Friday, May 31, 2013

తాటి చెట్టు నీడ లాంటి కొడుకు నీడ

చీకటి గదిలో ముసిల్ది మునగ దీసుకుని పడుక్కుని వున్నాది..
గదంతా రొచ్చు వాసన.. వెయ్యదు మరీ అన్నీ అక్కడే...
ఒక రోజా.. నెలా.. సవత్సరమా.. ఎన్నాళ్ళయిందో ... ఈ చీకటి గదిలో చేరి..
గాలి లేదు...  రావడానికి కిటికీలు వుంటేగా ... వూపిరి ఆట్టం లేదు..
కనీసం ఒక పంకా గాని, బల్బు గాని లేదు...
రాత్రి..  పగలు ఒంటరిగా ఆ చీకట్లో .. ఆ ప్రాణికి అలవాటు అయిపోయింది.

ఎవరూ లేరా.. ఎందుకు లేడు .. వున్న ఒక్కనానొక్క నలుసు...
హాయిగా ఈ గదికి ముందర పెద్ద ఇంట్లో  పిల్లా పాపలతో   హాయిగా వున్నాడు..
రోజుకో సారి సిల్వర్ బొచ్చెలో ఇన్ని మెతుకులు పడేసినప్పుడు కనిపిస్తాడు..

వాణ్ణి సరిగ్గా పెంచలేదా.. లోటు ఏమైనా చేసిందా ... లేదే..
ఎంతో డబ్బు ఖర్చు పెట్టి , శ్రమ పడి చదివించింది..స్కూల్  మాస్టరుని చేసింది..పెళ్లి చేసింది.. పురుళ్ళు పోసింది.. 
అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు గాని, కోడలు గాని, మనవరాళ్ళు గాని ఒక్కళ్ళు దగ్గరికి రావటం లేదే...

బిడ్డలు లేని తను ఈ బిడ్డని సొంత బిడ్డలా పెంచి పెద్ద వాణ్ణి చేసిందే..
"రామా".. అని ఆ రాముని పేరు పెట్టుకుని నోరారా పిలిచేదే.. "రామా..  రామా" అని..
ఆఖరుకి ఆ రాముని పిలుపు కోసం ఇలా ఈ చీకటి గుబ్యం లో మగ్గ వలసి వస్తోంది..
ఇంతకన్న వీణ్ణి పెంచకుండా వుంటే ఏ అరుగు మీదనో ఏ తల్లి వేసిన ముద్దో ఇంత తినేసి రోజులు వెళ్ళ బుచ్చేదాన్ని..

అయినా నా పిచ్చి గాని కన్నా తల్లిని కూడా ఇంతకంటే హీనంగా చూసిన వీడు నన్ను ఆదరిస్తాడని ఎలా అనుకోగలను..
ఎంతో జ్ఞానవంతుడు అయ్యాడు.. చదువుతో బాటు సంగీత పాఠాలు కూడా చెప్తూ ఎంతో పేరు తెచ్చుకున్నాడు.. జాతకాలు చెప్పడం వచ్చు... పండిత గోష్టిలో నెగ్గుకు రాగలడు.. జీవిత పాఠాలు నేర్పించ  గలడు..

కాని తల్లుల మైన మా పట్ల ఎందుకు ఇంత వివక్ష..

(ఇది వూహించి రాసినది కాదు నా చిన్నప్పుడు మా సొంత బంధువుల ఇంట చూసిన దృశ్య కావ్యం.. నా కళ్ళ ఎదుట ఆ తల్లి కన్నీరు పెట్టుకున్న వైనం.. నేను పెద్ద అయ్యాక ఇంకొక దగ్గర ఆవిడ పడ్డ కష్టం..)

తాటి చెట్టు నీడ  లాంటి కొడుకు నీడలో వున్న తల్లుల మీద జాలి పడటం తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయత్వం..   


Thursday, May 30, 2013

ఎంకి మొగుడుకి కోపం వొలుపొచ్చీసినాది..

సుబ్బి పెళ్లి ఎంకి చావు కొచ్చింది..
సుబ్బి గాడేమో నేనింత చేశాను.. అంత చేశాను అని బిల్డప్ ఇచ్చి అమ్మ  దగ్గర మార్కులు కొట్టేసి , తద్వారా ఇసక పాలెం లో కుర్సీ  కావాలని అమ్మదగ్గర యాగీ  చేస్తున్నాడు.. కాని పోయిన సారి అమ్మ తనకి కాకుండా తెలుగు సెల్లి అయిన ఎంకికి  కుర్సీ ఇచ్చీ సరికి .. ఈ సారి అలా కాకూడదని సిల్లాయికి ఏరే సోట కుర్సీ ఏయించమని సిపారసు చేసినాడు..   

అడ్డంకి గా వున్నా ఎంకమ్మకి మరొక చోట కుర్చీ వెయ్యమని బయటకి అందరికీ తెలిసేలా అరిచినాడు.. .
దాంతో ఎంకి మొగుడుకి కోపం వొలుపొచ్చీసినాది.. 

గతంలో సుబ్బి చేసిన అల్లరి పన్లన్నీ అమ్మకీ పన్లోపనిగా లోకానికీ తెలిసేలా ఏకరువు పెట్టాడు..
ఈళ్ళకి ఒకలినోకలు పడక పోడం వాళ్ళ ఎవులెంత కంగాలీ పన్లు చేసారో జనాలకి తెలిసి పోనాది..
ముక్కున ఏలేసి కున్నారు..
అమ్మ సుబ్బిగా పైకి పెద్ద నీతిమంతుడిలా కనిపించే  నీలొ ఇంత ఇలన్ దాకున్నాడా అని ఆచ్చిర్య పోనారు.. 
రావణా బమ్మ నాటి సుబ్బి కి కోపం వచ్చేసినాది..

ఇసక పాలెం  మొగం కూడా సూడని  పిచ్చోని తో నాకేమని గాలి తీసేసినాడు.. ..
నలుగుర్నో  అల్లరి పాలు సేసినందుకు గాను రచ్చ బండ కి ఈడుత్తానని శపధం సేసినాడు....

ఓరి ఈడ్చుకోవో . అనా సేస్తే నీకే నట్టం అని ఎంకి మొగుడు తెగేసి సెప్పీసి నాడు.. 

ఇసక పాలెం జనాలకి బుర్ర తిరిగిపోనాది.. అసలు ఇక్కడ పుట్టినోల్లకి కాకుండా ఎక్కడెక్కడించో వచ్చినోల్లకి కుర్సీ ఇచ్చీడం నచ్చక పోయినా ఇన్నాళ్ళు వల్లకుండి పోనారు.. పోనీలే అని ఆదరించినారు..
ఈ సుబ్బిగాడు గాని, ఎంకి గాని, ఇంతకు మునుపు కుర్సీ ఎక్కిన నేమల్లి జన్రెడ్డి గాని ఇక్కడోళ్ళు కాదు.. 
ఎవులు వల్ల ఏటీ వొరిగింది నేదు. 
వత్తన్నారు ..పోతన్నారు... ఇక్కడోళ్ళ కట్టాలు బాధలు తీరిచింది లేదు..
ఇమాన సమస్యలు, రైలు బండి సమస్యలు, పోర్టు దుమ్ము సమస్య, పరిశ్రమల అభివృధ్ధి సమస్య ఎయన్నీ ఎక్కడికక్కడే ఉన్నాయ్..
అబ్బో ఎవులూ అడగని అదేదో ప్లై ఓవర్ బ్రిడ్జీ అట ఓ నాలుగేళ్ళ బట్టి కడతనే వున్నారు..
అదేదో మురుగునీటి పతకమని ఇప్పటికీ సందులన్నీ అట్ట తవ్వుతూనే వున్నారు..
ఇగ గ్రామాల్లో అయితే సెప్పుకుందికి సిగ్గుసేటు..

ఇసక పాలెం జనాలు ఇసుగెత్తి పోయి ఈసారి గనక ఆరి ప్రాంతంలో ఒడికి కాకుండా సుబ్బికో, ఎంకికో .. ఈడు కాదని  ఆడు... ఆడు కాదని ఆడమ్మ మొగుడు వత్తే అదేదో బొమ్మలో ప్రభాస్ లాగ ఇరగ దీస్తారు.. 


Wednesday, May 29, 2013

"తడాఖా".... ఎవరిదీ?

"తడాఖా"
ఎవరిదీ?
నాగ చైతన్యదా .. ముమ్మాటికీ కాదు.. సునీల్ ది .. 
ఆహా ఎంత బాగా చేసాడు.. ఇన్నాళ్ళూ పెంచుకున్న కండలకి, కరిగించుకున్న కొవ్వుకి అర్థాన్ని, పరమార్ధాన్ని తెలియ చెప్పే రోజు రానే వచ్చింది.. 
కాదు దర్శకుడు తెలివిగా సునీల్ దేహ దారుడ్యాన్ని వాడుకున్నాడు.. 
 చాలా సీన్లలో చైతు కన్నా గ్లామరస్ గా , సాంగ్స్ లో స్టెప్ లు కూడా చైతు తో పోటీగా చేసాడు.. 
పోలిస్ ఆఫీసర్ డ్రస్ లో అదిరి పోయాడు .. 
వెరీ గుడ్ సునీల్ కీప్ ఇట్ అప్... 
చిరు బొజ్జను కల్గిన ఎంతో మంది మాలాటి వారికి ఇన్స్పిరేషన్ నువ్వు.. 
రేపట్నుంచి సీరియస్ గా ఎక్సర్ సైజులు చెయ్యాలని స్పూర్తిని కలిగించావు.. 
ఫామిలీ పాక్ తో వుండే వాడివి సిక్స్ పేక్ లోకి మారావు.. 
అయితే ఆ మధ్య తిక్క గోపాల్ కర్మ చేతిలో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బై అప్పలరాజు దెబ్బతో  తో నువ్వు మటాష్ అనుకున్నారు అంతా.. 
కాని సింహం జూలు విదిలించినట్లుగా విజృంభించావు.. 
ఎవరైనా ఇంకా ఈ తడాఖా చూడకపోతే అర్జంటుగా చూసేయండి.. 
చైతన్య కోసం కాదు సునీల్ కోసం.. 
సునీల్ .. ఒక అమితాబ్ అంతటి వాడివి కావాలని దీవిస్తూ.. 
కానీ మనలో మాట జూనియర్ నాగ కూడా బానే చేసాడు లెండి.. 
మనకి ఇష్టం వున్నా లేకపోయినా కొన్ని ఫీల్డ్స్ కి వారసత్వ నాయకులు తప్పరు. .. 
చూసారా మొన్న మహా నాడులో లోకేష్ బాబు ఎంత వెలిగి పోయాడో..అప్పుడే నాయకత్వ లక్షణాలు వచ్చేసాయి..  

