Tuesday, November 22, 2016

మహతిని భారతి ఎత్తుకెళ్ళింది..

రేడియో లో బుల్లి బుల్లి మనుషులుండి పాటలు పాడతారు కామోసనుకునే  పసితనంలో 'ఏమి సేతురా లింగా..ఏమీ సేతురా" అంటూ లాలిత్యమైన గొంతు వింటూ ఉదయాన్నే సుప్రభాత వేళ పారవస్యంతో పులకరించేది మనసు..

గ్రాంఫోను గిర గిర మని తిరిగితే పాటలెట్లు వచ్చునో తెలియని లేత వయసులో "ఇదిగో భద్రాద్రీ..గౌతమి నదిగో చూడండి" అంటూ గాంభీర్యమైన గొంతు మిత్రుడింట పదే పదే వింటూ చదువు కొనసాగించేది తనువు...

వయసు‌ బాటు మారుతున్న దృశ్య శ్రవణ యంత్రాలలో
నిక్షిప్తమైన వందల..వేల కీర్తనలను అదే మాధుర్యమైన
గొంతు లో వింటూ ఆధ్యాత్మికా భావ ప్రభంజనంలో జీవన మాధుర్యాన్ని గ్రోలుతూ సంసార నావని నడిపిందీ జీవుడు.

సంగీత సాహిత్య కళా పిపాసి బాలమురళి..
సరస్వతీ మాత కొలువులో మహతి గానరవళితో
సరళ రాగాల మేలవింపుతో సరికొత్త కీర్తనావళి
సుస్వరంగా ఆలపించుటకై బ్రహ్మలోకానికి పయనమైరి..

4 comments:

  1. ...... లాలిత్యమైన గొంతు ......
    ఏమీ అనుకోనంటే ఒక్క మాట. లలితమైన గొంతు - లేదా- లాలిత్యభరితమైన గొంతు అంటే సరైన ప్రయోగంగా ఉంటుంది కదండీ?

    ReplyDelete
  2. ధన్యవాదములు శ్యామలీయం గారు...మీ సూచన బావుంది...

    ReplyDelete
  3. మన్నించాలి గాంభీర్యమైన అన్నమాట కూడా లాలిత్యమైన అన్నమాట వంటిదే. గంభీరమైన అనవలసి ఉంటుందండి. మన్నించాలి మరలా కలుగజేసుకొన్నందుకు.

    ReplyDelete