Saturday, April 25, 2015

నిజంగా మన రాష్ట్రం ఇంకో ఇరవై , ముప్పై ఏళ్ళకి సింగపూర్, జపాన్ ల్లాగ అయిపోతుందా

అదొక ప్రభుత్వ కార్యాలయము...
సమయము: ఉదయము పదిన్నర దాటింది..
రిజిష్టర్ లో సంతకాలు పెట్టి స్టాఫ్ అంతా కాంటీన్ వైపు నడిచారు.. 
కాఫీ..టీలు వచ్చేలోగా పిచ్చాపాటి... ..

అసలు వచ్చిందే అరగంట లేటు..అలసిపోయి వచ్చారుగా సేద తీరాలి కదా... ఓ గంట కాంటీన్ కి వెళ్ళి టీ తాగితేనే గాని బుర్ర పనిచెయ్యదు.. 

"బాసూ.. మన రాజధాని సింగపూర్ లాగ చేస్తాడట బాబు"..
"మోడీ చూసేవా ఎంత అన్యాయం చేసాడో ఆంధ్రాకి"..
"ఈ వెంకయ్య నాయుడిదే తప్పంతా.."


ఇంతలో ప్యూన్ వచ్చాడు "సార్..ఎ.ఓ గారు పిలుస్తున్నారు"..ఏదో అర్జంటు ఫైలు హెడ్ ఆఫీసుకి పంపించాలట.."
"ఏవిటయ్యా అంత అర్జంటు.. కిందటి వారమేగా ఆ ఫైల్ వచ్చింది.. ఇంకా ఎహ్.ఏ రిమార్క్స్ రాయలేదు.. ఎందుకంత ఓవర్ ఏక్షన్ చేస్తున్నాడు... నాతో పెట్టుకున్న పాత ఎ.ఓ గతి ఏమయ్యిందో చెప్పు.. ఎడ్రస్సు లేకుండా పోగలడు.." 


మరొకడు అందుకున్నాడు... "నిన్న నాతో కూడా చాలా అహంకారంగా మాట్లాడాడు బాసు..రోజూ అరగంట లేటుగా వచ్చి, గంట ముందుగా వెళ్తున్నావేమిటీ?? అంటూ ఆరాలు తీస్తున్నాడు.. 


మన టైపిస్టుని కూడా ఏదో వంకతో తిడుతున్నాడట.. 
అరె.. టైపింగులో ఆ మాత్రం తప్పులు రావా.. అడ్జస్ట్ అయిపోవాలి గాని.. అసలు నువ్వు టైపింగు టెస్టు పాసయ్యావా లేదా అని ఒకటే వేధింపులు.. 

వీడి గురించి మన యూనియన్లో కూడా డిస్కషన్ అయ్యింది... మన ప్రెసిడెంటు సమయం చూసి ఏదో ఒక కేసులో వీణ్ణి ఇరికిస్తానని ప్రామిస్ చేసాడులే... "  

.....సీను నంబర్ రెండు.....


అది ఒక ఆసుపత్రి.. నైటు షిఫ్టు..  
కాజువాలిటీ కి వరుసగా రోగులు వస్తున్నారు..
కాని ఇవేమీ పట్టనట్టు డాక్టరు బాబు విశ్రాంతి గదిలో గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు.. 


పగలంతా అలసిపోయున్నాడు...ఫ్రండ్సుతో పేకాటలు అవి అయ్యాక హోటల్ భోజనం విత్ లిటిల్ ఆల్కహాల్ తో మస్తు ఎంజాయ్ చేసే సరికి నైట్ షిఫ్ట్ కి టైం అయిపోయింది.. 
అలాగే నేరుగా వచ్చేసాడు .. 
అలసి పోయి వున్నాడేమో బకాసరుడుకి తమ్ముడి లాగ.. కుంభకర్ణుడి కి బామ్మర్ది లాగ నిద్దర పోతున్నాడు..

ఇంతలో వార్డు బోయ్ డిస్టర్బ్ చేసాడు.. "సార్ కేస్ వచ్చింది".. అని..
"ఏం కేసు??"
"జ్వరం.. విపరీతమైన దగ్గు..ఆయాస పడిపోతున్నాడు సార్.."
"ఆ మాత్రం దానికే హాస్పిటల్ కి వచ్చేయాలా.. దిక్కుమాలిన సంత.. ఓ గంట రెస్టు తీసుకోనివ్వరుగా.."
"సార్.. మరో పాయిజన్ కేస్ కూడా వచ్చింది సార్.."
"వెధవ పూర్తిగా తాగి చావక.. సగం తాగి మనల్ని చంపడాని వచ్చాడన్న మాట..