రాహుల్ అయినా లోకేష్ అయినా జగన్ అయినా కె.టి.ఆర్ అయినా  నాగు అయినా సొంతంగా సరుకు వున్నా లేక పోయినా చచ్చినట్లు మనం భరించాల్సిందే.. 
పోనూ పోనూ వాళ్ళు డెవలప్ అవుతారు లేదా రాను రానూ వాళ్ళకి మనం అలవాటు అయిపోతాం... 
బాలయ్యబాబునే భరించ గల సత్తా వున్న తెలుగు ప్రేక్షకులు(అభిమానులు క్షమించాలి) మిగిలిన వారిని భరించడం ఒక లెక్కా.. 

P.S: కాని తడాఖా లో నాకు అనిపించిన లోపం ఏమిటంటే నాకు తెలిసి చనిపోయిన తండ్రి కోటాలో కొడుకుకి  ఎస్సై పోస్టుతో  భర్తీ చెయ్యరని అనుకుంటాను.. ఇస్తే ఏ కానిస్టేబుల్ వుద్యోగమో ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు ఎస్సై పోస్టు తాలుకా రాత పరీక్షల్లో పాసు అయితేనే ఆ స్థాయి పోస్టు ఇస్తారనుకుంటా.. ఇలా ఒకేసారి ఏ ఇంటర్వ్యూ లేకుండా అభ్యర్ధిని చూడకుండా పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వరని అనుకుంటున్నాను.. నాది తప్పయితే చెప్పండి.. 

Saturday, May 25, 2013

మదిలో ధైర్యం, దేహంలో కసిగా మారింది..

కడలి ఆవలవేపున కనిపిస్తున్నది గమ్యం  
అవరోధంలా నిలువెత్తున ఎగిసిసిపడే అలల వలయం ప్రజ్వలింది  నాలో  లక్ష్యాన్ని చేదించాలనే తపనం.. 
రగిలింది అంతులేని ఆత్మ విశ్వాసం.. 
అమాతం  గాలి లోకి లేచి ఒక్క వుదుటున దుమికాను
ఎంత వేగంగా లోతుకు వెళ్ళానో అంతే వేగంతో పైకి లేచాను.. 

 ఒక్కో అల బలంగా గుండెను తాకుతూ తోసేస్తోంది.. 
 కోరలు చాచి మింగేస్తూ వెనక్కి నెట్టేస్తోంది.. 

మదిలో ధైర్యం, దేహంలో  కసిగా మారింది.. 
రాకాసి అలల పై నిరంతర పోరాటం చేసింది.. 

వాయు వేగంతో ఘీంకార నాదాన్ని చేస్తూ కమ్ముతున్నా 
మనో వేగంతో ఓంకార నాదాన్ని స్మరిస్తూ ఎదుర్కొన్నా 

ఒకటి, మరొకటి, వేరొకటి .. ఒకదాని తర్వాత ఒకటి 
ఒకటి కాదు వంద వచ్చినా వదలలేదు నిబ్బరం.. 

నెట్టేస్తూ, కొట్టేస్తూ, తోసేస్తూ, విసిరేస్తూ అవి... (multiple action)
చీల్చుకుంటూ ముందుకి కదులుతూ నేను.. (single action)

ఆశ్చర్యం .... 
 
నడి సంద్రాన కానలేదు...  అలల విలయం
ఎటు చూసినా అంతులేని ప్రశాంత నిలయం 

తలవంచెను అవరోధ కాల యమనం 
సాధించెను ధీరత్వ బాల విజయం.. 
  
Friday, May 24, 2013

చస్తూ బతికే కన్న ఒక్క వడదెబ్బ తో పొతే మేలన్న

సూరీడు కి కోపం వచ్చేసింది.. 


 ఏడాదికోసారి తన ప్రతాపాన్ని చూపే సూరీడు ఏ ఏడు కా ఏడు తన నిప్పుల వర్షాన్ని పెంచుకుంటూ పోతున్నాడు.. 


ఏదో పోనీలే అని చూస్తూ వూరుకుంటూ వుంటే రోజు రోజుకీ పెరిగిపోతున్న అమానుషాలు  , అకృత్యాలు  తన కళ్ళెదుట జరుగుతూ వుంటే భగ భగ మని మండి పోతున్నాడు.. 

నరం లేని నాలుక తో నరుడు చేస్తున్న విన్యాసాలను భరించ లేక అగ్ని జ్వాలలను కురిపిస్తున్నాడు.. 

అవధులు లేని మనిషి వికృత చేష్టలను, విష సంస్కృతిని కన లేక కసితో రగిలి పోతున్నాడు.. 
 
ఎండ వేడి కన్న తోటి మనిషి వలన కలిగిన బాధే  మిన్న 
చస్తూ బతికే కన్న ఒక్క వడదెబ్బ తో పొతే మేలన్న

భద్రత లేని సమాజంలో మనుగడ కన్న 
గొంతెండి గుటుక్కు మంటే చాలన్న. 

ధన దాహార్తి తో ఉన్నవారితో సహజీవనం కన్నా 
దాహంతో విగత జీవిగా మారుట  మిన్న.. 
ఓ అన్నా.. కనీసం పై లోకం లో అన్నా సుఖంగా వర్ధిల్లన్నా!!

(వడ దెబ్బకి మరణించిన వారికి  కన్నీటి  నివాళితో) 
  

Wednesday, May 22, 2013

నీకు టైమ్ పాస్, వాళ్ళకి మెంటల్ పాస్ అన్నమాట

బ్లాగు మిత్రులకు నమస్కారం.. ఈ రోజు అసలు ఏం  జరిగిందంటే...
="అబ్బ మళ్ళి మొదలెట్టావా .... ఆపు .. చాల్లే" ...
"ఎవడివిరా .. నువ్వు .. ఎక్కడనుంచి మాట్లాడుతున్నావ్"...
="నీలోనే వున్నాను.. నీ అంతరాత్మ ని"..
"లోపడ వుండవలసిన వాడివి బయటకు ఎందుకు వచ్చావ్" ..

="నువ్వు చేసే పన్లు నచ్చక..అసలు ఎవడడిగాడురా నిన్ను...  ఓ...  నీ ఇష్టం వచ్చినట్లు బ్లాగులో  గెలికేస్తావ్... మనశ్శాంతిగా బతక నివ్వవేమిట్రా వాళ్ళని".. 
"ఏదో నాకు తెలిసిన నాలుగు విషయాలు చెప్పి వినోదంతో బాటు విజ్ఞానాన్ని కూడా పంచుదామని..సరదాగా ఊసుపోక". 

="నీకు టైమ్  పాస్...వాళ్ళకి మెంటల్ పాస్ అన్నమాట"....
"ఇదొక కాలక్షేపం దానితో బాటు ప్రపంచంలో చాలా మందికి మన గురించి తెలుస్తుంది అని"
="అసలు నెట్ కనక్షన్ ఎందుకు పెట్టించావురా.. మీ పిల్ల ఇంజనీరు చదువు కోసం.. పిల్ల చదువు అయిపోయింది.. జాబ్ వచ్చేసింది.. హాయిగా పెళ్లి కూడా అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోయింది.. అయినా వదలవేరా"..

"ఖాళీగా వుంటే బుర్ర దెయ్యాల ఖార్ఖానా అవుతుందని.. (Empty Brain is devils work shop)"
="అబ్బో ఏం  అనువాదం నాయనా.. శంకర్ దాదా MBBS లా ఫీలయిపోకు"..
="అసలు నెట్ వచ్చిన కొత్తలో అన్ని ఘంటసాల పాటలు, భగవద్గీత, ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మి గారి భక్తి  గీతాలు చూసే వాడివి... ఆహా మనకు నచ్చిన పాటలు అర క్షణం లో వచ్చేస్తుంటే తెగ ఆనంద పడిపోయే వాడివి..అమెరికా లో ఒకడు, ఇంగ్లాండు లో ఒకడు తమ్ముళ్ళు  వుంటే ఓ తెగ చాటింగ్ చేసే వాడివి..ఇప్పుడు కనీసం మూడు నెలలకోసారైనా చాట్ చేస్తున్నావా"...

="ఎలా అలవాటు అయ్యిందో ఈ గెలకడం ... ఆఫీసు అయిపోగానే ఓ అదేపని...ఇంతోటి దీనికి మధ్య మధ్యలో టీ,  కాఫీలు..కింద కుండలా పెరుగుతున్న షేపులు చూసుకో .. నడుము కి నొప్పి రాకుండా తలగడ దిండు ఒకటి.. మెడ వంకర పెట్టి అలా అదేపనిగా చూస్తూ వుంటే నొప్పి పెట్టదూ మరి..గంట సేపు ఇలా కెలికే బదులు ఒక్క అరగంట నడిస్తే ఆరోగ్యానికి మంచిది... కొవ్వు కరుగుతుంది.. అయినా నా మాట ఎప్పుడు విన్నావు లే"... 

"సమకాలీన సమస్యల మీద మన ఒపీనియన్ రాస్తే నలుగురు తెలుసుకుంటారు అని"..
="ఒరే నాకు తెలియక అడుగుతాను..జగన్ జైల్లో వుంటే నీకెందుకు, కె.సీ.ఆర్ కోట్లు సంపాదిస్తే నీకెందుకు.. కిరికెట్టులో స్పాట్ ఫిక్సింగ్ అయితే నీకెందుకు.. నీకు అక్కరలేని విషయమంటూ లేదేంట్రా...  అయినా అవన్నీ గంటలు గంటలు సమీక్షించే 24 గంటల వార్తా చానళ్ళు వుండనే వున్నాయి కదా.. మళ్లి ఇక్కడా అదే".. 

"నీకు తెలీదు గాని.. నేను కూడా ఎన్నో విషయాలు ఈ బ్లాగుల్లోనే తెలుసు కున్నాను తెలుసా... 
="నాకు తెలవకుండా ఏదీ నీకు తెలీదు.. వై. ఎస్. ఆర్ కి .కె.వీ.పీ లాగ".. 

