Thursday, October 9, 2014

"పనిలేక" అనేక విషయాలు కెలికితేనే మాలాంటి...

ఒక పెద్దాయన బ్లాగులో శ్రీ ఏసుదాసు గారి ప్రస్తావన రావడము..
అభిమానుల రియాక్షన్ కి కాస్త మనస్తాపం చెంది... ఆ పెద్దాయన రిటైర్మెంట్ ప్రకటించి...

మనసు మార్చుకుని  మరల ఫీల్డ్ లోకి రావడం జరిగిపోయాయి..
దానాదీనా శ్రీ ఏసుదాసు ఎడల నా మనసుని కెలికినట్టై ఏవో నాలుగు మాటలు రాద్దామని...


నాకు "పనిలేని" సంధ్యా కాలములో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి...

ఒకటి "శంకరాభరణం" రెండు "మేఘసందేశం"..రెండూ మ్యూజికల్ హిట్సే..

ఒకదాంట్లో శ్రీ.బాలు గారు మరొక దాంట్లో శ్రీ.ఏసుదాసు గారు హీరోలు..


నాకు తెలిసిన సంగతి ఏవిటంటే శ్రీ.విశ్వనాథ్ గారు శంకరాభరణానికి శ్రీ.ఏసుదాసు గారిచే పాడించాలనుకొని.. ఆయన అందుబాటులో లేకపోవడము వలన శ్రీ బాలు గారితో పాడించారట..

మేఘసందేశానికి శ్రీ.దాసరి గారు శ్రీ.బాలుతో పాడించాలని అనుకుని ఆయన అందుబాటులో లేకపోవడము వలన  శ్రీ ఏసుదాసు గారితో పాడించారని ....
ఇది చాలా ఆశ్చర్యకరమైనది కదా..   
ఈ కారణము వలననే ఇవి ఇంత ప్రజాదరణ పొందాయేమో.. ఎందుకంటే నటులలో కూడా వేరెవరో చేయవలసిన పాత్ర..వారితో చేయిస్తే మరింత శ్రద్ధగా  ఆ పాత్రలో లీనమై హిట్ చేస్తారన్నది గతానుభవం..ఇది హీరోయిన్లకు వర్తిస్తుంది..
మొదట విన్నవించుకున్నట్లు అది నా "పనిలేని" కాలము అగుట వలన... రోజులో సగభాగం (బహుశ) ఆ పాటలు విని ఆనందము పొందిన మధుర అనుభవము వుంది..
ఇక ప్రస్తుత విషయానికొస్తే శ్రీ ఏసుదాసు గారు కుల, మత, ప్రాంతాలకి.. భాషలకి  అతీతులు.. 

తన మతము కాకపోయినా హిందూ దేవుళ్ళ పాటలలో  భక్తి రసము 100% ఒలికించగల గాన గంధర్వులు.. ముఖ్యంగా అయ్యప్ప పాటలకు ఆయనే ప్రముఖుడు..మొదటి & చివరి గాయకుడు ఈ విషయములో.. 
ఆ అయ్యప్ప సందర్శనము కొరకై శబరిమల వెళ్ళక్కరలేదు.. ఒక్కసారి శ్రీ ఏసుదాసు గారి పాటల కేసెట్టు వింటే చాలు...
శాస్త్రీయ సంగీతాన్ని కాచి వడపోచి ఆద్యంతములను పట్టుకున్న మహానుభావుడు...
మరొక ముఖ్యవిషయం ఏవిటంటే మన మోహన్ బాబుగారి సినిమాలో ప్రేమ పాటలలో కూడా "అమ్మా" అన్న శబ్ధం ఎక్కడో ఒకచోట పలుకుతారు.. తప్పుగా కనిపించదు మనకు..ప్రియురాలిలో కూడా అమ్మను చూపెట్టిన మధురగాయకుడు..
నాకు తెలిసి ఒక దక్షిణాది గాయకుడు ఆ రోజుల్లో అనేక హిందీ పాటలను అలవోలగా పాడి సూపర్ హిట్ చేసింది ఈయన ఒక్కడే.. రియల్లీ గ్రేట్.. 
ముఖ్యంగా "చిత్ చోర్" అనే హిందీ సినిమాలోని "గొరి తెర గావొ బడా ప్యారా" అన్న పాట వుంది చూసారూ... ఆల్ టైం రికార్డు కదండి.. జనం పిచ్చెక్కి పోయారు.. పోతారు ఇప్పటికీ.. (ఎప్పటి పాత అండీ అది)..
ఇలా ఎన్ని పేజీలైనా రాయొచ్చు.. ఆ మహానుభావుని గురించి..
నా సినిమా.. నా ఇష్టం.. అన్న చందాన. .నా బ్లాగు నా ఇష్టం అని ఎవరి భావ ప్రటనా స్వేచ్చ వారికుంటుంది.. కాదనలేము.. 

