Saturday, April 30, 2016

రాముడంటే ఎన్.టీ.వో డే ... అంబేడ్కర్ అంటే... నేనే..


గబ్బర్ సింగు మూడో పార్టు తీసుకో...లేదా కొత్త పెళ్ళాన్ని వెతుక్కో...


సార్ధక నామధెయుడై గాలి తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటే... 
అన్నయ్య హీరోని చేసాడు... 

హీరో లాగ నిజమైన ఫాక్ష్యనిష్టులతో ఫైట్ చెయ్యబోతే....

గుండు కొట్టి వదిలేసారు... 

హీరో లాగ నిజజీవితంలో ముగ్గురో నలుగురో యువతులను లవ్వాడి పెళ్ళాడాడు...  


హీరో లాగ అన్నయ్య పార్టీ ప్రచారంలో పంచ్ డైలాగులు కొడితే పంచెలూడతీసారు.. 


హీరో లాగ సొంత పార్టీ పెట్టబోయినా.... 

అన్నకు పట్టిన గతే పడుతుందని భయపడ్డాడు.. 

ఎవడికీ అర్ధం కాడు...ఏంచేస్తాడో ..ఏం మాట్లాడతాడో తెలీదు... 


ఇలాంటి గొప్పోడు.. వేలకొద్దీ పిచ్చ అభిమానులున్న హీరోగారు... 


ట్విట్టర్ లో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాదు... 

సుద్దులు చెబుతున్నాడు...  

కాంగీ వోళ్ళు చేసిన తప్పులే చెయ్యకండని మితృలకు హితవు పలికాడు.. 


ఇన్నాళ్ళూ ఏమైపోయావు నాయనా.. ఇప్పుడే గురుతుకు వచ్చిందా రాష్ట్రం..


రెండేళ్ళు ఆగితే ఎలచ్చన్లు వచ్చేత్తాయి... 

ఈ మొసలి కన్నీళ్ళు అప్పుడు కారిస్తే..  

పిచ్చజనం నీమాటలకు ఊగిపోయి ఈలలు వేసి..

నువ్వు సెప్పినోడికి ఓట్లేత్తారు..

అందాకా గబ్బర్ సింగు మూడో పార్టు తీసుకో...లేదా కొత్త పెళ్ళాన్ని వెతుక్కో...
ఎంజాయ్...

Thursday, April 14, 2016

దేవుణ్ణి అలాగే వుండనివ్వండి.. అంబేద్కర్ ని అలాగే వుండనివ్వండి..

ఈరోజు డా.అంబేద్కర్ జయంతి కాబట్టి..
 ముఖ్యమంత్రులు..నాయకులు..డా.అంబేద్కర్ ని పొగడుతూ కుల తత్వం పోవాలని..అగ్రవర్ణ ఆధిపత్యం పైన పోరాటం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని ఆకాశం అంత ఎత్తైన విగ్రహాలు పెడతామని.. అదని ఇదని ఎన్నెన్నో వాగ్ధానాలు చేసారు..
కాని..అర్ధరాత్రి 12 దాటితే శ్రీరామనవమి.. ముఖ్యమంత్రులు.. మంత్రులు..నాయకులు శ్రీరామ నవమి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.. పట్టు వస్త్రాలు.. తలంబ్రాలు నెత్తిన పెట్టి తీసుకుని వస్తారు.. 
వర్ణ వ్యవస్థకి మూలాధారం అని అరోపించిన రామాయణ కాలం నాటి రాముణ్ణి భక్తితో ఆరాధిస్తారు..
ఇందులో ఏది నటన.. ఏది నిజం.. ఎందుకీ రెండు నాలుకల ధోరణి... ఎవరిని మోసం చేస్తున్నారు.. ఇంకా ఎన్నాళ్ళిలా మోసం చేస్తూ పరిపాలిస్తారు.. 

మాకు ఓటు వేస్తే ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తాను.. అని వాగ్ధానం చేసిన నాయకుడు తీరా గెలిచాక తాను ముఖ్యమంత్రిగా...తన కుటుంబ సభ్యులను మంత్రులుగా పదవులు చేపడితే ప్రశ్నించలేని సమాజం ఎన్నో వేల సంవత్సరాల కిందట జరిగిన సంఘటనలను ప్రశ్నించడం ఎంతవరకు సబబు.. 
అంబేద్కర్ విగ్రహం ఆకాశం అంత ఎత్తున టాంకు బండు మీదనో..ఇంకా ఏర్పడని రాజధాని అమరావతి లోనో వెలిస్తే దళితుల సమస్యలు తీరిపోతాయా.. 
ఆ విగ్రహాలకయే ఖర్చు ఎవరిది?? ప్రజలదే కదా.. వీళ్ళ జేబులోంచి తీసి ఇస్తారా?? 
ఇంకో పక్క వేలకి వేలు ఖర్చు పెడుతూ దేవాలాయలను అభివృధ్ధి చేస్తామంటారు.. ఈ డబ్బు ప్రజలదే... చక్కటి పురాతన శిల్పాలతో కూడిన కట్టడాలు కూల్చివేసి బోడి గుండులాగ దేవాలయలాను కోట్ల రూపాయలతో అభివృధ్ధి చెయ్యమని ఎవడు అడిగాడు.. 
ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడతారు...
దేవుణ్ణి అలాగే వుండనివ్వండి.. అంబేద్కర్ ని అలాగే వుండనివ్వండి..
మీ కుటిల రాజకీయాల కోసం దేవుణ్ణి..దేవుడి లాంటి నాయకులని వాడుకుంటూ ఎన్నాళ్ళు మోసం చేస్తారు.. 
ప్రజలు ఎన్నాళ్ళిలా మోస పోతారు??

Friday, April 1, 2016

బ్రిడ్జి కూలిపోవడానికీ..హిందుత్వానికీ ముడిపెట్టేవాళ్ళు ... 


అక్రమార్జనకు ఆశించారు....
అడ్డగోలుగా కట్టారు..
అడ్డదిడ్డంగా కూలిపోయి...జనం
అట్టుడికి పోతుంటే....

అబ్బెబ్బే తప్పంతా దైవానిదే గాని..
ఆ తప్పు మాది కాదంటున్నారు..... 

ఉప శృతి.:
బ్రిడ్జి పడిపోయింది బి.జె.పి పాలిత రాష్ట్రం లో కాదు..
లేకుంటేనా
ఒక రాహుల్..ఒక కేజ్రీవాల్.. ఒక కమ్యూనిష్టు నాయకుడు..
వచ్చి శవ రాజకీయాలు చేసేవారు..
అసహనం ప్రదర్శించేవాళ్ళు..
బ్రిడ్జి కూలిపోవడానికీ..హిందుత్వానికీ ముడిపెట్టేవాళ్ళు ...  
ఆర్.ఎస్సెస్స్ వలననే ...బ్రాహ్మణిజం వలననే..
బ్రిడ్జి కూలిపోయిందని గగ్గోలు పెట్టేవాళ్ళు...


జూనియర్ థోని హాయిగా బజ్జున్నాడు...

ష్...ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు..
సద్దు చేసారంటే ఉలికి ఉలికి పడతాడు..
రేపే వస్తాడు వాడి బాబు...
తీస్తాడు నూటొక్క బైకు...
తీసుకెళతాడు బాబును షికారు....