Monday, December 29, 2014

మీ కంటే బంధువులు, ఆప్తులూ ఎవరూ లేరు.. కాబట్టీ..

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2 రోజులు ముందుగానే అందుకోండి.. 
మా సిబ్బంది, అధికార్లు, బంధువుల కోసం తయారు చేసాను... 
మీ కంటే బంధువులు, ఆప్తులూ  ఎవరూ  లేరు.. కాబట్టీ..ముందుగా మీకు...అందుకోండి మీరు... 


 

"కొత్తా దేముడండీ..శిశువా..కొత్తా దేముడండీ.

రాష్ట్ర విభజన చేసిన పాపానికో..స్కాముల పుణ్యమా అనో..(కొంత మోడీ ప్రభంజనం).. కాంగిరెస్సు అడ్రస్సు లేకుండా పోయింది..ఇటు తెలుగు రాష్ట్రాల్లో.. అటు దేశంలో..

"కొత్తా దేముడండీ..శిశువా..కొత్తా దేముడండీ. " అంటూ ఓ సినిమాలో నూతనప్రసాద్ పాడుతూ..ఎగతాళి చేసినట్టుగనే.. ఈ కొత్త దేవుళ్ళు వచ్చి ఏమీ ఒరగబెట్టినట్లు లేదని ఇప్పుడిప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు..

ఠాట్ మే పుట్టి ఇంకా నెలలు నిండలేదు..అప్పుడే ఇంత ఎక్స్పక్టేషన్లా...ఇలా అయితే ఎలా?? గెడ్డం వున్న ఇద్దరు బాబులు..గెడ్డం లెని పొడుగు ముక్కాయన.. ధీర్గాలు తీస్తున్నారు..

ఇంగో పక్క సింగపూర్ చేస్తాం.. జపాన్ లాగ చేస్తాం..అంటూ పిట్ట దొర కబుర్లు చెబుతున్నారు.. ఎక్కడి సమస్యలు అక్కడనే వున్నాయి...

బాబూ గెడ్డపాయనా..కాస్త రాజమండ్రి రైల్ కం రోడ్డు బ్రిడ్జి వంక చూడవయ్యా... గోతులు పడ్డ రహదారుల వంక చూడండయ్యా...బాబూ గద్ద ముక్కాయనా... కాస్త భద్రాచలం బ్రిడ్జి వంక చూడవయ్యా..అయిదరబాదీ నల్లాల వంక చూడవయ్యా..
 
ఎప్పుడో ఇరవై ..ముప్పై సంవత్సరాల కితం ఎట్లున్నయో మన రోడ్లన్నీ ..డ్రైనేజీలన్నీ దాదాపు అలాగే వున్నాయి... ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.. ముందు వీటి పరిస్థితి చూడండి...
ఆనక సింగపూరే చెస్తారో.. జపానే చేస్తారో మీ ఇష్టం...

ఢిల్లీలో పెద్ద గెడ్డపాయన.. ప్రధాన మంత్రి అవడమే జీవిత ఆశయంగా పెట్టుకుని తీరా ఆ గద్దె ఎక్కింతరవాత.. ఇక పాలన తన మిత్రులకి అప్పచెప్పి ఇంచెక్కా రోజుకో దేశం తిరుగుతున్నాడు.. ఈ దేశంలో ప్రధానమంత్రి కంటే పెద్ద పోస్ట్ ఇక లేదుగా మరి... ఏవంటారు భయ్యా...    

Sunday, December 28, 2014

సుధీర్గ ప్రయాణం కారులో ...మంచుకురిసే వేళలో..