కాని ఒక పెద్దాయన నేటి సమాజములో పోకడలను గూర్చి బాధ్యతాయుతమైన  ప్రకటన చేసినప్పుడు మనము సహెతుకంగా స్పందిస్తే బావుంటుంది.. 
ఇతరులను అవహేళన చేసినట్టే వారిని చేస్తే అభిమానులు బాధపడతారు.. ఒకింత ఘాటుగా స్పందిస్తారు..

ఏది ఏమైనప్పటికి సత్యాగ్రహం విరమించిన శ్రీ రమణ గారిని హృదయపూర్వకంగా అహ్వానిస్తూ.. మీలాంటి వారు "పనిలేక" అనేక విషయాలు కెలికితేనే మాలాంటి అనేక మందికి పని కల్పించిన వారు అయి.. మా మానసిక ఆందోళనలను తగ్గించిన వారయి.. మాకు చికిత్సను అందిస్తున్నారు కాబట్టి.. ఫీజు ను మా కామెంట్ల రూపంలో స్వీకరించవలసిందిగా కోరుతూ..   

 
 

Monday, October 6, 2014

చెత్త మీద..స్వచ్ఛ భారత్ మీద పేరడీలు..

కేవలము వినోదానికి (ఎవర్నీ నొప్పించడానికి కాదు).. 

1. చెత్తో రక్షతి రక్షిత: = చెత్తని నువ్వు రక్షించు అది నిన్ను రక్షిస్తుంది..
2. ఇందు కలదు.. అందు లేదని సందేహము వలదు.. చెత్త..ఎందెందు వెదకి చూసిన అందందే కలదు... భారతిలో కంటే....
3. అంతా చెత్త మయం.. ఈ ఇండియా అంతా చెత్త మయం..
4. గుమ్మడి కాయ అంత నాయకుడు చీపురు కట్టకు లోకువయ్యాడు..


5. ఒక కేంద్ర మంత్రి గారి స్వగతం (హరిశ్చంద్రుని ధోరణిలో)..: అధికార పీఠం మీద మీసమ్ము మెలేసి కూర్చొన వుత్సాహ పడుతున్న నాకు మా అధినాయకుడు పిలచి "ఓరీ..మంత్రి పుంగవా.. కాదు.. కాదు.. జన సేవకుడా! నీ నెత్తి మీద ఈ చెత్త బుట్ట పెట్టుకుని చేతిలో చీపురు పట్టి రాతిరంతయూ రోడ్లను వూడ్చి.. తెల్లారేసరికి బుట్టల నిండా చెత్తను నింపుకుని రమ్ము... అని నాకు వుపదేశించినాడు.. విధి ఎంత విచిత్రమైనదో కదా..     


6. పోకిరీలో షిండే : మీకు లేదా సోషల్ రెస్పాన్సిబిలిటీ.. ఎక్కడ బడితే అక్కడ చెత్త పడేస్తారు.. మున్సిపాలిటీ వారు సరిగ్గా పనిచేయట్లేదని పెద్ద పెద్ద హెడ్డింగులు రాస్తారు.. 

"మురికి కంపు కొడుతున్న కాలనీ.. నిద్ర పోతున్న అధికారుల్లు"...
"నగరంలో కలరా..కమీషనర్ పట్టించుకోడా?? 
మీరు రోడ్డు పక్కన మూత్రం పోస్తారు.. నగరం శుభ్రంగా లేదని మీరే రాస్తారు.. 

ఏం.. శుభ్రపరచేది మునిసిపాలిటీ వాళ్ళేనా.. మీకు లేదా సోషల్ రెస్పాన్సిబిలిటీ... 
తిన్నామా. పడుకున్నామా.. తెల్లారిందా...

7. ఇంట్లో గబ్బిలాల కంపు.. వీధిలో స్వచ్ఛ భారత్ వూరేగింపు..


8. నదులన్నీ సముద్రములో కలసినట్టు.. అన్నిరకాల చెత్తలు కలిసేది మురికి కాలువలోనె..


9. అతడులో తనికెళ్ళ:
చెత్తని కాల్చేసే వాణ్ణి చూసేను.. పూడ్చేసే వాణ్ణి చూసేను.. వీడేంట్రా వెరైటీగా.. ఎదో మొక్కకి అంటుకట్టినట్టు జాగ్రత్తగా మూటకట్టి మరీ డస్ట్ బిన్ లో వేస్తున్నాడు..  ఆడు మగాడ్రా బుజ్జీ..

