Saturday, November 16, 2013

నా మనసులో అనుకున్నది వెంటనే జరిగినది..


ఎప్పటినుంచో సచిన్ తెండూల్కర్ కి భారత రత్న ఇవ్వాలనే డిమాండు తెరమీదకి వచ్చింది గాని..
నిన్నా మొన్నటి పత్రికలలో ఎక్కడా నామమాత్రం గా గాని 
ఆ ప్రస్తావన రాలేదు.. 

కాని మొన్నటి నా పోస్ట్ లో (14/11/2013) ఇలా రాసాను:


"అందుకే ప్రతిష్టాత్మక మైన భారతరత్న బిరుదు 
అతనికి రావాలని కోట్లమంది ప్రజల ఆకాంక్ష.. 
సర్కారు వారు ఇవ్వకపోయినా ప్రజలు ఇచ్చేసారు.. 
ఇహ లాంఛనప్రాయమే.." 


నా మనసులో అనుకున్నది వెంటనే జరిగినది.. ప్రభుత్వం వారి నుండి ఇలా ప్రకటన వస్తుంది అని ఎవరూ ఊహించలేదు.. దానిపై పత్రికలలో రాలేదు.. "భారత రత్న" అవార్డు శ్రీ సచిన్ కి ఇవ్వడం అందునా మొదటిసారిగా   క్రీడాకారులకి ఇటువంటి ప్రతిష్టాత్మక అవార్డు ఇవ్వడం ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయం.. కంగ్రాట్యులేషన్  టు సచిన్ అండ్ ఆల్ ద ఇండియన్స్ .. 
అలాగే భారతరత్న అందుకోబోతున్న శ్రీ. సి.ఎన్.ఆర్ .రావు గారికి కూడా..      

ఒకవేళ పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే మనమూ మునిగిపోతావేమో..సీతా దేవి: స్వామీ! ఈ తెలుగు భక్తులకు మీమీద ఎంత ప్రేమ.. పరమ పవిత్ర భద్రాచలం మాది అంటే కాదు మాదీ అని ఎంత పోరాడుతున్నారు..

రామయ్య: పిచ్చిదానా..వాళ్ళు  కొట్లాడుకుంటున్నది   నీకోసమూ నాకోసమూ కాదు   భద్రాచలం గుడి మీద ప్రేమకోసమూ  కాదు... గోదావరి మీద హక్కు కోసం.. పోలవరం ప్రాజెక్టు కోసము..   

సీతా దేవి: అవును స్వామీ ఒకవేళ పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే గుడి మునిగిపోయి.. మనమూ మునిగిపోతావేమో.. 


రామయ్య: మనం మునిగితే ఎవడికి కావాలి మునగక పోతే ఎవడికి కావాలి.. అసలు ఈ గుడికి ప్రత్యామ్నాయంగా వేరొక చోట గుడిని కట్టి మనల్ని అక్కడకి చేర్చే ఆలోచనే ఇంతవరకూ రాలేదు వాళ్ళకి.. 

సీతమ్మ: మరి ఎవరో ఒక పెద్దాయన..మాకు ఏ దేవుడూ వద్దు భద్రాచల రామయ్యే మాకు ముద్దు అని చెప్పాడే.. 

రామయ్య: ముందే చెప్పానుగా వాళ్ళ ప్రేమ గోదావరి మీద అని.వాళ్ళకి వారి సోదరులమీదే ప్రేమ లేనప్పుడు ఎక్కడో అయోధ్యలో పుట్టిన నార్త్ ఇండియా వాణ్ణి నా మీద ఎందుకు వుంటుంది.. 

సీతమ్మ: మన గుడి కట్టిన కంచెర్ల గోపన్న వారి ప్రాంతం వాడట..భక్త పోతన కూడా ఆ ప్రాంతం వాడేనటా.. అందుకే మీ మీద హక్కు వారికేనట కదా.. 