మొన్న December 25 తేదీన ఉదయం 5 గం.లకు విశాఖపట్నం లో బయలు దేరి మధ్య మధ్యలో ఆగుతూ సాయంత్రం 4.30 గం.లకు భద్రాచలం చేరితిమి.. 
26 వ తేదీన రాముల వారి దర్శన అనంతరం మణుగూరు వెళ్ళి తిరిగి రాత్రి భద్రాచలంలో విశ్రాంతి తీసుకుని... 27 వ తేదీన ఉదయం 7.30 గం.లకు బయలు దేరి మధ్య మధ్యలో భోజన విశ్రాంతి సమయాలు తీసుకుంటూ 6.30 గం.ల్కు విశాఖ చేరుకుంటిమి.. 
మొత్తం రాను పోను 900 కి.మీ ...సింగిల్ డ్రైవింగ్.. ఈ వయసుకు సాహస యాత్ర అని నేను అనుకుంటున్నాను..
కొన్ని ఫుటోలు ఇక్కడ పెడుతున్నాను.. వీక్షించండి...

-------- --------
 1. కుక్కునూర్ గ్రామం..అశ్వారావుపేట నుండి భద్రాచలం వెళ్ళే దారిలో..

 2. భద్రాచలం గుడి ముందు...నా కారుతో..

3. తిరుగు ప్రయాణం లో ఉదయం 8.30 గంటలకు.. కుక్కునూరు గ్రామం వద్ద... మంచుకురిసే వేళలో..  


5. కొవ్వూరు దగ్గర మన గోదారండె.. ఆయ్..   

Monday, December 22, 2014

మతం పేరుతో మోసం చేసేవాడు.. ఏ మతస్థుడైనా వాడికి శిక్షపడాలి..

ఈ మధ్య మతమార్పిడుల నిరోధక చట్టాన్ని గురించి పెద్ద చర్చే జరుగుతోంది.. 
(Note:నా వ్యాఖ్యలలో ఏవైనా సహేతుకమైన తప్పులు వుంటే చెప్పండి మారుస్తాను.. ఎవరినీ కించపరచడానికి కాని బాధపెట్టడానికి కాదు.. కొన్ని నా అనుభవాలు రాసాను. అంతే .. నాకు అన్ని మతస్థుల వారు మంచి స్నేహితులు వున్నారు). 
సెంట్రల్ లో బి.జె.పీ అధికారం లోకి వచ్చింది కాబట్టి.. హిందూ మత భావావేశాలు కలిగిన  ఆరెస్సెస్ ప్రభావం కలిగిన నాయకులు ఎక్కువగా వున్నారు కాబట్టి ఇన్నాళ్ళు దేశములో జరిగిన..జరుగుతున్న మత మార్పిడులను అడ్డుకట్ట వేయడానికి నడుము కట్టడం హర్షనీయమే.. .

