Sunday, July 28, 2013

"మూర్ఖుడా.. మీ సాగర్ లో అన్ని రాజకీయ పార్టీల (వి) నాయకులు లేరురా.. ...

కొంత మంది పల్లెటూళ్ళ నుండి వస్తున్న ఉద్యోగస్తుల మాటల ద్వారా తెలిసింది ఏవిటయ్యా అంటే ఒక్కొక్క ఓటుకు 2,500 చొప్పున ఒక ఇంట్లో ఇద్దరు వుంటే 5 వేలు ఇచ్చారట.. గుంపుగా ఒకే చోట వున్న కొంతమందికి కలిపి వుంటే  ఒక లక్ష రూపాయలట.. దేనికా నిన్న జరిగిన పంచాయితీ ఎన్నికల్లో...
 ఓ ఈపాటి దానికి ఎవడికి వాడు వాడి సొంత దృశ్య శ్రవణ యంత్రాల్లో మా పార్టీకి ఇన్నివేల మెజార్టీ .. కాదు మా పార్టీ కే ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారు అని పొద్దుటి నుంచి అర్ధరాత్రి దాకా గొంతులు చించుకుని అరుస్తున్నారు..

అందుకే...... 
1. పాకిస్తాన్ లాగ మనకీ మిలిటరీ పాలనో, రాష్ట్ర పతి పాలనో  వస్తే బావుంటుంది. లేదా.
2. చైనా జపాన్ వాడో .. కనీసం బ్రిటీష్ వాడైనా ఆక్రమించేసి దేశాన్ని అభివృధ్ధి పరచాలి.. 
3. సునామీయో ... భూకంపమో వచ్చేసి కుళ్ళు కంపు కొడుతున్న రాజకీయ వ్యవస్థ తో బాటు అవినీతిమయమైన ప్రదేశాల్ని కుప్ప కూల్చేయాలి.. మిగిలిన వారు కొన్నాళ్ళ పాటైనా అవినీతి జోలికి వెళ్ళకుండావుంటారు.. (అని ఎక్కడో చిన్న ఆశ). 
4. కొంత మంది (నేను కాదు) సమ సమాజ నిర్మాణానికి  తుపాకి రాజ్యం రావాలి అంటారు .. వాళ్ళకోసం అలాగ కూడ జరగొచ్చు.. 

ఇంకా... 
"నోర్ముయ్.. ఆపు  నీ చెత్త వాగుడు".. 
"నువ్వెవరు? ఎక్కడ నుంచి మాట్లాడుతున్నవు?"
"నీ అంతరాత్మను .. ఏం.. సినిమాల్లో చూడట్లేదా"..  
"అక్కడ  మనిషి లోంచి మరో మనిషి తెల్ల బట్టల లోనో నల్ల బట్టల లోనో వస్తాడు.. మంచి చెప్పే వాడు తెల్లగా వుంటాడు.. చెడు చెప్పేవాడు నల్లగా వుంటాడు.... ఇంతకీ నువ్వు ఏ టైపు ?".. 
"మూర్ఖుడా .. అంతరాత్మ ఒక్కటే వుంటుందిరా.. చెడ్డ అంతరాత్మ మంచి అంతరాత్మ అని రెండు వుండవు.. "
"మరి నేను చూసిన సినిమాల్లో ఒకే సారి రెండు అంతరాత్మ లు ఒకేసారి చెరో వైపు వచ్చి హీరోనో హీరోయిన్నో కన్ఫుజన్ చేస్తూ వుంటాయి".. 
"ఈ ప్రశ్న మీ సిన్మాలు తీసే దర్శకుల్ని అడుగు.. ప్రస్తుతం నాకు అట్టే టైమ్ లేదు.. చెప్పేది విను.. హాయిగా కాలు మీద కాలు వేసుకుని టిక్కు టిక్కు అని రిమోట్ నొక్కుకొని నీకు (నాకు) ఇష్టమైన చానల్స్ చూడక ఈ బ్లాకు గోల ఏవిట్రా.. ఎవరో ఏదో రాస్తారు.. చదివి ఆ సైటు పీక నొక్కక... నీ కామెంట్ ఒహటి గెలుకుతావు.. మరల దానికి జవాబు ఏమి రాసారో అని ఆ బ్లాగులన్నీ చదువుతావు.. ఇవన్నీ కాక నువ్వేదో దేశాన్ని వుద్దరిస్తున్నట్లు ... అవినీతి రహిత సమాజంకోసం నీ పుచ్చు  సలహాలు...బోడి అవిడియాలు .  