రామయ్య: వారి కాలంలో ఇలా వేరువేరు ప్రాంతాలుగా కాకుండా ఒకే ప్రాంతం అన్న భావనలో వున్నారు.. అందుకే వారి భక్తి గీతాలను తెలుగు వారు అందరూ కలిపే పాడుతున్నారు.. 
ఇన్నాళ్ళు భద్రాచల రాముడు అందరి వాడే అన్న భావం లో వున్నారు..
కానీ శకుని వారసులు కొంతమంది అన్నదమ్ముల మధ్యలో చిచ్చురేపి అన్ని వర్గాల ప్రజలలో విషబీజాలు నాటి వందల సంవత్సరాలుగా ఇక్కడి వారిని అక్కడ అక్కడి వారిని ఇక్కడ సంబంధాలు సైతం కలుపుకుని పోయి విడదీయరాని సంబంధ బాంధవ్యాలు కలిగివున్న రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్నారు... ఇది కలియుగ ధర్మం తప్ప మరేమీ కాదు.. 

సీతమ్మ: మరి దీనికి పరిష్కారమార్గం.. 

రామయ్య: ఇప్పటికి పదేళ్ళుగా ఈ ప్రాజెక్టు కడుతునే వున్నారు... 
ఒకపక్క పొరుగు రాష్ట్రాల వాళ్ళ గొడవ ఎలాగూ వుంది...  
అది పూర్తి అయ్యేదెప్పుడు..మనం మునిగేది ఎప్పుడు... చూద్దాం.. 
మనల్ని ముంచడానికి అయినా వాళ్ళలో సఖ్యత వుండాలిగా.. 
ఈ రాష్ట్ర ప్రజలందరి సుఖసంతోషాల కోసం మనం మునిగినా పర్వాలేదు.. ద్వాపర సముద్రంలో మునిగిన చందాన..     

సీతమ్మ:  ప్రజల్ని పీడిస్తున్న పాలకుల నుండి వాళ్ళకి విముక్తి ఎప్పుడు స్వామీ..రామయ్య: పరిత్రాణాయ సాధూనాం.. వినాశాయ చ దుష్కృతాం 
                ధర్మ సంస్థాపనార్ధాయ సంభవాని యుగే యుగే.. 

అంతదాకా వేచివుండు దేవీ..    

Thursday, November 14, 2013

డాక్టరూ కాలేదు .. యాక్టరు అవలేదు.. కానీ దేవుడయ్యాడు ..

 అతను ఏనాడూ స్కూల్ కి వెళ్ళలేదు.. కాలేజీ మెట్లను ఎన్నడూ ఎక్కలేదు..

డాక్టరూ కాలేదు .. యాక్టరు అవలేదు..

కానీ దేవుడయ్యాడు ..
మహా మనీషిగా ఎవరెష్టు శిఖరమంత 
ఎత్తుకి ఎదిగాడు.. 


అతను మెలవుకువగా వున్నా.. నిద్రపోయినా..
కనిపించేవి మూడు కర్రలు..
అవి పడిపోకుండా కాపాడుటయే అతని కర్తవ్యం.

ఊహ తెలిసినగ్గరనుండి అడుగున్నర చెక్కముక్కే ఆయుధం.. 
దాంతో గుండ్రని వస్తువుని గాల్లోకి కొట్టడమే విద్య.. 
పట్టుదల..ఏకాగ్రత..కసి..వెరసి విశ్వ విజేత 

క్రీజులో నిలబడ్డ యోధుడు
ప్రత్యర్ది ఎంత బలవంతుడయినా 
అదే ధైర్యం.. అదే వీరోచితం..


ఒక్కడు కొడితే పదిమందీ మైదానంలో 
అట్నుంచి ఇటు ఇట్నించి అటు పరుగులెత్తి అలసిపోవలసిందే..

కళాత్మకం అయిన బ్యాటింగ్ ను చూసి ప్రత్యర్ధులు కూడా 
నోరు వెళ్ళబెట్టవలసిందే.. చప్పట్లు కొట్టవలసిందే.. 

అతను ఉన్నంత సేపూ కన్నార్పకుండా చూసే జనం..
అతను అవుటు అయిపోగానే టి.వీలను కట్టేయ వలసిందే..

అతను సెంచెరీ చేస్తే తానే సెంచెరీ చేసినంతగా 
సంబరపడిపోయాడు ప్రతీఒక్క భారతీయుడు..
ఒకవేళ మొదటి ఓవర్లోనే డక్కౌట్ అయినా 
ఎన్నడూ అతన్ని నిందించలేదు జనం. 
నెక్స్ట్ టైం బెటర్ లక్ అని సర్దుకుని పోయారు.. 

అతనికి ఇదే ఆఖరు మాచ్.. కానీ జనం గుండెల్లో కాదు ఆఖరుది..

