Sunday, June 22, 2014

మల్లా జన్మంటు వుంటే.. ఆయన తిరిగి అదే కుటుమానం లో పుట్టాలని నా కోరిక..

- ఒరే అప్పిగా..ఇటు రా యెహె..
= ఏరా నారిగా.. ఏటప్పుడే లంచ్ టయం  అయిపోనాదేటి..
- బేగి కారేజీ ఇప్పెహె..ఆకలి దంచెస్తాంది...
= మా సెల్లెమ్మ కూరేటి సెయ్యనేదునాగుంది..ఇద్గో పట్టు బొమ్మిడాల పులుసు..
- రేత్రి రెండో ఆట సిన్మా కెల్లినాం లేరా.. ఆదోరం గందా..
= అబ్బోసి.. ముసలి కాలం లో దసరా పండగని...బానే ఎంజాయ్ సేస్తున్నారే.. - కాదెహె..నెల్రోజులనుండి అనుకుంటున్నామురా.. ఆ నాగు గారి కుటుమానం సినిమా కెల్దారని.. ఇన్నాళ్ళకి తీరిక దొరికినాది.. పాపం ముసిలోడు..ఆ రోజుల్లో ఓ ఊపు ఊపినాడు కదరా.. 

మనం కుర్రాళ్ళగా వున్నప్పుడు..దసరా బుల్లోడని, ప్రేమనగర్ అని పిచ్చెక్కించాడు కదరా..
- అవునురా..అప్పిగా.. మొదటి రోజున మొదటాటకి ఎల్తేనే గాని మొగోడు కాదురా..ఇంతకీ ఇసయానికొచ్చీ..ఎలాగుంది ఆళ్ళ కుటుమానం బొమ్మ.. 
= తాత, కొడుకు, మనవలు అంతా బాగానే యాక్టింగు సేసినారు గాని... అందరికన్నా నాగ్గోడు బాగా సేసినాడురా...ఏది ఏమైనా ఆల్ల కుటుమానం అంతా బొమ్మలు కనపడినందుకు చాలా సంతోషం ఏసిందిరా..

-ఏటి కొడుకులు  బొమ్మలో తండ్రులుగా  పుడ్తారంట.. అంటే నాగ చైతు నాగ్ కి తండ్రి అయితే నాగ్ ఏమో నాగేశ్వర్రావుకి తండ్రి అంట.. అంతా భలే ఎగతాళిగా నవ్వుకుంటున్నారటలే...
= ఒరే దీన్నే సినిమా భాషలో కానిసెప్టు అనో గాడిద గుడ్డనో అంటారట్లే.. అయన్ని మనకెందుకు..నిజజీవితంలో తండ్రి కొడుకుని నాన్నా.. అని పిలుస్తా వుంటే భలేగా వుందిరా.. ఇంతవరకా సినిమా సరిత్రలోనే ఇట్టాంటి బొమ్మ లేదంటే నమ్మూ..
= నీ కొడుకు నీ ఎదురుగ్గా తాగి ఊగుతున్నాడనుకో..నువ్వేటి సేస్తావ్..
- నాలుగు అంటించి..ఎర్రగా కాల్చి యీపు మీద వాతవెట్టీనూ..
= మరి ఇందులో నాగ్ ఏమో చైతూ ని ఇంకా తాగు.. ఇంకా తాగు అని సీసాలమీద సీసాలు అందిస్తాడు... అదిరా సినిమా వోల్ల గొప్పతనం..
= కారు నడుపుతున్నప్పుడు ఎవుళేనా సెల్లు మాటాడుతున్నారనుకో.. కనీసం యెయ్యి రూపాయలు జరీమానం..కాని నాగ్ ఏమో మొత్తం మూడు సార్లు కారు రయ్ మని పోనిస్తూ సెల్లులో మాటాడెస్తాడొరే..అంత గొప్ప కోటీశ్వరుడికి సెవిలో ఎట్టుకునే  మెషీన్  వుండదురా పాపం..
- ఇంకో నికారసయిన నిజం ఏటంటే ఎవుళికేనా గత జనమలో నత్తి గట్రా వుంటే  ఆళ్ళకి  ఈ జన్మ లో కూడా  సరిగ్గా అనాగే నత్తీ గట్రా వుంటాది..
- ఓరి మరో గొప్ప ఇసయం ఏటంటే అప్పుడెప్పుడో అమితాబ్ గారు కొడుకుతో కలసి కాబోయే కోడలితో ఎంచక్కా డాన్సింగ్ చేసి అదర్గొట్టీసేడు గందా..సరిగ్గా ఇనాగే నాగ్.. కొడుకుతో కలసి స్టెప్పు కట్టేడు.. కానీ ఇక్కడ కాబోయే కోడలే లేదు..
=ఆ కోరిక తరవాతి సిన్మాలో తీరుస్తాడేమోలే..
- ఈ బొమ్మలో ఇంకో ట్విస్టు..అంటే గొప్ప ఇసయం అన్నమాట.. ఈ బొమ్మలో ఎక్కడా చైతు తల్లి తండ్రులు గాని.. నాగేశ్వర్రావుకి అసలు కొడుకులు గాని కనబడర్రా.. ఈ కొడుకు ఇనా కాలేజీలో తాగి తందనాలుడుతుంటే మందలించడానికి గాని పట్టించుకోడానికి గాని ఆడి అమ్మాబాబు కనబడ్రు... నాగేశ్వర్రావు అన్ని రోజులు ఆసుపత్రిలోను..నాగ్ ఇంట్లోను వుంటే ఏమయిపోయాడనుకునే కొడుకులు కనబడ్రు.. అందరూ హాయిగా ఒకే ఇంట్లో మకాం పెట్టేసి..గత జనమలను తలసుకుంటూ...ఆ జనమ లో తండ్రుల గురించి తాపత్రయపడుతూ తమ వాళ్ళని మర్సిపోతారు.. ఇదిరా నిజమైన ట్విస్టు.. 
- ఏది ఏమైనా సూపర్ బొమ్మహె... ఆ పెద్దాయనకి జోహార్లురా అప్పిగా.. మల్లా జన్మంటు వుంటే ఆయన తిరిగి అదే కుటుమానం లో పుట్టాలని నా కోరికరా
=నీదొక్కడిదే కాదు యావత్తు తెలుగోల్లందరిదీను..  

