Sunday, June 30, 2013

అధ్బుత భవిష్య వాణి ? నా అనుభవాలు

నాకు జరిగిన కొన్ని అనుభవాలు మీ ముందు వుంచి దీన్ని ఏమని అనుకోవాలో
మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను..  


1. సుమారు ఇరవై ఐదు ఏళ్ళ క్రితం ఒకానొక అడవి ప్రాతం లో నేను
పనిచేస్తున్నప్పుడు ఒకరోజు కలలో 

"ఆ ఆడవిలో ఒక మారుమూల ప్రాంతంలో ఒక ఆడమనిషిని  ఒకతను అఘాయత్యం చేస్తున్నాడు.. ఆ అమ్మాయి ఒక మానసిక రోగి, అత్యాచారం చేస్తున్న వాడు అవిటి వాడు (కుంటి వాడు)..
 ఆమె వచ్చి రాని భాషలో బిగ్గరగా కేకలు పెడుతోంది.. వాడు కుంటి
కాలితోనే ఆమెను బలాత్కరించి చివరికి చంపేసాడు..

" ఇదేమిటి ఇలా ... భయంకరమైన కల వచ్చింది అనుకుంటుండగా తెల్లవారేసరికి వూరంతా గుప్పు మంది.. 
సరిగ్గా నా కలలో జరిగినట్టుగానే ఆ అడవిలో అత్యాచారం మరియు హత్యాకాండ జరిగింది.  ఒక ఆటో డ్రివర్ రెండో ఆట సినిమాకి వచ్చిన మానసిక బలహీనమైన అమ్మాయి, వాళ్ళ వారిని వదిలేసి రోడ్డు మీదకి వస్తే తన ఆటొలో ఎక్కించుకుని అడవి మధ్యలో వున్న మా కాలనీలో మిగిలిన పాసెంజర్లని దింపేసిన తర్వాత ఆమెను బలాత్కరించి ఆ తర్వాత చంపేసాడు.. 
అందులో ప్రయాణం చేసిన మా ఆసుపత్రి ఆయా అదే ఆటోలో ప్రయాణం చేయడం వలన ఆమె సాక్షిగా వెళ్ళవలసి వచ్చీంది.. ఆమె ద్వారా నిందితుడు ఒక ఆటో వాడు అని తెలిసింది..
విచిత్రంగా అతడు ఒక పాదం లేని అవిటి వాడు..
చాలా రోజుల వరకు నేను మనిషిని కాలేక పోయాను.. రాత్రి జరిగినది
 లైవ్ టెలికాస్ట్ లాగ అదే సమయం లో నాకు కలగా వచ్చింది.. ఇది ఎలా
 సాధ్యమో నాకు తెలియలేదు.. ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు..


2. కొన్ని
రోజుల క్రితం  నేను మా అబ్బాయి తో "ఒరేయ్ స్వాతి కిరణం వేసిన మంజు నాధ ఇప్పుడు రావట్లేదేమి.. పెద్ద వాడు అయిపోయాడు కదా ఇప్పుడు ఎలా వున్నాడో , ఎక్కడ వున్నాడో" అని అతను వేసిన మాల్గుడీ డేస్ లో  "స్వామి" పాత్ర గురించి కూడా చాలా సేపు మాట్లాడుకున్నాం.. 
చాలా విచిత్రంగా మర్నాడే టీ.వీ 9 లో "అన్వేషణ" కార్యక్రంలో అతనిపై
ప్రోగ్రాం వచ్చి మా సందేహాలన్ని తీరిపోయాయి.. కాని నేను మా అబ్బాయి నా శ్రీమతి చాలా ఆశ్చర్య పోయాం.. సరిగ్గా మేము అనుకున్న మాటలే ఆ కార్యక్రమం లో వచ్చాయి.. 