"నువ్వు ఎన్నైనా చెప్పు నేను నా బ్లాగులో వీలైనంత వరకూ మంచి విషయాలు, నిర్మొహమాటం లేని విమర్శలు చేస్తున్నాను.. నూటికి ఒకడు అన్నా నా బ్లాగుల ద్వారా మంచిని తెలుసుకుని" ... 

="ఆపెహే... నువ్వు చెడిపోయింది కాక వాళ్ళని చెడగొడుతున్నావు.. ఇప్పుడు నువ్వనేదేంటి  ఓటుకి నోటు తీసుకోవద్దు అంటావ్.. ధర్మంగా డబ్బు సంపాదించండీ అని చెప్తావ్.. ఇలా చెప్పిన జె.పి పార్టీకే ఓట్లు రాలేదు.. నువ్వొక లెఖ్ఖ".. 
"మా బ్లాగుల్లో వాళ్ళు చాలా మంచోళ్ళు.. మేం ఏ విషయాన్ని రాసినా మెచ్చుకుని వీరతాళ్ళు వేస్తారు.. 
="ఆ.. వురితాళ్ళు కూడా వేస్తారు".. 
"అయితే నన్ను రాసుకోనివ్వవా. ఇవాళ.. 
"నీ గొంతుని నా కాలి చెప్పుతో నొక్కి మరీ రాసుకుంటాను.. నేను మోనార్క్ ని..  నన్నెవరూ ఆపలేరు".. 
సోదర సోదరీమణులారా.. 
=(ఆ... ఆపు...  నీ... నీ...  నీ.. సో.. సో ..సోది...) 
హమ్మయ్య విజయవంతంగా నొక్కేసాను.. 
=(అయ్య.. లా .. రా... అమ్మ... లా... రా... కాస్త.... మీ.. రైనా... చె.... ప్పండి... లేదా... కా.. మెం.. ట్ల.. తో..   ప.. చ్చ..డి చె.. య్యం... డి)..  

Tuesday, May 21, 2013

సబితను, (అ)ధర్మానను "కళింకితులు" అని ఎలా పిలుస్తారు..

కళ + అంకిత = కళాంకిత... 
కళలకే అంకిత మయిన వాడు..... 
సుమన్ బాబు బతికున్న రోజుల్లో "ఈ టి.వీ" లో ఓ సీరియల్ కూడా వుండేది.. 
టైటిల్ సాంగ్ - " ఓ .. కళంకితా .. కళలకే  అంకితా.." అని జ్ఞాపకం.. అంతర్జాలం లో కనబడలేదు.. 

మరి ఈ కొత్త కళంకితులు = అంటే ఏవిటో ఎంత ఆలోచించినా ఈ మట్టి బుర్రకి తట్టటం లేదు..

వీళ్ళు కూడా ఏదైనా కళలో ఆరితేరిన వారా.
చోర కళ కూడ 64 కళలలో ఒకటేగా
కాని కళంకితులు అంటే మరొక అర్ధంలో మలినమయినవారు.. మచ్చ పడిన వారు.. అనుకుంటా నా టాలెంట్ ని బట్టి.. 
అంటే దాని అర్ధం బహుశా శీలాన్ని పోగొట్టుకున్న వారు.. అయివుండవచ్చు.. 
ఇక్కడ శీలంమంటే కేవలం మానభంగం చేయబడ్డ వారు కాదు... చెడునడతను, దుష్ప్రవర్తన కలవారు అయి వుండవచ్చు.. 
మరి సబితను, (అ)ధర్మానను "కళింకితులు" అని ఎలా పిలుస్తారు.. 
స్టేట్ గవర్నమెంట్ లో ఏ పని చేయించుకోవాలన్న పని కి ఇంత అని ఒక రేటు వుంటుందన్న ఇంకిత జ్ఞానం లేని వాడు ఈ భూప్రపంచంలో వున్నాడా. అది విద్యా శాఖ కావచ్చు, ఆరోగ్య శాఖ, నీటి పారుదల, ఎలక్ట్రికల్, రెవెన్యూ, రిజిస్ట్రార్, రక్షణ శాఖ  ... ఇలా ఏ శాఖ అయినా ఒక చిన్న పనికి మీరు డబ్బు కట్టకుండానే పని చేయించుకున్నారా ఎప్పుడైనా.. మీరు ఒకవేళ చిరు ఉద్యోగి అయితే చెయ్య చాపరా .. లేక పొతే మీ పై వాడు వూరుకుంటాడా.. అండమాన్ కి తన్నడూ.. సినిమాలు చూడ్డం లేదేమిటి.

మరి కొన్ని కోట్ల ప్రాజెక్టులకి అనుమతి ఇవ్వడానికి ఒక పావలా వంతు కమీషన్ ముట్టి వుంటుంది.. దానికే ఇంత రాధ్ధాంతమా .. 
మీరు మీ పై ఆఫీసరు లేదా యజమాని చెప్పిన పని తూ.చ తప్పకుండా చేస్తారా లేదా.. ఆ పనే వాళ్ళూ చేసారు... తప్పేవిటి.. పాపం అమాయకులైన మంత్రులను, ఐ.ఎ.ఎస్ అధికార్లను  ఇంకా అమాయకుడైన (అప్పటికి కనీసం MP, MLA కాని) జగన్ ని జైలు పాలు చేస్తారా.. 
దేముడు మీకే కాదు వాళ్ళకీ  వున్నాడు..పిల్లలు గలవాళ్ళని ఇలా అల్లరి చేయవచ్చా ... పిల్లలు సి.బి.ఐ వాళ్ళకీ వున్నారు..అనుభవిస్తారు.. ఇంతకింతా అనుభవిస్తారు..చెల్లమ్మ, భార్య శాపనార్ధాలు ...వాళ్ళ అమ్మ చేతిలో వున్న ----(*) మీద ఒట్టు.   
కాని పాపం పెద్దాయన చచ్చి బతికాడు.. బతికిన వారని చంపుతున్నాడు.. 

ధర్మ అనుభవం - మంచి పాఠంధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది.. ఆ...  పిచ్చి గాని ఇవన్నీ విండానికి బావుంటాయి గాని ఆచరణ సాధ్యం కాదని మీ అభిప్రాయమా. కాని  అనుభవ వేద్యం అయితే గాని బోధపడదు .. నా కిందటి టపా లో అలా కారులో షికారు కెళ్ళినట్టు రాశానా? ఆ.. రాశాను .. 
వస్తున్నప్పుడు దారిలో ఒక మంచి మామిడి తోటలో భోజన కార్యక్రమాలు చేసాం.. 
అక్కడ మామిడి పళ్ళు గుత్తులు గుత్తులుగా వేలాడుతూ వుంటే మనసు ఆనందంతో పొంగిపోయి ఛాయా గ్రహణాలు కూడా తీసుకున్నాం రకరకాల భంగిమలతో.. 
ఎవరూ కాపలా లేని ఆ తోట లోని కాయలను అలా చూసేసరికి ఎవరికీ మాత్రం వాటిని కోయాలని అనిపించదు.. నా సగభాగం కోస్తానంటే, తప్పు అది ధర్మం కాదు అని వారించా.. 
కాని వుండ బట్టలేక ఓ రెండు కోసి.. భద్రపరిచినది..
ఇక చాలు తోట యజమాని బాధ పడతాడు.. అని చెప్పి, అదిగో ఎవరో ఇటే వస్తున్నారు అని మభ్యపెట్టి తీసుకు వచ్చేసా... 
నీతి సూత్రాలు వర్లించడం కాదు దాన్ని మనం ఆచరించాలి అని చిన్న పాటి క్లాస్ తీసుకున్నాను దార్లో... ఎప్పుడు వుండే గొడవే కాబట్టి .. విన్నట్టు నటిస్తూ అప్పనంగా వచ్చిన కాయల్ని వదిలేసాం అన్న ఫీలింగ్ లో వుందేమో అని నా ఫీలింగ్..    

ఇక హైవే దగ్గరకు వచ్చేసరికి కాస్త తేనీరు సేవిస్తే మంచిది అని కారు స్లో చేసాను.. కాని అక్కడ ఆ దాఖలాలు లేవు...  కాని,  ఒక ముసలి జంట కుర్చుని వున్నారు వాళ్ళ దగ్గర నీళ్ళ సంచులు వున్నాయి 
వారు వాటిని అమ్ముతున్నారేమో అనుకుని ఒక వాటిని ఇమ్మని అడుగగా ఆ పెద్దాయన ఒక సంచి మాత్రమే ఇచ్చాడు.. ఇంకా కావాలి అంటే "మాం.. వాటిని అమ్ముత లేదు..మాకోసం కొనుకున్నాం పర్వాలేదు తాగండి"  అన్నాడు..డబ్బులు ఇవ్వబోతే తీసుకోలేదు .
" నేను కొని తెస్తాను ఎన్ని కావాలో చెప్పండి" అని అడిగితే అయితే ఓ నాలుగు పట్రమ్మని పది రూపాయలు ఇచ్చాం.. 
పెద్దాయన బట్టలు మట్టితో అప్పుడే పొలం పని చేసిన ఆనవాళ్ళు వున్నా  మొఖం లో ఏదో తెలియని వెలుగు, ప్రేమ, అభిమానం కూడిన నవ్వు నన్ను కట్టిపడేసింది.. 
మిగిలిన చిల్లర ఇవ్వబోతే వద్దని చెప్పాం.. 
మా కారు లో ఇంకా ఇద్దరు కూర్చో వచ్చు.. దాంతో "బాబు కాస్త ఆనందపురం వరకు దింపుతారా" అని అడిగితే అలాగే వచ్చి కూర్చోమని చెప్పాను.. 
ఆయన వారి సగ భాగాన్ని పిలిచి ఆమె తో బాటు ఓ పెద్ద మామిడి కాయల మూట కూడా ఎక్కించాడు.. మాకు ఒక పది కాయలు ఇమ్మని ఆవిడతో చెవిలో రహస్యంగా చెప్తున్నా అర్ధం అయ్యింది. ఆ మాట  నే రెండు మూడు సార్లు చెప్పాడు..
"మల్లి ఇటేపు వచ్చినప్పుడు మా  ఇంటికి రండ"ని పిలిచాడు.. 
పతి మాట జవదాటని  ఆ ఇల్లాలు దిగిపోతూ ఓ పది కాయలు మాకు వద్దు వద్దు అంటున్నా వినకుండా కారులో పడేసింది.. డబ్బులు ఇవ్వబోతుంటే వద్దని వారించాం.. వాళ్ళ అమ్మాయి పురుడు పోసుకుందిట... ఆమెను చూడ్డానికని ఈ పెద్దావిడ పెద్ద మామిడి కాయల మూటతో బయలు దేరింది.. 

