Sunday, June 28, 2015

నా తాన కోటి ఏడుపుల వీణ..


నీ దుంప తెగ..
"ఒక మహానుభావుడికి" కి నివాళులు ఇచ్చే సమయంలో కూడా ఏడుపే..
ఇంకా ఎన్నాళ్ళు వినాలిరా బాబు ఈ ఏడుపులు..


ఒకడేమో "ఆయన్ని" అవినీతి పరుడని తిడతాడు..
వేరొకడేమో ఆకాశమంత ఎత్తున కీర్తిస్తాడు.. 


మీరు ఎన్నుకున్న నేతలకి కనీసం నివాళి అర్పించడానికి తీరికలేదు..
మీ ఏడుపులు మీరు ఏడవక ఇంకా ఎన్నాళ్ళు పక్కోడి మీద పడి ఏడుస్తారు?? 


"ఉస్మానియా" లో తన్ని తరిమేస్తే "ఆంధ్రా" లో సీటు ఇయ్యలేదంట..
తన్ని తరిమేసిన ఉస్మానియా ది తప్పులేదు గాని సీటు ఇవ్వని ఘనత ఆంధ్రోళ్ళదంట..


"ఏమి సెప్పితిరి..ఏమి సెప్పితిరి.. రాసుకోరా సాంబా..


ఆనాడు ఎన్టీ వోడు త్యాగం చెయ్యబట్టే కదరా ఆ మహానుభావుడు ప్రధాని అయ్యింది... 

 
 

Saturday, June 13, 2015

ఛీ .గబ్బు నాయాలా.. సన్నాసీ.. ఏబ్రాసీ .. లుచ్చా ..
మంచి చిలక: 
రండి ..రండి ..బావున్నారా?? 


చెడ్డ చిలక: 
ఛీ .గబ్బు నాయాలా.. సన్నాసీ.. ఏబ్రాసీ .. లుచ్చా ... నువ్వు ఆడోనివా?? మగోనివా??.. 

నీతి:
చిలుకలన్ని  నొక్క పోలిక నుండు .. 
చూడ చూడ పలుక  జాడ వేరు .. 
పలుకు నేర్పిన గురువు తప్పు గాని   .. 
చెడ్డ పలుకు పలికిన చిలక తప్పు గాదయా.. 
విశ్వ ఓలేటి మాట వినగ రండయ్యా. ..  
 

Friday, June 5, 2015

అయితే... ఈ కేసుల వలన ఎవరికి ప్రయోజనం??

అరవ దేశంలో ఎప్పట్నుంచో ఒక సాంప్రదాయం వుంది.. 
ప్రధాన పార్టీలు రెండు ప్రతీ ఐదేళ్ళకోసారి అధికార, ప్రతిపక్ష స్థానాలను మార్చుకుంటాయి... 


ఆ విధంగా తీర్పునిస్తూ రాజకీయ నాయకులకన్నా సామాన్యులైన ప్రజలే చాలా తెలివిగా ఒక్కో దఫా ఒక్కొక్క పార్టీని అందలం ఎక్కించి పబ్బం గడుపుకుంటున్నారు అన్నా  ఆశ్చర్య పోనక్కర్లేదు.. 
చెరో పార్టీల వాళ్ళు పోటాపో టీగా ప్రజలకు అంతో ఇంతో మంచిపనులు చేస్తూ వుంటారు.. 
మరో పక్క ఇక దీనివలన ప్రత్యర్థులైన ఇరుపార్టీల వారూ తమ వ్యక్తిగత కక్షలకు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షం వారిపై కక్ష సాధింపు చర్యలు గైగొంటారు.. 

అవతల నాయికీమణిని   నిండు సభలో చీర లాగి జాగట్టు చింపి ద్రౌపదీ వస్త్రాభరణం చేస్తే... అందుకు ప్రతిగా అర్ధరాత్రి పంచలూడదీసి మరీ జైలులో కూర్చునే పరిస్థితి వస్తుంది ఇవతల వారికి.. 
కొడుకు, కోడలు, కూతురు వగైరాలు అవినీతి కేసుల్లో జైలుకెళ్ళినా అది తాత్కాలమే...


100 కోట్ల అవినీతి అని లోకల్ న్యాయ స్థానం తీర్పు ఇచ్చినా పై కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం విడ్డూరమే...
ఎప్పుడో ఇందిరా గాంధీ హయాములోనే రాజకీయం వ్యాపార వస్తువు అయిపోయినప్పుడు ఇప్పుడే ఏదో కొత్తగా తప్పు జరిగిఓయినట్టు గగ్గోలు పెట్టడం వింతగానే వుంది..


నెలకో ముఖ్యమంత్రి ని మారుస్తున్న కాంగిరేసు అధిష్టానాన్ని ధిక్కరించి ప్రాంతీయ పార్టీ పెట్టి అఖండ విజయం సాధించి గద్దెనెక్కి నెల రోజులు కాకుండానే కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్ లో కుర్చీ విరిగిపోయింది...  


Next..వైస్రాయ్ హోటల్ లో ఏమిజరిగిందో ప్రజలందరూ ఇంకా మర్చిపోలేదు.. ఇప్పుడు కత్తులు దూసుకుంటున్న ఇరు ప్రాంత నాయకులు అప్పుడు కలసి మంత్రాంగం నడిపిన వారే.. 


ఓటుకు నోటు నాయకులు మాత్రమే తీసుకుంటున్నారా..  నగదు, బట్టలు, మందు ఇత్యాదివి పడితేనే గాని ఓట్ల పండగ పూర్తి అవదే.. 
 
అయితే ఈ కేసుల వలన ఎవరికి ప్రయోజనం??


నాయకుల
కే.. ఎలా??

 
రోజూ సెన్సేషనల్ న్యూస్ గా ఇవి చూపించి అసలు సమస్యలనుండి ప్రజలను పక్క దారి పట్టించడం...

ఎవరు అధికారం వున్నా .. పైపైకి ఎన్ని గొడవలు వున్నా.. ఎవ
డి వ్యాపారం వారిది... ఎవడి అవినీతి వాడిది..
దొంగలు దొంగలు వూళ్ళు పంచుకున్నట్టు...


ఇంతకీ నే చెప్పొచ్చేదేవిటంటే అరవ వాళ్ళ లాగ మనం కూడా తడవకి ఒకణ్ణి అధికారం లోకి కూకో పెడితే గాని... ఈళ్ళు దారిలోకి రారు.. 


నాయకులకన్నా ప్రజలే తెలివైన వాళ్ళు కావాలి..


నేను ఎవరిని సమర్ధిస్తూ గాని ఎవరిని వ్యతిరేకిస్తూ గాని రాయట్లేదు...
రాజరికంలో వారసత్వంగా వచ్చే అధికార పీటాన్ని వద్దనుకుని ప్రజాస్వామ్య పద్దతిలో నాయకుణ్ణి ఎన్నుకొనేలా రూపుదిద్దారు రాజ్యాంగాన్ని.. 


అతి పేద వాడు గాని, ఆ రోజుల్లో అణగారిన వర్గానికి చెందిన వారు గాని అధికార పీఠం పై కూర్చోవాలని కలలు గన్న నాయకులు రాసిన రాజ్యాంగం...
దీన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలకు మాత్రమే వుంది..