Thursday, February 16, 2012

ఇది నిజమా?

ఇలా అని నాకు ఫేస్ బుక్ లో మెస్సేజ్ వచ్చింది..
మీలో
ఎంత మంది అనుకూలం ?
ఎంత
మంది వ్యతిరేకం ?


"ఇండియన్ రేవల్యుషణ్" అను బ్లాగ్ - continue sharing this as its election time, spread awareness amongst voters!
HIS FAMILY TOOK THE BURDEN OF THE NATION!
HER FAMILY IS A BURDEN ON THE NATION!

He is the FATHER of the NUCLEAR PROGRAM and GREEN REVOLUTION!

Tuesday, February 14, 2012

సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏమిటి..

పోకిరి సినిమాలో షిండే (సి.పి పాత్రధారి) సూటిగా అడుగుతాడు "ఏం మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా?" అని.. డైలాగ్ మాటి మాటికీ గుర్తుకి వస్తుంది నాకు.. ఇది సమాజంలో వున్న అన్ని వర్గాలని సూటిగా అడిగిన ప్రశ్న లాగ అనిపిస్తుంది..
అసలు దీనికి అర్ధం గాని సమాధానం గాని ఎంత మందికి తెలుసు ?
రోజున సమాజంలో ఎవరి గోల వారిదే.. వ్యక్తిగత స్వేచ్చకి మాత్రమే ప్రాధన్యం యిస్తూ సమాజ స్రేయస్సుని కోరుకునే వారు తక్కువ. మన కడుపు నిండిందా లేదా? (తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా)..
మన బతుకు ఏదో మనం గడుపుదాం.. మిగిలిన వాళ్ళ బాధలు మనకేల అనుకుంటూ వారి వారి వృత్తులకి సరైన న్యాయం చెయ్యటం లేదు..
ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ చేసే వాళ్ళు, (వైద్యులు, లాయర్లు, పోలీసులు, ఉపాధ్యాయులు, రవాణా వ్యవస్థ కి సంబంధించిన వాళ్ళూ) కాస్త బాధ్యతగా వ్యవహరించాలి..
ఇంకా పత్రికా, సినీ, టీవీ ల వాళ్ళూ సమాజం ఎడల బాధ్యతా రహితంగా వుండటం వల్లే ఇన్ని అనర్ధాలు.. మరి ప్రజా ప్రతినిధుల గురించి వేరే చప్పాలా..
రాజ్యాంగంలో పొందుపరచిన హక్కుల గురించి పోరాడతారు గాని బాధ్యతని గురించి పట్టించుకోరు..
తెలియని వారికి అయితే చెప్పగలం ...తెలిసీ నటించే వాళ్లకి ఏమి చెప్పగలం...

అసలు ఈ దేశం లో లా అండ్ ఆర్డర్ వుందా అని గత కొన్ని ఏళ్ళుగా అడుగుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న..

Thursday, February 9, 2012

మనకన్నా వాళ్ళే బెటరా?


నేరస్తులని పట్టుకోవడం లోను. నేర చరిత్ర గలవాళ్ళను నిలదీయడం లోను మన కన్న కర్ణాటక వాళ్ళూ బెటర్ అని అనిపిస్తోంది..
గ్రంధి మనోజ్ కుమార్ (మన రాష్ట్రానికి
చెందిన నగల వ్యాపారి అతి దారుణంగా హత్య గావించ బడ్డ రెండు మూడు గంటల్లోనే ఆ హత్యకు కారకులెవరో చాలా చక్కగా పరిశోధీంచి పట్టుకోగలిగేరు...
హత్య ఎలా జరిగిందో కళ్ళకి కట్టినట్టుగా వివరించారు..

మరి మన రాష్ట్రం లో జరిగిన ఎన్ని హత్య కేసులు, ఆడ పిల్లలపై అత్యాచారం చేసిన వాళ్ళని పట్టుకోవడం లోను మన పోలీసులు దారుణంగా విఫలం అవుతున్నారు..
పొలిటికల్ మర్డర్లు కొన్ని (పరిటాల రవి, మొద్దు శ్రీను, బాను కిరణ్ మొదలగునవి) ఆడపిల్లలవి (అయేషా, ప్రణీత మొదలగునవి)..

ఇందుకు కారణాలు అనేకం.. పొలిటికల్ నాయకులు ఇన్వాల్ అవ్వడం ఒక ఎత్తు అయితే..
చాలా కేసుల్లో పెద్ద ఎత్తున లంచాలు దిగమింగి... ముందే బేరం పెట్టుకుని మర్డర్ చేసిన వాళ్ళపై ఈగ వాలకుండా చెయ్యడం..
సాక్షాత్తూ
సినీ హిరో ఇంట్లో జరిగిన మర్డర్ మిస్టరీ నే చేదించ లేక పోయారు.. పోలేదు.. ఇక పోతే కర్ణాటక చట్ట సభలో అసభ్య వీడియోలు చూస్తున్న మంత్రులపై వేటు పడింది..
మరి
మన మంత్రి పుంగవుల పై ఎన్ని ఆరోపరణలు వచ్చినా ఎటువంటి ఏక్షన్ వుండదు..
పైగా వెనకేసుకుని వస్తున్నారు..
దీన్ని బట్టి మనకి ఏం అర్ధం అవుతోంది..