3.ఈ మధ్యనే 
ఒక రోజు బాత్రూం లో రైల్వే లో ఇ.క్యూ కోటా గురించి చాలా సేపు ఆలోచించాను.. ఇది చాలా మిస్ యూజ్ అవుతోందని..  
ఇ.క్యూ కోటాని తగ్గిస్తే బావుంటుంది అని, వి.ఐ.పి లకు మాత్రమే కేటాయించవలసిన దాన్ని రైల్వే అధికారులు మిస్ యూజ్ చేస్తూ తమకి కావలసిన వారికి ఇచ్చేస్తున్నారని ఇలా ఎన్నో అనుకున్నాను.. సరిగ్గా నాలో మనసు లోని భావాలన్ని మరు రోజు పేపర్లో ప్రచురితం అయి ఇ.క్యూ కోటాని
తగ్గిస్తున్నట్లుగా నిర్ణయం తీసు కున్నారని రాసారు..

4. ఈ దిగువ ఇచ్చిన లింకు లోని నా పోస్ట్ ఒక్కసారి చదవండి..
http://shankaratnam.blogspot.in/2013/06/blog-post_12.html

ఇది ఈ నెల 12 వ తేదీన రాసాను. ఒక్కసారి టైటిల్ ని ఇందులోని కొన్ని
పదాలను పరిశీలిస్తే భూకంపం, భారీ విధ్వంసం, మంచు పర్వతాల
మధ్య.. భారత్ లో నే జరుగుతుంది " ఇలా భయంకరంగా రాసాను.. నేను
 వ్యంగంగా రాసినా కొద్దిరోజుల్లోనే మంచు పర్వతాల మధ్య నిజంగానే
భారీ విధ్యంసం జరిగింది..


5. నేను నటుడిగా ఓనమాలు దిద్దుతున్న రోజుల్లో ఎవరివైన వేరేవాళ్ళ నాటికలు చూసినప్పుడు ఈ పాత్ర నేను వేస్తే బావుటుంది అని అనుకున్న పాత్రలను యాద్రిచ్చికంగా నేను వేయడం అద్భుతంగా రాణించడం జరిగేయి...

 
ఇవి మచ్చుకి కొన్ని మిగిలినవి తర్వాత రాస్తాను.. కాని దీన్ని సిక్త్  సెన్స్ అంటారో, ఏవని అనుకోవాలో మీకే వదిలేస్తున్నాను.. కాని నాకు జరిగే కొన్ని అనర్ధాలు, నష్టాలు ఒక్కోసారి  నాకు చుచాయగా తెలిసినా,  ఏమీ చెయ్యలేక నిర్లక్షం వల్లనో జరిగిపోతూవుంటాయి.... 

Saturday, June 22, 2013

దొంగ నోట్లు - చిన్న చిత్రం

సోదర సోదరీమణులారా ! 
తెలుగు అంతర్జాల పుటల మిత్రులారా !
you tube లో నేను నటించిన చిన్న చిత్రం (short film)
money chelamani" చూసి ఆనందిస్తారని.. మమ్ముల్ని ఆశ్వీరదిస్తారని కోరుతున్నాను.. ఇందులో "ధనగారము (Bank) లో  నోటులు లెక్కపెట్టు వుద్యోగస్తుని" (Cashier) గా నేను కనిపిస్తాను.. 
లింకు: 

  https://www.youtube.com/watch?v=_kWupFG5wiY
ధన్యవాదములు .. 


Wednesday, June 12, 2013

భారత్ లో భారీ భూకంపం వచ్చే అవకాశం

 ఈ ఫొటో చూడండి..
ఇది ఈ మధ్యనే నాసా వారు సాటిలైట్ ద్వారా ఏరియల్ వ్యూ లో సేకరించిన ఫొటో .. ఇది ఇంకా పబ్లిక్ లోకి రాలేదు.. దీని మీద విస్తృతంగా పరిశీలనలు, పరిశోధనలు జరుగుతున్నయి.. రహస్య ఏజెంట్ ల ద్వారా లీక్ అయి కొంతమంది నెటిజన్లు డౌన్ లోడ్ చేసేసారు.. 

ఇంతకీ విషయం ఏమిటంటే రెండేళ్ళ కితం ఏర్పడిన భూకంపం వలన చైనా, భారత్ సరిహద్దు ప్రాంతంలో భూమి ఇలా చీలి పోయిందట.. 