జనానికి ఇతడిపై ఎందుకు అంత ప్రేమ..
కేవలం అతని ఆటకే దాసోహం అయ్యారా.. 
కాదు అతని వినయానికి.. సంస్కారానికి.. 
మచ్చలేని అతని వ్యక్తిగత జీవితానికి.. 
సెంచరీ అయిపోగానే శిరాస్త్రాణం తీసి..
ఆకాశంలో వున్న నాన్నకి అంకితం చేసిన అతని తీరుకి.. 

మన భారతానికి కోహినీరు వజ్రం లాంటి సంపద  
అని పొంగిపోయారు భారతీయులంతా..

అందుకే ప్రతిష్టాత్మక మైన భారత రత్న బిరుదు 
అతనికి రావాలని కోట్లమంది ప్రజల ఆకాంక్ష.. 
సర్కారు వారు ఇవ్వకపోయినా ప్రజలు ఇచ్చేసారు.. 
ఇహ లాంఛనప్రాయమే.. 

ఇంత వరకూ ఏ క్రికెట్టు వీరుడికీ దక్కని గౌరవాలు అతని సొంతం... 

అతనే .. సవ్యసాచి - సచిన్ తెండూల్కర్.. 

ఓ వీరుడా ..నీకు లేదు విరామం... 
విడవకు నీ అనుబంధం ..బ్యాటుతో.. 
ప్రజల ఆదరాభిమాలతో కొనసాగించు నీ భావి జీవితం.. 

అందుకే నీకు లేదు వీడ్కోలు..
అందుకో మా ప్రేమాభిమానం...
ఈ భువిపై జీవి వున్నంతవరకు.. 
   
(బెట్టింగు మాయలో పడిన యువ కిరికెట్టు  వీరులలో
ఎవరు నిజమైన వీరులో తెలియని అయోమయంతో 
జనం ఇక రేపట్నించి కిరిక్కెట్టు అనబడే ఈ ఆటను ఎవరూ చూడరు..) 
Sunday, November 10, 2013

బొచ్చు పెదపిచ్చయ్య గారి సన్మాన కార్యక్రమం

నాకు ఏ.వి.ఎస్ గారి సినిమాల్లో కామెడీ కంటే సినిమా వాళ్ళ  ఫంక్షన్ "మిఠాయి పొట్లాం" లో గుండు హనుమంతరావు (బొచ్చు పెదపిచ్చయ్య) గారి సన్మాన కార్యక్రమం చాలా బాగా నచ్చింది.. నవ్వి నవ్వి కడుపు చెక్కలయ్యేటట్టు గా వుంటుంది.. మీరు కూడా ఈ కిందన ఇచ్చిన యూ టూబ్ లింక్ ద్వారా చూడండి.. 

ఒక నటునిగా ఆ మహా నటుడుకి నీరాజనాలు అర్పించుకుంటూ..    

http://www.youtube.com/watch?v=PcfPIAunzGM

Saturday, November 2, 2013

పెళ్ళికాని ప్రసాదు వింత అనుభవం -part 2

ప్రసాదునకు మరొక అనుభవం ఇంతకు ముందు జరిగింది... 

మనవాడు వుద్యోగంలో  సెలక్టు  అయి పోస్టింగ్ ఆర్డర్ చేతిలో పట్టుకుని తాను జాయిన్ కావలసిన సంస్థ ఎడ్రస్ పట్టుకుని బయలుదేరాడు.. 
అతను వుంటున్న జిల్లాకి పక్క జిల్లాలో పోస్టింగ్ తగిలింది.. 
ఒక్కడూ కొద్దిపాటి బట్టల బ్యాగుతో బయలుదేరాడు.. 
సదరు జిల్లాలొ ఒకానొక టౌన్ కి 80 కి.లో మీటర్లు వున్న మారుమూల ప్రాంతం..
మనవాడికి   వుద్యోగాన్ని ఇచ్చిన  ఫ్యాక్టరీ ఆ వూరిలో వుండడం వలన ఫాక్టరీకి 10 కిలో మీటర్ల దూరంలో వున్న కేంప్ ఆఫీసుకి వెళ్ళాడు.. 
అక్కడ ఇ.ఇ గారికి జాయనింగ్ ఆర్డర్ సబ్మిట్ చేసి మరల తనకు కేటాయించిన ఫీల్డ్ ఆఫీసులో పనిచేయాలి..

