి చూడకుండా పరిగెత్తాను.. సుమారు పదిహేను నిముషాలు పరిగెత్తాను.. అప్పటికి కాని మా వాళ్ళ ఇల్లు రాలేదు..
ఒక్కసారి ఇంటిని చూడగానే తెలియని ఉద్వేగం..హమ్మయ్య ఇంటికి వచ్చాసానన్న ధైర్యం... కాని గుండె దడ తగ్గలేదు.. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది.. ఒళ్లంతా చెమటలు.. కాని ఏడవలేదు.. ఎందుకంటే నేను ఏడిస్తే విషయం ఏమిటని..మా నాయనమ్మ గారు అడుగుతారు..తీరా చెప్పక తిడతారేమో నాన్న భయం.. ఆవిడ ఊరుకోదు.. విషయం మా అమ్మా నాన్నలకి చెప్తుంది..అది ఇంకా డేంజర్ ..అమ్మ చేతిలో దెబ్బలు..

సో విషయం నాలో నేనే దిగ మింగాను. ఎవ్వరికి చెప్పలేదు.. అలా శూన్యం లోకి చూస్తూ కూర్చున్నాను.."ఏమిట్రా అలా వున్నావు" అని అడిగేరు.. మా నాయనమ్మ గారు.. "ఏం లేదండి."అన్నాను..
"
ఇప్పటి దాకా ఎక్కడిగి వెళ్లావు "అని అడిగేరు. "అదేమిటి ఇందాక ఒక అబ్బాయి వచ్చేడు .. ఆడుకుందాం రా అంటే, అతనితో వెళ్ళనా అని అడిగితే మిరే కదా వెళ్ళు అన్నారు" అని అడిగా.. " అబ్బాయి.. నేనెప్పుడు చెప్పాను" అన్నారు..
దాంతో ఇంకా భయం వేసి ఇక సంభాషణ అక్కడితో ఆపాను..కాని.. రాత్రంతా నిద్రపోలేదు.. అబ్బాయి,లోతైన బావి, శూన్యం ఇవన్ని సినిమా రీళ్ల లాగ కాళ్ళ ముందు కదలాడుతున్నాయి... సంఘటన ఎన్నాళ్ళయినా, ఎన్నేళ్ళయినా నా కళ్ళముందు కదలాడుతూనే వుంటుంది.. మృత్యువు అంచుల దాకా వెళ్లి భీతి..
డియర్ ఫెండ్స్ ఇతకీ అబ్బాయి ఎవరు.. దేముడా..? సాక్షాత్తు భగవంతుడే పిల్లాడి రూపంలో వచ్చి నాకు మృత్యువు ఎలా వుంటుందో రుచి చూపి, జీవితాన్ని ఆషామాషిగా కాకుండా సీరియస్ గా తీసుకోవాలని జ్ఞాన బోధ చేసాడా...
లేదా బావిలో చనిపోయిన పిల్లాడు ఎవరైనా దెయ్యమై పిల్లాడి రూపంలో వచ్చి నన్ను బావి దాకా తీసుకుని వెళ్ళాడా..ఏది ఏమైనా ఆల్ మోస్ట్ నూతిలో పడి చనిపోయే స్థితి నుండి..బయటకు వచ్చిన నాకు సహాయం చేసింది ఎవరు.. నా ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం వుందా..
ఇది కల్పితం కాదు నిజంగా జరిగింది.. ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు..మీకు తప్ప..