Sunday, March 30, 2014

పొత్తులు పొత్తులంటూ మన జాతిని అగమానం సేస్తన్నారు ఆళ్ళ బతుకులు సెడ...

మావా..నేనిది భరించలేను..ఆత్మహత్య చేసుకు సచ్చిపోతాను...

రాత్రి మత్తులో తిట్టానని అంత మాటమంటావా..తప్పయిపోనాదే..

ఛిఛీ..అందుక్కాదెహె..అది నాకు మామూలేగా..

ఓ మర్చిపోయాను..పండక్కి సీర కొనమన్నవ్..మర్చిపోనాను..అంతమాత్రానికే సచ్చిపోవాలా..

అదీకాదెహె..అయినా పెళ్ళయి ఇన్నేళ్ళయింది నాకో సీర గాని సిన్న పూస గాని ఎప్పుడేనా కొని ఏడిసావా..

ఆ గుర్తుకొచ్చినాది హోటేల్లో బిర్యాని తినిపించి జగదాంబాలో సినిమాకి తీసుకెళ్ళమని అడిగావ్..అదీ మర్చిపోయాను..ఎల్దాంలే..అంతిదైపోకు..

నా బతుక్కి అదొక్కటే మిగిలినాది..పెళ్ళికి ముందు తిప్పినోడివి నీతో పెళ్ళయితే అయన్నీ వుంటాయని మా బాబు తెచ్చినోణ్ణి కాక నీతో లేసొచ్చీసినాను..మంచి సాస్తే జరిగినాది...కాని ఈటన్నిటికంటే ఈ దొంగ సచ్చినోళ్ళు చేస్తున్న పనికి ఒళ్ళంతా సచ్చిపోతున్నాది..సీ బతుకు సెడ..

ఎవుళే ఆళ్ళు..సెప్పు కాలు సెయ్యి ఇరిసేస్తాను..

తెల్లారినెగిస్తే సాను పొత్తులు పొత్తులంటూ మన జాతిని అగమానం సేస్తన్నారు ఆళ్ళ బతుకులు సెడ...

సిగ్గు,మానం,నీతి,మర్యాద లేని ఆళ్ళ కోసం నువ్వెందుకే సచ్చిపోడం..తెలివిగళోల్లు..ఒక్క ముద్రతో ఆళ్ళని పడగొట్టీరా...
Sunday, March 16, 2014

నోటా కావాలా? పూర్తి ఓటరుల ఓట్లు కావాలా?? ఆలోచించి చెప్పండి...ప్లీజ్..

రేపు జరగబోయే ఎన్నికల ప్రక్రియలో "నోటా" అనే ప్రత్యేక అవకాశం ఓటరు కి కల్పించబడి తన తిరస్కారాన్ని తెలియజేసే విధానం కొత్తగా ప్రవేశపెట్టారు అని చెప్తున్నారు..

సదరు ప్రక్రియ వలన ఏమిటి దేశానికి కాని ఖజానాకి గాని లాభమో నాకు నిజంగా తెలీదు..ఎవరికైనా తెలుస్తే వివరించగలరని కోరుతున్నాను..

నా దృష్టిలో ఇది కేవలం మన ఓటు వేరొకరు వెయ్యకుండా నిరోధిస్తుంది..

కాని 60 శాతం మంది ఎన్నికలకు దూరంగా వుండి ఫెయిల్ అయిన ఈ ప్రజాస్వామ్య దేశంలో కనీసం 90 శాతం మంది ఓటు హక్కు వినియోగించాలంటే ఇప్పుడున్న విధి విధానాలు, పాలనా పరమైన లోపాలు సరిదిద్దుకునే చర్యలు ఎందుకు చెయ్యరు...

మత గ్రంథాలను, ఆధునికత పేరుతో వేష,భాషలు,ఆచార వ్యవహారాలను మార్చుకున్న మనం...దేశ ప్రజలందరి సంక్షేమాన్ని ప్రతిబించేలా..నూటికి నూరు శాతం ఓటర్లు పాల్గొనేలా చట్టాల్లో, రాజ్యాంగంలో ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకునే పరిస్థితి ఎందుకు లేదు..

నోటా కావాలా..పూర్తి ఓటరుల ఓట్లు కావాలా..

ఆలోచించి చెప్పండి...ప్లీజ్..

Friday, March 14, 2014

బెస్ట్ ఆఫ్ లక్ పవన్ అండ్ జన సేన..

మొదట తన ప్రసంగం యావత్తూ చక్కటి క్లారిటీ వుంది..చిరు నసుగుడు బేరం కన్న బెటర్..

సూటిగా వ్యక్తుల పేర్లు చెప్పి మరీ విమర్శలు చేశాడు ధైర్యంగా..ఈనాటి నాయకుల కన్నా భిన్నంగా..

తన మనసుళొని ఆవేదన గత అనుభవాలను,అవమానాలను చక్కగా అర్ధమయ్యేలా వుంది..

