Tuesday, May 29, 2012

తోటకూర నాడే....

తోటకూర నాడే ఎందుకు చెప్పలేదమ్మా ? అని ఓ తల్లిని ఓ కొడుకు నిలదీస్తాడు.అంతే కాదు శిక్ష వేసిన న్యాయమూర్తి ముందు వాళ్ళ అమ్మ చెవిని కొరికేస్తాడు.. .
(ఈ కధ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా వుంటే అడగండి - తరవాతి టపా లో రాస్తా..)

ప్రస్తుత హీరో వాళ్ళ అమ్మని ఈ ప్రశ్న వేసాడొ లేదో?
ఒకవేళ వేసినా ఆ అమ్మ పశ్చాత్తాప పడిందో లేదో?
కాని నా కొడుకు అమాయకుడు, ఏ పాపం చెయ్యని బాలుడు, అన్యాయంగా మూసేసారు అని అక్రోశించి అంతటితో ఆగక శాపనార్ధాలు కూడా పెట్టింది.. 

ఆమె నమ్ముకున్న ఆ దేముడు మొర ఆలకించాడో లేదో.. తన పెనిమిటి, బిడ్డ కలిపి ప్రజా సొమ్ముని దోచుకున్న వైనం కళ్ళారా చూపిస్తున్నా గ్రహించలేని అమాయకురాలు పాపం..
రేపణ్ణుంచి మన మధ్యకు వస్తుంది.. ఓదార్పు యాత్ర? ఎవర్ని ఎవరు ఓదార్చాలి? ప్రజల్ని వాళ్ళా, వాళ్ళని ప్రజలా? 

వెయ్యండి.. పాపం సానుభుతితో మళ్ళి వాళ్ళకే వోటు వెయ్యండి..గెలిపించి అధికార పీఠాన్ని ఇవ్వండి.. దోచుకొనే దొరలు వాళ్ళు.. దోపిడికి గురయ్యే వాళ్ళం మనం..
తరాలు గడిచినా గర్భ దారిధ్ర్యంతో మనం వుందాం.. వాళ్ళు తరతరాలకీ  కూర్చుని తిన్నా కరగని ఆస్థిని సంపాదించుకో నియ్యండి..
పాపం.. పేదవాళ్ళూ..  జాలిపడండి..