ఫ్యాక్టరీకి దూరంగా వున్న ఆ కాంప్ ఆఫిసు చుట్టూ కొన్ని సిబ్బంది క్వార్టర్లు తప్ప ఏవీ లేవు.. కాని ఈ విషయం తెలియని మన హీరో ప్రసాదు.. అక్కడ ఏవైనా తినడానికి దొరుకుతుందిలెమ్మని ఏవీ తినకుండానే సుమారు 12 గంటలకు అక్కడకు చేరుకున్నాడు.. 

అక్కడ టైము కీపర్ ఒకాయన, ఆఫీసు కనిపెట్టుకుని వుండే ఆడ ప్యూను (కం) స్వీపర్ (కం) కీపర్ తప్ప ఎవరూ లేరు.. ఇ.ఇ గారు లంచ్ కి వెళ్ళిపోయారని మరల సాయంత్రం 4 గంటలకు గాని రారని సదరు టైము కీపర్ గాడు- తాను కూడా లంచ్ కి ఇంటికి వెళ్ళిపోతున్నానని ..
అదిగదిగో ఆ ఎదురుగుండా కనిపించే అరటి చెట్టు వున్న ఇల్లే తన ఇల్లని చెప్పి వెళ్ళిపోయాడు.. 

తాను ఏవీ తినలేదని నేరుగా ఇక్కడకి వచ్చిసానని తెలిపినా అతడు మాట వరసకైనా తన ఇంటికి రమ్మని పిలవనందుకు లోలోన కుమిలిపోయాడు... ఆకలి వేస్తోంది గాని తినడానికి గాని తాగడానికి గానీ ఏవీ దొరకని ప్రదేశంలో వచ్చిపడ్డాడు... ఆ టైము కీపర్ గాడు వెళ్ళిపోతూ ఓ వుచిత సలహా కూడా ఇచ్చాడు - ఇ.ఇ గారు వచ్చేలోగా 10 కి.మీ దూరంలో వున్న ఫాక్టరీ వున్న చిన్న టౌన్ ప్రంతానికి వెళ్ళి ఏమైనా తినేసి 4 గం కల్లా తిరిగి వచ్చీమన్నాడు.. 
10+ 10 = 20 కి.మీ దూరం..వెళ్ళిరావడానికి ఇప్పటిలాగ ఆటోలు గాని ఏ ఇతర రవాణా సౌకర్యాలు గాని లేవు..ఈ క్వార్టర్లలో వున్నవాళ్ళకి ఎవరి సొంత వాహనం వారికి వుంది..లేదా షిఫ్ట్ నకు ఒకసారి మాత్రమే తిరిగే వాను ఒకటి వుంటుంది.. ఇంతకు తప్ప రవాణా సౌకర్యం లేదు..
అప్పుడప్పుడు ఇటు అటూ తిరిగే పెద్ద ఆంబులన్స్ లో ఆ డ్రైవర్ ని బతిమాలి కొంతమంది ఆడవాళ్ళు అందులో కూరుకుని వెళుతూ వుంటారు..అదీ ఆ డ్రైవర్ ఒప్పుకుంటేనే..లేకపోతే లేదు..

ఒక్కడూ ఇ.ఇ రూము లో కూర్చున్నాడు మన ప్రసాదం..ఇందాక చెప్పిన ప్యూను అనబడే మగవాడిలాగ కనబడే ఆడ లేడీ ఎదురుగా బల్లమీద వచ్చి కూలబడినది.. మనిషి నల్లగా తుమ్మమొద్దులాగ వుంది...కాని దృఢమైన ఆకారం అంటే బలసిన ఒళ్ళు అనమాట.. బహుశా మూడు పదులు నిండాయేమో. మనిషి నలుపైనా ముఖం అందంగా నే వుండి ఆకర్షణీయంగా వుంది..భర్త చనిపోవడం వలన కాబోలు ఈ క్లాసు ఫోరు వుద్యోగం ఇచ్చి కంపెనీ "అన్నివిధాలా" ఆదుకుంది.. 

ముందు కుసల ప్రశ్నలు వేసింది " ఏ వూరు బాబూ ?" అంటు మొదలు పెట్టి ప్రాధమిక విషయాలన్నీ లాగేసింది....

వేసవి కాలం అవడం వలన చెమట దానికి తోడు వుక్కపోత... తన పైట చెంగు తీసి గాలికోసం విసురుకున్నట్టు విసురుకుంటూ కాస్త ముందుకి వంగుతూ తన కున్న మేని అందాలను బహర్గితం చేస్తోంది.. 