చరిత్ర తవ్వుకుని అప్పుడు మీరు మాకు అన్యాయం చేసారు కాబట్టి ఇప్పుడు మీకు బతకడానికి హక్కు లేదు అన్నట్టుగా అగ్రవర్ణాల మీద సామాజిక, ఆర్ధిక, మానసిక దాడులు ఏ విధంగా ఇన్నాళ్ళూ జరిగాయో.. అదేవిధంగా హిందూ వాదులు ఇతర మతస్థులపై నిందలను మోపుతూ గత చరిత్రను తవ్వి తోడుతూ భారత దేశం అంటే కేవలం హిందూ దేశమే అన్నట్లుగా ప్రచారం చెస్తున్నారు.. 
నిజానికి అది నిజమే అయినప్పిటికీ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు..
1. ధ్వంసం అయిన హిందూ దేవాలయాలను చూస్తే ఏ హిందువుకైనా గుండె తరుక్కుపోతుంది.. ముక్కులు తెగిపోయి..చేతులు విరిగిపోయిన దేవతా మూర్తులని చూసిన హిందువులు బరువెక్కిన హృదయాలతో కుమిలిపోతారు..
2. ఎప్పటికైనా ప్రపంచం అంతా మా మతస్థులతోనే నిండి పోవాలి అని దురాశయంతో ఇతర మతస్థుల వాళ్ళు యుద్దాలు చేస్తూ.. మారణహోమాల్ని సృష్టిస్తూ..అమాయకులను బలితీసుకుంటూ వుంటే మానవత్వం వున్నవాళ్ళు రోదిస్తున్నారు..
నా అనుభవాలు:
1. ఒకసారి ఢిల్లీ వెళ్ళి ఎంతో ప్రయాసబడి శ్రీకృష్ణుని జన్మ స్థానమైన మధురా కి వెళ్ళాం.. ఆహా ఎంతో పవిత్రమైన స్థలానికొచామే అనుకుంటూ గుడి లోపల క్యూలైన్లో వుండగా.. హఠాత్తుగా ఒకామె.."హె..కృష్ణ నహీ.. అల్లా హై." అంటూ బిగ్గరగా అరుస్టూ విపరీతంగా ఏవో చేష్టలు చేస్తూ వుంటే భయపడిపోయాం.. ఏం గొడవ జరుగుతుందో అని బిక్కచచ్చిపోయాం.. వూరుకాని వూరు భాషకాని భాష... ఏదైనా జరిగితే???  ఇంతలో పోలీసులు వచ్చి ఆమెను పక్కకి లాగారు.. కాని అక్కడ వున్నంత సేపూ ఏదో అభధ్రతా భావం వెన్నాడుతూనే వుంది..చుట్టు గట్టి బందోబస్తు మధ్య ఏదోలా దర్శనం అయిందనిపించుకుని బయట పడ్డాం.. 
2. ఒకసారి తిరుపతి క్యూలైన్లో వున్నాం.. ఒకడు టీలు అమ్ముతున్నాడు.. నోట్లో కైనీ వుంది.. మందు కొట్టేసి వున్నాడు.. "మీరు ఎందుకు ఇంత కష్టపడి.. బాధలు పడి ఈ దేవుణ్ణి చూడటానికి వస్తారు?? మా ప్రభువుని పూజించండి.. ప్రార్థించండి..మీకు ఏ బాధలు వుండవు అంటున్నాడు.. ఎవరూ ఏమీ మాట్లాడ్డం లేదు.. వాడు దాన్ని అలుసుగా తీసుకుని ఇంకా బిగ్గరగా అరుస్తున్నాడు.. అప్పుడు నేను కలుగచేసుకుని "మీ దేవుడు నీకు మందు తాగమని చెప్పాడా..పాన్ పరాగ తినమని చెప్పాడా..ఇలా ఇతరులని కించపరచమని చెప్పాడా" అని అడిగి గట్టిగా దెబ్బలాడాను.. అప్పుడు నలుగురూ కలసి వాణ్ణి బయటకు పంపి వేసారు..   
3. ఒకానొక ఆసుపత్రిలో వరండాలో ఒకామె అరుస్తోంది బిగ్గరగా.. మా మతం లో కలవండి.. మీకు ఏ జబ్బులు రావు.. ఇది మరీ చిత్రం.. వాళ్ళ మతంలోని వాళ్ళు ఎవరికీ జబ్బులు రాలేదా..మరణించలేదా.. పేదరికంలో లెరా??? ఇదేం లాజిక్కో నాకు ఇప్పటికీ అర్ధం కాదు.. శ్రీ కృష్ణుడు భగవద్గీతలో  పుట్టిన ప్రతీ వారికీ మరణం తప్పదు అని చెప్పాడు..అది నిజం.. కాని ఆ మతం లోకి వెళితే వ్యాధులు రావు..మరణం సంభవించదు..ఎలా??

షరా: పై వ్యాఖ్యలను బట్టి నేను ఏ మతానికి వ్యతిరేకిని కాదు.. నేను చదివింది మిషనరీ స్కూల్లోనే.. కాని ఆ రోజుల్లో మా ఫాదర్లు..బిషప్పులు హిందువులన్నా.. పండితులు అన్నా.. చదువుకున్న వారన్న ఎంతో గౌరవంగా చూసేవారు... ఇప్పుడు రాను రాను.. పరిస్థితులు దారుణంగా వున్నాయి.. దీనికి అడ్డుకట్ట ప్రతీ ఒక్క మతస్థులు చెయ్యాలి.. హిందూ మతాన్ని అడ్డుపెట్టుకుని కుహనా బాబాలు..స్వామీజీలు ఎంతో మంది వెలుస్తూ  ప్రజలను దోచుకుంటున్నారు.. ఇక మూఢనమ్మకాలకు బలీయ్యేవారు బోలెడు మంది.. 

