Thursday, January 31, 2013

మంచు కురిసే వేళలో...


మేము మొన్న ఆదివారం నర్సీపట్నం మీదుగా లంబసింగి, చింతపల్లి  వెళ్ళాం (కారులో- మదీయ డ్రైవింగ్ లో).. మంచు చాలా బాగుంది.. కాని వారం క్రితం వరకూ ఇంకా ఎక్కువగా వుంది అని చెప్పారు... ట్రిప్ చాలా బావుంది.. బాగా ఎంజాయ్ చేసాము.. ఫుటోలు చూసి ఆనందించి.. కామెంట్లు పెట్టి నన్ను ఆనందపరచండి...

Saturday, January 26, 2013

శభాష్ ఉండవల్లి.

నిన్నటి సభలో కొన్ని విషయాలు మర్చిపోయారు..
1. విశాఖపట్నం లోను, విజయవాడ వంటి నగరాల్లొ ఎంతమంది తెలంగాణా ప్రాంతం వారు వచ్చి చదువుకుంటున్నారు..? మొన్న వైజాగ్ బీచ్ లో ఆరుగురు తెలంగాణా విధ్యార్ధులు చనిపోతే ఒక్క తెలంగాణా నాయకుడు నోరు విప్పలేదే.. అక్కడ  నిత్యం జరిగే గొడవల్తో బందుల వల్ల.. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఆంధ్రా కాలేజీల్లో చదివిస్తున్నారు..   
2. ఇదేదో పాకిస్తాను, ఇండియా లాగ అనుకుంటున్నారు.. రేపొద్దున్న తెలంగాణా ఏర్పడితే వివాహం చేసుకున్న ఎంతమందిని విడగొట్టి పంపిస్తారు..

3. ఇంతకన్నా క్లారిటీగా, ఆవేశంగా సమైక్య ఆంధ్రా కు మద్దత్తుగా ఏ సభ జరగలేదు.. ఇప్పుడైనా తెలంగాణా ప్రజలు వాళ్ళ నాయకుల మనోగతాలను, నిజ స్వరూపాలను గ్రహిస్తే మేలు..  

శభాష్ ఉండవల్లి... జాతి గర్వపడే నాయకుడివయ్యా నువ్వు..      

Friday, January 11, 2013

ఫొటో అంటే ఇది..

ఈ ఫొటో చూడండి .. అమ్మ వారు పుత్ర వాత్సల్యంతో నా వైపే చూస్తున్నట్టు లేదూ.. ఇది ఇలా తీయించు కోవాలి ఫొటో.. (డైరెక్షన్ మనదే లెండి)..