Thursday, October 11, 2012

మహా నగరంలో మాయ గాడు..


మహా నగరం లోకి మాయ గాడు వచ్చాడు..ఆ నగరంలో రాజు గారు మరణించడం వల్ల మహా రాణి గారు పరిపాలిస్తున్నారు.. 
రాణి గార్ని కలవడానికి ముందు మంత్రులు, ఉప మంత్రులని కలవడానికి  ప్రయత్నించాడు..
విందులతో, పొందులతో చాలా బిజీ గా వున్న అమాత్యులు మన వాడికి కేవలం పది నిముషాల సమయం కేటాయించారు.. 
నమస్తే బావున్నారా.. రాత్రి బాగా నిద్ర పట్టిందా.. అని వీరు అడిగితే...నీ సంగతి ఏమిటి..రాత్రి సత్రవులో భోజనం బావుందా.. సురాపానము, మధు సేవనం మంచిగా జరిగినదా.. అని ప్రశ్నించడం తో   వీరికిచ్చిన కాలం ముగిసింది.. 
రాణి వారి దర్శనానికై సిఫార్స్ చెయ్యమని వీరు అడగను లేదు.. వారు ఇవ్వనూ లేదు..  
సరే కోట గుమ్మం దాకా వెళ్ళి భటులని బతిమాలేడు.. చీ.. పో.. అన్నారు.. అయినా కొద్ది సేపు కోట గుమ్మం లోపలి కి వెళ్ళి కళ్ళారా కోటని చూసి వెనుదిరిగి వచ్చేసాడు..  
పన్లో పని  వూళ్ళో వున్న ప్రముఖుల దర్శనానికే  ప్రయత్నించాడు..ఒకరిద్దరు తమ మందిరంలోకి  రానిచ్చి..కుశల ప్రశ్నలు వేసి పంపించి వేసారు.. ఎందుకొచ్చావు అని వాళ్ళు అడగ లేదు.. వీడు చెప్పలేదు..
సరే ఇక్కడ చూస్తే తన గ్రామ ప్రజలు చాలా రోజులనుండి .. మన నాయకుడైన గద్ద ముక్కుల పోటు గాడు ఏదో పొడిస్తాడని...పట్నాని కి వెళ్ళి చాన్నాళ్ళుగా తమకు లేని పోని ఆశలు చూపించి వుద్దరిస్తాడని..వీణ్ణి నమ్ముకుని రాణి గారి మీద తిరగబడే ప్రత్నాలు మానుకుని, వీడు చూపెట్టిన ఆశలకు లొనై తమ ప్రాణాలను సైతం ఈ మాయగాడి ప్రబోధంతో పోగొట్టుకుని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు... 

ఆ... వీడేమీ పీకడు.. మీరంతా నా వెనకాల చేరి వుద్యమించండి అని రాణి గారి కొలువులోనే భధ్రంగా వుద్యోగం చేస్తూ మిగిలిన వాళ్ళని రాజీనామా చెయ్యండి అని వుద్భోదించే శుక్రాచార్య  వంశములోని  వాడైన  ఓ గురువు వుద్భోధన  చేస్తున్నాడు.. 

చత్ ఈల్లెవరికీ చేతగాదు.. నాతో కలసి పోరాడండి అని పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన ఒక  నాయకుడు పరమవీర సింఘ్ అనే ఒకాయన కొత్తగా బయలు దేరాడు..
పసుపు రంగు వాళ్ళూ, ఎరుపు రంగు వాళ్ళూ, గులాబి పువ్వుల వాళ్ళు.... 
ఇంత మంది మేము మీ వెంటే వుంటాం మమ్మల్నే నమ్మండి అని వెనకాల తరుముతుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడని అయోమయ స్థిలో ఆ ప్రజలు తిరుగుపాటి  ధోరణే ఇన్నాళ్ళు వూపిరిగా బతుకుతున్న ప్రజలు ఎవరి మీద తిరగ పడాలో తెలీక, వీళ్ళలాగే కూటి కోసం, గూటి కోసం, ఎక్కడెక్కడ నుంచో వచ్చిన ఇతర ప్రాంతాల వారిని  తిడుతూ అలా చెయ్యడం వల్లనే మన కష్టాలు తీరుతాయని నమ్మించిన వాళ్ళ నాయకుడైన గద్ద ముక్కుల పోటుగాడు తను వీళ్ళని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపు కుంటున్నా, తన కొడుకు, కూతురు, అళ్ళుడు, బావమరదులు ఇలా నాయకుని కుటుంబం అంతా 
అష్ట ఐశ్వయాలతో తులతుగుతూ నిజంగా రాణి గారు వరమిస్తే ఈ స్వర్గ సుఖం దూరమవు తుందనే భయం తో.. ... పోరాటాన్ని కొన సా.......గిస్తున్నాడు...

