ఒకరు మరణిస్తే సంచలనం...
ఉత్కంఠ.. ఊహాగానాలు..
గుసగుసలు..గాసిప్స్...
మిగతా అన్ని వార్తలకు గాప్... బ్రేక్...
చనిపోయిన వారి ఆత్మ ఘోషించేలా గోల..
అభిమానమా? కక్షా? వేధింపులా?
ఎవడికి వాడే క్రెడిబిలిటీ కోసం తాపత్రయం..
ఎవడి డప్పు ఆడు కొట్టుకొనే పైశాచికత్వం..
అమ్మా...రావద్దు...
ఈ దేశంలో పార్ధివంగా కూడా అడుగుపెట్టకు...
అణువణువునా పోస్ట్ మార్టపు వేధింపులు..
అడుగడుగునా కృత్రిమ కన్నీళ్ళు...
"క్షణక్షణం" కాముకుడి ట్వీట్ల పోట్లు..
వద్దమ్మా ..రావద్దు... నిర్జీవ దేహమై..
మదిలో నిలిచిపో..సజీవ సుందరివై...
ఉత్కంఠ.. ఊహాగానాలు..
గుసగుసలు..గాసిప్స్...
మిగతా అన్ని వార్తలకు గాప్... బ్రేక్...
చనిపోయిన వారి ఆత్మ ఘోషించేలా గోల..
అభిమానమా? కక్షా? వేధింపులా?
ఎవడికి వాడే క్రెడిబిలిటీ కోసం తాపత్రయం..
ఎవడి డప్పు ఆడు కొట్టుకొనే పైశాచికత్వం..
అమ్మా...రావద్దు...
ఈ దేశంలో పార్ధివంగా కూడా అడుగుపెట్టకు...
అణువణువునా పోస్ట్ మార్టపు వేధింపులు..
అడుగడుగునా కృత్రిమ కన్నీళ్ళు...
"క్షణక్షణం" కాముకుడి ట్వీట్ల పోట్లు..
వద్దమ్మా ..రావద్దు... నిర్జీవ దేహమై..
మదిలో నిలిచిపో..సజీవ సుందరివై...
ఎవరి పేరు చెబితే ప్రజలకు కంపరం కలుగుతుందో ఎవరి సినిమాలు చూస్తే జుగుప్స కలుగుతుందో ఎవరి పిచ్చికూతలతో తెలుగు పెజానీకం విసిగిపోయి ఉన్నారో ఆ ఉన్మాది పైకూలు పట్టించుకోకూడదు.
ReplyDelete@బుచికి గారు..ధన్యవాదములు...
Deleteఆ ఉన్మాది కూతలు ఎంత దారుణంగా, హేహ్యంగా ఉన్నాయో మీ కామెంటు వ్యక్తమవుతోంది...
బహుకాల దర్శనం, వోలేటి వారూ. వెల్కం బేక్.
ReplyDelete// “చనిపోయిన వారి ఆత్మ ఘోషించేలా గోల..” // వెల్ సెడ్. పోయిన మనిషి పేరున్న వ్యక్తే ... కానీ గోల భరించలేనంతగా ఉంది.
@విన్నకోట గారు..మీ అభిమానానికి ధన్యవాదములు.. వ్యక్తిగత కారణాల వలన బ్లాగు లోకానికి దూరంగా ఉండవలసి వచ్చింది..
Deleteమీ స్పందనకు ధన్యవాదములు..
ReplyDeleteవోలేటీ వారూ, కుశలమా?
వైజాగ్ ప్రసాదు గారు ఉదయం మరణించారని ఇందాకే టీవీలో చెప్పారు. నటనారంగానికి తీరని లోటు. విశిష్ఠ నటుడు. వారి నటన వలన ఆ పాత్రలో చాలా హుందాతనం కనపడేది. నేను చాలా అభిమానించిన నటుడు. వారిని కలుసుకోవడం కుదరలేదు, ప్చ్. వైజాగ్ లో వారితో మీకు పరిచయం ఉండే ఉంటుంది కదా.
వారి కుటుంబానికి నా సంతాపం ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను 🙏.
ReplyDeleteమీ అభిమానానికి ధన్యవాదములు సార్..
వ్యక్తిగత కారణాల వలన, ఒడిదుడుకుల వలన బ్లాగు లోకానికి దూరం అయ్యాను..
వైజాగ్ ప్రసాద్ గారు నాకన్నా సీనియర్ కళాకారులు..మిశ్రో గారి టీమ్ లోనే ఎక్కువగా చేసారు..
నేను మిశ్రో గారి టీమ్ లో అస్సలు చెయ్యలేదు..కాని మిశ్రో గారితో అనుబంధం ఉన్నది..
వైజాగ్ ప్రసాద్ గారు వైవిధ్యమైన పాత్రలు తనదైన శైలిలో చేసేవారు..
ఆయన మాటలు పలికించే తీరు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి..నాటకీయత తక్కువ..మిశ్రో గారి నాటికలు, సంభాషణల తీరు , ఇంట్లో మాట్లాడుకున్నట్టుగానే ఉంటాయి..అరుపులు, పెడబొబ్బలు ఉండవు..ఆ schoolలో తయారయిన నటుడు శ్రీ వైజాగ్ ప్రసాద్ గారు..
అతి త్వరలోనే సినిమాల్లో అవకాశాలు రావడం వలన హైదరాబాద్ కి shift అయిపోయారు..
మితభాషి - అందువలన ఎదురైతే హలో అంటే హలో అనుకోవడమే తప్ప అంతకన్నా ఆయనతో పరిచయం లేదు..
ధన్యవాదములు...