Sunday, February 28, 2016

రేపటి కుల పోరాటాలు.....

 కుల వర్గాల వారీగా.. :

1. రైళ్ళలో ఉచితంగా  బెర్త్ లు కేటాయించాలీ .... విమాన చార్జీల్లో రాయితీ ఇవ్వాలి.. 

2. ఒలింపిక్స్ లలో... నేషనల్ గేమ్స్ లలో ఓడిపోయినా సరే విజేతలుగా ప్రకటించాలి... 

3. క్రికెట్ లో 5 రన్స్ చేస్తే 50 రన్స్ గాను.. 10 రన్స్ చేస్తే సెంచరీ  గా డిక్లేర్ చెయ్యాలి.. 

4. పద్మ అవార్డులలో కేటాయింపులు కావాలి.. 

5. తిరుపతి దర్శనం నేరుగా కల్పించాలి.... ఒక్కో కులానికి ఒక్కో క్యూ లైన్ ఉండాలి..కులాన్ని బట్టి లడ్డూలు కేటాయించాలి. 

6. అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనాలతో ఘనంగా చెయ్యాలి.. 





Friday, February 5, 2016

బ్రాహ్మణ భావజాలమంటే..

'అభ్యుదయ భావం' అంటే...
బ్రాహ్మణ భావజాలాన్ని వ్యతిరేకించడం..


బ్రాహ్మణ భావజాలమంటే..
వర్ణ వివక్షత కల్గి ఉండుట..
దురాచారాలు ఆచరించుట..
మూఢ విశ్వాసాలు పెంపొందించుట..
సమాన హక్కులు భంగపరచుట..
స్త్రీ స్వేచ్ఛను కాలరాయుట..


అందుకే బ్రాహ్మణ భావజాలాన్ని వదిలిపెట్టాం..కానీ... 

దాంతో బాటుగా..కింది జాడ్యాల్ని వదిలి పెట్టాం..

ఆయాచితంగా వచ్చేవాటిపై ఆశ లేకుండుట..
నిస్వార్ధం, నిష్పక్షపాతం తో పనిచేయుట..
వినయ విధేయతతో విరాజిల్లుట...
గౌరవాభిమానములతో మనుగడ సాగించుట..


అందుకే హాయిగా..
దొరికినంత దోచుకో..
దోచిందంతా దాచుకో..
ఇదీ అభ్యుదయ వాదం..
ఇదే నేటి ఆధునిక సిద్ధాంతం..




కులాల కుమ్ములాటలో దిక్కులేని చావు చస్తాం.. 
కాని అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని సహించం..

హక్కుల కోసం పోరాడతాం... 
అడ్డొచ్చిన వారిని అడ్డంగా నరికేస్తాం.. 

అరాచక శక్తులకు అండగా నిలబడతాం.... 
హిందు పురాణాలను ఎండగడతాం.... 

ఇదే అరవై ఏళ్ళ రాజ్యాంగం మాకిచ్చిన హక్కు.. 
కాదని ఎవడైనా కూసేడో.. అసహనం వెళ్ళగక్కుతాం.. 
మీడియా సాక్షిగా దేశాన్ని అగ్ని గుండంగా మారుస్తాం.. 
ఖబడ్దార్..