Tuesday, December 24, 2013

మరో వెయ్యేళ్ళ్యు దాటినా ఈ తెలుగోడి బతుకు ఇంతే..

దెబ్బకి దెయ్యం వదిలినట్టు.. ఎన్నికల్లో బోల్తా పడ్డ కాంగేయులకి రాష్ట్ర విభజన మీద జోరు తగ్గింది.. 

ఘోర పరాజయ భారంతో డీలా పడ్డ ఇటలీ మాత నోరు మూగబోయి చాటు మాటు సంకేతాలను నిలిపివేసివుంటుంది..

తె.రా.స విలీనానికి, సెపరేషన్ కి సంబంధం లేదని డిగ్గీ వారు డంబాలు పలికినా ముక్కు పోలయ్య వారు పొత్తుకి దూరంగా జరగడం వలననే ఢిల్లీ పెద్దలు  పునరాలోచనలో పడ్డారు..(love failure).. 

సర్వోన్నత సర్వాధికారాల్తో రాజ్యం ఒప్పగించే దాకా వుద్యమం కొన సా......గుతూనే వుంటుందని ఆచార్యుల వారు నొక్కి వక్కాణిస్తూ చిలక పలుకు వల్లిస్తున్నారు.. 

మరల  బలిదానాలకు  ప్రోత్సహిస్తున్నారు సదరు ముక్కు పోలయ్య గారు.. 

కిస్మిస్సు, సంకురాతిరి మొదలగు పండగల హడావుడిలో జనం వుండగానే.. ఎవరి ఎత్తులు వాళ్ళు చేస్తూ ఎత్తులకి పైఎత్తులు పన్నుతూ రాబోయే ఎలచ్చన్ల పండగకి నాయకులంతా అప్పుడే సంబరాలకి కండువాలు దులుపుతున్నారు.. 

గోడలకి ఏ రంగులు వేయిద్దామా అని దీర్ఘంగా మంతనాలు చేస్తున్నారు.. 
పందెం కోళ్ళను సిద్దం చేయడంలో పెద్దలు బిజీగా వున్నారు..

ఎన్ని ఆమ్మ్ ఆద్మీలు వచ్చినా మనోళ్ళు మాత్రం ఖచ్చితంగా నోటుకి, కులానికి తప్ప మరొకడికి ఓటు వెయ్యరు కాబట్టి ఏ పందెం కోడి ఎక్కడ గెలుస్తుందో వెండి తెరమీద వేచి చూడాల్సిందే.. 

మరో వెయ్యేళ్ళ్యు దాటినా ఈ తెలుగోడి బతుకు ఇంతే..         

Sunday, December 22, 2013

ఈ రమణీయ దృశ్యం మీద చక్కటి కవితను రాయండి..please..

వర్షపు నీటిలో తడిసిన పచ్చటి ఆకుపై నీటిబిందువులు ..
ఇది ఆ ప్రకృతి గీసిన సహజ సౌందర్య వర్ణ చిత్రము.. 
ఈ రమణీయ దృశ్యం  మీద మీ  అభిరుచి మేరకు చక్కటి కవితను రాయండి..
అందరి అభిమానము జూరగొనండి..    

Wednesday, December 18, 2013

మళ్ళీ అక్కడా... ఇక్కడా దొరల పాలన రావాలి..

ఎప్పుడో... సుమారు 29 ఏండ్ల క్రితం... పవిత్ర గోదావరి నదీమ తల్లి మీద కట్టిన రైల్ కం రోడ్ బ్రిడ్జ్ మీద నుండి నా చిన్న మోపెడ్ మీద ప్రయాణం చేసాను..
ఎంతో ఆనందాన్ని అనుభవించాను.. 

నున్నటి  సిమెంట్ రోడ్డుమీద బండి సాఫీగా సాగిపోతుండగా ఆ నదీమతల్లి అందాల్ని గంభీరతను గమనిస్తూ పొంగిపోయాను.. 

మొన్న ఫామిలీ తో కారులో మరల ఇన్నాళ్ళకు అదే రైల్ కం రోడ్డు బ్రిడ్జి మీదుగా తణుకు మీదుగా అత్తిలి వెళ్ళాము.. 

ఎంత ఘోరంగా వుంది బ్రిడ్జి.. అంతా గతుకుల మయం. ఇనుప బద్దీలు బయటకు తేలిపోయి వున్నాయి.. 
ఒకటో గేరు, రేండో గేరు లోనే బండి వెళ్ళగలిగింది..నేటి ఈ దుస్థితికి కారకులెవ్వరు? సుమారు పది సంవత్సరాల నుండి ఒక దిక్కుమాలిన సమస్యను పట్టుకుని వేలాడుతున్న ప్రజా పాలకులకు రాష్ట్రం లోని అన్ని ప్రధాన నగరాల్లోను రోడ్లు, బ్రిడ్జిలు, డ్రైనేజిలు  ఎంత ఘోరంగా వున్నా పట్టించుకోవడం లేదు.. 
అసలు ప్రభుత్వ వ్యవస్థ వున్నదా.. లేదా అన్న స్థితి.. ప్రజలు కూడా ఇబ్బందులను అలవాటు చేసుకుంటున్నారు..  ఇంకా ఎన్నాళ్ళీ ఘోర స్థితి.. అంతులేదా..