వీటన్నిటికీ  చట్టం రావాలి.. మతం పేరుతో మోసం చేసేది వాడు ఏ మతస్థుడైనా వాడికి శిక్షపడాలి..    

Sunday, December 21, 2014

హుద్ హుద్ తుఫాను అనుభవాలు..

ఈ వీడియో తుఫాను వెలిసిన అనంతరం తీసినది.. 
 ఇక్కడ నొక్కండి
తుఫాను రాకముందు కైలాసపురం (సాలగ్రామపురం) పోర్టు క్వార్టర్లు నేను తీసిన  భవనం నుండి కనిపించవు.. అలాగే దూరాన కొండమీద ఇండ్లు కూడా తుఫాను రాకముందు కనిపించేవి కావు.. చెట్లు కూలిపోవడము వలన..ఇప్పుడు అవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి..
బోసిపోయిన హైవే రోడ్డు ను చూసి ..రోజూ తిరిగే  జంక్షన్లను చూసి నోట మాట రాక బాధతో కుమిలిపోయాం..
నిజం చెప్పాలంటే ఇండ్ల ముందు పడిన చెట్లను స్వచ్చందంగా ప్రజలే ఎవరికి వారు నరుక్కుని దారి ఏర్పరచుకున్నారు.. మంచి నీటిని ఎవరి ఏర్పాట్లు వాళ్ళే చేసుకున్నారు... 

మా ఏరియాలో చేతి పంపులతో వున్న బోర్లు మా ప్రాణాల్ని కాపాడగా.. కొండవాలు ప్రాంతాలైన కైలాసపురం మొదలు మురళీ నగర్ వరకు సహజసిద్ధంగా దొరికిన నీటిని పట్టుకున్నారు.. 
ఎపార్టుమెంట్లో వాళ్ళు జనరేటర్ల సహాయంతో (అద్దె గంటకి వెయ్యి రూపాయలు)  నీటిని (బోర్ వాటర్లను) పైకి టాంకుల మీదికి ఎక్కించుకున్నారు... 
అయితే పది అంతస్తుల వాళ్ళు వుదా: నావల్ క్వార్టర్లలో వాళ్ళు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం..
చంద్ర బాబు నాయుడు గారు హుటాహుటిన రావడము వలన కరెంటు నాలుగు రోజులలో వచ్చింది.. రేషను కార్డుల మీద అందరికీ నిత్యావసర సరుకులు ఇచ్చారు..(వుచితంగా).. మిగిలిన అన్ని సౌకర్యాలు వెనువెంటనే జరిగాయి (పాల సరఫరా వగైరా).. 

కాని మిగిలిన స్థానిక ఎం.ఎల్.ఏలు గాని..అధికార్లు గాని ఇండ్ల వద్దకు వచ్చి ధైర్యం చెప్పిన పాపాన పోలేదు... 
కేవలము ప్రజల సహనము వలన, మంచితనం వలన కొట్లాటలు జరుగలెదు...ఇంతటి విపత్కర పరిస్తితుల్లో కూడా విశాఖ నగరం ప్రశాంతంగానె వుంది.. 
అయితే మన వాళ్ళకన్నా ఒరిస్సా రాష్ట్రం నుండి వచ్చిన ఎలక్ట్రికల్ సిబ్బంది చాలా చురుగ్గా   పనిచేసారు.. కారణం ఒకటి అనుభవము రెండు కుర్రాళ్ళ సంక్ష్య ఎక్కువ..    