మా ఇంటికొచ్చాక కారు దిగి  మామిడి కాయలు సంచిలో వేస్తునప్పుడు  చెప్పాను.. "చుసావా.. మనం నిజాయితీతో వుంటే దేవుడే మనకి న్యాయ బద్దంగా కాయలు ఇచ్చాడు.. దొంగతనంగా కోసి వుంటే తప్పు చేసాం ఏమో అన్న ఫీలింగ్ కొద్ది సేపైనా పట్టి పీడిస్తుంది.. ఇలా న్యాయబద్దంగా  అభిమానంతో వచ్చినట్లయితే తృప్తిగా వుంటుంది".. అని చెప్పగా నా అర్ధబాగానికి బాగా అర్ధమయ్యి తృప్తి గా తలూపింది.. 

ఈ రోజు చిన్న జేబు దొంగ (చిల్లర దొంగ) దగ్గర నుండి పదవులను అడ్డు పెట్టుకుని అడ్డంగా కోట్లు సంపాదించుకుంటున్నా అధికార్లు, మంత్రివరీలు, (అ) రాజకీయ నాయకులూ ఈ ధర్మ సూక్తాన్ని ఆచరిస్తే ఇవాళ ఇన్ని దోపిడీలు, దౌర్జన్యాలు, మర్డర్లు మానభంగాలు, అరాచకాలు, కబ్జాలు, హింసలు, ఇవేవీ వుండవు..
కాని వీటిని నేర్పే సంప్రదాయ విద్యావిధానం కాక ఆధునిక (అ)విద్యా విధానం అనబడే మరబొమ్మలని తయారుచేసే విలాస (కార్పోరేట్)  విద్యా విధానంలో ఇవన్ని అనుభవ వేద్యం వుంటేగా.. 

  

Sunday, May 19, 2013

"కోనసీమ" ని మరిపించేలా వున్న ప్రకృతి అందాలు

 ఈ రోజు అనగా 19/05/13 (ఆదివారం) మేము రామతీర్థం మరియు గోవిందపురం (విజయనగరం జిల్లా) కారులో వెళ్ళాం.. 
తోవ పొడుగునా కొబ్బరి చెట్లు, మామిడి తోటలు, చెరకు చేలు, జీడి మామిడి తోటలు, అరటి చేలు, యూకలిప్టస్ చెట్లు.. ఆర బెట్టిన మొక్కజొన్న కండెలు.. వీటన్నిటినీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం.. 
"కోనసీమ" ని మరిపించేలా వున్న ఈ ప్రకృతి అందాన్ని ఇన్నాళ్ళు ఆస్వాదించనందుకు విచారిస్తూ..ఇప్పటికైనా వీక్షించి నందుకు ఆనంద పడుతూ సరదాగా సాగిన మా ప్రయాణ చాయా చిత్రాలు మీరు కూడ కనండి.. ఆనందించండి..
బోల్డంత డబ్బు, సెలవు పెట్టుకుని దూర ప్రాంతాలు వెళ్ళే బదులు మనకి దగ్గరలోనే (100 కి.మీ లోపే) వున్న చక్కటి ప్రదేశాలు చుట్టి వచ్చేస్తే ఎంత హాయిగా వుంటుందో ... మీరూ చేసి చూడండి. 


 

Saturday, May 18, 2013

కొంపతీసి దేశానికి మంచి రోజులు వచ్చేస్తున్నాయా ?

కొంపతీసి దేశానికి మంచి రోజులు వచ్చేస్తున్నాయా ?
అమాయకంగా కనిపించే సోనియమ్మ , అంతకన్నా అమాయకంగా కనిపించే (నోట్లో వేలేస్తే కొరకలేని బాలుడు) రాహులయ్య. ప్రధాని పదవికే అప్రదిష్ట కలిగించేలా రిమోట్ కంట్రోల్ తో నడిచే బొమ్మ సింగు గారు.. 
వీళ్ళంతా ఒక్కసారిగా ఏం చేసేస్తిన్నారు.. 
= కసబ్, అఫ్జల్ గురు లాంటి వారిని వురి తీసేసారు..
= 2 జి స్కాం మొదలుకుని  బొగ్గు కుంభకోణాలలో పాల్గొన్న తమ సొంత కూటమి లోని మంత్రులనే తీసి   
   పారేసి జైలు పాలు చేసారు.. వాటిల్లో మాకు ఏ మాత్రం సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చేసుకున్నారు.. 
= కర్ణాటక  గాలి తో బాటు అనుంగు సోదరుడైన మన అమాయక రెడ్డి బాబుని కూడా జైలు పాలు   
   చేసారు..మరి వారి  నాయన పాలనలో వీరి అండదండలు లేకుండానే అన్ని పరిశ్రమలు, గనులు, జల 
   యజ్ఞాలు వీటన్నిటికీ  అనుమతులు ఎలా వచ్చాయి.. ఏ మట్టీ అంటుకోకుండానే (అని మనం అడగ 
   కూడదు).. 
= ఇప్పుడు కొత్తగా కిరికెట్టు స్కాం అంటూ కొంతమంది  ఆటగాళ్ళను, బుకీ లను బుక్ చేశేసారు  ..   
   ఐ.పి.ఎల్ వద్దు మొర్రో ఆని మొత్తుకున్నా వినకుండా దాన్ని ప్రజల మీదకి రుద్దారు.. 
   అయినా  అడ్డదారిలో కోట్లు ఖజానాకి, వాళ్ళ  జేబులకి వచ్చి చేరిపోతుంటే ఎలా నిషేదిస్తారు..   
   అధికారికంగా, అనధికారికంగా కొన్ని కోట్లు వచ్చి పడిపోతున్నాయి.. 
= నిన్నటి వార్తలను బట్టి చూస్తే కళంకిత మంత్రులని  మీడియాచే ముద్దుగా పిలవబడుతున్న మన రాష్ట్ర 
    మంత్రులను బర్తరఫ్ చేయడం.. 

ఇవన్నీ చూస్తుంటే అబ్బో సోనియమ్మ వారి బిడ్డ దేశాన్ని వుద్దరించేస్తారని ప్రజలు చంకలు  గుద్దుకుని  తర తరాలకి మరల వారినే గద్దేనిక్కిస్తారని, మర బొమ్మ లాంటి మన్మోహన్ వారినే తిరిగి ప్రధాని కావాలని వారి ఆకాంక్ష. 

అయ్యలారా, అమ్మలారా. అసలు ఈ దేశంలో ప్రజలకి అవినీతిని, లంచ గొండి తనాన్ని నేర్పింది రాహుల్ గారి నాయనమ్మ అని అందరికీ తెలుసు.. డబ్బు సంచులు ఎవరు తీసుకుస్తే వారికి సీట్లను, మంత్రి పదవులను, ముఖ్య  మంత్రి పదవులను కట్టబెట్టి ఆనాడే ఎన్ని కోట్లు కూడేసుకున్నారో తెలీదు గాని, అందుకే  ప్రజలు అప్పటి రబ్బర్ స్టాంప్ పాలనకు విసుగొచ్చి   అన్నగారిని (అసలు సిసలు NTR ని) అఖండ మెజారిటీతో గెలిపించారు.. బోఫోర్స్, హెలికాప్టర్ల కుంభకోణాలు ఆయన అయ్యగారి హయాంలో జరిగినా క్లీన్ చిట్ ఇచ్చేసుకున్నారు.. అసలు ఎంత సంపద విదేశాలకి తరలి పోతోందో తెలియడం లేదు.. 

అయినా నమ్మండి.. ఇక్కడ కె.సీ.ఆర్ కుటుంబ పాలనని, అక్కడ గాంధీ (Duplicate) కుటుంబ పాలనని అందలం ఎక్కించండి.. మనం కూడా కాస్త స్వేచ్చగా బతకాలి కదా.. 


Friday, May 17, 2013

నేను నా బ్లాగులో / టపాలో రాసినదే జరిగినది..

నాకు నిన్నటి రోజున జరిగిన సంఘటనలు రెండింటితో  చాల ఆనందం వేసింది..
నేను నా బ్లాగులో / టపాలో రాసినవే జరిగినవి... 
1.  ఐ.పి.ఎల్ గురించి నేను రాసినదే సరిగ్గా జరిగింది.. చూడండి .
(22 April 13 - Title: రావణ కీచకులు సిగ్గుపడుతున్నారు). లింకులు పెట్టడం ఎలాగో నాకు తెలీదు.
స్పాట్ బెట్టింగ్ గురించి ఈ పోలీసు వాళ్ళు ఇప్పుడే కొత్తగా కనిపెట్టినట్లు బిల్డప్ ఇచ్చినా సరి అయిన ఆధారాల కోసం వాళ్ళు పడ్డ శ్రమ కి హాట్స్ ఆఫ్.. 
ఒక బౌలర్ ఒక ఓవర్ లో సుమారు 20 పరుగులు ఇచ్చినందుకు సుమారు కోటి రూపాయల ఆఫర్.. నువ్వు, నేను ఎంత కష్టపడితే రావాలి అంత డబ్బు.. అసలు అంత డబ్బు జీవితకాలం లో చూడలేని నిర్భాగ్యులు కొన్ని కోట్ల మంది వున్న దేశం... మరి ఒక్క నిముషకాలం లోనే వచ్చి పడిపోతోంది.. ఎవడబ్బ సొమ్ము అది.. నీ సొమ్ము నా సొమ్మే.. అడ్డ దారిలో  జనాల్ని, దేశాన్ని మోసం చేస్తే వచ్చిన నల్ల డబ్బు అది..
ద్రావిడ్ పాపం ఏమీ తెలియని అమాయకుడిలా నటిస్తూ రోజంతా టీ .వీ లో గోల.. మా మీద మీ కుండే అభిమానం అలాగే వుంచండి. అని ఎందుకంటె .. మళ్లి ఎవరూ వాళ్ళ ఉత్తుత్తి ఆట చూడరేమో అన్న బెంగ.. 