Friday, February 3, 2012

మీలో అవార్డ్ గ్రహీత ఎవరు ?

క్రింది ఫోటో పై మీ కామెంట్ల ను పెట్ట గలరు.. ఉత్తమ కామెంట్ పెట్టిన వారికి - బ్లాగ్ రత్న, బ్లాగోత్తమ, బ్లాగ్ మార్తాండ లాంటి బిరుదులు ఇవ్వబడతాయి.. జడ్జ్ ఎవరో కాదు అన్ని బ్లాగ్ లలోను తనదైన శైలిలో కామెంట్ చేసే :ప్రవీణ్ శర్మ .. దీనివిషయమై ఎవరు ఎన్ని అనుకున్నా ఏమి చెయ్యలేను.. మొహమాటం, ప్రాతీయ అభిమానం లేకుండా తన మాటను ఎవరేమి అనుకున్నా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పగల మొనగాడిగా గుర్తించాం కాబట్టే అవకాశం ఆయన్ని వరించింది.

Thursday, February 2, 2012

ధ్యానం పై నాకు తోచిన నాలుగు ముక్కలు

క్రింది ఆనందం గారి బ్లాగులో నా కామెంట్లను చదివిన తర్వాతే ఈ క్రింది టపాను చదవమని ప్రార్ధన..
http://aanamdam.blogspot.in/2012/02/blog-post.html?showComment=1328105461794#క౭౯౪౦౬౯౪౯౭౩౯౯౦౫౬౮౩౧౫

1. మన జీవితంలొ నిద్రా అవస్థ, మెలవకుగా వున్న అవస్థ కాక సుషుప్న అవస్థ కూడా వుంది.. . మనం ధ్యానంలో వున్నప్పుడు ఇటు నిద్రా అవస్థలో వున్నట్లే వుండి, మెలకువలోనే వుంటాం..
మన ఆరోగ్యం మన శ్వాశలోనే వుంది.. ఏదైనా ఆందోళన కల్గిన వార్తలు విన్నప్పుడు , చూసినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటూ వుంటుంది.. ఎవరితోనైనా వాదించినప్పుడు దెబ్బలాడుతున్నప్పుడు శ్వాశ వేగంగా ఆడుతుంది.. అదే ఒక ప్రశాంత వాతావరణం లో వున్నప్పుడు గుండె నెమ్మదిగా కొట్టుకుని శ్వాశ నెమ్మదిగా వుంటుంది..

మనం నిద్రలో వున్నా గుండె నిద్రపోకుండా నిరంతరం కొట్టుకుంటూ మనకి మంచి రక్తాన్ని అందిస్తుంది..24 గంటలూ శ్వాశ ఆడాల్సిందే.. మరి అటువంటి గుండెపై, శ్వాశపై మనం దృష్టి పెడుతున్నామా? రోజులో ఒక్కసారైనా మన శ్వాసని నియంత్రించుకో గలుస్తున్నామా, ఒక క్రమ పద్దతిలో శ్వాస ఆడేలాగా మన శరీర వ్యవస్థని తయారు చేయగలమా..

1. మన ఆలోచనా విధానం, మనం చేసే పనులని బట్టి గుండె వేగంలో మార్పు వచ్చి, గుండె ఆయు: ప్రమాణం ఆధారపడి వుంది.
2. ఆశ్రమ ధర్మాల్లో మనిషి ఏ కాలం లో ఏ ఏ పనులు చెయ్యాలో క్లియర్ గా రాసారు.. కర్మలను చెయ్యడం మానకుండా, వాటిని ధర్మ పద్దతిలో ఎలా ఆచరించాలో అనేక గ్రంధాలలో రాసారు.. వాటిని కాలానుగుణంగా ఆచరించాలి.. పూర్వం అడవులకి వెళ్ళి తపమాచరిస్తూ గడిపేవారు, (ఇల్లు సంసారం వదిలి పెట్టి) .. ఇప్పుడు అలా చెయ్యనక్కరలేదు.. సంసారంలో వుంటునే తపస్సు చేసుకోవచ్చు..
3. తామరాకు మీద నీటి బొట్టు వలె మనం సంసార బంధన్నాని, జీవనాన్ని సాగించాలి,,
4. ఆరోగ్యానికి, మన జీవన విధానానికి లింక్ వుంది..
5. ఏ,సి రూముల్లో, విమానాల్లో పయనిస్తేనే మనం సుఖంగా వున్నట్టని భావించడం వల్లే ధన దాహానికి పోయి అనేక నష్టాలు జరుగుతున్నాయి (సమాజానికి, మనిషికి)..
సరే విషయం పక్క దోవకి పట్టకుండా, మనం ధ్యాన పద్దతులని గురించి మాట్లాడు కుందాం..
(తరవాతి పోస్టులో.. )