Wednesday, November 28, 2012

మనదీ ఒక బతుకేనా కుక్కల వలె, పందుల వలె

డబ్బు గాని, మరేదైనా వస్తువు గాని అవతలి వారు పుచ్చుకునే టప్పుడు ఏ రూలు, ఏ న్యాయం, ధర్మం కనబడదు..
ఇవ్వాల్సి వచ్చినప్పుడు పద్ధతులు గుర్తుకుని వస్తాయి, ముఖాలు చిట్లిస్తాయి.. 


ఒకరికి ఇచ్చి మనం తినడం ముందునుంచి మనకి అలవాటు.. ఆ అలవాటు ఎదుటివాని  నుండి ఆశించడం తప్పే.. మనల్ని వాళ్ళు ఎంతలేసి  మాటలైనా అనే వచ్చు వాటిని సరదాగా, జోకులుగా. లైట్ గా తీసుకోవాలి.. కాని మనం ఒక్క మాట తేడాగా అనేసరికి పెద్ద నేరం అవుతుంది... 

పోనీ మాట్లాడ కుండా మన తోవన మనం వెళ్ళి పోతే పొగరు బోతు. అహంకారం అని పేర్లు.. ముఖం నిండా నవ్వు పులుముకుని మనసు లేని అభిమానాన్ని పైకి చాటిస్తూ అవసరార్ధం మాట్లాడి వెళ్ళిపోవాలి అంతకన్నా  అవకాశం  లేదు.. 

ఇంటికి వెళ్తే కనీసం మంచినీళ్ళు ఇవ్వరు సరికదా, మనం మాట్లాడిన మాటలకు విపరీత అర్ధాన్ని వెతికి  వేరేవాళ్ళకి చెప్తూ వాళ్ళ దగ్గర మనల్ని చులకన  చెయ్యడం.. మంచిగా వుంటే పనిమనిషి, చాకలి మనిషి, చివరికి రోడ్లు తుడిచే వాడికీ లోకువే.. నోరు పెట్టుకుని బతికే వాడికి ఒంగి వుంటారు..  

సెల్ ఫోను లు వచ్చాక దరిద్రం మరీ ఎక్కు వ అయ్యింది.. ప్రతీదీ లైవ్ టెలికాస్ట్ అయిపోయింది... మల మూత్రాలు విసర్జించే  కార్యక్రమం తప్ప అన్ని ప్రత్యక్ష పురాణం అయిపోయాయి.. మనం ఇక్కడ దగ్గితే, (ఇంకోటి కూడా వుంది) ఎక్కడో అమెరికా లో వున్న వాడికి నిముషాల్లో చేరిపోతుంది.. అట్నుంచి వాళ్ళు ఇలాగట కదా, అలాగట కదా అని ఆరాలు.. 
మనసారా అన్నయ్యా అనో, అక్కా అనో, మావయ్యా అనో, అత్తయ్యా అనో పిలిపించుకుని, పిలిచే రోజులు పోయాయి.. పొట్టి పొట్టి పలకరింపులు, చిట్టి చిట్టి మెసేజ్ లు (ఇప్పుడు అవీ కరువే) 
ఏంటీ చాలా డల్ గా వున్నావు../ అరె ఈ మధ్య లావు అయినట్టున్నావే / మీ చొక్కా కొత్తది లావుందే./. పిల్ల లెలా వున్నారు..(ఏదో ఒక ప్రశ్న మాత్రమే వేస్తాడు)   ప్రశ్నకి జవాబు ఇచ్చే లోగా, మరో కాల్  వస్తుంది.. హాయ్ రా.. నేనా ఇప్పుడే బజారుకి వచ్చా..పదినిముషాల్లో మళ్ళి కాల్  చేస్తా.. (ఓ వుల్ఫా  గాడితో మాట్లాడుతున్నాను అని అర్ధం వచ్చేటట్టు ముఖం పెట్టి)... 
"ఆ చెప్పండి సార్ ఏమిటి సంగతులు".. మళ్ళి రింగ్ టోన్... మాష్టారు... ఇందాకా ఫోన్ చేసాను.. బిజీ గా  వున్నట్టున్నారు...ఆ రమేష్ కి కాల్ చేసి మన ప్రాబ్లం చెప్పండి.. ఓకె..మళ్ళి కాల్ చేస్తా... 