Wednesday, October 10, 2012

గురు నీచ, గురు రాక్షస గురు మహా యమ


"గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః"

"మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ" అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. "గురువు" అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. "గు" అంటే చీకటి. "రు" అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. "గు" అంటే గుహ్యమైనది, తెలియనిది. "రు" అంటే దానిని రుచ్యము చేసేది. అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది. ప్రేమ, ఆప్యాతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్ధుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం.
 (The above script adopted from another site)...

ఆహా
 హా.. ఎంత చక్కగా వున్నాయి పైన వాక్యాలు..
అయితే మన గురువుల సంగతి..
బాల్యంలో ఎలిమెంటరీ స్కూల్ లో చండసాసనురాలైన టీచర్.. 

దశరా  కట్నం ఓ ఐదురూపాయలు ఇవ్వలేదని నన్ను ఎన్నో బాధలకు గురిచేసిన
టీచర్.. 

డబ్బున్న పిల్లలకు ఎక్కువ మార్కులు వేసి నన్ను మానసికంగా
హింసించి బాధ పెట్టిన టీచర్ జీవితాంతం గుర్తుండి పోతుంది... 
(దసరా కట్నం ఇవ్వని తప్పు నాదా ?)
ఎంతో పేరు ప్రఖ్యాతులు వున్న గొప్ప స్కూల్ - హై స్కూల్.. 

ఆరవ తరగతి మొట్ట మొదటి క్లాస్ లో ఓ తాగుబోతు ఇంగ్లీష్ టీచర్.. 
ఆ పసి వయసులో ఎన్నో ఆశలతో స్కూల్ కి వెళితే పొద్దుటే వెనకాల బెంచ్ వాళ్ళని ఒళ్ళు
తెలియని మైకంలో చితక బాదే కీచక టీచర్.. 

(ఆ దెబ్బలు నాకు ఎక్కడ తగులు తాయేమో నన్న భయం) .. 
ట్యూషన్ కి వచ్చిన వాళ్ళకే ఎక్కువ మార్కులు వేసి వాళ్ళనే ప్రోత్సాహ పరిచే సైన్స్ మాష్టర్... 
ఒక  సైకో లెక్కల మాస్టర్.. తను చేసిన లెక్క తప్పని చూపి నందుకు
చెంప చెళ్ళుమని అని పించి మరి నోరు ఎత్తలేని స్థితిలోకి నెట్టేసిన
పిచ్చి లెక్కల మాస్టారు.. 

బూతులు తప్ప మామూలు భాష మాట్లాడని ఓ  ఇంగ్లీష్ మాస్టర్.. 
పుస్తకం మధ్యలో గైడ్ పెట్టుకుని అవస్థలు పడే ఓ లెక్కల మాష్టర్..(పదవ తరగతిలో)
ఈ మధ్య పేపర్ల లోనూ, టీ.వీ.లలోను నిత్యం మనకి కనిపించే కీచక గురువులని చూసి పై పద్యాన్ని మార్చాలని పిస్తోంది..

 
"గురు నీచ, గురు రాక్షస గురు మహా యమ
గురు సాక్షాత్ పరమ నికృష్ట: తస్మై శ్రీ గురు దండనే నమ: 


ఇది నాకు వున్న పరిజ్ఞానం తో రాసినది.. మీకు ఇంకా రాయాలని పిస్తే రాయచ్చు... 


 గమనిక: అయితే ఈ పద్యం యొక్క భావానికి అసలు సిసలైన నిర్వచనంగా నిలచిన నలుగురు, ఐదుగురు గురువులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు.. 
గురువు అన్న పదానికే ఎంతో గౌరవం కల్గించిన  
శ్రీ సర్వేపల్లి రాధకృష్న గార్కి క్షమాపణలు... 
ఇంకా ఎంతో మంది గురు బ్రహ్మలకు క్షమాపణలు...
 

Tuesday, October 9, 2012

ఇదేనా మీ పద్దతి ? ఏమైంది మీ అందరికీ ?

ఇదేనా మీ పద్దతి ? ఏమైంది మీ అందరికీ ? మన బ్లాగులోకం లో ఒక మంచి సినిమా మీద రివ్యూ ఎవరూ రాయలేదా?.. లేక నేను దాన్ని చదవలేదా?.. 