Thursday, December 18, 2014

హుద్-హుద్ తుఫాన్ భీభత్సాన్ని కనులారా వీక్షించండి.
మిత్రులారా ...హుద్-హుద్ తుఫాన్ భీభత్సాన్ని  కనులారా వీక్షించండి.. మా ఇంటి గుమ్మం లోంచి తీసాను ఈ వీడియో.. మీ అభిప్రాయాలు తెలియచేయండి..

Link:
https://www.youtube.com/watch?v=acSr7iK0BDc&feature=youtu.be


Tuesday, December 16, 2014

అన్యమతస్థులు యోగా చెయ్యకూడదా??
భారతీయ యోగా కి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చి ఐక్యరాజ్య సమితి వారు ప్రకటన చేయడం హర్షణీయం..గర్వించతగ్గ విజయం.. 
ఈ క్రెడిట్ అంతా మన ప్రధాని శ్రీ మోడీ గారిదే అని ఘంటాపదంగా చెప్పొచ్చు.. 
ఇంకా శ్రీ రాందేవ్ బాబా లాంటి గొప్ప యోగీశ్వరులది... 
స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ళ తర్వాత మాత్రమే ఈ గుర్తింపు రావడం కొంత బాధాకరం.. గత పాలకుల నిర్లక్షం..
యోగా పుట్టింది మన పవిత్ర భారతా వనిలో ..  మనం గుర్తించం..
 
కాని.. పరాయి దేశస్థులు చాలా మంది యోగ విద్యను అభ్యసించి చక్కటి దేహదారుఢ్యాన్ని, ఆరోగ్యాన్ని కల్గివుంటే మన భారతీయుల్లో చాలామంది దురలవాట్లకు లోనై డబ్బుని ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటూ సమాజానికి కూడా చెడు చేస్తున్నారు..  
ఈరోజున ఎన్ని మర్డర్లు..ఎన్ని మానభంగాలు.. తప్ప తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నవారు.. వీటన్నిటికీ ఒకే ఒక్క కారణం.. చెడు వ్యసనాలకు లోనవడం.. ఇంకా ప్రణాళికా బద్ధమైన జీవనవిధానం లోపించడం.. 
వీటన్నిటికీ యోగా చక్కటి పరిష్కారాన్ని చూపెడుతుంది..    
మా మిత్రుడు ఒకాయన కృష్టియన్ ఒకసారి "పొట్ట పెరిగిపోతోంది.. షుగర్ లెవెల్ పెరుగుతోంది ఏం చెస్తే బావుంటుంది చెప్పండి".. అని అడిగితే అప్పటికే యోగ మార్గంలో వున్న నేను "ఒక మూడు నెలలు యోగా చెయ్యండి .. మార్పు వస్తుంది అని సూచించా".. అప్పుడు అతను యోగా అంటే కేవలం హిందూ మతానికి సంభంధించినది అని..పైగా చాలా కష్టమైన  పని అని దాటవేశాడు.. పైగా వేళాకోళం చేసాడు... 