  

అసలు సిసలైన తెలంగాణా వోల్లు అంటే ఎవలు??

- ఒగో.. ఆగ.. ఏవి డబుల్ యాక్టింగ్.. సూపరో సూపర్..
= ఎవుల్దిరా..రాముడు-భీముడులో ఎంటీవోడిదా? హలో బ్రదర్ లొ నాగ్ దా??
- ఎహె..ఆళ్ళిద్దర్దీ కాదెహె.. సింహ..నరసింహ..


 
 =ఓగ్..ఆ పెద్దయనదా?? నిజంగా నిజమేరా. రూపాయిబిల్లంత నికార్సయిన నిజంరా.. 
-అయితే ఈయన గాని సినిమాల్లో ఏసంకడితే ఆస్కార్ అవార్డు 
గ్యారంటి ఎహె.. 
= కానొరె ఈ పత్రికలోల్లే అనౌసరంగా గగ్గోలు పెడుతున్నార్రా.. "ఇక్కడోమాట అక్కడోమాట ..మరీ ఇంత ఘోరవా( ?" అంటూ ఏదో మర్డర్ జరిగిపోయినంత ఫీలయిపోతున్నార్రా..
- నాకు తెలీక అడుగుతానొరే ఇన్నాళ్ళు ఈ రాజకీయ నాయకులు సేసింది ఇదే కదరా.. అక్కడ అమ్మ దగ్గర ఒక మాట.. ఇక్కడ జనాల దగ్గర ఒక మాట సెప్పి.. ద్రౌపదీకి దుశ్శానుడు సీర లాగేసి నట్టు నిండు సభలో వస్త్రాభరణం సేసీసారు కదరా..
= అందుకే కర్సై పోయారు...నా కొడు.....(ఒరే ఇక్కడ బూతులు సెప్పకుడదు.. సెన్సార్ కటింగు సెయ్యి..)
- అవునుగానొరే..ఏదిఏమైనా పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి  సానా గొప్పోడు రోయ్..
= ఆగాగు.. కొంపదీసి అలవాటులో పొరపాటుగా నోరు జారతావేమో.. బొక్కలో ఏసీగల్రు..
- అదేవిరా.. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి నెహ్రూ నుండి నేటి మోడీ దాక అందరిమీద వ్యంగ్య వ్యాఖ్యానాల్లు...కార్టూన్లు కోకొల్లలు..ఎప్పుడూ లేని ఈ ఆంక్షలు ఏట్రా.. 
= ఆమాటకొస్తే..మన జననేత.. ప్రియతమ నాయకుడు అంజయ్య గోరిమీద ఎన్ని బొమ్మలు రాలేదు...
 
బుడ్డోడు సేతిలో బొమ్మనాగ ఎలికాప్టర్ బొమ్మ కూడా గీసేసీ వోరు.. 

- ఎంటీ వోడు మీద ఎన్ని బొమ్మలు రాలేదు..
నెహ్రూ గోరు అయితే ఆయన మీద కార్టును కనబడక పోతే పత్రికాఫీసుకి ఫోను చేసి మరీ అడిగేవోడట.. 

=ఒరే అందుకే ఆళ్ళు గొప్ప నాయకులుగా మిగిలిపోనార్రా.. 
-అదిసరే గాని పంజాబ్ లో "వాగ్ధా" బోర్డరు కాడ వుండాల్సిన సైనికులు..మన సచివాలయంలో వున్నారేటి.. కొంపదీసి వుగ్రవాదులు దాడికి వచ్చేరా..
=కాదెహె..అన్నీ వెధవ డౌటు అనుమానాలు నువ్వూనూ..  వుప్పుడు మనం తెలుగోళ్ళం  రెండుగా సీలిపోనామా?? 