ఇవేమీ ప్రసాదుకు పట్టినట్టు లేదు.. ఈ టైములో ఇక్కడ ఇలా ఇరుక్కుని పొయానేవిటబ్బా అని తిట్టుకుంటూ కనీసం మాటవరసకి అయినా తన ఇంటికి పిలవని ఆ టైము కీపర్ గాణ్ణి తిట్టుకుంటున్నాడు.....

ఇక్కడ ఈమె లొడ లొడా ఏవిటేవిటో చెప్పుకుపోతోంది.. రోజూ ఇ.ఇ.గారు.మిగిలిన స్తాఫ్ అంతా లంచ్ కి ఇంటికి పోతారని తాను  ఒక్కర్తీ మాత్రమే  ఇక్కడ ఒంతరిగా వుంటానని...మరొక నాలుగు గంటలదాకా ఎవరూ రారని...ఏవైనా  కావలిస్తే అడగమని ఇలా ఇండైరెక్ట్ గా తనలోని కోర్కెను బయటపెడుతోంది... 
ఇక్కడ అతడు ఆమే తప్ప పిట్టమనిషైనా కానరాలేదు... 

ఇద్దరిలోనూ ఆకలే.. ఆమెది ఒకరకమైన ఆకలి అయితే అతడిది వేరొక ఆకలి...

ఈవిడ ఇచ్చె సిగ్నల్స్ అర్ధం చేసుకోని అమాయకుడేమీ కాదు మన హీరో..కాని ఇంతవరకూ చదువుమీద ధ్యాస తప్ప అన్య భావన లేని కుర్రాడు అతను..తల్లితండ్రుల సంస్కారవంతమైన పెంపకంలో ఇంతవరకూ ఎట్టి వ్యసనాలకు గాని స్త్రీల పట్ల అగౌవరంగా గాని ప్రవర్తించ లేదు..

అందువలన ఎటువంటి మనోవికారానికి లోను కాలేదు..ఆమెని పరీక్షగా చూసాడు తనకంటే సుమారు పదిఏండ్లయినా పెద్దది..పైగా కారునలుపు.... కాని ఆమె మాటకారితనం, ఆప్యాయత చూసి ఆ టైముకీపర్ గాడికన్నా ఈవిడే నయం అని అనుకున్నాడు... 

తనకు వచ్చీరాని ఇంగిలీషు ముక్కలను తన యాసతొ పలుకుతూ తనని ఆకర్షించడానికి ప్రయతిస్తున్నా ఆమెను చూసి మొదటి సారి ఒక అపరిచితురాలు ఇంత కలుపుగోరుతనంగా మాట్లాడుతున్నందుకు మొదట బిడియపడ్డా.. ఆమె దురవస్థకు జాలి, భర్త లేని ఆ యువతి పట్ల సానుభూతి కలిగాయి.. 
కాని దేవత సినిమాలో సావిత్రి చూసి సావిత్రి లాంటి వున్నత స్త్రీ భార్యగా దొరకాలని భావించే వేలమంది యువకుల్లో ఒకడిగా వుంటూ తనుకూడా పెళ్ళివరకూ ఎటువంటి పొరపాట్లు చెయ్యకుండా శీలవంతునిగా వుండాలని కంకణం కట్టుకున్నాడు...(దీనికీ ఒక కథ వుంది..తరువాత చెప్పుకుందాం)..

ఇలా కాలం గడుస్తోంది.. ఆమె మాత్రం కుర్రాడు ఎర్రగా బుర్రగా వున్నాడు... ఇన్నాళ్ళూ చదువు సంస్కారం లేని డ్రైవర్ వెధవలు తనలోని వేడిని తగ్గిస్తున్నా ఇలాంటి చదువుకున్న ఎర్రగా వున్నకుర్రాడు పైగా పట్నం వాసపోడు ఈడుగా దొరికాడని సిగ్నల్ ఇస్తూనే వుంది..

తన ఓటమి అంగీకారంగా కుర్రాడు తలదించుకున్నాడు.. తను ఇలాంటి వాడు కాదు అనితెలియచేసే విధంగా.."అమ్మా.. నువ్వు ఇక్కడ బల్లమీదే పడుక్కో..నేనో సారి అలా బయట కాస్త తిరిగి వస్తాను" అని అక్కడనుండి మెల్లగా బయటపడ్డాడు... కాని నిరాశతో కూడిన ఆమె చూపులు వెంటాడాయి...చేసేదేమీ లేక వుస్సూరుమని బల్లమీద మేను వాల్చింది..