ఇన్నాళ్ళకి భారత దేశ సమగ్రతను, భారతీయుల మరియు తెలుగు వారి గొప్ప తనాన్ని,మత సహనాన్ని సమైక్యతను చాటిచెప్పాడు..

తనపై వ్యక్తి విమర్శనలు చేసిన వారిని ఎండ్గట్టి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు..

ఇరు ప్రాంత ప్రజల మనోభావాలు ప్రకటించి స్థూలంగా కాంగిరెస్సు వ్యతిరేక భావాన్ని ప్రచారం చేసాడు..

మైనస్సులు:
ఇవన్నీ మనం రోజూ బ్లాగుల్లో టీ.వీ ల్లో చర్చించుకుంటున్నవే..కొత్తగా ఏమీ లేదు..

నా తెలంగాణా అని చాలా సార్లు చెప్పి అటు సైడు ఎక్కువ ప్రభావితం అయ్యేలా సాగి..టి.ఓటర్లని ఆకర్షించేలా వుంది..ఈ ప్రసంగం తర్వాత తెలంగాణా ప్రజలు ఇటు టి.ఆర్.ఎస్ కి గాని, కాంగి కి గాని ఓటు వేసే పరిస్థి కాకపోయినా ఆ రెండు పార్టీలే ప్రధానంగా వున్న తెలంగాణా లో ఎవరికి ఓటు వెయ్యాలో క్లారిటీ ఇవ్వ లేదు..

పనిలో పనిగా బాబు గారికి క్లీన్ చిట్ ఇచ్చేసాడు..

తన పార్టీ ఏ విధంగా రాబోయే ఎన్నికల్లో నిలబడుతుందో క్లారిటీ లేదు..

ఏది ఏమైనా ఈ జోష్..ఈ ఆవేశం, ఈ నిబద్దత, ప్రజా సమస్యలపై నిజాయితీ పోరాటం కొనసాగించి అన్నయ్యలా కాక నిజమైన పోరాట యోధునిగా నిలబడి తెలుగు వారి అభివృధికి కృషి చేస్తాడని ఆశిస్తూ..బెస్ట్ ఆఫ్ లక్ పవన్ అండ్ జన సేన..


Wednesday, March 12, 2014

ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకడైల్ ఫెస్టివల్..

ఒక్కడంటే ఒక్కడు సరిగ్గా తెలుగు మాట్లాడుతున్నారా..
ఒక్కడంటే ఒక్కడు మనస్పూర్తిగా,ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారా.. 

వాళ్ళు మాట్లాడే భాష ప్రజలను ఆకట్టుకునే విధంగా లేదు..వీడు మనవాడే అన్న భావాన్ని పలికించేటట్టు లేదు..

మాకు అవకాశం ఇవ్వండి మా తఢాకా చూపించి కోట్లు దిగమింగుతాం.. అన్న రీతిలోనే సాగుతున్నాయి ప్రసంగాలు..
పైకి మాత్రం అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని, అన్ని ప్రాంతాల వారిని వుద్దరిస్తాం అంటూ ఊకదంపుడు మాటలు..  

ఆనాడు ఎన్.టీ.ఆర్ గాని..రాజశేఖర్ రెడ్డి గాని జనాల్లో ఇప్పటికీ నిలచి వుండటానికి కారణం..వారి మాటలు,ప్రసంగాలు, కొంతైనా ప్రజలకు చేసిన మంచిపనులు.. ఎన్ని వ్యతిరేకపవనాలు వీచినా.. ధైర్యం చేసి  అనుకున్నది సాధించి ప్రజాసంక్షేమ పథకాలు అమలు పర్చారు.. 

మాటమీద నిలకడలేని తాగుబోతులు ఒక పక్క, పైకి ఒకటి చెప్పి లోపల మరొకటి చేసే ప్రజా ద్రోహులు ఒకపక్క..కేవలం పదవుల కోసమే పార్టీలు కండువాలు మారుస్తూ ప్రజల్ని అయోమయ స్థితిలో పెట్టి నిస్సిగ్గుగా ప్రజల మధ్యకి వస్తున్న నాయకులే నేడు..

ఈ పరిస్థితుల్లో సామాన్యుడు నాయకులంటేనే అసహ్యించుకుంటున్నారు..
ఫలానా వాడు మా కులపోడే అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు..
బహిరంగంగా తిడుతున్నారు..(రోజూ వాకింగులో పిట్ట గోడ మీద కూర్చుని నేటి నాయకుల గురించి మాట్లాడుకుంటున్న వయోజనులని చూసి రాస్తున్నాను).. 

ఏ పార్టీ వాణ్ణి, ఏ నాయకుణ్ణి సమర్ధించలేని స్థితి..అసలు ఇంతవరకూ మా నియోజక వర్గంలో ఎవరు ఎం.పీ గా నిలబడతారో చెప్పలేని పరిస్థితి..మరల అవే ముఖాలు..పార్టీ, జెండా,ఎన్నికల గుర్తు మారింది.. 