అయితే మరు మూడు సంవత్సరముల తర్వాత.. "మీరు చెప్పింది నిజమే ..నేను నెల రోజుల నుండి యోగా క్లాసులకి వెళ్తున్నాను.. చాలా మార్పు వచ్చింది.. అసలు యోగాకి మతానికి సంభంధమే లేదు...అవేళ మిమ్మల్ని అవహేళన చేసినందుకు సారీ" అని చెప్పాడు..
ఆరోజే నేను అతనితో వాదనకు దిగితే ప్రయోజనం వుండదు.. తన అంతట తానే తెలుకుని గుర్తించాడు.. ఈ సహనం.. నిరీక్షణ.. అనుకూల ప్రతికూల పరిస్థితులలొ కూడా  ఒకేలా వుండగలగడం ఇవన్నీ యోగా, ధ్యానముల మాత్రమే సిధిస్తుంది.. మిత్రులారా.. యోగాలో ఆసనాలు వేరు.. ధ్యానం వేరు... ఆసనాలు, ప్రాణాయాం చేస్తూ ధ్యానం చేసుకుంటే త్వరగా మంచి ధ్యాన స్థితికి చెరవచ్చు.. 
అట్లు వీలు కానిచో చక్కగా ధ్యానం మాత్రమే చేసుకుని ఆనందాన్ని అనుభవించచ్చు.. 
ఇకనేం మొదలు పెట్టండి.. 
మీకు దగ్గరలో గల యోగా సెంటర్ కి వెళ్ళండి.. కాని సరి అయిన గురువుని ఎంచుకోండి..ఈ రోజుల్లో ఇంటర్ నెట్ ద్వారా.. పుస్తకాల ద్వారా ధ్యాన పధ్ధతులు.. ఆసన పధ్ధతులు తెలుసుకోవచ్చు.. కేవలం ఒక అరగంట కేటాయించలేరా??? శ్రీ కృష్ణుని  ద్వారా యోగమార్గాన్ని  అందచేసిన వ్యాసభగవానుడికి పాదాభివందనములు... 
 హైందవ సిధ్ధాంతాలని ప్రపంచానికి అందచేసిన ఎందరో గురువులకు అనేక నమస్కారములు..
ప్రస్తుత ప్రధానికి వేల వేల నమస్కారములు..     
 

Friday, December 12, 2014

ఇదేనా బంగారు తెలంగాణా???

 

షర్మిలకి కనిపించినది ..తె.రా.సా వాళ్ళకి కనబడలేదా?
ఒక మహానేత..జననేత..పూర్వ రాజుగారైన వై.ఎస్స్.ఆర్ ముద్దు బిడ్డ శ్రీమతి షర్మిలమ్మ గారు గత రెండు / మూడు రోజులుగా తెలంగాణాలో ఓదార్పు యాత్ర అనబడు కార్యక్రమం పేరుమీద పర్యటిస్తూ అనేక విషయాలు సెలవిస్తున్నారు..
"రైతులు అప్పులు బారిన బడి,.. కరెంటు లేక, నీళ్ళు లేక, అనేక బాధలు పడుతున్నారు.. అత్యంత దయనీయ స్థితిలో బతుకు ఈడుస్తున్నారు" అని...
మరి నేటి తెలంగాణా పాలకులకు ఇవేవీ కనబడటం లేదా... హైద్రాబాదు లో ఆకాశ హర్మ్యాలు నిర్మించి సింగపూర్, జపాన్ లాగ తయారు చేసే వారికి రైతుల కన్నీళ్ళు ఆకలి చావు కేకలు వినబడటము లేదా???
ఇదేనా బంగారు తెలంగాణా??? 


ఇలా ఈ వివాదాస్పదమైన వాఖ్యలు ఎందుకు రాసానంటే నా ముందరి టపా ఎవరూ చదివినట్టు అనిపించలేదు.. అసలు "కూడలి" లో గాని, జల్లెడ లో గాని ఎక్కడా కనబడటము లేదు.. అందువల్ల ఈ టపా చదివిన వారు ఈ విషయములో హెల్ప్ చేస్తారని ఇలా టి.వీ 9 లాగ కాస్త అతిగా వాగాను... అదీ సంగతి...

 

Thursday, December 11, 2014

హుద్-హుద్ తుఫాను - మా ఇంటిపై కూలిన వృక్షాలు..

అయ్యలారా ! అమ్మలారా !
హుద్ -హుద్ తుఫాను ఎంత భీభత్సం సృష్టించిందో మీకందరకీ తెలుసు.. అయితే ఇన్నిరోజులు తుఫాను ప్రభావము వలన ఇంట్లో నెట్ వర్క్  లేక 

ఆ దృశ్యాలను మీతో పంచుకోలేక పోయాను..   
ఇప్పుడు వీక్షించండి.. 

ఇది మా ఇల్లు.. ఇంటిపై కూలిన చెట్లు..ఇతర దృశ్యాలు..