Friday, August 16, 2013

నా (ఆంధ్రా) కారుమీద భద్రాచల(తెలంగాణా) రాముడు

వరుసగా నాలుగు రోజులు సెలవులు కదా ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వేద్దామని అనుకున్నాం .. కాని ఈ బంద్ లు రాస్తా రోకో ల వలన సాహసం చెయ్యలేదు.. పైగా కారు కొత్తది, ఇంకా ఫస్ట్  సర్వీసింగ్ కూడా అవలేదు..  
అసలు వయా రాజమండ్రి (ర్యాలీ) , భద్రాచలం కారులో వెళ్దామని ఎన్నాళ్ళ బట్టో  కోరిక.. ఎప్పటికి తీరునో .. 
ఇప్పుడు సమ్మె వలన హోటళ్ళు బంద్  అయి తిండి కూడా దొరకదేమో అని ఆలోచించాము. 

"రామా ! భద్రాచల రామా!  త్వరగా ఈ సమ్మెలకు ఫుల్ స్టాప్ పెట్టి నీ దర్శన భాగ్యం కలిగించు  తండ్రీ "   అని రాముణ్ణి వేడుకుని ఈ సారికి  శ్రీకాకుళం బయలుదేరాం.. పంద్ర ఆగష్టు పుణ్యమా అని దార్లో టిఫిన్ సెంటర్లు అన్ని బంద్. . సరే ఒక చోట ఒక పుణ్యవతి ధర్మమా అని టిఫిన్ దొరికింది..(హోటలే గాని పూర్వకాలం పూట కూళ్ళమ్మ గుర్తుకు వచ్చింది)..  

శ్రీకాకుళం లో ఓ పావుగంట రోడ్డు రోకో లో చిక్కుకుని ముందుగా అరసవిల్లి సూర్యనారాయణ మూర్తిని దర్శించుకున్నాం. బంద్ ల పుణ్యమా అని గుడి ఖాళీ గా వుంది.. పైగా అలంకరణ సామగ్రి అంతా తోమడానికి తీసేసారు.. దాంతో నిజరూప దర్శనం అయ్యింది చక్కగా.. కెమెరా కారులో వుండి పోయింది.. ఇక్కడ (గుడి బయట) ఫుటోలు తియ్యలేదు.. 


అక్కడనుంచి శ్రీకూర్మం వెళ్ళాం. మన భారతదేశం లోనే కుర్మావతారం లో వున్న  వైష్ణవ ఆలయం ఇదొక్కటే (అట). ఇక్కడ కూడా చక్కగా మనకి కావలసినంత సేపు దర్శనం చేసుకుని, బయట గోపురానికి, శిల్పాలతో వున్న స్థంభాలకి  ఫుటోలు తీసుకుని ఆలయ అభివృధ్ధిని వీక్షిస్తూ బయటికి వచ్చాం.. 

 
శ్రీకూర్మం ఫుటోలు చూడండి..  
 దార్లో మా కారు ఫొటొ చూడండి.. 
 


చూసారా .. నా (ఆంధ్రా) కారుమీద భద్రాచల(తెలంగాణా) రాముణ్ణి ఎలా బంధించానో.. కారు మీదే కాదండోయ్ మా పూజామందిరంలో ఎప్పట్నుంచో నిజరూప దర్శనంలో  కొలువై వున్నాడు.. 

జై తెలంగాణా. జై సమైక్యాంద్రా .. బాబోయ్ నాదీ రెండు కళ్ళ సిద్దాంతమే .. కాని ఇక్కడ అక్కడ చల్లగా వుండాలని కోరుకునే సిద్ధాంతం.. చిచ్చు పెట్టే సిద్ధాంతం కాదు.. 

మన వెధవాయిలు అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృధ్ధి చెయ్యడం మానేసి, అభివృధ్ధి పేరుతో హైదరాబాద్ లోనే కాదు దాదాపు అన్ని పట్టణాలలో ప్రభుత్వ  భూములన్నీ లాక్కుని ప్రైవేట్   పరం చేసేసారు..