అయినా ఆ నర్సు ఏం చేస్తోంది.. ఏదో ఒకటి ఇచ్చి తగలడమనవయ్యా.."
"అలాగే సారు"... 


తెల్లారింది.. అయ్యగారికి మత్తు దిగింది.. రాత్రంతా ఓ పది కేసులు ఇలాగే వస్తే నర్సు మానేజ్ చేసింది..
అన్నీ వివరంగా రాసింది...ఎవరెవరు వచ్చారు.. వాళ్ళకున్న జబ్బేవిటీ ..ఎంత టెంపరేచర్తో వచ్చారు.. వచ్చినప్పుడు బీ.పీ ఎంత వుందీ..  ఇచ్చిన మందులు అవీ...  అన్నీ వివరంగా నోట్ చేసింది..


అవన్నీ పక్కన పెట్టుకుని ఒక్కక్క కేసుకి ఒక్కొక్క పేజీ రిపోర్టు అందంగా  రాసేసి.. 

చాలా కష్టపడి రిపోర్టు రాసినందువలన ఓసారి సుధీర్గంగా ఒళ్ళు విరుచుకుని..దిగువ సంతకం పెట్టి.."వస్తాను సిస్టర్.. రాత్రి చాలా బాగ మానేజ్ చేసారు.. థాంక్యూ..." అని వెళ్ళబోతూ... 

"అవునూ...నాకు కిందటి నెల నైట్ అలవెన్సు రాలేదని ఆ టైం కీపర్ గాడి
కి చెప్పాను.. వాడ్ని ఓ సారి నాకు కలవమని చెప్పండి...గట్టిగా వార్నింగ్ ఇస్తేనే గాని చేసేలా లేడు...  " అని ఆర్డర్ వేసాడు..
ఇంతలో మార్నింగు షిఫ్టికి రావలసిన డాక్టరు వచ్చాడు..
"హలో అవినాష్.. ఏంటి డల్ గా వున్నావు.. రాత్రంతా నిద్రపోలేదా. అంతేలే కొత్తగా పెళ్ళయ్యింది కదా.. (అహ్హ... అహ్హ... పెద్ద నవ్వు..)
అవతల అంబులెన్సు లో సీరియస్సు కేస్ ఒకటి దించుతున్నారు.. అయినా అవేమీ పట్టనట్టు ఒకటే నవ్వులు.. జోకులు..


"అవునూ మన రాజధాని పేరు అమరావతి అట.. ఈ చంద్రబాబు కి బుద్ది  వుందిటయ్యా.... చక్కని పొలాల మధ్యలో రాజధాని పెడుతున్నాడు.. హాయిగా ఏ కడప లోనో కర్నూల్ లోనో పెట్టక..."
"అయినా ఈ మోడీ గాడు మాత్రం తక్కువ తిన్నాడా.. అంతా వ్యాపారస్తులకి దోచిపెట్టేయ్యడమే కదా అతని ఎజెండా..." 


 .......story over..... అయ్యా... ఇప్పుడు చెప్పండి... నిజంగా మన రాష్ట్రం ఇంకో ఇరవై ,  ముప్పై ఏళ్ళకి సింగపూర్, జపాన్, చైనాల్లాగ అయిపోతుందా.... మీకా నమ్మకం వుందా.. నాకైతే లేదు...
 

Saturday, April 4, 2015

ఈ దుశ్చర్యకు.. తెలంగాణా కు లింక్ ఎందుకు పెట్టానంటే..

