Thursday, October 31, 2013

సిగ్గు పడనక్కరలేని సమాజంలో వున్నాం.... ...ఘోర అగ్ని ప్రమాదం జరిగి క్షణాల్లో బస్సులోని వారంతా కేవలం పదినిముషాల్లో బూడిగా మిగిలారు...

నిన్నటి నుండి ఒకటే హడావుడి...

అసలు దీనికి బాధ్యులు ఎవరు?? కారకులు?? ఎవరూ అంటూ సమీక్షలు..

చివరాఖరికి ప్రభుత్వానిదే బాధ్యత అని కనబడని ప్రభుత్వము మీద నెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు..

కొన్నాళ్ళుపోతే ప్రజలు, మీడియా వారు జరిగిన సంఘటన లను మర్చిపోతారు.. షరా మామూలే... 
మళ్ళీ మరో ప్రమాదం జరిగేవరకూ అంతా గుప్ చప్... 

ప్రేవైట్ బస్సులు ఎవరు నడుపుతున్నారు ??? 
ప్రేవైట్ (కార్పొరేట్) ఆసుపత్రులు ఎవరివి???
ప్రెవైట్ విద్యా సంస్థలు ఎవరివి?? 

అర్ధరాత్రుళ్ళు పబ్బులు, క్లబ్బులు నడిపే వారు ఎవరు??
లిక్కర్ వ్యాపారాలు నడిపే వాళ్ళు ఎవరు??
ఇసుక మాఫియా, దందాలు చేసే వారు ఎవరు??
భూకబ్జాలు, సెటిల్ మెంట్లు చేసేది ఎవరు??

వీటన్నిటినీ ఏ పసిపిల్లాణ్ణి అడిగినా జవాబు చెప్తాడు..  

రాజకీయ నాయకులు మరియు వారి అనుచరులు..బంధువులు..

ఈ చీకటి వ్యాపారాలు, విచ్చలివిడి వ్యాపారాలు చేసి సామాన్యులని దోచుకుని కోట్లకి పడగెత్తడం కోసమే ఇవాళ జరుగుతున్న అధికార దాహ పోరాటాలు.. 

ఒకప్పుడు రాజుల పరిపాలనలో ప్రజలు అనేక వెతలకి లోనయ్యారని పుంఖాను పుంఖానులుగా రచనలు చేసిన రచయితలు ఇప్పుడు ఏమని సమాధానం చెప్తారు.... 

రాచకీయ వ్యవస్థలో వున్న లోపాలను సరిచేస్తూ ప్రజాస్వ్యామ్య రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం.. 
కాని దోపిడీలు, దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయి.. 

వెయ్యో రెండు వేలో పడేస్తే స్కూటర్ లేదా కారు  డ్రైవింగ్ లైసెన్సులు దొరికేస్తాయి..ఇది సామాన్యుడి లెవెల్.. 
లక్షల్లో లంచం పడేస్తే కోట్లల్లో దోచుకోవడానికి పర్మిట్లు వచ్చేస్తాయి.. 

ఒక సెక్షన్ కి పది ఉప-సెక్షన్లు వుంటాయి లా లో .. 
ఏదో ఒక సెక్షన్ను అడ్డుపెట్టుకుని శిక్ష నుండి తప్పించుకోవచ్చు.. 

తన దాకా వచ్చీసరికి ప్రతీ ఒక్కరు లంచం ఇచ్చి తప్పించుకోవలసిందే...బతకాలంటే తప్పదు మరి...     

సామాన్యులు సైతం రాంగు రూట్లో వెళ్తున్న ఈ రోజుల్లో ..
అక్రమాలకు.. అన్యాయాలకు బలి అయిపోతున్న వారిమీద రెండు రోజులా.. కాదు కాదు.. 
రెండు క్షణాలు మాత్రమే బాధపడటం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితిలో వుండి మన పని మనం చేసుకు పోవడం తప్ప....
ఇంకేమీ చెయ్యలేని చేతకాని స్థితిలో వున్నందుకు  సిగ్గు పడనక్కరలేని సమాజంలో వున్నాం.... 