ఇన్నాళ్ళు దట్టమైన అడవీ ప్రాంతం వలన, మంచు కొండల నడుమ వుండటం వలన ఎవరికీ కనబడలేదు.. 
ఇలా ఎక్కువ మైళ్ళ విస్తీర్ణం మేరకు భూమి చీలడం వలననే ఈ మధ్య అక్కడక్కడ భూ ప్రకంపనలు ఏర్పడుతున్నాయిట. 
మొన్న అమెరికా లో ఏర్పడ్డ టోర్నెడో లు కూడా దీని ప్రభావం వల్లనే అట ... ఈ చీలిక వలన భూ ఉపరితలం కొద్ది కొద్దిగా జరుగుతూ ఆ ఖాళి  స్థానాన్ని భర్తీ చేయడం వలన భూమి అంతర్గత పొరల్లో కదలికలు ఏర్పడి భారీ సంఖ్యలో అతి కొద్ది కాలం లోనే భూకంపాలు వచ్చే అవకాశం వుందట.. 
ఇది కూడా ఇండియా లోనే ఎక్కువ ప్రభావం చూపుతుందట.. 

అందుకనే ఈ విషయం తెలిసిన కొద్ది మంది రాజకీయ నాయకులు దీపం వుండగానే ఇల్లు చక్క దిద్దుకోవాలని కోట్ల కొద్దీ స్కాముల తో నల్ల ధనాన్ని కూడగడుతున్నారని సమాచారం.. 

ఎన్నడు లేనివిధంగా 2జి స్కాం మొదలు ఇనుము, బొగ్గు గనుల కేటాయింపుల్లో స్కాము లు చేసి విదేశాల్లో నల్ల డబ్బుని కూడ బెట్టుకుని విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడానికి తెగబడుతున్నారట. 

నమ్మట్లేదా మరి ఆ మధ్య "2012 యుగాంతం" అని మిమ్మల్ని భయపెట్టి తీసిన సినిమాని హిట్ చేసి కోట్లు కురిపించారు... నేను రాస్తే కామెడీ గా వుందా.. 

సరే మీ మాటే చెల్లును...  ఇది మా ఇంటి డాబా పగుళ్ళ ని క్లోజప్ చేసి తీసిన ఫొటో .. సరదాగా... 
 అంతే సరదాగా... మీ తిట్లు, శాపనార్ధాలు పార్శిల్ చేసేయండి.. 
  

Sunday, June 9, 2013

అసలు సినిమా వాళ్ళు అంటేనే అసహ్యం వేసింది..

నా చిన్నతనంలో ఒకసారి హైదరాబాద్ వెళ్ళాం.. బంధువుల  ఇంట్లో వున్నాం.. 
హైదరాబాద్ లో చూడదగ్గ ప్రదేశాలైన . చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్  మ్యూజియం , బిర్లా మందిర్ ఇవన్నీ అయిపోయాక ఒక రోజు కారులో గండి  పేటకి వెళ్ళాం..

అప్పుడు గండి పేట వుద్యానవనం చాలా బావుంది.. నీళ్ళు కూడా డాం లో ఎక్కువగా వుండేవి..
సినిమా షూటింగులు చాలానే జరిగేవి (ట)..

మేం వెళ్ళిన రోజు ఏదో కృష్ణంరాజు, ప్రభ ల మీద ఏదో సినిమా పాట చిత్రీకరణ జరుగుతోంది..పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఒకే చరణాన్ని తీసారు..

డాన్స్ మాస్టరు, అతని అసిస్టెంట్ అయిన ఒక భామ విన్యాసాలు, అదే రీతిలో హీరో హీరోయిన్ల డాన్సు (అనుకుందాం)... ఎంతకని చూస్తాం .. చూసి చూసి విసుగు వచ్చింది.. మొదట్లో అంతా ఎగబడి చూసిన వాళ్ళు మధ్యాహ్నానికల్లా ఎవరూ లేరు..

వాళ్ళు (హీరో, హీరోయిన్లు) పెద్ద కాన్సెంట్రేషన్ గా చెయ్యట్లేదు.. ఏదో ఇలా నడుస్తూ వెళ్ళడం.. కాస్త కాళ్ళు చేతులు వూపడం అంతలోనే కట్ అని చెప్పడం...
అంతా ఆషా మాషీగా తీస్తున్నారు...