ముందుగా.. భయంకరమైన ఉగ్రవాదులతో పోరాడి అసువులు బాసిన పోలీసు సోదరులకు.. వీరులకు  నివాళులు .. 
గాయపడిన ప్రతిఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు.. 
ఈ తెలుగు రాష్ట్రాలకు.. భారతదేశానికి మీరు చేసిన సేవ అమోఘము.. అసమాన్యము..అమరము..  
విభజన జరగక ముందే పోలీసు అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులు హెచ్చరించారు.."ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే ఉగ్రవాదులు, తీవ్రవాదులు పెచ్చుమీరుతారు.. తమ కార్యకలాపాలు యదేశ్చగా ఎటువంటి భయమూ లేకుండా నిర్వహిస్తూ విజృంభిస్తారు" అని.. 
అప్పుడు తెలంగాణా వాదులు వేళాకోళం చేసారు..  ఇప్పుడు అదే జరిగింది.. "సిమి" కార్యకర్తలు అంటే మామూలు నేరాలు చెసే దోపిడీ దొంగలో.. తీవ్రవాదం పేరుతో అడవుల్లో చెలరేగిపోతున్న అన్నలో కాదు.. భయంకరమైన ఉగ్రవాదులు.. పొరుగునే వున్న శత్రుదేశ సంరక్షణలో పెరుగుతున్న నరరూప రాక్షసులు.. 

మన దేశములో మానవ బాంబులు సైతం పెట్టి అరాచకం సృష్టించి మానవహోమం రగిల్చడమే కాక భద్రత, రక్షణ వ్యవస్థలను నాశనం చెయ్యడమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు..
మన పోలీసులు గనక ఈవిధంగా పోరాడి మట్టిపెట్టక పోయి వుంటే ఎంత విధ్వంసం జరిగేదో ఊహించలేము..   వారిలో ఇద్దరు మాత్రమె చనిపోయారు.. ఇంకా ఎంతమంది వున్నారో తెలీదు.. ఎక్కడ వున్నారో తెలీదు..
ఒక బాధ్యత కలిగిన హోం మంత్రి గారు.. సూర్యాపేట సంఘటన  జరిగిన వెంటనే "ఇదేమీ ఉగ్రవాదుల చర్యకాదు" అని సెలవిచ్చారు..
అదే పవన్ కల్యాణ్ అయితే "అబ్బబ్బబ్బా ..ఏమి సెలవిచ్చితిరి ..ఏమి సెలవిచ్చితిరి" అంటూ పొగిడే వాడు..
నేను ఈ దుశ్చర్యకు..  తెలంగాణా కు లింక్ ఎందుకు పెట్టానంటే.. ఈ వ్యాఖ్యలతో సంచలనం సృష్టించాలి అనో.. దీన్ని కూడా వివాదం చేద్దామనో కాదు.. మన పాలకుల నిర్లక్ష్య ధోరణి..
ఎంతసేపూ "చనిపోయిన వారి కుటుంబాలకు డబ్బిస్తాం..ఉద్యోగాలు ఇస్తాం" అని ప్రకటిస్తున్నారే గాని.. ఇలాంటి ఉగ్రవాదుల మీద ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుని అరికడతాం.. పోలీసులకు ఆధునిక ఆయుధాలు ఇస్తాం.. మరింత శిక్షణ ఇస్తాం" అని ఒక్క మంత్రి అయినా ... ముఖ్యమంత్రి అయినా ప్రకటించారా???
ముఖ్యమంత్రి కూడా పొడి పొడి మాటలు రెండు మాట్లాడి ఊరుకున్నాడు.. గట్టిగా మాట్లాడితే ఆ మతం వారు లేదా.. వారి వెనక వున్న రాజకీయ నాయకులు ఏమనుకుంటారో అన్న భయం.. ఆ మతస్థుల ఓట్లు పడవేమోనన్న భయం..
దర్జాగా దర్గాలో రాత్రంతా విశ్రాంతి తీసుకున్నారూ అంటే.. ఆ దర్గా నిర్వాహకులు వారి వెనక వున్న నాయకులు .. వీరందర్నీ ప్రశ్నించే అధికారం పోలీసులకి ఈ రాజకీయ నాయకులు ఇవ్వగలరా?? 

పోలీసులకు సమాచారం అందించిన తెలంగాణా పౌరులకి ఇదే నా సలాములు.. గులాములు..  

ఇట్లా ప్రజలు కూడా కేవలం ప్రేక్షక పాత్ర వహించకుండా ఉగ్రవాదుల నిరోధన లో పాల్గొంటేనే తప్ప.. ఇటువంటి దుర్మార్గులను.. రాక్షసులను.. అంతమొందిచలేము.. మరొక్కసారి పోలీసు అమరవీరులకు జోహార్లు.. 
తెలంగాణా మరో బీహార్ కాకుండా రక్షించాల్సిన అవసరం వుంది..