జిల్లాలలో పేదరికం అలాగే వుంది అంతటా..  సహజంగానే తిరగబడే మనస్థత్వం తెలంగాణా లో ఎక్కువ కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారు.. కాని అక్కడ వచ్చిన విప్లవం అన్ని ప్రాంతాల్లోనూ రావాలి.. సామాన్య ప్రజల్లో చిచ్చు రేపుతూ నాయకులు బాగానే వున్నారు.. 

మీకు గుర్తుందో లేదో చైనా లో 1989 లో వచ్చిన తియన్మాన్ స్క్వేర్ లో విద్యార్ధులు, ప్రభుత్వ వుద్యోగులు అప్పటి పాలనపై చేసిన ఉద్యమం ఇక్కడ మనకీ రావాలి అన్ని ప్రాంతాలలో..అప్పుడే మన భారత దేశం కూడా నాయకత్వ మార్పు వచ్చి ,ఈ వంశ పాలన రోజులు పోతాయని నా గట్టి నమ్మకం.  
ఏవంటారు ?  ఇలా మీలో మీరు గొణుక్కోవడం  కాదు .. బయటకి కక్కేయండి..  

Saturday, August 3, 2013

మన సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యత..

ఎవరు అవునన్నా కాదన్నా హై టెక్ సిటీ డెవలప్ అయింది చంద్ర బాబు హయాం లోనే (ఆయన నా చుట్టం, బంధువు కాదు.. నాకు తెలుగు దేశానికి ఏ సంబంధము లేదు అన్ని పార్టీలు  సమానమే) .. .. అభివృద్ధి అంటే ఇంతకు ముందు వున్న దాని కంటే వున్నతంగా వుండం.. (దాని అర్ధం అంతకు ముందు ఐ.టి కంపెనీలు లేవని కాదు..)
2. ఐ.టి రంగం అన్ని ముఖ్య పట్టణాలలో వున్నా బిల్ గేట్ ని హైదరాబాద్ కి తీసుకుని వచ్చిన ఘనత మనదే.. (కొన్ని వాత్సవాలు మనం ఒప్పుకుని తీరాలి)..
ఒక తెలుగు వాడు స్థాపించిన కంపెనీ అమెరికా లో వున్నత వాణిజ్య పధంలో ఒక్కటిగా నిలిచింది.. ఎంత గర్వ పడాలి మనం..
3. గడచిన పది ఏళ్ళలోనే హైదరాబాద్ గణనీయంగా అభివృద్ధి చేందింది.. ఆ డబ్బు అన్ని జిల్లాల వారి పన్నుల రూపంలో కట్టినవి.. హైదరాబద్ లో వున్నన్ని ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు వేరే ఎక్కడన్నా వున్నవా.. మెట్రో రైల్ సిస్టం వుందా.. ఇవన్నీ ఆంధ్ర ప్రదేశ్  ఏర్పడక ముందు వున్నవా..
4. తిట్ల భాషను వాడడం తెలంగాణా సంస్కృతి కాదు అని అన్నాను... మా సంస్కృతి అదే .. కాదనడానికి మీరెవరు? అని అంటే నేను ఏమీ చెప్పలేను..
5. ఇరానీ చాయ్ తాగొద్దని, బతుకమ్మ ఆడటానికి వీలులేదని ఏ అంధ్రా వాడు అయినా అన్నాడా? అలా జి.వో పాస్ అయ్యిందా? మీతో బాటు మేమూ ఇవన్నీ అనుభవిస్తున్నాం ..హోలీ ఆడుతున్నాం.. పానీ పూరీలు, జొన్నరొట్లు ఇప్పుడు ప్రతీ తెలుగు వాడు తింటున్నాడు అన్ని ప్రాం
తాలలోనూ.. హైదరాబాద్ దం బిర్యానీ, ఇరానీ చాయ్  అన్ని ప్రాంతాలలోనూ అమ్ముతున్నారు.. ఇక మీకు మితండ వాదన తప్ప ఏవీ లేదు.. అడ్డగోలు కె.సీ.ఆర్ మాటలు పట్టుకుని వేలాడకండి.. 