ఒకసారి ముఖం మీద వెలుతురు పడలేదనో ఇంకొక సారి కృష్ణం రాజు గారు నవ్వారనో.. తీసిన టేక్ నే మళ్ళి మళ్ళి తీసేవారు... మళ్ళా షూటింగ్ గాప్ లో ఒకరిపై ఒకరు విసుర్లు ఇక ఇకలు పక పకలు .. అసలు సినిమా వాళ్ళు అంటేనే అసహ్యం వేసింది...ఇంతకీ ఆ సినిమా ఒక్క రోజు లోనో రెండు రోజుల్లోనో వెనక్కి వెళ్లిపోయింది..

కాని నాటకాల్లో అలా కుదర్దు... ఒకసారే టేక్.. మళ్ళా మళ్ళా యాక్షన్ లు వుండవు.... పాత్రలో లీనమై నటించవలసిందే గాని రిలాక్స్ అవడానికి చాన్స్ వుండదు... లైవ్ షో... తప్పు చేస్తే ఇంతే సంగతులు అంతా రసాభాస అవుతుంది...

నేను కేవలం వుదాహరణకి మాత్రమే కృష్ణం రాజు గారి పేరు వాడెనే గాని.. ఆ మహా నటున్ని విమర్శించడానికి కాదు.. దాదాపు అన్ని సినిమా షూటింగులు ఇంతే ....

ఇప్పుడైతే ఒక పాటలో గాని డైలాగ్ చెప్పేటప్పుడు గాని కంటిన్యూ గా ఒక్క సెకను కాలం కూడా ఒక షాట్ వుండట్లేదు.. అందులోను ఇప్పుడు అంతా గ్రాఫిక్ మహిమ అయిపోయింది... హీరో అమాంతం గాల్లోకి లేచి అలా ఫ్రీజ్ అయి వుండిపోతాడు... మాయల నిలమైన సినీమా(య) లో ఇప్పుడంతా మాయలే... 
  
ఇంకొక చిత్రం ఏవిటంటే ఇప్పుడు టి.వీ లో ఏదైనా పాత పాటలు వచ్చినపుడు ఆ తరం హీరోల కుప్పిగెంతులు చూసి ఈ డాన్సులకేనా జనాలు పిచ్చెక్కి పోయారు అనిపిస్తుంది..రోజల్లా కాళ్ళు పీకేట్టు గెంతిన ఆ  హీరోయిన్లను తలచు కుంటే జాలి వేస్తుంది..  

సమాజం పై ఒక సెక్సీ తారకున్న బాధ్యత మీకు లేదా...

ఈ టపా ఇలా రాస్తుందుకు నేను సిగ్గు పడటం లేదు.. బహుశా చదవడానికి మీరు సిగ్గు, ఇబ్బంది పడాలేమొ..
ఈ మధ్య ఒక ప్రభుత్వ ప్రకటనలో (ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుంది) దీని మీద International Business Times వారి వార్త ని ఈ లింక్ లో  చూడండి: 
http://www.ibtimes.co.in/articles/337113/20120504/vidya-balan-sanitation-campaign-national-award.htm

నటి విద్యాబాలన్ సిగ్గు పడే పెళ్ళి కూతురిని మగ పెళ్ళివారిని ధైర్యంగా తలెత్తి ప్రశ్నించ మంటుంది.. "మీ ఇంట్లో మరుగు దొడ్డి వుందా" అని.. తలదించుకుని సిగ్గు పడి ఇబ్బంది కరమైన పరిస్థితులకన్నా ఇంట్లోనే మరుగుదొడ్డి కట్టించుకుని ధైర్యంగా తల ఎత్తుకుని బతకండి అని చెప్తుంది.. 
చాలా బావుంది కదూ..
కాని ఈ రోజుల్లో కూడా ఇలాంటి దుస్థితి లో మనం వుండడం దురదృష్టకరం.. మన దౌర్భాగ్యం..