"ఆ చెప్పండి.. మొన్న ఏదో వూరు వెళ్ళినట్టున్నారు"... మళ్ళి కాల్.. ఆ చెప్పండి  సార్.. నేనా.. బజార్ లో వున్నా (మళ్ళి సేం ఫీలింగ్ తో చూపు) మా బావగారా ఆ అక్కడే వున్నారు.. ఏమిటీ సెల్ కి చేస్తే రెస్పాన్సు లేదా.. మరేం లేదు సిమ్ము మార్చి    వుంటాడు లెండి...  అతగాడు నెలకో సిమ్ము మారుస్తాడు  లెండి.. ఓకె..మా బావకి మీరు ఫోన్ చేసారని  చెప్తాలెండి..బై.. వుంటా..  
"ఆ చెప్పండి"... 
బీపి రైజ్ అయ్యింది అంటే నాదా తప్పు.. మీరే చెప్పండి.. 
Note: టైటిల్ వల్ల కుక్కల, పందుల మనోభావాలు దెబ్బతింటే నేనేమీ చెయ్యలేను.. శ్రీ శ్రీ మీద కేసు పెట్టాలి..

Thursday, November 22, 2012

మర్చిపోలేని అనుభవం

ఇది ఒక డైరీ లాంటిది.. నిన్న జరిగిన అనుభూతుల ప్రవాహం.. ఒక ముఖ్యమైన పని మీద నర్శీపట్నం దగ్గర కోటవురట్ల వయా అనకాపల్లి, మా కుగ్రామం కొక్కిరాపల్లి (పుట్టిన వూరు)  వెళ్ళవలసి వచ్చింది.. 
కారు లోనే మదీయ డ్రైవింగ్ తో.. కారు నడపడం అంటే ఎవరికి ఇష్టం వుండదు చెప్పండి. కాని ముందు రోజు జరిగిన సంఘటన ల వల్ల మనసంతా చికాగ్గా అనిపించింది.. ఒహ ఆఫీసర్ గాడితో వాగ్వాదం వల్ల మనసంతా పాడయింది.. హుషారు లేదు... తప్పదు కాబట్టి ఫామిలీ మాతర్ కాబట్టి బయలు దేరక తప్పక వెళ్ళం.. 
సరిగ్గా కారు దగ్గరకి వెళ్తున్నాను ఎవరో రోడ్డు మీంచి వెళ్తూ పెద్దగా తుమ్మాడు..సరే ఇలాంటి సెంటిమెంట్లు పట్టించు కోవడం మానేసి చాలా కాలం అయ్యింది కాని ఎందుకైనా మంచిదని కాసేపు కూచుని నెత్తిన నీళ్ళు జల్లుకుని కారు తీస్తున్నాను.. మా అబ్బాయి కారు డోరు తీసి కూచుంటూ హాచ్ అని తుమ్మాడు.. ఇదేమిట్రా భగవంతుడా అనుకుని సరే మన తలరాత ఎలా వుంటే అలా జరుగుతుందిలే అనుకుని మరో సారి కారులో వున్న విఘ్నేస్వరుని, ఆంజనేయుల వారిని ప్రార్ధించి కారు స్టార్ట్ చేసా.. 
అనన్య మస్కంగానే డ్రైవ్ చేస్తున్నాను.. అంద్లోను నిన్న జరిగిన ఆర్గుమెంట్ అలా రీలు లాగ బుర్రలో సినిమా రీలు లాగ తిరుగుతోంది.. యోగా క్లాసుల్లో చెప్పారు.. ఎవరితోను వాదనకు దిగద్దు.. ఏ విషయం లోను ఎక్కువ ఆర్గుమెణ్ట్ లు చేసుకుని మనసుని పాడుఛేసుకుంటే ధ్యానానికి ఆటంకం అని.. 
కాని ఎదుటి వాడు అడ్డ దిడ్డంగా వాగి నప్పుడు గాని..పస లేని వాదన చేస్తున్నప్పుడు కాని, మన ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టినప్పుడు కాని విపరీతమైన కోపం వస్తుంది.. నా వాదన తారా స్థయికి వెళ్ళిపోయి నా వాక్ ప్రవాహానికి అడ్డు అదువుండదు..అవతాల వాడు ఎంత పెద్దవాడైనా దులిపి పారెయ్యడమే.. మొత్తానికి లోపల వున్నాది దాచుకోకుండా కక్కేస్తే గాని మనశ్సంతి గా వుండదు.. 