బి.సి.సి. ఐ వాళ్ళు కూడా ఎంతో అమాయకంగా ఫోజు పెడుతున్నారు.. అసలు వాళ్ళు పెంచి పోషించి, దానికి ప్రభుత్వ మద్దతు వుండబట్టే కదా ఇదంతా.. 
స్నేహితులు, మొగుడూ పెళ్ళాలు రెండుగా చీలిపోయి చెరొక టీమ్ మీద పందెం కట్టుకుంటూ విడిపోతే .. పెద్ద స్థాయిలో బుకీలు, బెట్టింగులు.. మళ్ళా అంతా ఏమీ తెలీయనట్టు నాటకం.. 
సచిన్ అందుకే క్రికెట్ దేవుడు గా పిలువ బడుతున్నాడు.. బుద్దిగా తన ఆట ఏదో తను ఆడుకుని ఏ వివాదాలు లేకుండా కెరీర్ కోన సాగిస్తున్నాడు.. 
ఇక చాలు నిజంగా ప్రభుత్వానికి, క్రికెట్టు పెద్దలకి చిత్త శుద్ది వుంటే ఈ క్రికెట్ వ్యభిచారాన్ని ఇంతటితో ఆపేయాలి..

2. గతంలో కె.సీ.అర్ గురించి, తెలంగాణా విషయంలో వాళ్ళ కుటుంబ దోపిడీ గురించి నేను చాలా రాసాను.. కాని బ్లాగు లో కొంతమంది.. సరిగ్గా అర్థం చేసుకోక కె.సి.ఆ ర్ ని తిడితే తెలంగాణా వాళ్ళని మొత్తం తిట్టినట్టుగ భావిస్తూ ఓహ్ గోల గోల చేసేవారు.. దాంతో మనకెందుకులే అని వూరుకున్నా.. 
నిన్న రఘునందన్ రావ్  అనే పక్కా కె.సీ.ఆర్ పార్టీ లోని కీలక నాయకుడు (?) .. సాక్షాధారాలతో వీళ్ళు చేస్తున్న అన్యాయాలు,కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, ధనార్జన ఇవన్నీ నిరూపిస్తానని నిన్నంతా ట్.వీ లో ఒకటే గోల.. 
ఏం ?  ఇన్నాళ్ళూ తెలీదా ఇప్పుడేదో కొత్తగా తెలుసుకున్నట్లు  బిల్డప్.. అసలు కె.సీ. ఆర్ వల్లనే తెలంగాణా రావట్లేదు అన్నది జగమెరిగిన సత్యం..
"జాగో, బాగో తో మొదలు నాలికలు తెగ్గొస్తా, తరిమి తరిమి కొడతాం" .. ఇలాంటి భాష, మాటలు ఇంతకు ముందు ఏ ఉద్యమ కారులు మాట్లాడలేదు.. 
తెలంగాణా గనక నిజంగా వచ్చేస్తే వాళ్ళకే నష్టం.. ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తున్నారు. ఇవన్నీ.. కాని వీళ్ళ అమాయక మోసపూరిత మాటలతో ఇప్పడి దాకా ప్రాణాలు కోల్పోయిన బిడ్డల తల్లి తండ్రులకు ఏమని సమాధానం చెప్తారు.. 


ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ .. face book లాంటి సోషల్ నెట్ వర్క్ మీద ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని రాస్తున్నారు... అదే కనక జరిగితే ప్రజల నోళ్ళు నిక్కినట్టే ప్రజాస్వామ్య విలువల్ని, ప్రజల మనోభావాల్ని, స్వేచ్చను కాలరాసినట్టే.. భావప్రకటనా స్వేచ్చను హరించి నట్లే .. ఈ సోషల్ నెట్ వర్క్ ల వల్లనే కొన్ని దేశాల్లో నియంత్రత్వ పాలన అంతమొందింది... ఒకడు నేరస్తుడు అయితే వాడి స్నేహితుల్నిఅందర్నీ అనుమానించడం కూడా తప్పు..

మనం రాస్తున్న విషయాలు ప్రపంచంలోని  అనేక మందికి చేరుతుంది..  కనక సమాజం లో జరిగే అన్యాయాల్ని, తప్పుల్ని వీలైనంత వరకూ ఎత్తి చూపాలి.. అలాగని ఎవర్నీ నొప్పించ ప్రయత్నం చెయ్యకూడదు..  
ఎవరు కామెంట్ చేసినా చెయ్యకపోయినా.. ముఖ్యంగా మనం వున్నది తెలుగు బ్లాగు లోకం కాబట్టి వీలైనంత వరకూ భాష పట్ల శ్రద్ధ వహించాలి.. 

చాల మంది ఆడవారి బ్లాగుల్లోనే కామెంట్ రాస్తూ "మీ కవిత - అబ్బో అద్భుత మండి.. అబ్బ మీ ఊరి ఫొటోలు ఎంత బావున్నాయో ".. అంటూ.. ఏవేవో రాస్తారు... 
అసలు నిజంగా ఆ బ్లాగు ఆడవారిదేనా కాదా అని కూడా అనుమానమే .. నేనొక పల్లెటూరి (గోదావరి) అమ్మాయిని... లేదా ఇప్పుడిప్పుడే లోకం చూస్తున్న(గడప దాటుతున్న) ఇల్లాలిని అనగానే బోల్తా పడిపోయి..కామెట్లే కామెంట్లు.. ఎప్పటికి మారతారర్రా..   Wednesday, May 15, 2013

ఈ నాటి యువతరం ఒక్క సారి ఆలోచించాలి..

ఇన్నాళ్ళకి ఒక కుంటుంబ సమేతంగా చూడగలిగిన సినిమా చూసాం .. అదే "సుకుమారుడు" -సినిమా. 
వారసత్వంగా వచ్చిన నట కుటుంబం నుండే వచ్చినా, ఇతర నట వంశీయుల కన్నా భిన్నంగా వున్నాడు..
ఓవర్ ఏక్షన్ లేకుండా, పది సుమోలు గాల్లోకి లేపకుండా, ఒక్క చేత్తో వందమందిని కొట్టకుండా, బట్ట తల బ్రహ్మీతో చెత్త (చెంప దెబ్బల) కామెడీ లేకుండా కధకు తగ్గట్టు పాత్రల ఎంపికతో  ఆద్యంతం రక్తి కట్టింది.. ఒక పక్క సూపర్ స్టార్ క్రష్ణ (పాత్ర చిన్నదే అయినా హుందాగా వుంది), మరొక పక్క  సహజ నటి ఊర్వశి శారద, వేరొక పక్క రావూ రమేష్, చుట్టూ చక్కటి జూ. కామెడీ నటులు అంతా కలసి నవ్వులు పూయించారు.. 

హీరో అందంగా, గ్లామర్ గానే వుండి హావభావలన్నీ చక్కగా పలికించాడు.. డాన్సులు బావున్నాయి.. హీరోయిన్లకి అంత ప్రాముఖ్యం లేకుండా ఎంతవరకు వుండాలో అంతవరకే వుంచారు. వాళ్ళ అక్క లాగ బకెట్ల కొద్ది కన్నీరు కార్చలేదు.. కధనం, స్క్రీన్ ప్లే బావుంది.. పాటలు బావున్నాయి... హాయిగా కుటుంబ సమేతంగా వెళ్లి పడి, పడి నవ్వుకోవచ్చు.. 

ఇందులో నాకు నచ్చనవి: 
1. హీరోకి  కొంత విలన్ లక్షణాలు ఆపాదించడం.(కథా పరంగా తప్పలేదేమో) .. 
2. ఫోర్జరీ సంతకాలు రెండు చోట్ల వాడడం .. 
3. శారద మనవరాలు (కొడుకు కూతురు) ఆస్తి కాగితాలు చేతికి వచ్చింతరవాత అవి అందుకుని, హీరో ని ఇక ఈ ఇల్లు ఆస్తి నావి నువ్వు వుండడానికి వీల్లేదు వెళ్ళిపో అంటూ కాగితాలు పట్టుకుని వెళ్తుంది..
అలా కాక నేను ఈ అస్తి కోసం రాలేదు .. నీ ప్రేమ కోసం వచ్చాను నాయనమ్మా అని ఆ దొంగ ఫోర్జరీ పత్రాలు చింపేసి నాయనమ్మను కౌగలించుకుని వుండి వుంటే ఇంకా బావుణ్ణు.. 
4. హీరో పక్కన అతని కంటే ఎత్తుగా అందంగా వున్న స్నేహితుణ్ణి (అష్టా చెమ్మలో 2వ  హీరో) పెట్టడం వలన  ఆది(హీరో) డి -గ్లామరస్ అయ్యాడు.. అందుకే పెద్ద హీరోలు బ్రహ్మీ ని , సునీల్ పెట్టి వాళ్ళను వికారంగా చూపిస్తూ వెకిలి హాస్యాన్ని పెట్టుకుంటారు.. 
5. హీరో తాత (నాన్నకి నాన్న) హనుమంతరావు వచ్చింది వర్ధనమ్మ మనవడు అంటే అతనికి కూడా మనవడే కాబట్టి ఆ తాత మనవల సెంట్ మెంట్ ఎక్కడా లేదు.. 
6. ప్రేమ పేరుతో అంత వరకూ అల్లారు ముద్దుగా పెంచిన అమ్మా నాన్నల ప్రేమను, ఆశలను వదిలేసి హటాత్తుగా కులం కాని వాడితో లేచి పోతే జరిగే పరిణామాలు చక్కగా చూపించారు..ఒక్క చూపుతోనే ఎవడో గొట్టం గాడితో లేచిపోయి కనీ పెంచిన తలి తండ్రులను క్షోభకి గురిచేస్తున్న ఈ నాటి యువతరం ఒక్క సారి ఆలోచించాలి.. 

మీ తల్లితండ్రులు మిమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచి, కావలసినవి కొనిపెట్టి, లక్షలు పెట్టి చదివించి, అవసరం అయితే విదేశాలకైన పంపించింది మీరు ఎక్కడున్నా బావుండాలని, ముసలి తనంలో వాళ్ళకి ఆసరాగా వుండాలని.. ప్రియుడో ప్రియురాలో దొరికినంతనే వాళ్ళని గుండెల్లో తన్ని పోవడం ఎంతవరకు సబబో ఆలోచించండి..   

Tuesday, May 14, 2013

అమ్మని, ఆవకాయని మర్చిపోకండి.