నేను ఈ మధ్య కారులో చుట్టుపక్కల వున్న పల్లెటుర్ల మీదుగా కొన్ని దర్శనీయ ప్రదేశాలకు వెళ్ళడం జరిగింది... కొన్ని ఊర్లకి మొదటి లోనే రోడ్డుకి ఇరువైపులా మల విసర్జనాలు మరియు చెత్త కుప్పలు, దుర్గంధ వాసనలు, ఈగలు, దోమలు, కుళ్ళునీటి ప్రవాహం స్వాగతం పలికేయి..
కారు లో  ప్రయాణం చేసిన మాకే చాలా జుగుప్స, అసహ్యకర వాతావరణం, మరి కాలి నడక న వెళ్ళేవారి ఇబ్బంది వర్ణనాతీతం... ఎన్నో ఏళ్ళుగా ఇదే తంతు..

గాంధీ మహాత్ముడు గుజరాత్ లోని సూరత్ లో పొద్దుటే నాలుగు గంటలకు ఒక చీపురు తీసుకుని ఆ మల విసర్జాలను అన్ని ఊడ్చి గంపకు ఎత్తి పారబోసే వాడట.. ప్రజలు మొదట్లో గుర్తించక పోయినా రోజు తెల్లారే సరికల్లా శుభ్రంగా వున్న రోడ్లను చుసి, వాటిని శుభ్రపరుస్తున్నదెవరో తెలుసుకుని సిగ్గుపడి ఆ పని చెయ్యడం మానుకున్నారట..

మా వీధిలో అన్ని ఇంచుమించు అపార్టుమెంటులే.. అయినా చిన్న జాగా దొరికితె చాలు మూత్ర విసర్జన కానిస్తారు.. కిటికిల లోనుంచి ఎవరైనా చూస్తారన్న సిగ్గు, భయం వుండదు... మన పని అయ్యిందా లేదా.. అంతె... ఆ పని చేసె వారిని ఏమని తిడతాం...

ఇవాళ ఎన్నో గొప్ప గొప్ప పన్లు చేసాం చేస్తున్నాం అని విర్ర వీగే నాయకులకు కొదవలేదు.. ఆధునిక పరిజ్ఞానంతో రోజుకో కొత్త మోడల్ సెల్ ని, కార్లని, వాడుతూ విదేశీ పరిజ్ఞానాన్ని అనుకరిస్తున్న నేటి సమాజం లో పల్లె టుర్ల లోనే కాదు  పట్టణాలలో కూడా.. బహిరంగ మల మూత్ర విసర్జన ప్రాధమిక హక్కు అయిపోయింది...

గెడ్డలనిండా.. నేల కింద కట్టిన మురుగునీటి గొట్టాల నిండా ప్లాస్టిక్ వ్యర్ధ పదార్ధాలు, చెప్పులు, సీసాలు, రబ్బరు ట్యూబులు, టైర్లు ఇలా అనేకం మురికి నీటి ప్రవాహానికి అడ్డు వచ్చి రోడ్లన్నీ మురికి నీటి జల ప్రవాహాలుగా మారి అనేక రోగాలు ఇవాళ సంప్రాప్రిస్తున్నాయి..

కొంతమంది  ఇంజనీర్లు, బాంక్ వుద్యోగస్తులు, ఆఫీసర్లు కూడా వారి  కార్యాలయాల్లో శుభ్రతను గురించి పట్టించు కోరు...
నీట్ గా సూటు బూటు  వేసుకున్న వాళ్ళుకూడా కొన్ని చెండాలం పన్లు చేస్తారు.. కనకపు సింహాసనం మీద శునకం కూర్చుండ బేడితే ఏం పని చేస్తుందో అదే చేస్తారు...
కొంతమంది మరుగుదొడ్లు వున్నా ఆ పక్కన చెట్ల మధ్యకి వెళ్ళి పని కానిస్తారు...
వాష్ బేసిన్లలో, టాయిలేట్లలో తిని పారేసిన కైనీలు, కాల్చి పారేసిన సిగరెట్లు, వుమ్మేసిన పాన్ పరాగ్ లు అబ్బో ఈ వైట్ కాలర్ల వాళ్ళు కూడా చెండాలపు ఎదవలే...
మధ్యాహ్నం కారేజ్ భొంచేస్తారు.. సగం అన్నం మెతుకులు బాత్రూం లో ఒంపేస్తారు.... అవన్నీ జాలీలకు అడ్డం పడి నీళ్ళు వెల్లక... బాత్ రూం అంతా మడుగు లాగ అయిపోతే అక్కడున్న స్వీపర్ల మీద అరుస్తారు.. వాళ్ళ పై వాళ్ళకి కంప్లైంట్ ఇస్తారు... దరిద్రులు..
లెట్రిన్ కి వెళ్తారు... ఫ్లష్ కొట్టకుండానే పోతారు... ఏబ్రాసి నాయాళ్ళు...