కాని తర్వాత ఆవేశం తగ్గాక, ఎందుకు అలాంటి వెధవలతో అనవసరంగా ఆర్గుమెంట్ అనిపిస్తుంది.. అప్పటిదాకా, మన చెవులను కొరికేసిన మహానుభావులు నోరు మెదపరు.. మనకి సపోర్టుగా ఒక్క ముక్క మాట్లాడరు.. తర్వాత చెవులు కొరుక్కుంటారు... బాగా అడిగేరు అని కొందరు అంటే కొందరేమో మనకెందుకు చెప్పండి.. పై అఫీసర్ల మీద కి తోసేస్తే సరి అనో గోడ మీద పిల్లివాటంగానో చెప్తారు...  సరే ఎవరు ఎలా అనుకున్నా నేను చేసింది ధర్మానికి, అన్యాయానికి వ్యతిరేక పని కాదని నన్ను నేను సమాధాన పరుచుకుని నాలో నేనే సమాధానం చెప్పుకుంటాను... 
ఇహ విషయానికొస్తే...కోటవురట్లకి వెళ్ళలంటే ఇంచుమించు  నర్శీపట్నం వూర్ళొకి వెళ్ళక ముందు ఎడమ పక్కకి తిరిగి జల్లూరు  (పూరి జగన్నాధ్ వూరు) మీదుగా వెళ్ళలి, కాని నాకు సరిగ్గా తెలియక మాకవరి పాలేం అనే వూళ్ళో కుడి పక్క తిప్పేసాను.. అక్కడున్న వాళ్ళని అడిగితే ఇలాగక్కూడా వెళ్ళొచ్చు అసలు ఇదే దగ్గర దారి అని చెప్పారు... అది పళ్ళెటూళ్ళని కలుపుకుంటూ వెళ్ళే సింగిల్ రోడ్డు మార్గం.. 
ఇక్కాడే అద్బుతం జరిగింది.. ఈ రోడ్డు పక్కా పళ్ళెటూర్లను కలుపుకుని పోతూ పచ్చని పొలాలంట, మధలో సెలయేరు మీదుగా చాలా హాయిగా, అలౌకిక అనందాల మధ్య సాగింది...మధలో పిల్ల ఏరు వద్ద ఆగాను.. అక్కడే నాలుగు పశువుల పాకలు, మట్టితో కలసిన పేడవాసనలు, పక్కన చెరుకు తోటలు, నా కారుని ముందుకి వెళ్ళనీయలేదు.. 
అపేసి, ఆ సెలయేట్లో దిగి, పసువలని నిమిరి వస్తూడగా ముగ్గురు పల్లె పడుచులు ఎదురై కుశల ప్రశ్నలు వేసారు.. ఇదేమిటి ముందున పెద్ద సెలయేరు వుంది అన్నారు.. 
అక్కడే పొలాల మధ్య సెలయేటి ని తవ్వి పారేస్తూ పెద్ద ఫక్టరీ ని ప్రకృతి మాత గుండె చీలుస్తూ వెలిసింది.. ఆ ఫాక్టరీ ఏమిటమ్మా అంటే అదేదో సిల్వర్ ఫక్టరీ అట బాబూ బోల్డెన్ని మా పొలాలు లాగేసుకుని కడతన్నారు.. అని విచారంగా మొహాలు పెట్టి సమాధానం ఇచ్చారు.. 
మనసు పాడైది గాని, అభివృద్ధికి సంతోషించాలా, ప్రకృతి విధ్వంసానికి బాధపడాలా  తెలియలేదు..వూరుచేరతాం అనుకునేలోగా పెద్ద సెలయేరు (వరాహ నది) మీదుగా వేసిన బ్రిడ్గి ని దాటుతూ వుంటే అనుభవం వుంది చూసారూ,, నా సామిరంగా నేను పడ్డ మానసిక క్షోభను మరిచి పోయి చిన్న పిల్లాడి లాగే అయిపోయి కేరింతలు కొట్టాను.. 
మా లేడిస్ పరిస్థితి కూడా ఇంచు మించు అంతే... పొరపాటున ఈ మార్గంలోకి అడుగు పెట్టామేమో అని బాధ మొదట్లో బాధ పడిన వాళ్ళు,, మర్చి పోలేని ఈ అనుభుతులని అనుభవించి.. ఈ మార్గం లో వచ్చినందుకు మమ్మల్ని మేమే అభినందించు కుంటూ.. మొత్తానికి కోటవురట్ల చేరాం.. 
కొసమెరుపు ఏమిటంటే.. మా జూనియర్ కి ఫోన్ చేసి.. నిన్న జరిగిన ఆర్గుమెంట్ కి ఫేడ్ బాక్ అడిగా,, ఆ ఇంకా దాని గురించి ఆలోచిస్తారేమిటండి... మీరు అడిగిందాంట్లో తప్పేమీ లేదు.. ఏమీ జరగదు.. మీకెందుకు నేనున్నాను కదా నా మీద వదిలెయ్యంది.. మీరు ముఖ్యమైన పనిలో వున్నారు.. దాని మీద మనసు పెట్టండి.. ఇవన్ని మమూలే అని హిత బోధ చేసాడు.. ఇవాళ మా సీనియర్ ఫోన్ చేసి.. మీరు వాదించడం మంచిదే అయ్యింది.. అన్నాడు.. అదీ పరిస్థితి.. సుత్తి ఎక్కువై నట్టుంది.. శెలవ్...     
(చిన్నా చిన్న తప్పులున్నాయి .. తర్వాత సర్దు తాను టైం లేదు..సారీ)