Saturday, July 1, 2017

బోరు బావి లో ఇంకిన కన్నీళ్ళు...



కన్నబిడ్డ కానరాక..
కన్నతల్లి కన్నీరాయె..

పాలబుగ్గ పసిపాపను
పాడుబుగ్గ మింగెనమ్మ..

విలవిల లాడెనమ్మ పసిపాణం..
వలవల పోయెనమ్మ పేగు బంధం..

పాపాత్ములైన పాడు మనుషులు..
పాతాళానికేసిరి  పాడు బావులు..

బుడిబుడి అడుగుల బుజ్జాయి..
తడబడి అడుగంట జారిపోయి..

అమ్మ కోసం ఆక్రోశించె బిడ్డ..
బిడ్డ కోసం రోదించె అమ్మ..

ఇంకిపోయిన బావిలోన..
ఇంకరాని కూన కోసం..
ఇంకెనమ్మా కన్నీళ్ళు..

ఇంకెన్నాళ్ళయ్యా ఈ అగచాట్లు???

(రచన, బొమ్మ: ఓలేటి.శంకర్)

1 comment:


  1. అవి తీరే అగచాట్లు కావులెండి. ఎన్ని సంఘటనలు జరిగినా సిగ్గులేదు. నియంత్రణ సక్రమంగా చెయ్యని ప్రభుత్వాధికారులు / చెయ్యనివ్వని రాజకీయనాయకులు, నిర్లక్ష్యం పేరుకు పోయిన కాంట్రాక్టర్లు వగైరా వగైరా - కర్ణుడి చావుకు కారణాలలాంటివే. వెరసి అభంశుభంతెలియని చిన్నపిల్లలను అల్పాయుష్కులను చేస్తున్నారు. దారి తప్పిన సమాజం.

    "నెమలికన్ను" బ్లాగ్ లో "అగ్నిహోత్రావధానులు" టపా క్రింద ఈరోజు మీ వ్యాఖ్య చూశాను. చిరకాల దర్శనం.
    కొంతకాలంగా మీ స్వంత బ్లాగ్ మీద మీరే శీతకన్ను వేసినట్లున్నారు, చడీచప్పుడూ లేదు. మీ "కాసు బంగారం ...... " (నవంబర్, 2016) టపా క్రింద ఈరకమైన వ్యాఖ్యే వ్రాసాను మొన్న మే నెలలో.

    మీ బ్లాగ్ ని re-activate చేస్తే బాగుంటుంది.

    ReplyDelete