ఇలాంటి దరిద్రులు ఎవరైనా మీ పక్కలో వుంటే వారిని మార్చండి... పక్క వాడు ఎలా వుంటే మనకెందుకులే అని వుపేక్షిస్తే వాడు చేసే చెత్త పన్లు వలన మీకు కూడా రోగాలు వస్తాయి.. తస్మాత్ జాగ్రత్త....    

            

Saturday, June 8, 2013

భయపెట్టే దెయ్యాలు ఒక్కోసారి నవ్విస్తాయి కూడా..

భయపెట్టే దెయ్యాలు ఒక్కోసారి నవ్విస్తాయి కూడా.. 


దెయ్యాలు నవ్వించడం ఏవిటి విచిత్రం కాకపోతే అని అనుకుంటున్నారా.. 
అయితే అర్జంటుగా :"ప్రేమ కథా చిత్రం" చూసేయండి..
ఈ మధ్య కొన్ని చిన్న సినిమాలు (అంటే నిడివి తక్కువ వున్న సినిమాలు లేదా లో బడ్జెట్ సినిమాలు కాదు.. చెవులు హోరు ఎత్తిపోయాలా శబ్ధ బీభత్సాలు, బండ గొంతుకతో అరిచే విలన్లు, బొడ్డుని మాత్రమే చూపించే హీరోయిన్లు, చెంపదెబ్బల కమేడియన్లు, గాలిలోకి లేచే సుమోలు, తొడగొట్టి  మీసం మెలితిప్పే హీరోలు .. ఇవన్ని లేని సినిమాలు) బాగానే ఆడుతున్నాయి.. 

స్వామి రారా.. తడాఖా, గుండే జారి.. ఇప్పుడు ప్రేమ కథా చిత్రం ఆ కోవ లోకే వస్తాయి..  

హీరో కృష్ణ గారి అల్లుడు అట .. బాగానే చేసాడు.. సొంత తెలివి తేటలు చూపి అతిగా చేసే జూ. NTR, అల్లు, మహేశ్ లాగ కాకుండా.. దర్శకుడు చెప్పిన దాన్ని బుద్దిగా ఫాలో అయినట్టు అనిపించింది... పొగరు చూపులు లేని హీరో.. 

 అమ్మడు కూడా చాలా బాగా చేసింది.. మామూలుగా ఎంతో అమాయకంగా, చిన్నపిల్ల లాగ, స్వీట్ గాళ్ లాగ కనిపించి దెయ్యం ఆవహించిన తర్వాత విశ్వరూపం చూపించింది.. 
పచ్చని కాపురం లోని "వెన్నెలైనా.. చీకటైనా"  అన్న పాటను చాలా చక్కగా రీమేక్ చేసారు.. గాయనీ, గాయకులు బాగా పాడేరు, సంగీతం బావుంది.. తీసిన విధానం బావుంది.. హావ భావాలు బావున్నాయి..

కాని అతికించినట్టుగ వుంది.. దాన్ని ఎక్కడ పెట్టాలో తెలీక... చివర్లో ఇమిడిస్తే ప్రేక్షకులు ఉత్సుకతో ఎదురు చేస్తారని అనిపించింది.. 