ఏమో కాస్త ఆలస్యమైనా నాకు తోచింది రాస్తా..
ఆ మంచి సినిమా : "బర్ఫీ" అను హిందీ సినిమా..

మన సగటు తెలుగు సినిమా లాగ గ్రాఫిక్ ఫైట్లు (హీరో ఒక్కడే వందమందిని చితగ్గొట్టడం) లేవు.. 
చెవులు హోరెత్తించే మ్యూజిక్ లేదు.. గోచీ భామల ఐటెం సాంగ్ లేదు..
హీరో వద్దన్నా సరే కుక్కలాగ వెంటబడే హీరోయిను లేదు.. 
చెంపదెబ్బలు కొట్టించుకునే బ్రహ్మి కామెడీ లేదు..    
చత్ ఇదేం సినిమావయ్యా బాబూ... అని నిరుత్సాహపడే వాళ్ళు చూడక్కర్లేదు..


హీరో మంచి అందగాడు.. కనుముక్కు తీరుగ వున్నవాడు.. చక్కటి భావ ప్రకటన చెయ్యగల సత్తా వున్నవాడు.. మూగ, చెవుడు వున్న యువకుని పాత్రలో ఎంత బాగా చేసాడంటే నిజంగా మూగ వాడేమొ అన్న సందేహం వస్తుంది..

ఇక ఇలియానా ..  
మన తెలుగు సినిమాల్లో లాగ కాకుండా ఎంతో పద్ధతిగ.,  కట్టు బొట్టు నిండుగా ఓ భారతీయ వనిత లాగ చాలా బాగ కనిపించింది.. 
తల్లి మాటకు తలఒగ్గి తను ప్రెమించిన హీరో ని దూరం చేసుకుని మరొకరిని మనువాడినా, అదే ప్రియుడి జాడ కోసం, ఆతడిని రక్షించడం కోసం.. భర్త వారిస్తున్న వినకుండా గడప దాటి బయటకు రావడం నిజంగా హాట్స్ ఆఫ్.. చివర్లో ఆమె చూపిన హావ భావాలు సింప్లీ సూపర్బ్..
ఇక కీలక పాత్ర ధారి "ప్రియాంక చోప్రా" 
ఆమె నటన గురించి ఎంత పొగిడినా తక్కువే.. ఒక మానసిక వైకల్యం  వున్న యువతి పాత్రలో ఆమె చూపిన నటన అద్భుతం, అమోఘం.. 
నేను ముందు నుంచి ప్రియాంకా అభిమానినే కాని ఆవిడ చేసిన సినిమాలు చాలా తక్కువ చూసాను..  అదేదో స్కూటర్ (మోపెడ్) యాడ్ లో - (చాన్నాల్ల క్రితం) ఆమె చూపిన నటన చూసి అభిమానిని అయిపోయాను.. 
కాని అదే ప్రియాంక ఇలా పూర్తి భిన్న మైన (డి గ్లామర్ రోల్ - (అనొచ్చునా)..  పాత్రలో జీవించారు.. 
ఈ సినిమా తీసిన దర్శకులకి, నిర్మాతలకి,, మిగిలిన సాంకేతిక వర్గానికి శతకోటి వందనాలు...
టోటల్ గా హాలివుడ్ రేంజ్ కన్నా మించినదిగా వుంది ఈ సినిమా..  మీరు ఇంత వరకూ చూడక పోతే నిర్భయంగా ఫామిలీ ని తీసుకుని వెళ్ళండి.. 
మీ వుళ్ళో సినిమా వెళ్ళిపోయి వుంటే కొన్నాళ్ళాగి సి.డి లో చూడండి.. కాని మిస్స్ అవకండి..  
ఇంత కన్నా బాగా రాయండం నాకు రాదు.. 
కాని మీలో చాలా మంది సినిమాల మీద రివ్యూలు బాగా రాస్తున్నారు.. 
కాని ఇలాంటి మంచి సినిమా మీద రివ్యూ ఎందుకు రాయలేదో.. నాకేతే తెలీదు.. చెత్త సినిమాల మీద కామెంట్లు రాస్తే వాళ్ళు చేసిన పాపం లో మనకి భాగం వస్తుంది.. ఇలాంటి మంచి సినిమా మీద రాస్తే పుణ్యం రావచ్చు (ఒక వేళ రాక పోయినా - ఒక మంచి పని చేసిన తృప్తి వుంటుంది). ఆలోచించంది..