ఇక నిరక్ష్యరాసులు  ఈ అయోమయ స్థితిలో ఎవరికి ఓటు వేస్తారో తెలీదు..ఈవిడ (లేదా) ఈయన గెలవాలంటే ఫలానే గుర్తుకే ఓటు వెయ్యాలని నర నరాన పాతుకుపోయిన గుర్తు కాదని మరొక గుర్తుకి ఎలా ఓటు వేస్తారు.. లేదా వాళ్ళ ఓటు మరొకరు వేస్తారు.. 

పాతవాళ్ళు చాలరన్నట్టు కొత్త బిక్షగాళ్ళు బయలుదేరారు..పంచ్ డైలాగులతో సినిమా చూపిస్తారు..ఆనక ఎవడో ఒకడి పంచన చేరి పదవులు పంచుకుని ప్రజల పంచెలు ఊడదీస్తారు.. 

ఇంత దౌర్భాగ్య స్థితి బహుశా ఇదే మొదటి సారి..ఇక తెలంగాణాలో అయితే సామాన్య ఓటరు పరిస్థితి మరీ దారుణం.. ఇది ముందే (చానాళ్ళ కితమే నా బ్లాగులో రాసాను).
కాని చిత్రం తె.వాదులంతా సదరు నాయకుణ్ణి విమర్శిస్తే మొత్తం తెలంగాణా వారినే అన్నట్టు ఫీల్ అయిపోయి..తిట్ల పురాణం అందుకునే వారు.. మొత్తం ఆంధ్రా వాళ్ళనే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన బ్లాగర్లు ఇప్పుడు మౌనం దాల్చారు.. ఇక ముందు ముందు పరిస్థితి ఎలా వుంటుందో ఊహించ వచ్చు.... 
వీటన్నిటీ ఫలితమే ఇక్కడా అక్కడా కూడా..ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకడైల్ ఫెస్టివల్..    
  


Wednesday, March 5, 2014

ఈ పండగ రోజుల్లో మగోళ్ళకు మందు ఫ్రీ..ఆడోళ్ళకు కోకలు ఫ్రీ..

బావుల్లారా..అమ్మల్లరా..వస్తున్నాది పండగ..ఈ పండగ కేవలం ఒక్క మతం, ఒక్క కులం వాళ్ళకీ, కాదు..అందరిదీ మనందరిదీ..

ఈ పండగ రోజుల్లో మగోళ్ళకు మందు ఫ్రీ..ఆడోళ్ళకు కోకలు ఫ్రీ..బుడ్డోళ్ళకు కిరికెట్టు కిట్టులు ఫ్రీ..అంతా ఫ్రీ..ఫ్రీ ఫ్రీ..

పేద..దళిత,బడుగు,బలహీన వర్గాలకు బోలెడు వరాలు...
ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు..నిరుద్యోగులకు రిక్రూట్మెంటులు..
కూలివాళ్ళకు వస్త్ర దానాలు..ముష్టివాళ్ళకు అన్నదానాలు..
పనీ పాటా లేక బికారుల్లా తిరిగేవాళ్ళకు ఆల్ టైం వర్క్..

నిన్నొక జెండా..రేపొక జెండా మోసుకు తిరిగి
నిన్నో నాయకుడు..రేపో నాయకుడి ఎనకాల జేజేలు పలికితే..
ఛేతినిండా పని,కడుపు నిండా భోజనం..రేతిరికి మందు..

పందాలు మీన పందాలు వంద నుండి కోట్ల వరకూ బెట్టింగులు
సవాళ్ళు..బెట్టింగులు..బుల్లి తెరల రోమాంచిన చర్చా యుద్దాలు..

నువ్వు దొంగ అంటే నువ్వు గజ దొంగ అంటూ వీర దొంగల విన్యాసం..
వినోదం అంతా ఫ్రీ..

రోడ్లన్నీ రంగుల మయం..పులి వేషాల బల్లకట్టు వూరేగింపులు..
దొరల పెత్తందార్ల వూరేగింపులు..ఒంటెలు,గుర్రాలు,ఏనుగులు..

మళ్ళీ ఆనాటి రాజయుగపు ఆనవాళ్ళు..వంశ పాలకుల,విదేశీ నియంత పాలకుల వైభవ,బహిరంగ సభలు..
లారీలు,ట్రాక్ట్ర్లపై జనం..వచినందుకు మనిషికి వంద..కుల నాయకుడికి  లక్ష తీస్కో...పండగ చేస్కో..

ఆపెహె నీ గోల ఇనాగైతే దేశం బాగుపడుద్దా..

దేశం ఎలా పోతే ఎవురికి గావాల్రా..
మందు కొట్టామా ..చిందేసామా..
ఎవురెక్కువ మందిస్తే ఆడికే మన వోటు..ఎవడెక్కువ జాకెట్లు..బొట్లు ఇస్తే ఆడికే మా వోటు..
పోనీ ఈ దేశం ఈ రాష్ట్రం ..ఈ ఊరు ఎలా పోతే మనకేటి..ఆడు మన కులపోడా కాదా..ఆడు గూండా అయితే మనకేటి గజ దొంగ అయితే మనకేటి..గుద్దెయ్య్ నీ ఓటు..