Friday, November 25, 2016

ఆర్ధిక నేరస్థులకి శిక్షలు వేసిన రారాజు

ఒకానొక రాజ్యం లో పరమోత్తములైన పాలనాధ్యక్షుల వారి సమక్షాన పరమ విధేయులైన కోశాధీసుల వారు రాజ్యం లో కెల్లా అత్యంత ఆర్ధిక నేరాలకి పాల్పడిన నేరస్థులను ప్రవేశపెట్టారు..

1. ఈ ముద్దాయి నెలవారీ వెచ్చాలకోసం తన భర్త ఇస్తున్న డబ్బులో కొంతభాగము మిగుల్చుకొని పోపులడబ్బాలో తన భర్త కు తెలియకుండా దాచినది..
దీన్ని తీవ్రమైన ఆర్ధిక నేరంగా పరిగణించి..ఇకమీదట ఆడవాళ్ళకి పోపులపెట్టి రద్దు చేసి....ప్రస్తుత పోపులపెట్టెలన్నీ ఈ నెలాఖరులోగా రాజ్యానికి అప్పచెప్పవలసిందిగా ప్రకటించడమైనది..

2.ఈ ముద్దాయి తన కున్న 2 ఎకరాల పొలం తాకట్టుపెట్టి లక్ష రూపాయల ఋణం చేసి వచ్చేనెలలో తన పిల్ల పెళ్ళి కోసం బ్యాంకులో వేసుకున్నాడు..
నిజనిర్ధారణ కమిటీ వేసి..జమాఖర్చులు బేరీజు వేసి కమిటీ వారు సూచించిన మేరకే వారి డబ్బు ఇచ్చి మిగిలిన సొమ్మంతా రాజ్యం లో కలిపేసుకోవలసింగా ఆజ్ఞాపించడమైనది...

3. ఈ ఉద్యోగి పన్ను ఎగవేయుటకు పి.ఎఫ్ ఖాతాలో పొదుపు చేయడం... ఋణాలు తీసుకుని ఇండ్లు కట్టుకోవడం వంటి నేరాలు చేస్తున్నాడు...
ఉద్యోగులకు పి.ఎఫ్ లు, బోనస్సులు, బ్యాంకు ఋణాలు, పండగ అడ్వాన్సులు...మొత్తం రద్దు చేసి గోళ్ళూడగొట్టాలి..

4. ఇక తోపుడుబళ్ళ వాళ్ళు, రోజుకూలీలు లెక్కలేనంత ఆర్ధిక నేరాలు చేస్తున్నారు...వీళ్ళకసలు బ్యాంకు అకౌంట్లు గానీ...ఏ.టి.ఎమ్ కార్డులు గాని లేవు..జమాఖర్చుల అకౌంటు లేదు..
అందుకే వీళ్ళకి  ఓ పది రోజులపాటు చిల్లర ‌ నోట్లు అందుబాటులేకుండా చేస్తే చస్తారు..దరిద్రం వదిలిపోద్ది...

ఇంతలో కలకలం...రాజుగార్ని సన్మానించడానికి ఓ పది మంది ఉన్నతవ్యక్తులు..పరమపురుషోత్తములైన కోట్ల ఋణాల్ని పొంది పాపం కట్టలేని బీద పరిస్థితుల్లో ఉండి ప్రజలచే మోసగాళ్ళని అపవాదు మోస్తూ ఆ అవమానం భరించలేక పొరుగుదేశంలో తలదాల్చుకున్న ఆ దీనుల కోట్ల ఋణమాఫీ చేసిన ధీరోధాత్తుడైన రాజుగార్ని సన్మానించుకోవడానికొచ్చారు..

రాజుగారు ఎదురెళ్ళి పట్టుపీతాంబరములతో..పన్నీటి జలకరింపులతో ఆహ్వనం పలికేరు..
అడ్డుగా ఉన్న పైన చెప్పిన ఆర్ధిక నేరస్థులను సైనికులు లాక్కెళ్ళి కుళ్లబొడిచారు..

2 comments:

  1. అబ్బో అబ్బో అబ్బో. బెమ్మాండంగా రాసారు. మరి ఇట్లా అవమానం ఫీలైపోతూ తప్పనిసరై విదేశాల్లో తలదాచుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు పొందిన ఋణాలన్నీ‌ను మరి ఈ పరమోత్తములైన పాలనాధ్యక్షుల వారి పాలనాకాలంలోనే పొందారా లేదా అంతకు ముందటివరకు మంచిగా రాచరికం దర్జాగా వెలిగించిన పరమ పరమ పరమ పరమ పరమోత్తములైన నేటి ప్రథాన ప్రతిపక్షంవాళ్ళ కాలంలోనే పొందారా అన్నది చెప్పకుండా ఎందుకు దాటవేస్తున్నారండీ తమరు?

    ReplyDelete
  2. "అతి కంటే ఘనుడు ఆచంట మల్లయ్య"అన్నారు కదండీ...
    ఉత్తర కుమారుడి ప్రగల్భాలు ఎవరు చేసేరండి??
    ఆళ్లు తప్పు సేసేరనే కదండీ ప్రతిపచ్చం కూకుంది అజ్ఞాతగోరూ..

    ReplyDelete