అమెరికాలో వున్నా తెలుగు వాడు తన సంస్కృతిని కాపాడుకుంటు వుంటే ఇక్కడ మిమ్మల్ని అవన్నీ చెయ్యొద్దని ఎవరు అన్నారు.. మన సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యత..
6. నాలుగు వందల ఏళ్ళ పరాయి పాలనలో భారత దేశం మగ్గి
నా, మన సంస్కృతి మూలాలు ఎక్కడా చెడిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నాం.. మన పండగలు ఎక్కడికీ పోలేదు.. సంప్రదాయాలు ఎక్కడికీ పోలేదు.. 

7. ఏదైనా పండగ వస్తే హైదరాబాద్ కర్ఫూ ఏర్పడినట్లు రోడ్లన్నీ ఖాళి
అయిపోతాయి.. తెలంగాణా కోడలైన ఆంధ్రా ఆడపిల్ల, తన మొగుడితో, పిల్లలతో పుట్టింటికి వెళి పోతే (vice verse)  హైదరాబాద్ ఖాలీ అయిపోతుంది.. ఇప్పుడు ఈ విభజన పేరుతో ఎన్ని కుటుంబాల్లో చిచ్చు రేపి ఎంతమంది మొగుడూ పెళ్ళాలని విడగొడతారు.. ? 
8. పంచవేణీ సంగమం (అన్ని భాషల సమాహరం కాస్మోపాలిటన్ సంస్కృతి నుండి ఒక్క తెలుగు వారిని  మినహాయించద్దని మనవి).. 

Friday, August 2, 2013

చైనా విప్లవ పంధాలో పయనిస్తారేమో

1. రాజకీయ డ్రామాలో పావులుగా మారాము మనము.. అంధ్ర ప్రదేశ్  అంతటా  అన్ని సీట్లు రావడానికి ఈ విభజన నాటకానికి కాంగిరేసు తెరతీసింది.. 

2. నాది రెండు కళ్ళ సిద్దాంతం అని బాబు ఎప్పుడో చెప్పి అక్కడా ఇక్కడా తమ్ముళ్ళ  చేత హై  డ్రామా నడిపిస్తున్నాడు... 

3. కాంగిరేసు ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కరాచ ఇప్పుడు కాంగిరేసు లోకి దూరేలా ఒప్పందం చేసుకుని ఈ డ్రామాకి కొత్త రంగు పూసాడు.. 

4. ఏమీ తెలియని అమాయకులు లాగ సీమాంధ్ర నాయకులు కొత్తగా పాత రాజీనామాల డ్రామా ని మొదలు పెట్టారు.. 

5. ముఖ్య నాయకుడు జైలులో వున్నా వై. ఎస్స్. ఆర్. పి. గోడ మీద పిల్లిలాగా వ్యవహరించి ఆచి తూచి అడుగులు వేస్తోంది.. కోట్ల కొద్దీ డబ్బు వుంది.. అది అరిగేదాకా ఇలా అరుస్తూనే వుంటారు.. 

6. గోతి కాడ గుంట నక్క ల లాగ బి.జే.పీ వాళ్ళు కాచుకుని వున్నారు..కాంగిరేసు  ఫేల్యూర్ అయినా మార్కులు కొట్టినా అది తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వ్యూహాలు పన్నుతున్నారు. 


అసలైనా డ్రామా ఇంకా ముందు వుంది.. ఎన్నికలు వచ్చేక చూడండి..  తెలంగాణా, సీమాంధ్ర  ప్రజలు నాయకుల మాటలు నమ్మి మోసపోతున్న వైనం నమ్మే రోజులు దగ్గర పడ్డాయి.. ఇరు ప్రాంతాల ప్రజలు సంయమనం పాటించి అసలు ఎన్నికలనే బహిష్కరించేలా ఒక విధమైన చైనా విప్లవ (విద్యార్ధులు, ఉద్యోగులు, కార్మికులు చేసిన ఉద్యమం) పంథా లో పయనిస్తారేమో నని నాకు అనిపిస్తోంది ..