Monday, September 17, 2012

సుత్తి వేలు గారితో నా అనుభవం

నిన్న (ఆది వారం) తే 16/09/2012 ది.న పరమాత్మలో ఐక్యం చెందిన "సుత్తి వేలు" గారికి నివాళులు అర్పిస్తూ.. ఒక నటుడిగా నాకు ఆయన మీద వున్న అభిమానంతో ఈ పోస్ట్ రాస్తున్నాను..
 "నాలుగు స్థంభాలాట" సినిమాలో "సుత్తి" పాత్ర ద్వారా ఆయన ప్రఖ్యాతి గాంచి చివరికి సుత్తి అన్నది వారి ఇంటి పేరుగా నిలిచి పోయింది..  

కాని ప్రతిఘటనలో "నా డ్యూటీ ఇంకా అయిపోలేదమ్మా" అన్న  ఆయన డైలాగ్ హృదయానికి హత్తుకుని పోతుంది.. కాని నిన్నటితో ఆయన డ్యూటీ అయిపోయింది అన్న భావమే మనల్ని కలచి వేస్తుంది.. మా అబ్బాయికి సుత్తి వేలంటే చాలా అభిమానం.. అస్తమాను "నా డ్యూటి ఇంకా అయిపోలేదమ్మా" అంటూ వుండేవాడు..
సరే ఆయనతో నా అనుభవం ఏమిటంటే, ఆయన కజిన్ బ్రదర్ (మొక్కల మోహన్, విశాఖపట్నం) గారు మా టీం లో వుండేవారు.. మా నాటిక (చీమ కుట్టిన నాటకం, రచన శ్రీ యండమూరి)  విజయవాడ లోను, హైదరాబాద్ లోను జరిగినప్పుడు ఆయన స్వయంగా వచ్చి మమ్మల్ని అభినందించి వెళ్ళారు.. ఆయనతో కలసి ఫొటోలు కూడా తీయించుకున్నాము.. 


ఆయన విజవాడ థియేటర్ కి వచ్చినప్పుడు మేకప్ రూం bath రూం లో ఇన్సులిన్ కిట్ మర్చి పోయారు.. నేను ముఖం కడుక్కోడానికి వెళ్ళినప్పుడు ఆ బాక్స్ (కిట్ మొత్తం) సింక్ మీద చూసి వెంటనే అది ఇన్సులిన్ కిట్ అని గ్రహించి అక్కడున్న వారిని అడిగాను.. మాది కాదంటే మాది కాదు అనడంతో నా బాగ్ లో పెట్టాను ఎవరైనా వచ్చి అడిగితే ఇద్దాములే అని.. 

ఒక పది నిముషల తర్వాత ఆయన వెనక్కి వచ్చి గాభరాగా అందర్ని అడుగుతున్నారు "బాబు ! నా ఇన్సులిన్ బాక్స్ బాత్ రూం లో మర్చిపోయాను ఎవరైనా తీసారా? అని, అవరో అన్నారు "శంకర్ తీసాడు"  అని వెంటన ఇదిగో గురూ గారు అని తీసిచ్చాను.. అప్పుడు ఆయన కళ్ళలో కనిపించిన ఆనందం వర్ణించలేను.. "చాలా థాంక్స్  బాబు నేను పోయిందేమో అని గాభరాపడ్డాను, ఇప్పుడు ఇదిలేందే నేను బతకలేను.. కనీసం మూడు సార్లు థాంక్స్ చెప్పి వుంటారు.. ఏదో దీవించారు కూడా..

 అయితే ఆ కిట్ పోతే మరొకటి కొనుక్కోవచ్చు కాని కాస్త ఖరీదు ఎక్కువ అవచ్చు.. అయినా వస్తువు పోయిందే అన్న బాధ మిగిలి పోతుంది.. పోయిన వస్తువు తిరిగి పొందితే ఆ ఆనందం వేరు.. కాని అంత పెద్దాయన..చిన్న పిల్లాడిలాగ అన్ని సార్లు థాంక్స్ చెప్పితే నాకు ఆశ్చర్యం, ఆనందం అనిపించింది.. 

ఆ కిట్ వెంటనే నేను చూసాను కాబట్టి సరిపోయింది.. అక్కడ సుమారు నలభై మంది దాకా పరాయి వాళ్ళు కూడా వున్నారు.. ఎవరు తీసినా ఇస్తారన్న గారంటీ నాకైతే లేదు.. 
అందులోనూ అది విజయవాడ..రైల్లో చెప్పులని కూడా వదలని బాచ్ వుంటారు అక్కడ..

అంతకు ముందు హైదరాబాద్ లో కూడా మా ప్రదర్శన చూసి మా టీం అందరినీ అభినంచి వెళ్ళారు... అదే నాటకాన్ని కొన్ని ఏళ్ళ క్రితం వాళ్ళు ఇలా వేసిందీ ఆయన అనుభావాలు చెప్పారు..    
మరొక్కసారి ఆ మాహా నటుడికి నా హృదయపూర్వక
నివాళులు అర్పిస్తూ ..శెలవ్...