"ఒరేయ్ మూర్ఖుడా.. ఈ స్వతంత్ర భారతదేశం లో ఎన్నికల టైము లో మందు, బిర్యాని, డబ్బు, చీరలు, టి.వీ లు ఆఖరుకి కిరికెట్టు కిట్టులు అన్నీవాళ్లకి  ఉచితంగా వస్తూ వుంటే నీకెందుకురా కడుపు మంట.. 
అన్నీ ఉచితంగా ఇస్తామని హామీలు ఇస్తూ.. పదవిలోకి వచ్చిన వాడు పెద్ద పెద్ద భవనాలు, పడవల్లాంటి కార్లు, పెళ్ళాం తో బాటు వుంచుకున్న దానికి ఒంటినిండ నగలు ఇయన్నీ సంపాదించుకూంటూ వుంటే నీకెందుకురా కుళ్ళు.. 
రాజకీయ పలుకుబడితో వాళ్ళు మర్డర్లు చేసుకుంటారు, కబ్జాలు చేసుకుంటారు.. సెటిల్ మెంటులు చేసుకుని ఏదో పదవిలో వున్నంతకాలమన్నా నాలుగు రాళ్ళు వెనకేసుకుంటారు.. నీకేంటి బాధ.. 
అదేదో సినిమాలో పరాయి నటుడు అన్నట్టు.. "తిన్నామా, పడుకున్నామా.. తెల్లారిందా" . అన్నట్టు వుండాలి.. 

ఇంత చెప్పినా  నీకు జ్ఞానోదయం అవలేదా.. తిన్నగా మీ వూరు రైల్వే స్టేషన్ కి వెళ్ళు .. హైదరాబాద్ కి టికెట్టు కొనుక్కుని  రైలు ఎక్కు.. అక్కడనుంచి హుస్సేన్ సాగర్ కి వెళ్ళు.. బుద్దుడి విగ్రహం కనిపిస్తుంది.. ఆ గట్టు మీదకి చేరుకుని ఓ  దండం పెట్టి  నీళ్ళలో దూకెయ్.. "
- మా విశాఖపట్నం లో సాగర్ లేదా  ఏవిటి...ఆ సాగర్ కి వెళ్ళమంటున్నావ్  .. 
"మూర్ఖుడా..   మీ సాగర్ లో అన్ని రాజకీయ పార్టీల (వి) నాయకులు లేరురా.. ... 
అన్నట్టు ఒరే దూకే ముందు 
"జై తెలంగాణ" అని రెండు సార్లు, "జై సమైక్య ఆంధ్రా" అని రెండు సార్లు, "జై రాయల తెలంగాణా" అని రెండు సార్లు అరిచి మరీ దూకు.. 
చచ్చిన తరువాత అయినా బోల్డు పబ్లిసిటీ, సింపతీ పెరుగుతుంది నీ మీద .. 
ఈడు మావోడు అటే కాదు మావోడు అని ఓ రెండ్రోజులు కొట్టుకు చస్తారు ఈ దృశ్య శ్రవణ యంత్రాల సాక్షిగా.. 
ఏటి ఇలా చెయ్యడం తప్పనా  నీ అనుమానం .. ఇదే మాట డిల్లీ లో వున్న పెద్దలని అడుగు..సన్నాసీ.. ఈ మంత్రం తోనే 2014 లో రాహుల్  ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న  సీను కళ్ళకి ఎదురుగా కనిపిస్తుంటే ఇంకా అనుమానం ఏట్రా నువ్వు దూకుతావా .. తోసీ మంటావా.."


No comments:

Post a Comment