వందే మాతరం...........   
  


  

Wednesday, October 16, 2013

సుందర మనోహర దృశ్యాలు (మాకు అతి చేరువలో)

గత కొద్ది రోజులుగా బ్లాగు మిత్రులకు ఎందుకు దూరం అయ్యానంటే .. ఈ క్రింది ప్రదేశాలను చుట్టి రావడం వలన... మీరు కూడా చిత్రాలను చూచి తరించండి..  
1. పంచదార్ల  (యలమంచిలి) ఉమా ధర్మ లింగేశ్వర స్వామి గుడి: 
 అతి పురాతనమైనది (ధర్మరాజు చేత ప్రతిష్టింపబడినది)  
2.ఎస్. రాయవరం (మహారాజశ్రీ గురజాడ వారి జన్మ స్థలం) వద్ద ఒక చక్కటి ప్రాంతం :   (ఆ చెరువులో జలకాలుడుతున్న  పిల్లల ఆనందం మనలో ఎవరికైనా వుంటుందా.. ఎన్ని లక్షలు ఖర్చుపెట్టినా రాదుకదా..)

 3. పుణ్యగిరి (శృంగవరపు కోట) దగ్గర "వాటర్ ఫాల్స్) :


4. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజి వద్ద పుణ్య గోదావరి నది: 5.అనపర్తి హైవే పక్కన శ్రీఆంజనేయస్వామి..    

Saturday, October 5, 2013

Telangana-andhra-rayalasima ---Biryani story

Copied from face book...
Thanks for originator...

your comments will be directed to the creator...

Wednesday, October 2, 2013

నెల్సన్ మండేలా నుండి ఒబామా వరకూ....స్పూర్తిదాయకం నీ అహింసా పోరాటం..బాపూజీ అని ముద్దుగ జాతి పిలువంగ..
జాతిపిత అని సుద్దుగ కొలువంగ..
మహాత్మా అని జనులెల్ల కీర్తించగ... 

ఎవరివయ్యా నీవు .. 
ఎందుకయ్యా భరత జాతి విముక్తికై పోరాడినావు.. 

నెల్సన్ మండేలా నుండి ఒబామా వరకూ
ఎంతో మంది పరాయి దేశస్థులకు స్పూర్తిదాయకం 
నీ అహింసా పోరాటం.. 

కాని సొంత గడ్డపై 
లేదు నీకు గౌరవం.. 

నీ ఆశయాలు గోతిలో పూడ్చి
పీల్చుకు తింటున్నారు నేటి 
పాలకులు మమ్ములను  

నీవు కలలు గన్న 
స్వరాజ్యం ఛిద్రమైంది నేడు  

అర్ధరాత్రి కాదు
పట్ట పగలే 
ఆడది ఒంటరిగా తిరుగుట లేదు..  

సత్యము... అహింస.. నీ ఆయుధాలు 
అపహాస్యమై నిలిచాయి నేడు.. 

అయినా బాపూజీ ..
జాతి నీకు రుణ పడి వుందయ్యా.. 

అనాధ శవంలా పడివున్న 
స్వతంత్ర భావ స్వేఛ్చా సంఘానికి...   
ఊపిరి నీ పోరాట స్పూర్తి..  

ఇదే మా నివాళి..  

Tuesday, October 1, 2013

అత్తారింటికి దారేది పాటకు రీమిక్స్ .. తెలంగాణాపై..


ఇది ఫేస్ బుక్ లో దొరికింది కాబట్టి మీ ఆశీస్సులు  . శాపనార్ధాలు అక్కడికే చేరతాయి.. 

లింక్: 
https://www.facebook.com/photo.php?v=10151881989285973&set=vb.171458633041406&type=2&theater