10. ఈగల నాయకుడు రాజమోళీతో : "అన్నా!! ఈ నాయకులు మాకు ఇళ్ళు లేకుండా చేస్తారంట..పగ తీర్చుకోడానికి వుపాయం చెప్పన్నా"..  


11.ఏ నగరాన్ని చూసినా ఏమున్నది గర్వకారణము.. గతుకుల రోడ్లు..మురికి కాలువలు..కుళ్ళిన చెత్తకుండీలు..కంపు కొట్టే మరుగుదొడ్లు.. 

12.ఠాగూర్ లో చిరంజీవి: "పరిసరాలు పరిశుభ్రంగా వుంచండి.. స్వచ్ఛ భారత్ రూపొందించండి" ఈ నినాదాన్ని నువ్వు ఒక వందమందికి అందించు.. వాళ్ళు మరో వందమదికి అందించాలని చెప్పు..

  

Saturday, October 4, 2014

మీ మొఖాలు మండా.. ఎదగండిరా.. అప్ డేట్ అవ్వండిరా... (ఎవరు??? డైరెక్టర్లా??.. .. ప్రేక్షకులా???)

"ఒరేయ్ నారిగా.. ఇది "ఢీ" సినిమాయే గదరా.. మరి మంచు బాబు బదులు ఎవడో హీరో వున్నాడేంటిరా..""వార్ని..ఇది "ఢీ" సినిమా కథే రా.. కాకపోతే హీరో మారాడు.. మిగిలిన పాత్రలు మారాయి...బెమ్మి గాడు తప్ప...
నిజానికి ఈ కథ ఫార్ములాతో ఇది తెలుగులో వందో సినిమా..
"ఎహె.. చానల్ మార్చెహె".. 
(ఐదు నిముషాల తర్వాత)
"ఓరోరె..ఇది వర్మ గాడి "మర్రి చెట్టో.. తాటిచెట్టో" కదా..
"కాదురా బాబు .. నీతో చచ్చి పోతున్నాను.. దెయ్యాల సినిమా అనగానే వర్మ తప్ప ఇంకెవరూ చెయ్యరా"...
-ఈ మధ్య "ప్రేమ కథా చిత్రం" అనే దెయ్యం కథ హిట్ అయ్యేసరికి వరుసగా బోల్డు దెయ్యం సిన్మాలు వచ్చాయి.. ఎర్రిమొగమా"..
"ప్రశాంతంగా ప్రేమించుకోక మద్దెలో ఈ దెయ్యాల గొడవేట్రా బాబు.. మనం ముందుకి వెళ్తున్నామా ... వెయ్యేళ్ళు వెనక్కి వెళ్తున్నామా.. "ఓ పక్క కంప్యూటర్లు..ఫేస్ బుక్కులు..స్మార్ట్ ఫోనులూ అంటూ యువత ముందుకి  వెళ్తుంటే ఈ దెయ్యాల గోల ఏవిట్రా..
"నీకు తెలవదా.. సోషల్ నెట్ వర్కుల్లో దెయ్యాల వీడియోలే ఎక్కువ"..పిడత మొహంగా.. 
"సర్లె .. చానల్ మార్చు...
(ఐదు నిముషాల తర్వాత)
"ఇది మెగా తనయుడు చరణ్ చేసిన మగధీరా లాగుంది..ఇది "మగధీరా -టూ" యా కొంపదీసి.. 