ఈ మధ్య మామూలు జూ. ఆర్టిస్టులతో చక్కని కామెడీ పండిస్తున్నారు. గంటకి ఇంత అని, ఒక్కో చెంప దెబ్బకి ఇంత అని తీసుకునే వాళ్ళకన్నా చాలా బాగా చేస్తున్నారు.. చక్కటి కామెడీ కాకపోతే అక్కడక్కడ మసాలాలు ఎక్కువ అయియాయి.. 

భయపెట్ట వలసిన దెయ్యం వచ్చినప్పుడల్లా పడి పడి నవ్వారు ప్రేక్షకులు ... రామ్ గోపాల వర్మ తీసే దెయ్యాల సినిమాల కన్నా వంద శాతం గొప్ప సినిమా.. 

ఈ సినిమాలో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే చక్కటి  మెసేజ్ వున్న చిత్రం.. 

ఈ మధ్య ఎక్కువ అవుతున్న మానభంగాలు, హత్యల మీద వుంది.. ఆడదాని మీద చెయ్యి వేసే ప్రతీ మృగాడికి వెంటనే ఈ దెయ్యం  పాత్ర గుర్తుకి వస్తుంది..

ఇక చాలు వెళ్లి చూసేయ్యండి .. ధియేటర్లో.. పైరసీ వీడియో లో కాదు.. 

నిజగానే తప్పు చేసిన వాళ్ళకి దెయ్యాలు శిక్ష వేస్తే బావుణ్ణు.. 

దేవుడు వేయబోయే శిక్షలకు ఎవరూ భయపడటం లేదు.. దేవుడి నే  కోట్లు లంచం ఇచ్చి కొనేస్తున్నారు.. అధికారులకు, నాయకులకు లంచం ఇచ్చేసి దర్జాగా ఎవరికీ అనుమతి లేని  అంతరాలయం లో అన్నప్రసన కార్యక్రమాలు కుటుంబ సమేతంగా చేసుకుంటున్నారు.. 
పవిత్రులమని సిగ్గు, లజ్జ, మానం మర్యాద లేకుండా ప్రకటించుకుంటున్నారు.. 

వాళ్ళకి దేవుడు కాదు దెయ్యాలు వెయ్యాలి శిక్ష.. దేవుడికి భయపడని వారు దెయ్యాన్ని చూసి భయపడతారు.. 
 

Friday, June 7, 2013

బాబు అన్నిటిలోనూ వీకే మేడమ్..


పి.ఏ: గుడ్ మార్నింగ్ మేడం
మేడం: ఏవయ్యా అప్పుడే తెల్లారిందా.. బయట ఏమిటీ కోలాహలం..

పి.ఏ: తెలుగు గొర్రెలు మేడం సారీ .. నాయకులు మేడం.. మీ దర్శనానికై ఒకళనొకలు తోసుకుంటున్నారు..

మేడం: మరి నువ్వేం చేస్తున్నావ్.. అందర్నీ లోపలికి తోలేస్తున్నవా. అదే.. వదిలేస్తున్నావా..

పి.ఏ: లేదు మేడం వాళ్ళ బరువుని బట్టే లోనికి పంపిస్తున్నా మేడం..

మేడం: ఆ జాదూ గాడు  ఎం చేస్తున్నాడు.. లెక్కలు సరిగ్గా చూస్తున్నాడా లేదా... అసలే మా వాడు లెక్కల్లో వీకు..

పి.ఎ: బాబు అన్నిటిలోనూ వీకే మేడమ్.. అదే పాప గారైతే వాళ్ళ నానమ్మ లాగ హై స్పీడు.. కాని మీరేమో పాపని రానీయరారె...

మేడం: ఊ... .. నీ హద్దుల్లో నువ్వు వుండు.. వాళ్ళ నానమ్మకి అన్న దమ్ములు లేరు కాబట్టి వాళ్ళ నాన్నగారు పగ్గాలు ఆమె చేతిలో పెట్టారు .. నాకేమయ్యా బంగారం లాటి కొడుకు వుండగా..నా  వారసుడు వాడే.. నా ఆశలన్ని వాడిపైనే  ..

పి.ఏ: కాని ఇంతవరకూ బాబుకి వారసులు లేరని జనాలు గొణుక్కుంటున్నారమ్మా..