ఆశ్చర్యం గొలిపే సంగతి ఏవిటంటే తిరుగు ప్రయాణం లో సర్.ఆర్ధర్ కాటన్ కట్టిన ధవళేశ్వరం బ్రిడ్జి మీదుగా వచ్చాం .

.
ఇప్పటికీ చెక్కు చెదరని ఈ బ్రిడ్జి ల సమాహారాన్ని చూసి రెట్టింపయిన వుత్సాహంతో, ఆ దొర గారికి నివాళులు అర్పిస్తూ రాజమండ్రి చేరుకున్నాం... అందువలన మళ్ళీ అక్కడా.. ఇక్కడా... దొరల పాలన రావాలి.. అప్పుడే రాష్ట్రమంతా సుభిక్షంగా వుంటుంది... సర్వే జనా సుఖినో భవంతు..              

Monday, December 16, 2013

ఈ ఒక్క పాయింటు చాలదూ ఆయనకి "భారత రత్న" ఇవ్వడానికి..

ఇక్కడ చూడండి ..మా ఎదురుగా వున్న ఇల్లు పడగొట్టేసారు..

 (before ....)

After...
ఒక నెల రోజుల క్రితం మా పెరటి వేపు (ఇప్పుడు పెరడు లేదు అయినా అలవాటులో వాడాను) ఇల్లు కొట్టేసి గ్రూప్ హవుసో.. అపార్టుమెంటో కడుతున్నారు..
బిల్డింగులు వాళ్ళకి.. దుమ్ము..ధూళి మాకు.. 
దానికి తోడు రాత్రల్లా పనిచేసిన జె.సీ.బీ వలన one week శబ్ద కాలుష్యం..
ఇప్పుడు డెక్కింగుల కోసం కలపను బిగిస్తూ చేసే చప్పుళ్ళు.. 
ఇంకా సంవత్సర కాలం భరించాలి.. 

ఇలాంటప్పుడే సచిన్ గుర్తుకొస్తాడు..
ఆయన ఇల్లు కట్టుకుంటున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి జరుగుతున్న అసౌకర్యానికి మన్నించమని వుత్తరాలు రాసాడట.. నేను సచిన్ మీద ఆర్టికల్ రాసినపుడు.. వేరొకరి బ్లాగుల్లోను చాలామంది విమర్శిస్తూ కామెంట్లు రాసారు..
ఈ ఒక్క పాయింటు చాలదూ ఆయనకి "భారత రత్న" ఇవ్వడానికి..       

చెక్కు చెదరని తపాలా కార్యాలయం..

ఇలాంటి పోస్ట్ ఆఫీసు మన భారత దేశం అంతటా వుండేవి.. 
ఇప్పుడు దాదాపు కనుమరుగు అయిపోతున్నాయి..
ఇలాంటి పోస్ట్ ఆఫీసు శ్రీ ఆర్కే.లక్ష్మన్ గారి కథ మీరు దూరదర్శన్ సీరియల్ "మాల్గుడీ డేస్" లో చూసే వుంటారు.
.పోస్టు మేన్ కి వూళ్ళో వాళ్ళకి గల మానవీయత సంబంధాలను చాలా బాగా  టచ్ చేశారు.. హాట్స్ ఆఫ్ టు ఆర్కేజీ..
     
ఈ పోస్ట్ ఆఫీసు  పశ్చిమ గోదావరి జిల్లా "అత్తిలి" అను వూరులోని పోస్ట్ ఆఫీసు..
 ప్రస్తుత రోజుల్లో పోస్ట్ ఆఫీసుకి-మనకీ అంతరం పెరిగిపోతున్న ఈ యుగంలో ఇంకా ఇలాంటి  పురాతన  పోస్ట్ ఆఫీసుల్ని కాపాడుతూ రావడం మనకి ఆశ్చర్యం..ఆనందకరం..  
అధికారులకి.. ఆ వూరి వాళ్ళకి జోహార్లు.. 
అమెరికాలోనో మరెక్కడో విదేశాల్లోనో వున్న మితృలకి వింతగా వుండచ్చు.. కాని ఇక్కడ మీ వూళ్ళో ఇలాంటి ఫుటో వుంటే పెట్టి మమ్మల్ని అలరిస్తారని కోరుకుంటూ..