కాని అక్కడే ప్రసాదు గ్రహించలేని విషయం జరిగింది..
తాను నల్లగా వున్నా దృఢమైన శిల్పంతో నిగనిగలాడిపోయే తనంటే పడిచచ్చిపోయే మగాళ్ళూ వుండగా తన కోర్కెను కాదన్నందుకు ఆమె ప్రసాదు మీద పగతో రగిలిపోయింది...  

అందుకు ప్రతిగా ఏవిచేసిందీ అన్న విషయం తరువాయి భాగంలో ...

ఎందుకంటే లెంత్ ఎక్కువయ్యింది అని కట్ చేసా...  
యండమూరి వారి సీరియల్ లాగ ఆమె ఏమి చేసివుంటుందో అని మీలో ఆశక్తిని కలిగించవచ్చు..... 

అబ్బో పెద్ద రైటర్ ని అయినంత ఫీలింగ్ అప్పుడే వచ్చేసిందండోయ్..    

ఏవంటారు???

Friday, November 1, 2013

పెళ్ళికాని ప్రసాదుని వింత అనుభవం

 (కథ కొంచెం పెద్దదే అయివుండవచ్చు కాని చదివి మీ అభిప్రాయం చెప్తారని ఆశతో..) 

వర ప్రసాద్ ఒకానొక సంస్థలో సివిల్ సూపర్ వైజర్ గా పనిచేసేవాడు..ఆ సంస్థ ఆధీనంలో కొన్ని నిర్వాసిత కాలనీలు వున్నాయి..వాటి నిర్వాహణ బాధ్యత ప్రసాదు పనిచేసే సివిల్ డిపార్టుమెంటు వారిదే.. 

అందువల్ల సదరు వరప్రసాదు వృత్తి లో భాగంగా   రోజూ కాలనీలో కలియతిరిగి  సదరు కాలనీల్లో సివిల్ సమస్యలు ఏవైనా వుంటే గమనించి వాటిని రిపైర్స్ చేయిస్తాడు.. 
ఈ క్వార్టర్లలో ఆ సంస్థలో పనిచేసే వుద్యోగస్తుల నివాసం   వుంటారు.. వాళ్ళతో బాటు సంస్థ రక్షణ విభాగం లోని జవాన్లు కూడా నివాసం వుంటారు కుటుంబాలతో. 
వారు ఎక్కువగా వుత్తర భారతంలోని ఏ గుజరాత్ వాళ్ళో, పంజాబీలో అయివుంటారు..ఆ జవాన్ల వాళ్ళ ఇండ్లు కాలనీకి చివరన వుండి ప్రత్యేక వాతావరణం లో వుంటాయి.. అక్కడ వుత్తర భారత దేశపు వాతావరణం కనిపిస్తుంది.. తెలుగు కాకుండా హిందీ, మరాఠీ, పంజాబీ భాషలన్ని కలబోసి అలరిస్తాయి.. ఆడవారి అలంకరణ కూడా విభిన్నాంగా వుండి ప్రసాదు లాంటి యువకులకి ఆకర్షణీయంగా వుంటుంది.. 
పనున్నా లేకపోయినా ప్రసాదు లాంటి సూపర్వైజర్లు ఒకటికి పదిసార్లు ఈ ఇండ్ల చుట్టు ప్రదిక్షణలు చేస్తూ వచ్చీరాని హిందీలో వాళ్ళని సమస్యల గురించి అడుగుతూ యువతలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు.. 