"ఒరే నాయనా. ఈ తెలుగు లోకంలో డజను మగధీరాలు.. అరడజను అరుంధతిలు... ఇరవై చంద్రముఖిలు వున్నారు... నీకైమేనా అభ్యంతరమా...మూసుకుని కూర్చో"...
"ఒరే తీసేవోళ్ళకి సిగ్గులేకపోతే .. చూసేవోళ్ళకైనా సిగ్గుండాలి కదా."..
నాయనా ఇలా కాదు గాని... ధియేటర్లో కెళ్ళి కొత్త బొమ్మ చూద్దాం రారా..
(ఇద్దరూ వెళ్ళేరు)
- ఐదు నిముషాల తర్వాత...
"అరె సీతారామయ్య గారి మనవడు"...
మరో ఐదు నిముషాల తర్వాత..
"అబ్బో అత్తారింటికి దారేది..."
మరో ఐదు నిముషాల తర్వాత...
ఒరే నారిగా... శుభలగ్నం ..మురారి... ఇంకా చాలా బొమ్మలు.. కనిపిస్తున్నయిరా.. భలె.. భలె.. ఒక్క టికట్టుమీద పది సినిమాలు.. బెమ్మాండం...
ఇంటర్వెల్ జరిగి పదినిముషాల తరవాత.. నారిగాడు ఎక్కడా కనబడలేదు.. వీరి గాడు గాభరా పడ్డాడు...ఆ చీకట్లో చుట్టూ చూసాడు.. "ఒరే నారిగా.. ఏడున్నావురా...బావూ మీకు మా నారిగాడెక్కడైనా అవుపించాడా బావూ.. ఆడసలే అమాయకుడు.. పాలకి నీళ్ళకి తేడా తెలియనోడు.." అంటూ నాటక ఫక్కీలో హాలంతా కలియతిరిగాడు.. మధ్యలో కాళ్ళకి అడ్డంగా ఎవరిదో కాలు తగిలింది..
ఎవడో ఒక పెద్దాయనా కిందపడి గిల గిలా కొట్టుకుంటున్నాడు.. అతనొక్కడే కాదు హాలులో సగం మంది అదే పరిస్థితి.. 

వాళ్ళలో నారిగాడు ఎక్కడున్నాడో ఎతుకుతున్నాడు వీరిగాడు...
మీకు ఎక్కడన్నా కనిపిస్తే చెప్పండి...మళ్ళీ జన్మలో తెలుగు సినిమా చూడడేమోనని భయం..  

P.S: 
ఏ తెలుగు సినిమా చూసినా ఏమున్నది గర్వకారణం.. 
నాలుగు పంచులు..బట్టల్లేని హీరోయిన్లు.. 
కండలున్నా బుర్రలేని విలన్లు.. 
సర్కెస్సు బఫూన్ల కన్నా నీచమైన కామెడీ సీన్లు..
కథకి సంబంధము లేకుండా మధ్యలో పాటలు..
సినిమా స్టార్ట్ అయిన ఐదు నిముషాలకి..హీరో ఎంట్రీ సాంగు..
తర్వాత ఇద్దరు హీరోయిన్లతో చెరొక రెండు సాంగ్సు.. 
కామెడీ నటుడ్ని ఏడిపిస్తూ.. కొడుతూ ఒక సాంగు.. 
చివర్లో ఒక సానుభూతి (ఎమోషనల్)సాంగు.. 
హీరో అసలు స్వరూపం మిగిలిన పాత్రలకు తెలిసిపోయేక విలన్లని చేజ్ చేసి చివరాకర్న పెద్ద డెన్ ఫైటు..
ఇంతేనా...  ఇంకేమైనా కావాలా... 

మీ మొఖాలు మండా.. ఎదగండిరా.. అప్ డేట్ అవ్వండిరా... 
(ఎవరు??? డైరెక్టర్లా??..  .. ప్రేక్షకులా???         
Thursday, October 2, 2014

వీర బ్లాగర్ మైత్రీ.. "చెత్తే" కదా అని పక్కకి తోస్తే..పీక కోస్తా..

అయ్యలారా.. అమ్మలార.. 
మేము సైతం "స్వచ్ఛ భారత్" నడుం బిగించాము.. 
చేతులెత్తి నినాదం చేసాము..ప్రస్తుతము ఫుటోలు మాత్రమే పెడుతున్నాను..
"పరిసరాలు పరిశుభ్రంగా వుంచండి..స్వచ్ఛ భారత్ ని రూపొందించండి"  - ఈ నినాదము నేను సొంతంగా రాయగా దానినే మా అధికారులు బేనరులో ప్రచురించి అధికారికంగా కార్యక్రమము జరిపినందుకు ఆనందము..


ఇంకా మరికొన్ని నినాదాలు, సొంతంగా ప్ల కార్డుల రూపంలో తయారుచేసాను:

"పచ్ఛని చెట్లు - ప్రగతికి మెట్లు"..
"కాలుష్య నివారణ-ఆరోగ్యానికి పరిరక్షణ
"శుభ్రత పాటించండి-ఆనందంగా  జీవించండి..
"స్వచ్ఛ భారత్" కీ జై.. "భారత్ మాతా" కి జై.. 

Note:  టైటిల్ కి మాతృక .."ఇంద్ర" సినిమా రచయితది.. ఎరైటీగా వుంటుందని కాపీ కొట్టా.. ఆమాత్రం ఎట్రాక్షన్ లెకపోతే నా బొమ్మ చూడరుగా..