మేడం: చూడు  పి.ఏ మా వాడు దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేసి పెళ్లి మాటే మరిచాడు.. కాని తల్లిగా అది నా  బాధ్యత కాబట్టి వాళ్ళ నాన్న లాగే లవ్ మేరేజ్ చేసుకుని తగలాడతాడని ఎదురు చూస్తున్నాను.. సరే  ఒక్కొక్కళ్ళని తోలు .. అదే వదులు..

ఒకడు (వంగి వంగి దణ్ణాలు పెడుతూ) : అమ్మా ఈ కిరణ్ గాడి దూకుడు మరీ ఎక్కువైంది సుమీ.. నిన్న గాక మొన్ననే కదా మీ దయవల్ల, నా బరువు వల్ల మంత్రి పదవి వచ్చింది.. కాళ్ళ పారాణి ఆరక ముందే    
 దించీసీ  లాగ వున్నడు.. తవరు ఆదుకోవాలి..

మేడం: గో అండ్ మీట్ జాదు..

రెండవ వాడు: తల్లీ .. అసలే నాకున్న పదవి చిన్నది.. దాన్ని కూడా లాక్కుంటాడని అందరూ చెప్తే ఇలా వచ్చాను.. కిందరి మారు వచ్చినప్పుడు ఇచ్చిన బరువుకంటే ఎక్కువ జమా చేసాను .. కనికరించు తల్లీ..

మేడం: జాదు చెప్పినట్టు చెయ్యి.. ఆంధ్రా భవన్ లో ఆవకాయ తిను.. హాపీగా విమానం ఎక్కి మీ వూరు వెళ్లిపో..

పి.ఏ: అమ్మా నం.వన్ వచ్చాడు.. పంప మంటారా.

మేడం: నీకు ఏమైనా పిచ్చి పట్టిందా..వాడికి  నా దర్శనం కలగలేదని మీడియా వాళ్ళకి తెలిసేలా చెయ్యి.. రాత్రే వాడితో ఆ జాదు గాడు ఫోన్ లో మాట్లాడేడు.. చెప్పవలసిందంతా స్క్రిప్ట్ ముందే ఇచ్చేసాను.. ఇన్నాళ్ళ బట్టి  పని చేస్తున్నావ్ .. మన వాళ్ళలో వ్యతిరేకులను ఎలా మేనేజ్ చెయ్యాలో తెలీదా..
          ఇంతకీ అబ్బాయి ఎక్కడ..   ఫోన్ కనెక్షన్ ఇయ్యి..

పి.ఏ: అలాగే మేడం..  

మేడం: అరె రాహుల్ ఏం  చేస్తున్నావురా..ఆంధ్రా ఇడ్లీ దోసె తిన్నావా..

రాహుల్: అరె.. అమ్మా... పార్టీ కి   చిన్న నాయకుణ్ణి చేసావ్.. ఆంధ్రా గొర్రెలు తెచ్చే బరువుని నాకిచ్చేవ్.  కాని  అమ్మా  రెండు చేతులే ఎందుకిచ్చావ్.. ఇంత మూట ని లెక్కట్ట దానికి మరొక నాలుగు చేతులు 
 ఎందుకు ఇవ్వలేదు.. అయినా   అమ్మా.. నువ్వంటే నాకిష్టం.. ఎర్లీ గా చావకమ్మా.. అమాయకుణ్ణి చేసి
 ఆడుకుంటారని భయంగా వుందమ్మా..

పి.ఏ: పిచ్చి నా జఫ్ఫా. .. ఇలాగే మీ నానమ్మ ఆంధ్రా పాలకులని చీటికీ మాటికి మారుస్తూ పోతే .. అన్నగారు పార్టి పెట్టి.. "తెలుగు జాతి పౌరుషాన్ని డిల్లీ లో తాకట్టు పెట్టారు .. ఈ కాంగిరేసు వాళ్ళు అని .. కుక్క మూతి పిందెలని" తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి కేవలం తొమ్మిది నెలల్లో అఖండ మెజార్టితో గెలుపోందేడురా.. ఏమో చరిత్ర మళ్ళ తిరగ బడుతుందేమో..