చిన్నప్పుడు భోగి నాడు "భోగి మంట , పొయ్యిలో కర్ర.. మీ పిల్లలేరి మా మంటకు రారా.. " అని పాడుతూ ఇంటికొక కర్ర చొప్పున ఏరుకుని అంతా సామూహికంగా భోగి మంట వేసేవారు. 
అలాగే వేసవి లో మామిడికాయల  సీజన్ లో మీరింకా ఆవకాయ పెట్టలేదా.. మా ఆవకాయ ఈరోజు పెడుతున్నాం రండి..  అని అంతా కలసి ఒక్కొక్క రోజు ఒకొక్కరి ఇంట్లో ముక్కలు తరుగుతూ కబుర్లు చెబుతూ ఆవకాయలు పెట్టేవారు.. అదో ప్రహసనం.. 
ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు కాబట్టి మన వాళ్ళు ముఖ్యంగా బ్రాహ్మణులు  ఇళ్ళలో చాలామంది ఆవకాయలు పెట్టడం మానేస్తున్నారు. 
అమ్మా, అయ్యా బ్రాహ్మణ సోదరీ సోదరులారా.. ఆవకాయ మనది. పనస పొట్టు కూర మనది.. అరటి దవ్వ కూర, అరటి పువ్వు కూరా మనదే.. వీటిని వండడం మరొకరికి చేతకాదు.. వీటి రుచిని ఆస్వాదించడం రాదు . ఒకవేళ వచ్చినా అది మన దగ్గర నుంచి కొట్టేసినదే.. వీటి పేటెంట్ హక్కు మనది.. 
అమ్మని, ఆవకాయని మర్చిపోకండి. 
ముద్ద పప్పు లో కాస్త ఆవకాయ వేసి, కొంచెం నెయ్యి వేసుకుని తినండి.. దీన్ని మించినది లేదు. 
ఇదిగో గత రెండు రోజులుగా కష్టపడి మా ఇంట  తయారు చేసిన ఆవకాయలు చూడండి.. 


 

 

విశాఖపట్నం లో అన్ని రైతు బజార్ల లోనూ తక్కువ రేటుకే మామిడి కాయలు దొరుకుతున్నాయి .. ముక్కలు కొట్టేవాళ్ళు అక్కడే వుంటారు.. This credit goes to Mr.Chandra Babu Naidu..  (రైతు బజార్లను పెట్టిన ఘనత ఆయనదే కనక) .. సుష్టుగా ఆవకాయ తినండి.. చంద్ర బాబుకే ఓటు వెయ్యండి.. ప్రస్తుత కాలంలో ఇంత కన్నా గట్టి లీడర్ ఎవరూ లేరు.. పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలను కూడా ఇక్కడ పెట్టి అనేక మందికి ఉపాధి కల్పించాడు.. ఇది మరోసారి చర్చింద్దాం.. 
నీతి: ఈ ఆవకాయ వల్లనే రామోజీ రావు కోటీశ్వరుడు అయ్యాడు.... 

Monday, May 13, 2013

అభ్యర్ధి ఎవరో కూడా తెలీదు... స్వకులస్తుడైతే గుద్దేయడమే..

నిన్న సాక్షి ఆదివారం అనుబంధం లో ఈ దిగువ ఆర్టికల్ వచ్చింది.. 

అందులో మొదటి పాఠకుడు ఏమని సెలవిస్తున్నాడయ్యా అంటే "అందరూ ముఖ్యంగా అగ్రవర్ణాల వాళ్ళు తమ పిల్లలకు కులం గురించి చెప్పకూడదు. వారి మనసు లోకి ఆ  భావనే రాకుండా చూడాలి.. కొందరు విద్యావంతులు కూడా అంతర్గతంగా ఎస్సీ, ఎస్టీ, బీ.సీ లను తక్కువగా చూస్తున్నారూ .. అని ఇంకా జంతువులకు చూపని వివక్ష మనుషుల్లో ఎందుకు" అంటూ .. మీడియా మీద కూడా చైతన్యం చేసే బాధ్యతను మోపారు.. 

అయ్యా.. మా పిల్లల విషయానికొస్తే ఇంజనీరు కాలేజీ కి వెళ్ళేవరకూ వాళ్ళకి ఇన్ని కులాల కుంపట్లు వుంటాయని తెలీదు.. అక్కడ కులాలని బట్టి కేటాయింపులు వుంటాయని, కట్టే ఫీజుల్లో రాయతీలు వుంటాయని మొదటి సారిగా అర్ధం అవుతుంది. నిన్నా మొన్నటి వరకూ కలసి మెలసి ఆడుకున్న పిల్లలు నీది ఫలానా కాస్ట్ కదా..నీది బీసీ ..నీది ఎస్సీ అదిగో వాడిది ఓ.సీ అంటు వేరు భావంతో చూడటం జరుగుతుంది..  

మొదటి తరగతిలో వుత్తీర్ణుడయినా, ఎమ్ము సెట్టు లో మంచి రాంకు వచ్చినా వాడు అగ్ర కులస్తుడు అయిన పాపానికి  కోరుకున్న సీటు లేదా ప్రాముఖ్యం వున్న కాలేజీలో ప్రాధాన్యత వున్న కోర్సులో సీటు రాక చతికిల పడినప్పుడు తెలుస్తోంది కులాల అంతరాల గురించి.. 

మొదటి సారి ఓటు హక్కుని వినియోగించుకుందామని సరదా పడినప్పుడు తెలుస్తోంది.. ఆయా నియోజక వర్గంలో కులాన్ని బట్టి సీటు కేటాయించారని, ఎక్కువ మెజారిటీ కల్గిన కులాల వారు వున్న ఏరియాలో అభ్యర్ధి అర్హత, ప్రజా సేవ పట్ల విధేయత కాక, డబ్బు కులాన్ని బట్టి కేటాయింపులు జరుగుతూ వుంటే నిస్సహాయంగా వుండటం తప్ప ఏమీ చెయ్యలేని స్థితి.. 

ఆఖరుకి ప్రభుత్వ రంగ సంస్థల్లో చిన్న కో-ఆపరేటీవ్ ఎలక్షన్ల కి కూడా కులమే శాసిస్తోంది.. అభ్యర్ధి ఎవరో కూడా తెలీదు... స్వకులస్తుడైతే గుద్దేయడమే.. 
ఇవాళ ఎవరి కులాన్ని వాడు కులసంఘాల పేరుతో కాపాడుకుంటూ వారి కులాల వారిని వుద్దరిస్తున్నారేమో తెలీదు కాని ఇతర కులాల వారి మీద దాడులు చేస్తూ కులం కార్డుని అడ్డుపెట్టుకుంటూ ఇతరుపై  జులుం సాగిస్తూ వారిని ఈ దేశంలో బతికే చాన్సు ఇవ్వకుండా ఆర్ధికంగా దిగజారిపోయే స్థితిని కల్పిస్తున్నారు.. (అందరూ కాదు) - కొంతమంది మాత్రమే.. 

నాకు సరిగ్గా తెలీదు కాని I.A.S, I.P.S లాంటి వున్నత స్థానాన్ని పొందిన వారు  వారి పిల్లలకు కులం యొక్క రాయతీలను పొందకూడదట కదూ .. కాని ఎంతమంది అలా చేస్తున్నారు.. 
దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ఎంతో మంది రిజర్వేషన్ ఫలితాన్ని పొందుతున్నారు.. అసలు వాళ్ళే ఇలాంటి నీతి సూత్రాలు ఎక్కువగా వర్లిస్తారు, ఇతరులను నిందిస్తారు..  నిజమైన కులాల వారు అందరినీ గౌరవిస్తారు.. 
ఈవేళ ఇలా ప్రపంచీకరణ, ప్రెవైటీ కరణ, వున్నాయి కాబట్టి అగ్ర వర్ణాల వారు ఇన్ని మెతుకులు తినే స్థితిలో వున్నారు.. 
ఎక్కడో విదేశాల్లో అయినా తమ ప్రతిభను, తెలివితేటలను బట్టి బతక గలుస్తున్నాడు.. తమ తల్లితండ్రులకు మంచి జీవితాన్ని ఆర్ధిక వనరులను పెంచుకో గలుస్తున్నారు.. 
నేను రిజర్వేషన్ వ్యవస్థకి వ్యతిరేకిని కాదు గాని రాజ్యాంగంలో పొందుపరిచినట్లు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే ఈ విధానం వుండాలని పెట్టిన ఆ మహానుభావుని పలుకులని ఎందుకు గౌరవించలేదో తెలీదు.. 
తప్పులుంటే క్షమించండి.. చెప్తే సరిదిద్దుకుంటాను.. 
ఇవాళ కులాల అంతరాలను పోవాలంటే కేవలం అగ్ర వర్ణాల వారు మాత్రమే తమ కులాన్ని తమ పిల్లలకు చెప్పకూడదని రాస్తే ఇలా రాసాను తప్ప మరోటి కాదు..
కాని అగ్రవర్ణాల పిల్లలను టార్గెట్ చేస్తూ వాళ్ళ పిల్లలని ప్రేమ అనే ముసుగులోకి లాగి వారి జీవితాలతో ఆడుకుంటున్న కొంతమంది పై కాస్త జాగ్రత్తగా వుండాలని అగ్ర వర్ణాల పిల్లలకి హెచ్చరిక చేస్తున్నాను.. తమ అవసరాలకు వాడుకుని తర్వాత మా వాళ్ళు నా మరదలితో పెళ్లి ఫిక్స్ చేసారని చల్లగా జారుకునే వాళ్ళు ఎక్కువ. వాళ్ళకి ఆస్తి, కులం నియమాలు ఎక్కువ ప్రాధాన్యం. 

Sunday, May 12, 2013

ఈ దేశాన్ని ఎవ్వరూ కాపాడలేరు .. పోనివ్వండి మనం పోనంత వరకూ..

గమనిక: ఈ టపాని పూర్తి తెలుగులో రాయడానికి ప్రయత్నించాను నా వల్ల  కాలేదు అందుకే కొన్నిటికి బ్రాకెట్టులో (? - మార్కు) పెట్టాను. వాటి తెలుగు పదాలు తెలుస్తే చెప్పండి.. 
ఇక విషయానికి వద్దాం.. 