మరి గంతుసేత  సచివాలయంలో అటు వాళ్ళు ఇటేపు- ఇటు వాళ్ళు అటేపు రాకుండా.. మధ్యలో కంచె పెట్టేసి సరిహద్దులో సైనికులు కాపల పెట్టినట్టు ఎట్టేరు.. ఒకేల ఎవుడైనా ఇటేపు వచ్చినా కన్నెత్తి సూసినా పిట్టని కాల్చినట్టు కాల్చేస్తారన్నమాట..అదీ కొత్త ప్రభుత్వం ఆర్డరు.. 

-అబ్బో.. కొత్త రాష్ట్రం వస్తే
నచ్చల వుద్యోగాలు వస్తాయని..రైతుల అప్పులన్నీ తీరిపోతాయని..గరీబోడు కడొరపతీ అయిపోతాడని ఎన్నో కలలు కన్న ప్రజలకు.. సక్కటి కానుక ఇచ్చేసి నారు దొరవారు..
అవునొరే ఇన్నాళ్ళు ఆంధ్రా వోల్లు మోసం చేసి నల్గొండలో తాగడానికి మంచినీళ్ళు లేక అల్లాడిపోతున్న జనాలకి నీల్లొత్తన్నాయా??..
=ఆగరా.. ఏటా తొందరా. ఇప్పుడే గందా రాష్ట్రం ఏర్పడి కుర్సీలో కూకున్నారు.. అసలు సిసలైన తెలంగాణా వోల్లు అంటే ఎవలు??.. రూపాయి బిల్లంత నికార్సయిన తెలంగాణా వోడు అంటే ఆడు మాత్రమే కాదు.. ఆడి బాబు.. ఆళ్ళ బాబు బాబు అంతా అక్కడ్నే పుట్టాల్నంట.. మరి ఆ బర్త్ సర్టిఫికెట్లు అయీ పుట్టించినోళ్ళకి ..అదే..అదే...సూపించినోళ్ళకు మాత్రమే ఈ రాయితీలు గట్రా వుంటాయి..  
-సరె ఆల్లసంగతి అనాగొగ్గీ గాని మన బాబుగారేట్రా... మనల్నేదో వుద్దరిస్తాడని కుర్సీలో కూకో బెడితే సూపులన్ని పక్క రాష్ట్రం మీదే పెడుతున్నాడు... ఎంతబేగిన  అక్కడ కుర్సీలో రుమాలు గుడ్డ పరిసేసి సీటు ఆక్రమిద్దామని తాపత్రయపడుతున్నాడు..

=నీ బుర్ర మోకాలులో పెట్టుకున్నావు.. అక్కడైనా..ఇక్కడైనా డెవలప్ మెంట్ అంతా ఒక్క హైదరాబాదు లోనె జరిగిందని జగమెరిన సత్తెం.. దానికి మౌన సాచ్చికం ఆళ్ళ పెద్ద సెరువు లో నిటారుగా నిలబడ్డ రాతి బుద్దుడు..
మరందుసేత మెడ మీద తలకాయున్నోడు ఎవుడైనా ఓ గులాబ్ జాం... ఓ బాద్ షా.. ఓ బర్ఫీ నాంటి అయిదరాబాదు మీద సర్వ హక్కులు వుండేలా నవాబులవ్వాలని కోరుకుంటారు గాని.. ఈ కల్లు పాకలు, రాతి గోడలు, మొండి శిధిలాలు వున్న ఇతర ప్రాంతాల మీద అభిమానం వుంటుందా.
అయితే ఇవన్నీ నటనలో భాగం..

-నచ్చల వుద్దోగాలు ఇచ్చేత్తాం.. సేతినిండా అప్పులు సేసీయండి.. మావు తీరుత్తాం..ఆడోల్లకు ఋణాలు, రేసన్లు..మగోల్లకు పంచెలు..గోసీలు ఫ్రీగా ఇచ్చేత్తామ్.. ఇయన్నీ..
=అయన్నీ..సినేమాల్లో డైలాగుల్లాటివిరా పిచ్చికన్నా... నువ్వు ఏడ్సినప్పుడల్లా తేనె రాసిన పాలపీపా వొకటి నీ నోట్లో ఎట్టి..జోలపాడి నిద్రపుచ్చి...అటక మీదనున్న బెల్లం, జీడిపప్పు ఆల్లు మింగుతార్రా పిచ్చి సన్నాసీ.. 
-పద పద బేగెల్దాం.. లేటయితే మన కడుపు కాలిపోద్ది.. ఆల్లకేం ఏ.సీ గదుల్లో సల్లగా తొంగుంటారు..        


   

Wednesday, June 4, 2014

Please save them - Madam Sonia

నీ చేత్తో నువ్వు చంపేసి ఇప్పుడు బతికించమంటావా??? పచ్చాత్తాపమా?? ప్రాయశ్చిత్తమా??