సాధారణంగా రిపైర్ పనులకు వచ్చే సిబ్బందితో మామూలుగా మాట్లాడిన యువతులకు, గృహిణులకు ఏ దురుద్దేశం వుండదు గాని సదరు ప్రసాదు లాంటి యువ సూపర్వైజర్లు ఏవిటేవిటొ వూహించేసుకోని లోలోన హీరోల్లాగ ఫీల్ అయిపోతూ వుంటారు.. 
దానికి తోడు కొంతమంది పెళ్ళయిన సీనియర్ సూపర్వైజర్లు కూడా గత అనుభావలను కథలు కథలుగా చెప్తూ వాళ్ళు ఏవిధంగా ఫలానా ఆవిడను పడగొట్టిన సంగతులు లేనివి వున్నవీ కల్పిస్తూ ప్రసాదు లాంటి కుర్ర వయస్కులను రెచ్చగొడ్తూ వుంటారు.. ఇది ఒకవిధంగా మానసిక దౌర్బల్యం.. 
నిత్యం శృంగార విషయాలనే ప్రస్తావిస్తూ నేను నీ వయస్సులో వుండగా ఫలానా స్త్రీ తో ఫలానా విధంగా రొమాన్సు చేసానని...ఎన్నో కోతలు కోస్తూ ఆనందాన్ని పొందుతారు..అందులో కొన్ని నిజాలు మరికొన్ని అబద్దాలు అన్నీ కలగలపి తానేదో మన్మధునికి ప్రత్యామ్నాయంగా పుట్టానని గొప్పలు పోతూ వుంటారు... నిజానికి వాడు సొంత భార్యని ఏనాడు సుఖపెట్టలేక పోయి వుండొచ్చు.. కాని ఇదొక మానసిక దౌర్భల్యం (ముందే చెప్పాగా).

ఎవరైనా పెళ్ళికాని ప్రసాదు లు వుంటే తాము ఈ విషయంలో ఏ స్థాయిలో వున్నామా అని పరీక్షించుకోవడానికి ఇలా కాలనీల్లో కనిపించే ఆడవాళ్ళకి సైటు కొడుతూ అంగలార్చి పోతూ వుంటారు.. మొదట్లో పెద్దగా పట్టించుకోని ఆడవాళ్ళు కొంతమంది ఈ  కుర్రాడు రోజూ నా కోసమే ఇక్కడ చక్కర్లు కొడుతున్నాడు పోనిలే పాపం అని వో నవ్వు పారేస్తూ వుంటారు.. అదే మహా ప్రసాదంగా భావిస్తూ మరో రెండు రౌడ్లు ఎక్కువ చక్కర్లు కొడుతూ వుంటారు.. 

సరే ఇక విషయానికొద్దాం.  మన హీరో ప్రసాదు ఇలా  ఇద్దరు హిందీ ఆడవారి పట్ల ఆకర్షణ కల్గి వున్నాడు... అవకాశం దొరికినప్పుడల్లా వారిని చూస్తూ ఒక్క క్షణం వారు తనవైపు చూడగానే పులకరించిపోయి వెళిపోతూ వుంటాడు.. దూర ప్రాంత మహిళలు కూడా ఇలాంటి  వాళ్ళు తమకు బాడీ గార్డుగా పనికి వస్తాడులే అనుకుంటూ వాడి వికార చేష్టలను తిరస్కరించే పనులు చేయకుండా వదిలేస్తూ వుంటారు..  

సీనియర్ల అనుభవాల లాగే తను కూడా వీళ్ళలో ఒక్కరి తోనైనా అందమైన అనుభవం జరుగుతుంది అని వాళ్ళతో మాటలను కలుపుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు... 

రోజులు దొర్లుతున్నాయి... ఇంతలో ప్రసాదు ఎదురుచేసిన సమయం రానే వచ్చింది...
కంపెనీ వాళ్ళు తమ క్వార్టర్లలో నివసించే వారి సంఖ్య ను గణించవలసిందిగా తమ డిపార్టుమెంటు వారిని ఆదేశించడం.. వాళ్ళ డిపార్టుమెంటులో అందరికంటే చిన్నవాడైన ప్రసాదుకి ఆ బాధ్యతను అప్పగించడం అన్నమాట... ఇంచుమించు జనాభా లెక్కల లాంటిది... 

మన వాడు చాలా వుత్సాహంగా బయలుదేరాడు... మగవాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళని ఇంటర్వూ చేసే మహభాగ్యం కలిగినందుకు వుత్సాహంతో గాల్లోకి సుమారు 5 అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తూ కాలనీలోకి అడుగు పెట్టాడు.... 

కానీ ఈ అనుభవం తాను జీవితంలో మర్చిపోలేని అనుభవం అవుతుందని కలలో కూడా వూహించలేదు... 