బాబోయ్.. ఈ రోజు ఒక్కరోజే జరిగిన రోడ్డు ప్రమాదాలను నిరంతర వార్తా దృశ్య శ్రవణ యంత్రం లో చూపిస్తుంటే భయమేసింది. అసలు రోడ్డు మీద ద్విచక్ర వాహనమైనా, భోషాణ శకటమైనా (కారు?)..  నడుపుటకు కడు భయంగా వుంది. ఏ మూల నుంచి ఏ కుర్ర వెధవ దూసుకుని వస్తాడో తెలీదు.. 
మొన్న శనివారం మా విశాఖ లో ద్విచక్ర వాహనం మీద ముగ్గురు వెళ్తూ చాలా వేగంగా వచ్చి ప్రభుత్వ ప్రజా వాహనాన్ని గుద్దితే ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు.. 
అదేరోజు మరో ముగ్గురు అదే తరహాలో చాలా వేగంగా వచ్చి ఏదో పెద్ద వాహనాన్ని గుద్ది, అక్కడికక్కడే ముగ్గురూ హరీ మన్నారు.. 
అదేరోజు అదే రోడ్డులో మరొహడు వేగంగా వచ్చి మరో మరో వాహనాన్ని తప్పించ బోయి అదుపుతప్పి, రోడ్డు కి మధ్యలో వున్న కరెంటు స్తంభానికి గుద్దుకుని అతనూ అక్కడికక్కడే... 
ఈ రోజు అదేదో వార్తా ప్రవాహం లో ప్రత్యక్షంగా ఎక్కడెక్కడో పెద్ద వాహనాలను గుద్దుకుని ఆయా వాహనాల్లో వున్న కనీసం 5 గురు (ఒకొక్క వాహనంలో) అక్కడికక్కదే.. అమ్మో ... నా నోటితో నేను చెప్పలేను..
పై ప్రమాదాలన్నిటికీ ఒకటే కారణం.. అతివేగం, నిర్లక్షం.. నిన్న నేను నా నాలుగు చక్రాల వాహనం లో వెళ్తుండగా పెద్దగా శబ్దం చేస్తూ ఒక ద్విచక్ర వాహన హారన్(?) వినిపిస్తోంది.. కాని ఆ శబ్దం ఎక్కడ నుంచి వస్తోందో తెలియడం లేదు.. 
నాకు కుడి పక్క కొద్ది దూరంలో ఒక మలుపు వుంది... ఆ మలుపుకి ముందు ఒక నాలుగు చక్రాల వాహనము, మలుపు తర్వాత ఒక మూడు చక్రాల బాడుగ వాహనము -(ఆటో =?) వున్నాయి..
అందువలన నాకు ఆ సందు గుండా వచ్చే వాహనాలు కనబడే అవకాశం లేదు.. 
ఎప్పటి లాగే ఎడమ వైపు రోడ్డు సగం ఆక్రమించేసి కొన్ని వాహనాలను నిలుపుతారు కాబట్టి నేను వాటి మధ్య లోంచి అతి చాకచక్యంగా నా ప్రతిభను ప్రదర్శించి ముందుకు వెళ్తుండగా ఒక కుర్ర  నాయకుడు (రామ్ చరణ్ కాదండోయ్) సర్రున ఇందాకా చెప్పిన సందులోంచి నా వాహనం మీదకి దూసుకుని వచ్చాడు.. 
హటాత్తుగా జరిగిన ఈ సంఘటనకి బిత్తర పోయి చూసా.. నేను నెమ్మదిగానే వెళ్తున్నాను గాని వాడు నేరుగా వచ్చి నా వాహనాన్ని గుద్దినంత పని చేసి తన చేతి లో నున్న వాహన  హాండిల్ (?) ని ఒక్కసారిగా కుడిపక్కకి తిప్పి తనను తాను రక్షించుకుని నన్ను కూడా రక్షించాడు.. 
అంటే ఇందాకా గట్టిగా హారన్ (?) వినిపించిన వాహనం ఇదన్నమాట.. అప్పుడు పక్క అద్దంలో కాని, ఎదుటి అద్దంలో గాని నాకు ఏ వాహనము కనిపించలేదు.. 
నేను కాస్త విసుగుతో కూడిన కోపంతో చూసేసరికి పళ్ళికిలిస్తూ నవ్వుతున్నాడు.. వాడు ఆఖరి క్షణంలో అలా పక్కకి తిప్పకుండా వచ్చి గుద్దేసి వుంటే నేరుగా నేనున్న స్థానం లోనే అతివేగంతో గుద్దడం వల్ల నేను పోయి వుండే వాణ్ణి .. కాస్త ముందుగా వచ్చి గుద్దితే ఇంజన్(?)  సైడ్ తగిలి వాడు పోతాడు లేదా నా వాహనానికి పెద్ద నష్టమే జరిగేది .. పెద్ద ప్రమాదమే తప్పింది.. కాని ఈ వెధవ గుండెకి అంత వేగిన సర్దు కోవడం రాదే..  అలా సాయంత్రం వరకూ వేగంగా కొట్టుకుంటూనే వుంది.. 

ఆయన గారు చేసిన శబ్దానికి మనం ఆయన ఎక్కడ వున్నారో తెలియక పోయినా మన బండి ఆపేసి నించుంటే ఆ నాయకులు గారు అతి వేగంగా వాహనాల మధ్యలోంచి కుడి ఎడమల మధ్య తేలియాడుతూ, గాల్లో విహరిస్తునట్లు అనుభూతి పొందుతూ మిగిలిన వాళ్ళను చేతకాని దద్దమ్మలు అన్నట్లుగా చూస్తూ అమ్మా బాబుల డబ్బుతో  వాహనాన్ని కొనుక్కుని సిగ్గులేకుండా నడపడమే కాక, ఇంధనానికి, జల్సాలకి కూడా  డబ్బులు తీసుకుని వీళ్ళు చేస్తున్నది ఏమిటి? వాళ్ళు చస్తూ ఇంకొకరిని చంపడం.. 
    
హైవే రోడ్డు(?)  మీద అడ్డంగా (వైజాగ్ లో) తాత్కాలిక ఇనుప అడ్డుగోడలను(Stoppers = ?) పెట్టి రక్షక భటులు తామేదో గొప్పపని చేసాం అని మురిసి పోతున్నారు గాని ఇలా అతి వేగంగా బండి నడిపే వాళ్ళను  పట్టుకుని వాళ్ళకు  వాహనాన్ని నడిపే అర్హత ను ధృవీకరించే పత్రాన్ని (Driving license) శాశ్వతంగా రద్దు చేస్తే చాలా వరకు ప్రమాదాలను అరికట్టవచ్చు .. 
వాళ్ళంతా M.Ps , M.L.As, మంత్రివర్యుల  పుత్ర రత్నాలు, బామ్మర్దులు, సినిమా (?) నాయకులు  - వాళ్ళకి మినహాయింపు ఇస్తే - ఈ దేశాన్ని మనల్ని ఎవ్వరూ కాపాడలేరు .. పోనివ్వండి అలాగే మనం పోనంత వరకూ.. 
 

Sunday, May 5, 2013

నా తోనే మొదలెట్టవా నీ రాజకీయం ... నీకెదురులేదు"...

 "గురువా !"
"ఏమిటి శిష్యా ? "  
"ఎక్కడ చూసినా -రోడ్డుమీద జనారణ్యం.. కార్లు, స్కూటర్లు, బస్సులు, పాద చారులు వీళ్ళందరి మధ్య తోవ చేసుకుని వెళ్ళడం చికాకుగా వుంది. ఒక్క స్విచ్ నొక్కనంటే ఎక్కడి వాళ్ళు అక్కడ నిలిచి పోవాలి.. హాయిగా నా గమ్యాన్ని నేను చేరుకోవాలి... తిరుపతికి స్వామి దర్శనానికి వెళ్తే కంపార్టమెంటుల నిండా జనం. ఓ పదిహేను గంటలకి కాని దర్శనం దొరకదు.. ఒక్క స్విచ్ నొక్కానంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోవాలి నేనొక్కణ్ణీ హాయిగా దర్శనం చేసుకుని బయటకి రావాలి.. సిమ్మాచలం నిజరూప దర్శనమప్పుడు, శివరాత్రి శ్రీశైలం లో శివ దర్శనం అన్ని ఇలాగే అయిపోవాలి" రైలు మన కోసం ఆగాలి.. ఆఖరి నిముషం లోనైనా బెర్ట్ కన్ఫర్ము కావాలి"..

"అంతేనా ఇంకేం కోరికలు లేవా"..
"ప్రస్తుతానికి ఇంతే"...
"లేదు నేను ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాను"....
1. చదువు, అర్హత, అనుభవం లేక పోయినా ఉన్నత  పదవి లో వుండవచ్చు...
2. ఉచితంగా నువ్వు నీ మంది మార్బలం దేశ, విదేశాలకు వెళ్ళచ్చు.. 
3. ఏ.సీ కార్లలోను, విమానాలోను తిరగవచ్చు స్టార్ హోటల్ల లోను దర్జాగా ఉచితంగా వుండవచ్చు..
4. ఎక్కడికి వెళ్ళినా స్వాగత సత్కారాలు, వంది మాగధ గణాలు...
5. మర్డర్లు, మానభంగాలు నువ్వు (లేదా) మీ వాళ్ళు చేసినా కేసులు వుండవు..
6. దర్జాగా నీకు నచ్చిన జాగా ఎంతైనా కబ్జా చేసుకోవచ్చు..
7. ఊరికి పది మంది చొప్పున ముండల్ని మెంటైన్ చేసినా అడిగే వారు వుండరు...
8.అడ్డదారిలో కోట్లు పోగేసినా జనం నీ వెనకాలే వుంటారు.. ఎవరూ ప్రశ్నించరు.. 

"ఓ.కే".. 
"అయితే కింది షరతులు వర్తిస్తాయి".. 
1. సిగ్గు, మానం మర్యాద వదిలేయాలి.. 
2. సిద్దాంతాలు, నమ్మకాలు = వంకాయ తోటకూర లాంటివి  పెట్టుకోకూడదు ... 
3. బూతులు నేర్చుకోవాలి..అవసరం అయితే ముష్టి యుద్ధం కూడా...  
4. మైకు దొరక గానే ఇతరులపై ఇష్టమొచ్చి నట్లు పూనకం వచ్చి నట్లు తిట్టాలి.. 
5. ఆయా మతం వారి వీధుల్లో, ఊర్లల్లో వారి వేష, భాషలను అనుకరించాలి.. 
6. అందరికీ బుగ్గలు నిమురుతూ, నెత్తిన చెయ్యి వేస్తూ భరోసా ఇవ్వాలి.. 
7. ముఖ్యంగా  తాయతులు, రాయతీలు, వడ్డీ  లేని రుణాలు, ప్రస్తుతం వున్న దానికంటే 
    ఇంకా ఎక్కువ శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటిస్తూ వుండాలి.. 
8. "ఆకాశం దించాలా ? నెలవంక తుంచాలా ?" అన్న లెవల్లో మభ్య పెడుతూ ఎన్నో వరాలు    
    గుప్పించాలి.. 