మొదట తాను అత్యంత ఎక్కువగా ఇష్టపడే నార్త్ ఇండియా కాలనీకి వెళ్ళి రోజూ తను ఆరాధనగా చూసే నారీ మణుల ఇండ్లకి వెళ్ళాడు.. 
ఒకామె వయస్సులో చిన్నామె, ఏడాది బాబు వున్నాడు..
మనవాడు కాస్త బెరుగ్గానే మొదటి అంతస్థులో వున్న ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు... 
కానీ ఆ ఇంట్లో తాను చూసిన దృశ్యాన్ని చూసి అవాక్కయ్యాడు... 
ముందరి గదిలో ఒక నులకమంచం వుంది దానిమీద సదరు నారీమణి భర్తగారు వెల్లకిలా పడుకుని వున్నాడు...నైట్ షిఫ్ట్ కాపలాదారుని డ్యూటీ చేసివచ్చేడేమో అలసిపోయి గాధనిద్రలో వున్నాడు... 

ఆ గదిలోనే కాదు ఆ పోర్షనులో ఆ నులకమంచం తప్ప ఏ సామానూ లేదు.. రెందు తపేలాలు కనబడ్డాయి... ఈ అమ్మాయి ఒళ్ళో వున్న బాబు ఆకలికి కాబోలు ఏడుస్తున్నాడు..కాని ఆ బిడ్డ ఆకలి ఎలా తీర్చాలో తెలియక బిక్కముఖం వేసుకుని కూర్చుని వుంది ఆ పిల్ల...ఈవిడ కూడా నాస్తా చేసినట్ట్లు లేదు.. 

అసలు వండుకోవడానికి సామాన్లు గాని, ఆలి కట్టుకోవడానికి మంచి చీరలు గాని వున్నాయో లేదో అన్న ధ్యాసలో ఆ పురుషుడు వున్నట్టు లేదు..తనకొచ్చె కాస్త జీతం రాళ్ళు తాగుడుకో, గుట్కాలకో ఖర్చుచేస్తూ బోర్లా పడుక్కుని..తన శారీరక అవసరాల కోసం మాత్రమే ఈ పిల్లని చేసుకుని ఇంతదూరం వూరుగాని వూరులో భాషరాని దేశంలో తెచ్చిపడేసాడు...

డ్యూటీ అయిపోయేక ఫుల్ గా తాగివచ్చి అందమైన ఆ శరీరరంపై ఆంబోతులా పడి ఆమె అనుమతిగాని ప్రోత్సాహం గాని లేకపోయినా ఈ కార్యాన్ని ఒక హక్కులా భావించి..  ఆనక   నిద్రలేచి ఆమె పెట్టిన నాలుగు మెతుకులు తిని మళ్ళీ డ్యూటీకి  పోవడమే.. 
తన సంపాదనలో పావలా వంతు పారేసిన దాంట్లోనే  నెలంతా సర్దుకు పోతూ మొగుడి ఆకలి ఆ మొగుడి వలన తనలోంచి వచ్చిన బిడ్డ ఆకలి తీర్చాలి.... 

ఈ స్థితిలో ఆమెను చూసిన ప్రసాదుకి నోట మాట రాలేదు.. 
"క్యా నాము హై ???  ఆప్కా హజ్ బెండు కా నాం కా నాం క్యా హై??" అంటు వచ్చీరాని భాషలో తన హిందీ ప్రజ్ఞానాన్ని  ప్రయోగించి అడిగేడు.. 
ఆ అమ్మాయి కూడా "భయ్యా" అంటూ సంబోధించి ముక్తసరిగా చెప్పింది... . గట్టిగా మాట్లాడితే ఆ భర్త గారికి ఎక్కడ తెలివివస్తుండొ అన్న భయం మనవాడికి ఒకపక్క పీకుతూ వుండగా..
ఎక్కడో దూరంగా వున్న తన తమ్ముడుని ప్రసాదులో చూసుకుంటు "భయ్యా" అని ఆప్యాయంగా ఆమె పిలిచిన విధానానికి మనసు చలించిపోయి... ఒక్కక్షణం జాలిగా ఆమె వైపు చూసి..
కొన్ని వందల కిలో మీటరల దూరం నుండి ఇక్కడకు వచ్చిఇలాంటి బాధ్యతలేని తాగుబోతు భర్తతో సాహచర్యం చేస్తున్న... ఈ దేవతనా  ఇన్నాళ్ళూ నేను నా  వెకిలి చేష్టలతో బాధపెట్టాను అనుకుంటూ సిగ్గుతో తలవంచుకుని నిష్క్రమించాడు ప్రసాదు... 


 (తరువాయి భాగం తరువాత)...