 "అరె .. ఏదీ  ... ఎక్కడా.. కనిపించవేం... ఓహ్ .. నా కాళ్ళ దగ్గర వున్నావా ? పాదాభివందనం చేస్తున్నావా ? అలాగే కాని.. 
?....?...?..
అరె ఏమిటిది? .. అలా లాగకు.. అరె చెప్తే నీక్కాదు.. పడిపోతా ... అమ్మా... పడిపొయా.. నా తోనే మొదలెట్టవా నీ రాజకీయం ... నీకెదురులేదు"... 

Friday, May 3, 2013

"దాడి" దారి ఎటు (?)

తెలుగు దేశం ఆవిర్భావ కాలం నాటి నాయకుల్లో శ్రీ. దాడి వీరభద్ర రావు గారు ముఖ్యులు.. వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి వారి ఇష్ట కొలువులో అగ్రభాగాన నిలబడ్డ ప్రముఖుల్లో ఒకరు.. 
ఆనాటి తెలుగు దేశం ప్రభుత్వంలో మంత్రివర్యులు.. 
ఇప్పటి ఆయన పరిస్థితి బాధాకరమే అయినా కొన్నాళ్ళుగా, కొన్నేళ్ళుగా తన నియోజక వర్గంలో ఎందుకనో వెనకబడ్డరనే చెప్పచ్చు.. ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల వలన ఓట్ బాంకింగ్ లో వెనక బడ్డారని చెప్పవచ్చు.. 

కాని ఆ రోజుల్లో ఆయనకు వున్న ఇమేజ్ అంతా ఇంతా కాదు.. ఒక విధ్యాధికుడిగా, కాలేజ్ లెక్చరర్ గా, ఒక రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు.. కనకనే స్వర్గీయ ఎన్.టీ. అర్ అక్కున చేర్చుకున్నారు.. 
సామాన్య కుటుంబ నేపధ్యం గల వీరభద్ర రావు గారు నాకు తెలిసి వీలైనంత వరకూ ప్రజల్లో మమేకమై, మేధావులు దగ్గర నుండి పామరుల వరకు ఆకట్టుకో గలిగారు.. కొన్నాళ్ళ బాటు ఓ వెలుగు వెలిగారు.. 

NTR గారి మరణంతో తమ ప్రాబల్యాన్ని కోల్పోయిన వారిలో ఈయన ఒకరు అని చెప్పవచ్చు.. ఆయన రాజకీయ జీవితం ఎందుకు వెనక బడిందో నాకు సరైన వివరాలు నాకు తెలియవు.. 
అయితే నాకు ఆయన అంటే ఒక రచయితగా ఎంతో అభిమానం.. 

ఆయన రాసిన నాటకాలు సమకాలీన రాజకీయ వ్యవస్థ మీద, పేద ప్రజల ఇక్కట్ల మీద సాగాయి.. మా R.K Production, Visakha వారి ఆధ్వర్యంలో మా గురువు గారైన కీ.శే మందులు గారి దర్శకత్వంలో మేం వేసిన రా.వి శాస్త్రి గారి "నిజం" నాటకాన్ని శ్రీ.వీరభద్ర రావు గారు (మంత్రి గా వున్నా రోజుల్లో) విశాఖ లో చూసి, అదే నాటకాన్ని అనకాపల్లి లో జర్నలిష్టుల అసోషియేషన్ ద్వారా ఆయన  ఆధ్వర్యంలో  వేయించారు.. అప్పుడు ఆయన చూపిన ఆదరణ, మందులు గారి మీద ఆయన గౌరవం ఆశ్చర్యం వేసేది.. 

ఒకసారి చుట్టు మందీ మార్భలం, వెనకాల గన్ మేన్ వుండగా అనుకోకుండా వైజాగ్ లో RTC కాంప్లెక్స్ ఎదురు రోడ్డులో మా టీమ్ ఎదురవగా ఆయన కారు ఆపి మమ్మల్ని పేరు పేరునా పలకరించారు.. పెద్దాళ్ళతో మనకెందుకులే అని నేను కాస్త చివరిగా నిలబడి వుండగా తన గంభీర మైన గొంతుతో "ఏమండీ ! అంతరాత్మ గారు (నిజం లో నా పాత్ర పేరు) ఇలా రండి అని పిలిచి మరీ కరచాలనం చేసారు. 
అంత పెద్ద మంత్రి వర్యులు అలా పిలచి పలకించేసరికి కామన్ గానే ఎవరికైనా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది... నాది సేమ్ ఫీలింగ్ .. 
ఇప్పుడు నేను ఎవరో ఆయనకీ తెలియక పోవచ్చు కాని హైదరాబాద్ లో ఆయన రాసిన నాటకాన్ని మేం వేసిన సందర్భంలో అక్కడ ఆయన కలుసుకున్నప్పుడు జరిగిన సంభాషణలు ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతాయి..    

నాకే కాదు నాలాగా నాటక అభిమానులందరికీ శ్రీ దాడి వీరబధ్ర రావు గారన్నా, ఆయన రచనలన్నా ఎంతో  అభిమానం..అసలు ఈనాటి కుళ్ళు రాజకీయాల నుండి ఆయన తప్పుకుని ప్రజల మనిషిగా ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తూ మరింత మంచి పేరు తెచ్చుకోవాలని నా వినతి.. ఇంత కంటే వ్యక్తిగతమైన  విషయాలు నాకు తెలియవు.. నాకు అనవసరం కూడా..  

Thursday, May 2, 2013

మహిళా సంఘాలు చేతులు ముడుచుకుని కూర్చుని .....

అపరిచుతుడు, గజని లాంటి సినిమాలు పెద్ద హిట్ నే కొట్టేసాయి.. 


కాని ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అలాంటి మనుషులు ఎవరూ ఈ భూమ్మీద వుండరు.. కాని కొత్తదనం వెంపర్లాడే మన సినిమా దర్శకులు, నటులు ఇలా ఏదో ఒహటి కొత్త దానాన్ని జొప్పించి పాత ప్రేమ కథలనే మార్చి మార్చి కొత్త తరహాలో చూపిస్తారు.. మనం కూడా అలా చూసేసి హిట్ చేస్తాం... తర్కానికి తావులేదు.. ఎంటర్ టైన్ మెంట్ వుంటే చాలు.. 

రాజరిక వ్యవస్థ కూడదు అంటూనే రాజులు రాణులతో తీసిన (అ) చారిత్రిక సినిమాలని మగధీర, అరుంధతి, చంద్రముఖి లాంటి సినిమాలు వంద రోజులు ఆడిస్తాం.. 

నిజమైన విలువలు కల్గిన సినిమాలు కొన్ని అప్పుడప్పుడు వస్తున్నా అవి ఎక్కువ రోజులు ఆడవు వారం రోజులకే వెనక్కి వెళ్ళిపోతాయి..  ఆ మధ్య కృష్ణ , ఆయన కూతురు మంజుల, శ్రీకాంత్ (పోలిస్ ఆఫీసర్) వేసిన "సేవకుడు" సినిమా వచ్చింది.. నాకైతే చాలా నచ్చింది. కాని ఎందుకో ధియేటర్ లో పది మంది కూడ లేరు..

"మిధునం" లాంటి సినిమాలు చాలా వస్తున్నాయి కాని ఇప్పటి జనాలకి (మాస్) ప్రేక్షకుల కి కావలసిన మసాలాలు లేకపోవటం వాళ్ళ కాబోలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి.. 


పెద్ద హీరోలు వున్న సినిమాలు క్రింతం వచ్చిన మూడు నాలుగు సినిమాల మిక్సీ తో కథ, చెంపదెబ్బల కామెడీ లు, హీరో ఒక్కడే వందమందిని లేపెయ్యడం, సుమోలు గాల్లోకి లేవడం వీటికి అలవాటు పడిపోయాం అనిపిస్తోంది..  

నిర్మాతలు ఇతింత కోట్ల బడ్జెట్ తో ఎలా సినిమా తీస్తున్నారు అని ఎప్పుడూ ఆలోచించట్లేదు. నల్ల డబ్బుని తెల్లగా మార్పు చేయడం కోసమో, అన్యాయంగా మర్డర్లు, మానభంగాలు, దోపిడీలు చేస్తూనో సెటిల్ మెంట్లు చేస్తూ ఆర్జించిన కోట్ల రూపాయలు బినామీ పేర్ల తో పెద్ద హీరో లను పెట్టి మసాలా సినిమాలు మన మీదకి వదులుతూ వాళ్ళ ఫాక్ష నిజాన్ని హీరోయిజంగా చూపెడుతూ సమాజాన్ని బ్రష్టు పట్టిస్తూ బాధ్యత లేని,  ఏమాత్రం సామాజిక స్పృహ లేని దర్శక నిర్మాతల పైత్యాన్ని తీస్తే తీసారు. కాని ప్రభుత్వం గాని, ప్రభుత్వ అధికార్లు గాని ఇలాంటి సినిమాలకి పర్మిషన్లు ఇవ్వడం ద్వారా ఇవాళ ఇన్ని మాన భంగాలు, నేరాలు, ఘోరాలు జరగడానికి కారకులు అవుతున్నారు.. 

ఒక ప్రముఖ టి.వి ఛానల్లో గురువారం వచ్చే  కామెడీ షోలో ఖ్యాతి నొందిన సినీ హీరోయిన్, ఒక ప్రఖాతినొందిన  నటుడు పాల్గొంటున్న షోలో ఎన్నో ద్వందార్ధాల మాటలు అవి ఎంజాయ్ చేస్తు సదరు నటీ నటుల కామెంట్లు .. అసలు కుటుంబ సమేతంగా చూడలేని ఇలాంటి ప్రోగ్రామ్ ఎలా ప్రసారం చేస్తున్నారో గవర్నమెంట్ అఫీసర్లంతా నిద్రపోతున్నారా అనిపిస్తోంది.. మహిళా సంఘాలు చేతులు ముడుచుకుని కూర్చుని ఎక్కడైనా రేప్ జరిగితే మాత్రం పోలీసుల్ని, ప్రభుత్వాన్ని తిడుతూ పత్రికల్లో టీ.వీ చానల్లో హడావుడి చేస్తారు..